Wednesday, January 1, 2025

*జ్ఞాన సూర్యుని శక్తితో (భగవంతుని- సర్వశక్తివంతుని ప్రకాశం - వెలుగుతో) అజ్ఞాన - అంధకారాన్ని తొలగించుకుంటే ఇంకా మిగతా ఉండేది అంతా జ్ఞానమే... ప్రకాశమే...* 

*మానవుని మనసు వికారాలలో, విషయాలలో, వస్తువులలో, అల్పకాలిక కోరిక బంధనాలలో ఇరుక్కోవడం వల్ల మనిషి మనస్సులో అజ్ఞాన అంధకారం ఆవహించింది...*

*భగవంతుడు - సర్వశక్తివంతుడు (Almighty Authority) ఈ విశ్వానికి, వ్యక్త ప్రపంచానికి కావలసిన కొత్త ఆవిష్కరణలను... ( కొత్త సదుపాయాలను) ఎవరితోh చేయిస్తారంటే... ఎవరైతే అల్పకాలిక వికారాల బంధనాల కోరికల్లో ఇరుక్కోకుండా... ఉంటారో... వారి ద్వారా భగవంతుడు - సర్వ శక్తివంతుడు ఈ విశ్వానికి వ్యక్త - ప్రపంచానికి కొత్త సదుపాయాలను అందిస్తాడు...*

*ఉదాహరణకు నికోలా టెస్లా అనే ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తకు కలలో భగవంతుడు ఈ ప్రపంచానికి కావాల్సిన కొత్త ఆవిష్కరణలు చూపించేవాడు... నికోలా టెస్లా వెంటనే ఆ కల నుంచి మేలుకొని నోట్ బుక్ లో అవి అన్ని రాసుకొని... దాని మీద ప్రయోగాలు చేసి విద్యుత్ పరికరాలు కనుగొన్నాడు మనకు విద్యుత్ అందించాడు మరియు ఎన్నో ఈ వ్యక్త ప్రపంచంలో ఉన్న శక్తుల గురించి తెలుసుకొని అందరికీ తెలియజేశాడు...*

*మన భారతదేశానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ కూడా శివశక్తి అమ్మవారి ధ్యానంలో కూర్చున్నప్పుడు గణిత సిద్ధాంతాలు (మ్యాథమెటిక్స్ ఫార్ములాస్) మరియు ఈక్వేషన్స్ కనుపడేటివి అవి అతను పుస్తకంలో రాసుకొని ఎన్నో కఠినమైన గణిత సమస్యలకు పరిష్కారాలు చూపాడు...*

*ఈ విధంగా ఏ శాస్త్రవేత్త అయిన తన మనసుని శాంత పరుచుకొని... అల్పకాలిక వికారాల కోరిక బంధనాలలో  ఇరుక్కోకుండా... ఈ విశ్వ విజ్ఞాన లోతుల్లోకి వెళ్లి ఈ వ్యక్త ప్రపంచానికి కావాల్సిన కొత్త ఆవిష్కరణలను (సదుపాయాలను) ఆవిష్కరించారు...*

*ఇక్కడ మనము మనసుతో గ్రహించ వలసింది... తెలుసుకోవాల్సింది ఏమిటంటే... మనం ఈ అజ్ఞాన అంధకారం నుంచి బయటకు వస్తే ఇంకా ఉండేదంతా జ్ఞానమే... తర్వాత భగవంతుడు ఇచ్చిన జ్ఞానంతో ఈ వ్యక్త ప్రపంచంలో ఉన్నటువంటి శక్తులు... సిద్ధులు... ప్రకృతి రహస్యాలు గురించి అర్థము చేసుకోవచ్చు... మనము అవి తెలుసుకొని మన జీవితంలో ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవచ్చు...*

          *ఆధ్యాత్మికం ఆనందం*
🙏🌷🙏 🕉️🙏🕉️ 🙏🌷🙏

No comments:

Post a Comment