నాగ సాధువులు ఎలా మాయం అవుతున్నారు?అద్భుతమే జరుగుతోంది@nandurihemamalnini
శ్రీమాత్రే నమః నాగసాధువుల్ని గాని అఘోరాలని గాని చూసినప్పుడు ఎన్నో విషయాలు ప్రశ్నార్థకంగానే మిగిలిపోతాయి ఎందుకంటే ఇప్పుడు ప్రయాగరాజులో గడ్డ కట్టే చలి ఉంది ఆ గడ్డ కట్టే చలిలో వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు అంతకు మించి వీళ్ళు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నప్పుడు కూడా వీళ్ళు ఒంటికి విభూది మాత్రమే రాసుకుంటారు కొంతమంది అయితే రుద్రాక్షలు వేసుకుంటూ ఉంటారు అలా వేసుకుని హిమాలయాల్లో గడ్డ కట్టేసే చలిలో మైనస్లో ఉండే ఆ చలి ప్రాంతాలలో వీళ్ళు అలా ఎలా ఉండగలుగుతున్నారు వాళ్ళు చేసే సాధన ఏంటి అనేది చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ అసలు మామూలుగా చలికాలంలో ఏసీ వేసుకుని ఆ గదిలో దుప్పటి కప్పుకోకుండా పడుకుంటే మనం ఆ గదిలో ఉండలేము కదా అలాంటిది ఇన్ని వేల ఏళ్ల నుంచి ఈ నాగసాధువులందరూ హిమాలయాల్లో ఎలా ఉండగలుగుతున్నారు దానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసే సాధన ఆ సాధన వల్లే చలిలో అలా ఉండగలుగుతున్నారు వాళ్ళు చేసే సాధన ఏంటంటే నాడీ శోధన అగ్ని సాధన అలాగే మంత్ర పఠనం విభూతి యోగం ఈ అగ్ని సాధన వల్లే నాగసాధువులు చలిలో ఉండగలుగుతున్నారు ఈ అంతర్గత వేడి వాళ్ళ శరీరాలని కఠినమైన పరిస్థితుల్లో కూడా వెచ్చగా ఉండడానికి సహాయపడుతుంది అన్నమాట వాళ్ళు చేసే అగ్ని సాధన నాడీ శోధన ప్రాణాయామం ద్వారా ఏం చేస్తారు అంటే ఈ నాగసాధువులు వారి శరీరంలోని గాలి ప్రవాహాన్ని సమతుల్యం చేస్తారు ఇది శరీర ఉష్ణోగ్రతని అన్ని కాలాల్లో క్రమబద్ధంగా వెచ్చగా ఉండేలా చూస్తుంది ఇది ఎలా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి శరీరంలో ఉన్న ప్రతి నాడిని యాక్టివేట్ చేస్తూ ఉంటుందన్నమాట అయితే ఈ సాధన చేయటం చాలా కష్టం దీనితో పాటు ఈ స్టేజ్ వరకు రావడానికి వాళ్ళకి దాదాపుగా ఎన్నో ఏళ్ళు పడుతుంది అలాగే మంత్ర పఠనం నాగసాధువులు నిరంతరము మంత్రాలను పటించడం ద్వారా వాళ్ళ శరీరంలో దివ్యమైన పాజిటివ్ శక్తిని ఉత్పత్తి చేస్తారు ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేసి చల్లని ఉష్ణోగ్రతలను తట్టుకునేటట్లు చేస్తుందన్నమాట అలాగే విభూతి యోగం నాగసాధువులు ఏం చేస్తారు ఒంటి నిండా విభూతి రాసుకుంటారు ఈ విభూతిలో కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి ఈ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి చలి నుంచి కాపాడుతాయి అన్నమాట అంటే విభూతి ఒక ఇన్సులేటింగ్ పొరగా పని చేస్తూ ఉంటుంది ఈ నాగసాధువుల మీద ఈ నాగసాధువులను చూసినప్పుడు మనకి ఇంకొక విషయం కూడా అర్థం కాదు ఎక్కడి నుంచి వీళ్ళు వస్తున్నారు అనేది మనకు ఆ తెలియని విషయం ఏంటంటే మనం ఎంతసేపు పాశ్చాత్యుల నుంచి ఏ విషయాన్ని అయినా సరే తీసుకుంటాం వాళ్ళు అని చెప్తేనే మనం అథెంటిక్ గా ఆహా వాళ్ళు చెప్పారు సైన్స్ ప్రకారం రుజువైందట అని అనుకుంటాం అలా ఈ పాశ్చాత్యులు మనకు అంటించిన విషయాల్లో ఒక జబ్బు ఏంటంటే నానో టెక్నాలజీ ఈ నానో టెక్నాలజీ మీద పాశ్చాత్య దేశాలు బిలియన్ కోట్లు పెట్టి మరి పరిశోధనలను చేస్తున్నాయి దురదృష్టం ఏంటంటే ఈ నానో టెక్నాలజీ కొన్ని వేల సంవత్సరాల నుంచి మన దేశంలో కూడా ఉంది ఇప్పటికీ ఉంది అందులోనూ హిమాలయాల్లో సజీవంగా ఉంది మనం ఇప్పుడు చూస్తున్నాం కదా నాగ సాధువులు అలాగే అఘోరాలు మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఒక్కసారి ఆలోచించండి మన ఋషులు యోగులు సాధువులు కొన్ని వేల ఏళ్ల క్రితమే సూక్ష్మ శరీర యానం గురించి చెప్పారు మొన్న మీకు చెప్పాను కదా భోగర్ సిద్ధరు ఆయన సూక్ష్మ శరీరం ద్వారానే ఒకచోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళేవారు అలా ఎంతో మంది సిద్ధులు సూక్ష్మ శరీరంతో ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట మనం పుస్తకాల్లో చదువుకున్న తపస్సునే ఇప్పుడు ధ్యానం అంటున్నారు ఈ ధ్యానం ద్వారా అమోఘమైన సిద్ధులు సంప్రాప్తిస్తాయి అని చెప్పి చెప్తున్నారు అయితే ఈ తపస్సు ఏదైతే ఉందో ఈ సిద్ధులు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒకటి ఏంటి అంటే సూక్ష్మ శరీర యానము దీన్నే నానో టెక్నాలజీలో అడ్వాన్స్డ్ స్టేజ్ అని చెప్పి పిలుస్తారు ఇప్పుడు పరిశోధనలు చేస్తున్నారు గాని ఇది ఎప్పుడో మన భారతదేశంలో ఉంది ఇప్పుడు పరిశోధనలు చేస్తున్న వాళ్ళ లక్ష్యం కూడా ఏంటి అంటే మన ఋషులు యోగులు కోరుకున్నదే తడవుగా ఒకచోట నుంచి ఇంకొక చోటకి ఎలా వెళ్లారు అది తెలుసుకోవాలని వాళ్ళు ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు పరాయి దేశాల వాళ్ళు మనకి నారద మహర్షిని చూస్తే ఒక విషయం అర్థమవుతుంది ఆయన్ని త్రిలోక సంచారి అని చెప్పి పిలుస్తూ ఉంటారు కదా ఆయన ఎలా వెళ్ళగలుగుతున్నారు ఈ మూడు లోకాలని ఎలా సంచరించారు నడుచుకుంటూ వెళ్లారా కాదు నానో టెక్నాలజీ ద్వారానే ఆయన ప్రయాణించారు అన్నమాట అంటే సూక్ష్మ శరీర యానము ఇప్పటికీ హరిద్వార్ లోనూ త్రివేణి సంగమంలోనూ కుంభమేళాలు జరుగుతుంటే లక్షలాది మంది నాగసాధువులు రావటం మనం టీవీ లోనూ పేపర్ లోనూ చూస్తూ ఉంటాం ఈ నాగసాధువులు దిగంబరంగా ఉంటారు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు ఎక్కడో హిమాలయ గుహల్లో కొండల్లో నదీ తీరాల్లో ఉంటారు మామూలు రోజుల్లో వీళ్ళు ఎవరికీ కనిపించరు అసలు హిమాలయాల నుంచి కుంభమేళ జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఇక్కడ మనకు మనమే ఒక ప్రశ్న వేసుకుందాం కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా ఇప్పటిదాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డు అయ్యిందా ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు పట్టణాలు నగరాలు ఉంటాయి ఎక్కడైనా ఏ ఫోటోగ్రాఫర్ కైనా ఇన్ని లక్షల మంది దిగంబరులు కనిపించారా ఎక్కడైనా ఇంతమంది ప్రత్యేక విమానాల్లో గాని ఇతర రవాణా సాధనాల్లో గాని ప్రయాణం చేసిన దాఖలాలు మనకి కనిపించాయా కనిపించలేదు కదా అందరూ మరి ఈ కుంభమేళ జరిగే ప్రదేశంలో ఒకేసారి ఎలా ప్రత్యక్షమయ్యారు కుంభమేళ ముగిసాక తిరుగు ప్రయాణంలో కొద్ది దూరం వరకే కనిపించి హటాత్తుగా ఎలా మాయమైపోతున్నారు ఈ ప్రాంతంలో తప్ప ఇంకా ఎక్కడ వాళ్ళ జాడ ఎందుకు కనిపించదు వీటన్నింటికీ సమాధానం ఏంటో తెలుసా సూక్ష్మ శరీర యానము అదే నానో టెక్నాలజీ నాగసాధువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం అన్నమాట ఎన్నో ఏళ్లగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కనిపిస్తూ ఉంటే దాన్ని మనం నమ్మం అమెరికా రష్యా చైనా జపాన్ జర్మనీ వాళ్ళు ఎవరైనా చెప్తే ఆ సొల్లంతా విని చంకలు ఎగరేసుకుంటూ ఆహా వాళ్ళు చెప్పారని చెప్పి మనం ఎగురుతాం ఒక్కసారి మనసు పెట్టి మన పురాణాలు మన శాస్త్రాల్ని మనం చదువుకుంటే మన విషయాలు మనకి అర్థమైపోతాయి ఒక్కసారి అవి చదవండి అవి చదివితే మనకు అన్ని అర్థమైపోతాయి ప్రపంచానికి ఎన్నో తెలియని విషయాలు మన శాస్త్రాలలో మన ఋషులు పొందుపరచబడి ఉంచారు కనీసం అవి తెలుసుకునే ప్రయత్నం అయినా చేస్తారు చేద్దాం ఈ నాగసాధువుల్ని అఘోరాల్ని చూసినప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే ఓహో వీళ్ళు జపము తపము ఇవి మాత్రమే చేసుకుంటారు అన్నమాట ఒంటి నిండా విభూది రాసుకుని మాత్రమే ఉంటారు అని అన్నమాట అని అనుకుంటాం కానీ వీళ్ళు ఏ విధంగా అయితే దైవాన్ని నమ్ముతారో దేశాన్ని కూడా రక్షించే సైనికులు వాళ్ళు ఒక చేత్తో జపమాలని పట్టుకుంటారు త్రిశూలాన్ని పట్టుకుంటారు అదే త్రిశూలాన్ని దేశ రక్షణ కోసం ఉపయోగిస్తారు దేశం మీదకి వచ్చిన ఎన్ని ఎన్నో అరాచక శక్తులను తరిమి కొట్టిన వాళ్ళు ఈ నాగసాధువులు ఈరోజు ఇంతటితో ఈ వీడియో ముగించుకొని ఇంకా అద్భుతమైన విషయాలు ఇంకొక వీడియోలో తెలుసుకుందాం లోకా సమస్త సుఖినో భవంతు సర్వేజనా సుఖినో భవంతు
No comments:
Post a Comment