Friday, January 3, 2025

 🙏 *రమణోదయం* 🙏

*క్షుద్రమైన బుద్ధిని నశింపచేసే ఉత్తమ ఆత్మజ్ఞానం, హృదయంలో "లోదృష్టి"తో అన్వేషించి చేసే "విచారణ"తోనే ఉదయిస్తుంది. శాస్త్రాలు చదివి అనుష్ఠించని ఆత్మ విచారణ, వంటకి ఉపయోగపడని కాగితంపై గీసిన సొరకాయ బొమ్మ వంటిది.*

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.531)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*

'కల'నుండి ఇప్పుడే ఎందుకు మేల్కొనకూడదు?  

ఇప్పుడే ఎందుకు మేలుకోవడం లేదు?  

మీరు చేయాల్సిందల్లా మీ ఆలోచనలను ఆపడం.  
మీరు వాటిని ఆపడానికి ప్రయత్నించడం ద్వారా 
మీ 'ఆలోచనల'ను ఆపలేరు.  
మీరు వాటిని గమనించడం ద్వారా 
ఆలోచనలను ఆపవచ్చు. 
మరియు వాటిపై శ్రద్ధ చూపకుండా ఉండండి.  
మీ ఆలోచనలు మరియు స్పృహ మధ్య గోడ ఉంది.  
మీ మనస్సులో గోడను విచ్ఛిన్నం చేయండి 
మరియు ఆలోచనలు స్పృహలోకి ప్రవహించనివ్వండి, 
అక్కడ అవి పూర్తిగా అధిగమించబడతాయి 
మరియు స్పృహ మీ 'వాస్తవికత' అవుతుంది.  

కాబట్టి మీ ఆలోచనలతో పోరాడకండి.  

~ రాబర్ట్ ఆడమ్స్

రమణులు మరణించి జీవించారు కనుకనే
మరణ సమయంలో కూడా సంపూర్ణ ఎరుకతో
"నేనెక్కడికి పోగలను?" అన్నారు!

బయట అంతా నటనే...నీతో సహా
నీలో నీవు - నీతో నీవు జీవించు!

🌹🙏 ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹

మనస్సుకు శాంతి మనస్సులోనే ఉంది. అది మనస్సు వేగం తగ్గేకొద్ది అనుభవంలోకి వస్తుంది. అలా వేగం తగ్గిన మనస్సు సత్యంతో అనుసంధానమై పూర్తిగా తనతో తానుండి తన్మయస్థితిని పొందుతుంది.

భావాలచేత అది బంధించబడినట్లు కనిపిస్తుందిగానీ భావాలు పోతే దాని స్వతంత్రత దానికి తెలుస్తుంది. మనస్సు తన్మయస్థితిలో ఉంటే భావాలకే కాదు. ముక్తి, మోక్షాలకు కూడా అతీతంగా ఉంటుంది. ఎందుకంటే సాధారణమైన స్థితిలో ముక్తిమోక్షం అనేవి కూడా భావాలే. భావాలే లేని తన్మయస్థితిలో మనస్సే పరమాత్మగా ఉంటుంది. ఇక దానికి అప్పుడా ముక్తి, మోక్షం అనేవి సిద్ధించే ఉంటాయి. ఏకత్వం పొందిన మనస్సు అభయ స్థితిలో ఉంటుంది. 

అట్టి స్థితిలో నామరూపములు లేనివాడను నేను. మనోతీతము నేను. పరబ్రహ్మము నేను. అపరిమితుడను నేను. చైతన్యమే నేను.

*ఋభుగీతాసారము* 🙏🕉️🙏

No comments:

Post a Comment