Vedantha panchadasi:
అజ్ఞాన మావృత్తీ స్తద్వద్విక్షేపశ్చ పరోక్షధీః ౹
అపరోక్షమతిః శోఖ మోక్ష స్తృప్తిర్నిరఙ్కుశా ౹౹33౹౹
33. అజ్ఞానము,ఆవరణము,
విక్షేపము,పరోక్షజ్ఞానము,
అపరోక్షజ్ఞానము,దుఃఖనివృత్తి,
నిరతిశయమైన తృప్తి.
సప్తావస్థ ఇమాః సన్తి చిదాభాసస్య తాస్విమౌ ౹
బన్దమోక్షౌ స్థితౌ తత్ర తిస్రో బంధ కృతః స్మృతాః ౹౹34౹౹
34.చిదాభాసుడగు జీవుడు ఈ సప్తదశలనుగడచును.అందు మొదటి మూడూ బంధకారణములని చెప్పబడినవి.
న జానామీత్యుదాసీన వ్యవహారస్య కారణమ్ ౹
విచార ప్రాగభావేన యుక్తమజ్ఞానమీరితమ్ ౹౹35౹౹
35. నాకు తెలియదు అనుభావము,సత్యమును గూర్చి నిర్లిక్ష్యము,వివేకము లేకపోవుట అనేవి అజ్ఞానమని చెప్పబడినవి.
వాఖ్య:-అజ్ఞానము, ఆవరణము(ఆవృత్తి),
విక్షేపము,పరోక్షజ్ఞానము,
అపరోక్షజ్ఞానము,శోకనివృత్తి,
నిరతిశయానందము అనేవి చిదాభాసలోని సప్తావస్థలు.
ఇవే బంధమును మోక్షమును కూడా కల్పించును.
ఈ ఏడు అవస్థల్ని ఆత్మధర్మాలుగా అంగీకరిస్తే,
ఆత్మ అనేది నిర్వికారమైనది ఎట్లా అవుతుంది?
అంటే,సమాధానం -
ఈ ఏడు అవస్థలు చిదాభాసకు(జీవునికి) ఉండేవే తప్ప కూటస్థునివి కావు.ఈ ఏడు అవస్థల్లోనూ బంధమోక్షాలు రెండూ ఉన్నాయి.
మొదటి మూడు అవస్థలూ (అజ్ఞానం,ఆవరణ,విక్షేపం)
బంధాన్ని కలిగించేవి.
మిగిలిన నాలుగూ (పరోక్షజ్ఞానము,
అపరోక్షజ్ఞానము, దుఃఖనివృత్తి,
నిరతిశయమైన తృప్తి) మోక్షాన్ని కలిగించేవి.
ఇప్పుడు వీటిలో అజ్ఞానస్వరూపం -
ఎవనియందైనా సరే,
ఆత్మతత్త్వ విచారణకు సంబంధించిన ప్రావభావం -
ఆత్మ తత్త్వవిచారణ లేకపోవటంతో కూడిన తూష్ణీ భావంతో ఉదాసీనుడుగా ఉండటం అనేవి కనిపిస్తే వాటికి కారణం అజ్ఞానం అన్నమాట.
అట్లాగే,
"నేను కూటస్థుని ఎరుగను" అనే ఈ విధమైన అనుభవానికి
విషయమైనదే అజ్ఞానం. ఔదాసీన్యం,సత్యత్వము పై నిర్లిక్ష్యము,వివేకము లేకపోవుట అనేవి అజ్ఞాన స్వరూపమని,
"నేను ఎరుగను" అనే అనుభవం అజ్ఞానానికి కార్యం అన్నమాట.
ఏ చైతన్యస్వరూపమైన ఆత్మవల్ల సమస్తమూ తెలుసుకొనబడుతోందో,అటువంటి సత్యమును దేనివల్ల తెలుసుకోగలము ? అనే శ్రుతివచనాన్ని బట్టి ఏ ఆత్మతత్త్వంతో ఈ దృశ్యాన్నంతనూ తెలుసుకోగలుగుతున్నామో అటువంటి సత్యాన్ని ఏ జడవస్తువుతో చూడగలగుతాము?
తెలుసుకోగలుగుతాము?
జ్ఞానానికి సాధనమైన మనస్సు కూడా జ్ఞాతవ్యమైన విషయాన్నే తెలుసుకోగలుగుతుందేతప్ప జ్ఞాతయైన ఆత్మను తెలుసుకోలేదు.
మరొక శ్రుతికూడా ఇదే చెపుతొంది.
"నైవ వాచా న మనసా ప్రాప్తుం శక్యోన చక్షషా..."
కఠ 2-3-13.
ఆత్మను వాక్కుతో గాని,మనస్సుతోగాని,చక్షురాది ఇతర ఇంద్రియాలతో గాని పొందటానికి వీలులేదు.వాఖ్య:-అజ్ఞానము, ఆవరణము(ఆవృత్తి),

ఏ చైతన్యస్వరూపమైన ఆత్మవల్ల సమస్తమూ తెలుసుకొనబడుతోందో,అటువంటి సత్యమును దేనివల్ల తెలుసుకోగలము ? అనే శ్రుతివచనాన్ని బట్టి ఏ ఆత్మతత్త్వంతో ఈ దృశ్యాన్నంతనూ తెలుసుకోగలుగుతు
న్నామో అటువంటి సత్యాన్ని ఏ జడవస్తువుతో చూడగలగుతాము?
తెలుసుకోగలుగుతాము?
జ్ఞానానికి సాధనమైన మనస్సు కూడా జ్ఞాతవ్యమైన విషయాన్నే తెలుసుకోగలుగుతుందేతప్ప జ్ఞాతయైన ఆత్మను తెలుసుకోలేదు.
మరొక శ్రుతికూడా ఇదే చెపుతొంది.
"నైవ వాచా న మనసా ప్రాప్తుం శక్యోన చక్షషా..."
కఠ 2-3-13.
ఆత్మను వాక్కుతో గాని,మనస్సుతోగాని,చక్షురాది ఇతర ఇంద్రియాలతో గాని పొందటానికి వీలులేదు.
ఆమార్గేణ విచార్యాథ నాస్తి నో భాతి చేత్యసౌ ౹
విపరీత వ్యవహృతి రావృతేః కార్యమిష్యతే ౹౹36౹౹
36.అశాస్త్రీయమగు తర్కము ద్వారా కూటస్థము కన్పింపదు అది లేదు అనే విపరీత వ్యవహారము ఆవరణము యొక్క ఫలము.
దేహద్వయ చిదాభాసరూపో విక్షేప ఈరితః ౹
కర్తృత్వా ద్యఖిలః శోకః సంసారాఖ్యోఽ స్య బంధక ౹౹37౹౹
37.చిదాభాసుడు శరీరములతో తాదాత్మ్యము నొందుట విక్షేపమనబడినది. దీని వలన కర్తృత్వభావనతో ప్రారంభమగు సకల దుఃఖములకు లోనగును.ఈ దుఃఖజాతమే సంసారము.అదే బంధము.
వ్యాఖ్య:- శాస్త్రాల్లో ప్రతిపాదింపబడిన ప్రక్రియల్ని
ఉల్లంఘించి,కేవలం కుతర్కాలతో ఆలోచించినమీదట "కూటస్థుడు లేనూలేడు, కనపడనూ కనపడటం లేదు" అనే ఈ విధమైన విరుద్ధ వ్యవహారం ఆవరణకు కారణమౌతుంది.
అజ్ఞానావరణ వల్లనే ఈ విధంగా వ్యవహరిస్తారు.
స్థూలశరీరం,సూక్ష్మశరీరం ఈ రెంటితోనూ కూడి తాదాత్మ్యము నొంది ఉన్న చిదాభాసనే(జీవుణ్ణే)విక్షేపం అంటారు.
బంధనహేతువైనట్టి సంసారమనే పేరుతో వ్యవహరింపబడే
కర్తృత్వ భోక్తృత్వాది రూపంలో ఉండే సమస్త శోకమూ చిదాభాస యొక్క కార్యమనే అంగీకరించాలి.
ఈ పై రెండు అవస్థలూ చిదాభాసలో ఎట్లా ఉంటాయి ?
అజ్ఞానం,ఆవృత్తి అనేవి విక్షేపం పుట్టటానికి ముందు గూడా ఉన్నాయి గదా !
చిదాభాసమనేది విక్షేపాంతర్గతమైనదని అంటారేమి ? అంటే -
అజ్ఞానము, ఆవరణము (ఆవృత్తి)అనే ఈ రెండు అవస్థలూ విక్షేపం పుట్టటానికి పూర్వమే ఉన్నప్పటికీ అవి చిదాభాసకున్నవే తప్ఫ కూటస్థమైన చైతన్యానికి సంబంధించినవు కావు.
కూటస్థమనేది అసంగమైనది కాబట్టి,చిదాత్మ యందు అజ్ఞానము ఆవరణము అనేవి సంభవం కాదు.
ఇక పరిశేష న్యాయంగా ఆ రెండు అవస్థలూ చిదాభాసకు చెందినవే అని అంగీకరించాలి.
అంతఃకరణ వృత్తి అంతర్ముఖమయిన తరువాత సూక్ష్మమైన చైతన్యము ను అందుకొనుటకు నిరీక్షించాలి.
నిలకడ లేక బహిర్ముఖమయినచో అదే "విక్షేపం".
ఇంట్లో నిధి ఉన్నది.తవ్వాడు దానికి ఒక విష సర్పము కాపలా ఉన్నది.చాలా ప్రయత్నాలతో ఆ సర్పము అడ్డు తొలగినది.దీని వలన మనస్సుకు సంతోషం కలిగింది.
ఈ సంతోషంతో ఆగిపోతే"నిధి"
దొరకదు.
అలాగే మనలోనే బ్రహ్మరూప నిధి గలదు.దానికి కాపలాగా విక్షేపం వున్నది.అది తొలగితే వచ్చే ఆనందం దగ్గరే ఆగితే బ్రహ్మానందం లభించదు.
బాహ్య విషయాకార వృత్తి - విక్షేపం.
అంతర వాసనాకార వృత్త - రాగద్వేషాదులు.
విషయాలను దోషాలుగా గమనించటం ద్వారా దీనిని పోగొట్టవచ్చును.
అజ్ఞాన మావృతిశ్చైతే విక్షేపాత్ ప్రాక్ ప్రసిద్ధ్యతః ౹
యద్యప్యథా ప్యవస్థే తే విక్షేపస్యైవ నాత్మనః ౹౹38౹౹
38.అజ్ఞానము ఆవరణము అనే రెండు దశలు రెండూ విక్షేపదశకు పూర్వము కలుగునవే.చిదాభాసుడు అనగా జీవుడు ఏర్పడునది మూడవ దశయగు విక్షేపము వలననే.అయినను ఆ మొదటి రెండు దశలు జీవునకే గాని ఆత్మకు బ్రహ్మమునకు కావు.
వ్యాఖ్య:- జీవుడు ఏర్పడుటకు మునుపటివైన అజ్ఞానము,ఆవరణము ఎవరికి చెందగలవని ప్రశ్న.
ఇవి దశలు,వికారములు,అగుటచే
అవికార్యమైన బ్రహ్మమునకు చెందవు.
జీవుడు ఇంకా ఏర్పడక పోవుటచే జీవునకు చెందజాలవు.
మరి ఎవరికి చెందునట్లు ?
విక్షేపసహితముగ మొదటి మూడుదశలును ఏకకాలమున సంభవించును అనుట కుదురదు.
అట్లయిన
మూడు దశలనుట ఏల?
ఒకే దశ అనరాదా?
జీవునవే అని పరిష్కారము. విక్షేపదశయందు జీవుడు స్పష్టముగ నేర్పడినను దానికి పూర్వము కూడా సూక్ష్మ సంస్కారముల రూపమున ఉండనే ఉన్నాడు.
అజ్ఞానము ఆవరణము అనే దశలు సూక్ష్మ రూపముననున్న ఆ జీవునకే చెందును.
ఇంకను జన్మింపకున్నను, మాతృగర్భమునందున్న శిశువునకు అనేక సంస్కారములు చేయబడుచున్నట్లే.
తార్కికముగ కూడా అజ్ఞానము ఆవరణము లేకుండ విక్షేపము సంభవింప జాలదు.
దశముడు తన సంగతి విస్మరించును.
దశముని ఉనికి తోచక పోవును అప్పుడు మాత్రమే దశముడు నదిలో మునిగిపోయెననే విక్షేపము సంభవమగును.
కనుక విక్షేనమునకు కారణములగు అజ్ఞాన ఆవరణములు విక్షేపకార్యమగు జీవునకు చెందుట న్యాయమే.
No comments:
Post a Comment