Wednesday, June 4, 2025

*🐄 ప్రతీ పూజకు ఆవుపాలు ఎందుకు 🐄* 

🙏🐄గోవు యొక్క గొంతుక నందు, పొదుగులో, మూత్రములో, గంగా దేవి ఉంది. అంతే కాదు గోవు యొక్క అన్ని అంగములు లో కలిపి సర్వ దేవతలు ఉన్నారు అని శాస్త్రములు చెప్పుతున్నాయి.

🙏🐄గోవు యొక్క మలముత్రాలులో పెన్సిలిన్ ఉంది అని నిరూపితం అయినది. అటు శాస్త్రపరంగా ఇటు సైన్స్ ప్రకారం చూసినా గోమాత గొప్పదనం అంతా ఇంతా కాదు.

 *శ్లో !! గ్రీవా మస్తక సంధేతు తాసాం గంగా ప్రతిష్ఠితా*
*సర్వదేవ మయోగానః సర్వతీర్థమయాస్తదా !!* 

🙏🐄ప్రతీ పూజకు ఆవు పాలు ఎందుకు అంటే వైదిక ధర్మం కావాలని చెప్పుతుంది. పురోహితులు ప్రతీ పూజకు ఆవుపాలు, పెరుగు, నెయ్య ఖచ్చితం గా కావాలి అని శాస్త్రం .ఆవుపాలు తప్ప వేరేవి సమ్మతించవు. పాల పాకెట్స్ తప్పక వాడడం పట్టణ ప్రజలుకు అలవాటుగా మారిన నేటి రోజులు చూసి విచారణ చెందడం కన్నా సాధ్యమైన మేర ఆవుపాలు కోసం వెదకటం మంచిది. గోశాలలు కు విరాళం ఉన్నంతలో కొంత మన భాద్యత గా అందించడం మన కర్తవ్యం. స్థలం కేటాయించే దాన గుణ సంపన్నులు, వృత్తితో పాటు అభిరుచి ఉన్నవారు గోసంరక్షణ శాల లో కొంత సమయం కేటాయించడం ఆవశ్యకం.

🙏🐄యే ఊరి నందు అయితే గోశాల ఉంటుందో ఆ ఊరిలో ఉన్న ప్రజలకు శని భాదలు ఉండవు అని శాస్త్ర వచన. విష్ణువుకు గోవులు అంటే ఇష్టం అందుకే ఆవు పాలుతో పూజలు చేయడం ద్వారా లక్ష్మీ కటాక్ష సిద్ది ఆయన ఇస్తాడు. గోదాన ఫలం అంతా ఇంతా కాదు, గోదానము చేసిన వారికి సర్వ దోష నివారణ సకల సంపదలు అందుతాయి.
🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯

No comments:

Post a Comment