Monday, January 13, 2025

Neem Karoli Baba Life Story Part 1: The Baba Who Inspired Steve Jobs & Ram Dass | #neemkarolibaba

Neem Karoli Baba Life Story Part 1: The Baba Who Inspired Steve Jobs & Ram Dass | #neemkarolibaba

 Youtube link - https://youtu.be/WcFNHLFIndM?si=SunV1mW6ODzICCre


హాయ్ ఫ్రెండ్స్ నా పేరు భార్గవ రెడ్డి నేను గత కొన్ని సంవత్సరాలుగా మెడిటేషన్ చేస్తున్నాను నాకు యోగులన్న యోగుల జీవిత చరిత్ర అన్నా చాలా ఇష్టం అయితే ఈ మధ్యనే భారతదేశ సుప్రసిద్ధ గురువుల్లో ఒకరైన శ్రీ నీమ్ కరలి బాబా గారి జీవిత చరిత్రను చదవడం జరిగింది ఆ ఆయన యొక్క జీవిత చరిత్ర నాకు ఎంతగానో నచ్చింది సో ఆ ఆ యొక్క యోగి జీవిత చరిత్రను మీతో పంచుకోవాలని ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజులవి భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు దేవుడు దైవం అనేటివి ఏవి లేవని అవమానిస్తున్న రోజులు అవి అప్పుడు ఈ దైవం యొక్క ఉనికిని ప్రపంచమంతా తెలియజేయాలని ఒక శక్తి ఒక వ్యక్తి రూపంలో జన్మ తీసుకుంటుంది ఆ శక్తి ఆ వ్యక్తి మరెవరో కాదు శ్రీ శ్రీ శ్రీ నీమ్ కరోలి బాబా గారు ఈయనే మహారాజ్జీ అని కూడా అంటుంటారు ఈయన ఆంజనేయ స్వామి ఉపాసకులు అయితే ఈయనకు భారతదేశం నుంచే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి కూడా భక్తులు ఉన్నారు ఉదాహరణకి భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మాజీ ప్రధానమంత్రి శ్రీ చరణ్ సింగ్ గారు క్రికెట్ సూపర్ స్టార్ అయిన విరాట్ కోహ్లీ అనుష్క శర్మ హాలీవుడ్ యాక్ట్రెస్ జూలియా రాబర్ట్ facebook ఫౌండర్ మార్క్ జుకెన్స్ బర్గ్ అదేవిధంగా ఆపిల్ ఫౌండర్ ఆ స్టీవ్ జాబ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది అసలు ఇంతమంది ఆయన్ని ఫాలో అవ్వడానికి కారణం ఆయన చేసిన మిరాకిల్స్ అందులో కొన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఒకసారి నీమ్ కరోలి బాబా ట్రైన్ లో ప్రయాణిస్తుంటే టిసి వచ్చి ట్రైన్ ఆపి ఆయన్ని కిందకి దింపేస్తాడు ఆ తర్వాత ఏం జరిగింది కొంతమంది ఈయన్ని తలయ బాబా అని మరి కొంతమంది ఈయన్ని నీమ్ కరులి బాబా అనేవారు ఇలా అనేక పేర్లు తో ఎందుకు పిలిచేవారు అలాగే ఎవరైనా భక్తుడు వచ్చి స్వామి నాకు ఫలానా స్వీట్ తినాలని ఉంది అంటే వెంటనే బాబా ఆ భక్తుడు అడిగిన స్వీట్ ని ఇచ్చేవారు ఇది ఎలా సాధ్యం అన్న విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈయన జననము అదేవిధంగా శరీరం వదిలిన రోజు రెండు ఒకటే అంటే ఈయన పుట్టింది సెప్టెంబర్ 11వ తేదీ అయితే ఈయన శరీరం విడిచింది కూడా సెప్టెంబర్ 11వ తేదీ ఇంత పెద్ద మహా గురువు అయినటువంటి శ్రీ నీమ్ కరోలి బాబా గారి జీవిత చరిత్రను ఈరోజు మనం తెలుసుకుందాం నీమ్ కరోలి బాబా సెప్టెంబర్ 11 1900 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లా అక్బర్ పూర్ అనే గ్రామంలో శ్రీ దుర్గా ప్రసాద్ శర్మ శ్రీమతి కౌసల్య దేవి అనే బ్రాహ్మణ దంపతులకు జన్మిస్తారు వీరిది ధనికుల కుటుంబం సో వీరు ధనికులు కావడం తో బాబా పుట్టిన వెంటనే వీరి కుటుంబంతో పాటు ఆ ఊరు మొత్తం కూడా సంబరాలు చేసుకుంటారు బాబాకి తల్లిదండ్రులు పెట్టిన పేరు లక్ష్మీనారాయణ శర్మ ఈ లక్ష్మీనారాయణ శర్మకి ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వీరి తల్లి శ్రీమతి కౌశల్య దేవి గారు మరణిస్తారు తల్లి మరణం తర్వాత వీరి తండ్రికి వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరూ నచ్చ చెప్పి పిల్లలు చూసుకోవడానికి ఒక ఆడదిక్కు కావాలని ఆయన కు రెండో వివాహం చేస్తారు లక్ష్మీనారాయణ శర్మ కి 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అక్బర్ పూర్ కి కొంత దూరంలో ఉన్న బాదంబాస్ అనే గ్రామానికి చెందిన రాంబేటి అనే ఆవిడతో పెళ్లి జరుగుతుంది బాబా గారికేమో 11 సంవత్సరాలు ఆవిడకేమో తొమ్మిది సంవత్సరాలు మీకు డౌట్ రావచ్చు అదేంటి ఇంత చిన్న వయసులో పెళ్లి జరగడం ఏంటి అని పూర్వకాలంలో అందరికీ బాల్ వివాహాలు జరిగేటివి అంటే అసలు పుట్టిన వెంటనే కూడా మాట ఇచ్చుకుండేవారు మా కూతురు మీ కొడుకుని మీ కొడుకు మా కూతురు అని సో అదే విధంగా బాబా గారికి కూడా చిన్న వయసులోనే పెళ్లి జరుగుతుంది పెళ్లి జరిగిన కొన్ని నెలలకే బాబా ఎవరికీ చెప్పకుండా అంటే మన లక్ష్మీనారాయణ శర్మ ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోతారు ఈ లక్ష్మీనారాయణ శర్మ కోసం తండ్రి ఊరి ప్రజలందరూ కూడా వెతికి వెతికి అలసిపోయి ఎంత వెతికినా ఆయన ఆచూకి తెలియదు ఈ సంఘటనే భవిష్యత్తులో ఆయన్ని లక్ష్మీనారాయణ శర్మ నుంచి ఆయన తన నీమ్ కరలి బాబాగా ఎదగడానికి తోడ్పడుతుంది అలా ఇంటి నుంచి వెళ్ళిపోయిన లక్ష్మీనారాయణ శర్మ గుజరాత్ రాజ్కోట్లో ఒక ఆశ్రమంలో చేరుతాడు అక్కడ ఈయన అందరికంటే చిన్నవాడు గురువుకి సేవ చేసుకోవడం ఎవరైతే విద్యార్థులు ఉంటారో సాధకులు ఉంటారో వారందరికీ సేవ చేసుకుంటూ ఉండేవారు ఈయన యొక్క క్రమశిక్షణ సేవా తత్వం చూసి ఆ ఆశ్రమ గురువు ఈయనకు సాధన రహస్యాలు చెప్పి సాధన చేసుకోమంటారు అలా అలా ఈ లక్ష్మీనారాయణ శర్మ అలా సమయం దొరికినప్పుడల్లా ఈయన గంటల కొద్ది సాధన చేసుకునేవారు అక్కడ ఆ ఆశ్రమ గురువే ఈయన్ని లక్ష్మీనారాయణ శర్మ నుంచి బాబా లక్ష్మణ్ దాస్ గా ఈయన పేరును మారుస్తారు అంతేకాకుండా ఈయన భక్తి శ్రద్ధలు చూసి అతి తక్కువ కాలంలోనే ఆ ఆశ్రమానికి ఉత్తరాధికారి చేస్తారు అయితే అతి చిన్నవాడైన ఈ లక్ష్మణ్ దాస్ ఆ ఆశ్రమానికి ఉత్తరాధికారి అవ్వడం మిగిలిన విద్యార్థులకు నచ్చరు ఎందుకంటే మాకంటే వయసులో చిన్నోడు నిన్న గాక మొన్న వచ్చాడు అంటే ఇతను చెప్పింది మేము వినాలా అని ఆ ఆశ్రమ గురువు పైన వాళ్ళు కోపంతో ఉంటారు ఈ విషయం తెలుసుకున్న లక్ష్మణ్ దాస్ ఆశ్రమ గురువు దగ్గరికి వెళ్లి అనుమతి తీసుకొని అక్కడినే వెళ్ళిపోతాడు అలా వెళ్ళిన బాబా లక్ష్మణ్ దాస్ గారు బబనియా అనే గ్రామానికి వెళ్లి అక్కడ ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక చెరువులో ప్రతిరోజు సాధన చేసుకునేవారు అంటే ఏదైతే రాజ్కోట్ ఆశ్రమంలో గురువు సాధన రహస్యాలు చెప్పారో అదే సాధనని ఈయన బబనియా గ్రామంలో అక్కడికి కొంత దూరంలో ఉన్న చెరువుకి వెళ్లి ఆ చెరువులో గంటలు గంటలు సాధన చేసుకునేవారు కొంతమంది భక్తులు చెప్పేవారు ఈయన రామ జపం జపిస్తే సాక్షాత్ హనుమంతుడు ఈయన పక్కన వచ్చి కూర్చునేవారంట అంటే అంత బాగా ఆయన రామ జపం చేసేవారంట అదే విధంగా కొంతమంది ఈయనను అంటుంటారు సాక్షాత్ ఆ హనుమంతుడి అవతారం అని అలా అక్కడ ఆయన ఆ చెరువులో గంటలు గంటలు సాధన చేసుకునేవారు అదే బబనియా గ్రామంలో ఈయన మొట్టమొదటి హనుమంతుడి గుడిని కట్టిస్తారు ఈయన స్వహస్తాలతో విగ్రహాన్ని చేసి ఒక గుడిని నిర్మిస్తారు సో ఈయన దినచర్య ఏంటంటే చెరువుకి వెళ్లడం చెరువులో గంటల కొద్దీ సాధన చేయడం మిగిలిన సమయంలో ఆయన ఆ గుడిలోకి వచ్చి ఆ జపం చేసుకోవడం ఇలా కొన్ని నెలలు జరుగుతాయి గంటలు గంటలు సాధన చేయడం వల్ల అతి తక్కువ కాలంలోనే ఈయనకు అనేక సిద్ధులు లభిస్తాయి ఆ సిద్ధులు ఎలా ఉండేటివి అంటే ఒక భక్తుడు వచ్చి ఇది ఆయన బయోగ్రఫీ లో ఉంది ఒక భక్తుడు వచ్చి బాబా నాకు జిలేబి తినాలని ఉంది అని అడుగుతాడు జిలేబి తినాలంటే బాబా దగ్గర ఏమి షాప్ లేదు కదా జిలేబి మరి ఎలా తింటాడు అంటే ఆయన సిద్ధులు ఎలా ఉంటాయి అంటే ఈయన ఆయన చేతిని ఇలా వెనక్కి తీసి మళ్ళీ ముందుకు తీసుకొచ్చే లోపల ఆయన చేతిలోకి ఆ జిలేబి ప్యాకెట్ వచ్చేది ఆయన ఆయన భక్తుడికి ఇచ్చేవాడు ఇలా వేసేవాడు సో అంతలా ఉండేటివి ఈయన సిద్ధులు ఇలా ఈయన సిద్ధులు తెలిసి ఆ బబనియా గ్రామ ప్రజలందరూ కూడా ఈయనకు భక్తులుగా మారుతారు అయితే ఈయన ఆ చెరువుకి వెళ్లి గంటలు తరబడి సాధన చేయడం వల్ల ఈయన్ని తలయ బాబా అని పిలిచేవారు హిందీలో తలాబ్ అంటే చెరువు అంటే ఈయన చెరువులోకి వెళ్తే సాధన చేస్తాడు కదా కాబట్టి తలాబ్ ని వాళ్ళు తలయ బాబా అని పిలిచేవారు మన తెలుగులో చెప్పాలంటే చెరువు బాబా అని మొట్టమొదట తల్లిదండ్రులు పెట్టిన పేరు లక్ష్మీనారాయణ శర్మ తర్వాత గుజరాత్ రాజ్కోట్ లోని ఆశ్రమ గురువు పెట్టిన పేరు బాబా లక్ష్మణ్ దాస్ తర్వాత బబనియా గ్రామ ప్రజలు ఈయనకు పెట్టిన పేరు తలయ బాబా ఇక్కడ నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను అదేంటంటే బాబా బాబా అంటుంటే తలయ బాబా అంటుంటే మీరేదో 40 ఏళ్ళు 50 ఏళ్ళు లేదా 60 సంవత్సరాలు వచ్చినా బాబా అనుకుంటుండొచ్చు కాదు అప్పటికి ఆయన వయసు 16 సంవత్సరాలు ఇన్ని చేస్తుంది అంటే ఇన్ని సిద్ధులు పొంది భక్తులు చేయదడితే అది ఇస్తుంది ఒక 50 60 సంవత్సరాల గురువు కాదు ఒక 16 సంవత్సరాల ఒక యువకుడు అలా అక్కడ కొన్ని నెలలు గడిపిన తర్వాత ఇక అక్కడి నుంచి ఆయనకు వెళ్లాలనిపిస్తుంది ఆ ప్రాంతానికి కొంత దూరంలో మాతాజీ అనే ఒక ఆవిడ ఉంటుంది ఆవిడకి ఆ గుడి అన్ని అప్పజెప్పి బాబాజీ అక్కడి నుంచి వచ్చేస్తారు ఒకసారి బాబా లక్ష్మణ్ దాస్ అదే మన తలయ బాబాకి ఆయనకు గంగా స్నానం చేయాలనిపిస్తుంది సో దాని కోసమని అంటే గంగా స్నానం చేయాలంటే గడియా ఘాటుకి వెళ్ళాలి ఉత్తరప్రదేశ్ లో ఉన్న గడియా ఘాటుకి వెళ్ళాలి దాని కోసమని ఈయన ట్రైన్ లో వెళ్తుంటారు సో ఈయన ఏమో యోగి ఈయన దగ్గర ఒక రూపాయి ఉండదు సరే ట్రైన్ లో ప్రయాణిస్తుంటాడు ఈ లోపలే టిసి వచ్చి ఈయన పైకి కిందకి చూస్తాడు ఆ టీసి బ్రిటిష్ వారు అన్నమాట ఈ స్టోరీ మొత్తం కూడా మన స్వతంత్రం రాకముందే జరిగే స్టోరీ సో అతను వచ్చి పైకి కిందికి చూసి టికెట్ అని అడుగుతాడు ఈయన దగ్గరేమో టికెట్ ఉండదు వెంటనే అతను ఏం చేస్తాడు నీకల్లి బాబాని దింపేయాలని ప్రయత్నిస్తాడు బాబా చెప్తారు లేదు నేను అట్లా ఒక యోగిని నా దగ్గర డబ్బులు ఏమి లేదు దయచేసి నన్ను వెళ్ళనివ్వు అని అడుగుతాడు టీసి ఏం చేస్తాడు అంటే నిర్దాక్షణంగా ట్రైన్ చైన్ లాగి బాబాని దింపేస్తారు దింపేసిన తర్వాత టిసి వెంటనే సిగ్నల్ ఇస్తాడు ట్రైన్ వెళ్ళడానికి ట్రైన్ కదలదు బాబా ఏమో వెళ్లి ఆ దింపారు కదా బాబా ఏమో వెళ్లి ఒక చెట్టు కింద కూర్చొని పద్మాశ్రమంలో కూర్చొని ఆయన దగ్గర యోగదండం ఉంటే దాని మీద చెయ్యి పెట్టుకొని ఇలా ట్రైన్ వైపు చూస్తూ ఉంటాడు ఈ లోపల టిసి ట్రైన్ వెళ్ళడానికి సిగ్నల్ ఇస్తాడు ఎంతసేపైనా ట్రైన్ కదలదు సరే ఎందుకు ట్రైన్ కదలట్లేదా అని ఆ ట్రైన్ ఇంజనీర్ డ్రైవ్ డ్రైవర్ టెక్నీషియన్ అందరూ వచ్చి ట్రైన్ మొత్తం చెక్ చేస్తారు అంటే ఇంజన్ మొత్తం చెక్ చేస్తారు వీళ్ళకేం అర్థం కాదు ఇలా కొన్ని గంటలు గడిచిపోతుంది అయితే కొన్ని గంటల పాటు ట్రైన్ అక్కడ ఆగిపోవడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వచ్చి గుమిగూడి ఆ ట్రైన్ ని చూస్తుంటారు అయితే అందులో ఒక వ్యక్తి ఈ బాబాని గుర్తుపడతాడు గుర్తుపట్టి అసలు ఏం జరిగింది అని తెలుసుకుంటాడు తెలుసుకుంటే అక్కడున్న ఒక ప్రయాణికుడు ఈ కథ మొత్తం చెప్తాడు అంటే బాబాని ఇలా ఆయన ట్రైన్ ఆపి దింపేస్తారండి అప్పుడు ఈ వ్యక్తి పరిగెత్తుకుంటూ టికెట్ కలెక్టర్ దగ్గరికి వెళ్లి చెప్తాడు అసలు మీరు ఎంత పెద్ద తప్పు చేశారో మీకు తెలుసా ఆయన్ని ఇలా దింపేసి వెళ్లి ఆయన క్షమాపణ అడగండి సో అడిగిన వెంటనే ఆయన క్షమిస్తే వెంటనే ఈ ట్రైన్ స్టార్ట్ అవుతుంది అని చెప్తాడు ఇక చేసేదే లేక అంటే వీళ్ళు కొన్ని గంటల పాటు ప్రయత్నించిన వీళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలియలేదు ఇంకా చేసేది ఏం లేదు ఆ వ్యక్తి వచ్చి బాబా దగ్గరికి వస్తాడు ఈ లోపలే ఆ ఎవరైతే అయితే ఆ బాబాని గుర్తుపట్టాడు ఆ వ్యక్తి వచ్చి బాబా బాబా మీరు మాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టాలి ఏంటంటే ఇక్కడికి కొంత దూరంలో మా ఊరు ఉంది మా ఊరి ప్రజలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లాలంటే ఎలాంటి రవాణా సౌకర్యం లేదు దయచేసి మీరు కరుణించి ఎక్కడైతే ట్రైన్ ఆగిందో ఈ ప్లేస్ లో మాకు రైల్వే స్టేషన్ వచ్చేటట్లు చేయండి దీనివల్ల ఏమవుతుంది అంటే మా ఊరి ప్రజలందరికీ మేలు జరుగుతుంది అని ఆయన బాబాని ప్రాధాయ పడతాడు ఇంతలోనే టికెట్ కలెక్టర్ వచ్చి బాబా నన్ను క్షమించండి మీ గురించి తెలియదు మీ శక్తి గురించి తెలియక నేను ఇలా చేశాను అని క్షమాపణ కోరుతాడు కోరితే అప్పుడు బాబాజీ సరే ట్రైన్ అయితే కదులుతుంది కానీ నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి అదేంటంటే ఎక్కడైతే ఇక్కడ నువ్వు నన్ను దింపేసావో అదే ప్లేస్ లో రైల్వే స్టేషన్ రావాలి సో నువ్వు మీ పై అధికారులతో మాట్లాడి ఇక్కడ రైల్వే స్టేషన్ వచ్చేటట్టు చేస్తే ఈ ట్రైన్ కదులుతుంది అని చెప్తాడు అప్పుడు టికెట్ కలెక్టర్ మాట ఇస్తాడు కచ్చితంగా నేను పై అధికారులతో మాట్లాడి ఈ ట్రైన్ ఎక్కడైతే ఆగిందో మిమ్మల్ని ఎక్కడైతే దింపానో ఆ ప్లేస్ లో రైల్వే స్టేషన్ కట్టించే బాధ్యత నాది అని చెప్పిన తర్వాత ఈయన ఈ బాబా లక్ష్మణ్ దాస్ గారు ఇలా ట్రైన్ వైపు చూస్తారు చూసిన వెంటనే ట్రైన్ స్టార్ట్ అవుతుంది మీకు అనిపించొచ్చు ఇదేదో సినిమా స్టోరీ అని కానీ నిజంగా జరిగిన ఒక సంఘటన ఇక ట్రైన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అండి ఈ ఊరి ప్రజలు ఎవరైతే అక్కడ జనాలు వచ్చి గుమిగూడారో ఆ జనాలందరూ పక్కనే ఉన్న వారి ఊరికి వెళ్లి ఆ ఊరికి వెళ్లి ఆ ఊర్లో ఉన్న సర్పంచ్ కు ఈ స్టోరీ మొత్తం చెప్తారు చెప్పి అయ్యా ఇలా ఒక గొప్ప యోగి ఆయన ఇక్కడే ఉన్నారు సో మనమంతా కలిసి ఈ యోగిని మన ఊర్లో ఉండేటట్లు చేద్దాము అని ఆ సర్పంచ్ ని తీసుకొచ్చి ఈ నీకలి బాబా గారి దగ్గరికి వస్తారు వచ్చి అందరూ రిక్వెస్ట్ చేస్తారు చేస్తారు బాబా మీరు మా ఊరికి రండి మీకు మేము అన్ని చూసుకుంటాం ఇలా అంటే అప్పుడు బాబా సరే నేను మీ ఊరికి వస్తాను నాకు సాధన చేసుకోవడానికి ఒక గుహ కట్టించండి అని అడుగుతారు అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆ సర్పంచ్ ఆ ఊరి ప్రజలందరూ కలిసి బాబాకి ఒక గుహ కట్టిస్తారు సో బాబా ఆ గుహకి వెళ్లి సాధన చేసుకుంటూ ఉంటారు ఏ విధంగా అయితే ఆ టికెట్ కలెక్టర్ మాట ఇచ్చారో అదే విధంగా అది తక్కువ కాలంలోనే ఎక్కడైతే ట్రైన్ ఆపి బాబాని దింపేశారో అదే ప్లేస్ లో రైల్వే స్టేషన్ వస్తుందన్నమాట అప్పుడు ఆ రైల్వే స్టేషన్ పేరు అంటే అక్కడికి కొంత దూరంలో నేమ్ కరోలి అనే గ్రామం ఉంటుంది సో ఆ గ్రామం పేరుని ఆ రైల్వే స్టేషన్ పేరుగా పెడతారు అదేవిధంగా ఆ బాబా వల్ల అక్కడ రైల్వే స్టేషన్ వచ్చింది కాబట్టి ఆ ఊరి ప్రజలందరూ కూడా నేమ్ కరోలి బాబా అని పిలవడం మొదలు పెడతారు అలా మన లక్ష్మి నారాయణ శర్మ అదే లక్ష్మణ్ దాస్ అదే తలయ బాబా గారు నీమ్ కరోలి బాబాగా పేరు పొందుతారు ఇలా ఆయనకు నీమ్ కరలి బాబా అని పేరు వస్తుందన్నమాట అప్పటికి ఆయన వయసు 18 సంవత్సరాలు మాత్రమే మళ్ళీ మనం నీమ్ కరలి బాబా జీవిత చరిత్ర రెండవ భాగంలో కలుసుకుందాం ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లైతే దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు 



No comments:

Post a Comment