Friday, June 27, 2025

Tips to be mentally strong | మనిషి స్వార్ధపరుడు | Life లో చేదు నిజాలు Telugu motivational videos

Tips to be mentally strong | మనిషి స్వార్ధపరుడు | Life లో చేదు నిజాలు Telugu motivational videos



 [సంగీతం] లైఫ్ ని బెటర్ గా ఫేస్ చేయాలి అంటే మనం కొన్ని నిజాలని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ నిజాలు చాలా చేదుగా ఉండొచ్చు కానీ వాటిని అర్థం చేసుకుంటే ఎమోషనల్ గా స్ట్రాంగ్ అవ్వడానికి మెచూర్ గా ఆలోచించడానికి తెలివిగా బ్రతకడానికి హెల్ప్ అవుతాయి. మన ఆలోచన విధానాన్ని జీవించే విధానాన్ని మారుస్తాయి. సో ఈ వీడియోలో అలాంటి కొన్ని చేదు నిజాల గురించి మాట్లాడుకోబోతున్నాము. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో చివర్లో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న జీవితమస్తు  స్వాగతం. ఫస్ట్ చేదు నిజం ఏంటి అంటే కష్టాలు పడకుండా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఎవ్వరూ స్ట్రాంగ్ అవ్వలేం. కష్టాలు పడకుండా మనం ఎవ్వరం స్ట్రాంగ్ అవ్వలేం ఫిజికల్లీ మెంటల్లీ ఎమోషనల్లీ ఎలా అయితే బరువులు ఎత్తితేనే మన కండలు గట్టి పడతాయో అలానే మన లైఫ్ లో ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడే ఇంటర్నల్ గా స్ట్రాంగ్ అవుతాము. స్ట్రగుల్ అనేది పనిష్మెంట్ కాదు అదిఒక ట్రైనింగ్ గ్రౌండ్ స్ట్రాంగ్ అవ్వాలన్నా సక్సెస్ అవ్వాలన్నా కాన్ఫిడెన్స్ గెయిన్ చేయాలి అన్నా మన భయాన్ని ఎమోషన్స్ ని దాటి వాటిని ఫేస్ చేయాలి. ప్రతి ఛాలెంజ్ ప్రతి ప్రాబ్లం ప్రతి కష్టం ఏదో ఒకటి నేర్పిస్తది మనల్ని స్ట్రాంగ్ చేస్తది. చాలా కంఫర్టబుల్ గా పెరిగిన వాళ్ళ కంటే కష్టాలు పడిన వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. చాలా విషయాలు నేర్చుకుంటారు. అలాని కష్టాలు రావాలని కోరుకోము బట్ కష్టాలు వచ్చినప్పుడు మనం దాని నుంచి స్ట్రాంగ్ అవుతాము నేర్చుకుంటాము అనుకున్నప్పుడు వాటిని బెటర్ గా ఫేస్ చేయగలుగుతాము. ఈ మధ్య ఒక కోట్ చదివాను నో ట్రీ కెన్ గ్రో టు హెవెన్ అన్లెస్ ఇట్స్ రూట్స్ రీచ్ డౌన్ టు హెల్ ఒక చెట్టు స్వర్గానికి ఎదగాలి అంటే దాని వేర్లు నరకాన్ని తాకాలి అని. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి అంటే నేను ఐటీ లో జాబ్ చేసేటప్పుడు చాలా ప్రాజెక్ట్స్ వర్క్ చేశాను కానీ ఒక ప్రాజెక్ట్ మాత్రం చాలా చాలా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ చాలా కష్టమైన ప్రాజెక్ట్ బట్ ఆ ప్రాజెక్ట్ లోనే నేను చాలా విషయాలు చాలా ఫాస్ట్ గా నేర్చుకున్నాను అంటే టెక్నికల్ విషయాలే కాదు మనుషులతో డీల్ చేసే విషయాలు అలాంటివి కూడా నేర్చుకున్నాను అన్నమాట ఓవరాల్ గా చాలా స్ట్రాంగ్ అయ్యాను ఆ ప్రాజెక్ట్ తర్వాత ఇంక మనం నెక్స్ట్ చేదనిజం చూసేద్దాము అదేంటంటే మనిషి స్వార్ధపరుడు. ఎస్ యక్సెప్ట్ చేయడానికి కష్టంగా అనిపించిన దిస్ ఇస్ ద ఫాక్ట్ మనుషులు సెల్ఫిష్ ఇక్కడ సెల్ఫిష్ అంటే ఏదో క్రూరంగా ఉండడం కాదు మనుషులందరికీ ఫస్ట్ వాళ్ళ అవసరాలు కోరికలు తీర్చుకోవాలి అనే ఒక టెండెన్సీ ఉంటుంది. అలానే ఇతరులని ప్రేమించరా ఇతరుల గురించి ఆలోచించరా అని కాదు కానీ ప్రతి ఒక్కరిలో ముందు వాళ్ళు సేఫ్ గా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి అనే ఇన్స్టింట్ ఉంటుంది. ముందు తన గురించి తను ఆలోచించుకోవడం మనిషి తత్వం. నేను చాలా వీడియోస్ లో చెప్పాను కదా మన బ్రెయిన్ కి మనం బ్రతికి ఉండడమే ఫస్ట్ ప్రయారిటీ మనం మంచిగా ఉన్నామా చెడ్డగా ఉన్నామా హ్యాపీగా ఉన్నామా బాధగా ఉన్నామా అనేది తర్వాత సంగతి మన సేఫ్టీ మన అవసరాలు దానికి ముఖ్యం అలానే ఏదో ఒక లాభం లేకుండా మనిషి ఏది చేయడు. ఏ పని చేయాలి అన్నా నాకేంటి అనే ప్రశ్న రెడీగా ఉంటుంది. కానీ దేవుడు మనకి కొంచెం బుద్ధి కూడా ఇచ్చాడు కాబట్టి లైఫ్ మీనింగ్ఫుల్ గా అనిపించడానికి కొన్ని సాక్రిఫైసెస్ కొన్ని అడ్జస్ట్మెంట్స్ కొంచెం కైండ్ గా ఉండడం ద్వారా సెల్ఫిష్నెస్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాము అండ్ ఆ బుద్ధి అందరికీ ఉండదు మనిషిని బట్టి మారుతుంది సో అందరూ కైండ్ గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయలేము. మనిషి స్వార్ధపరుడు అనే విషయాన్ని యక్సెప్ట్ చేయడం ద్వారా నాకు కలిగిన పెద్ద బెనిఫిట్ అయితే కొన్నిసార్లు మనుషుల సెల్ఫిష్ బిహేవియర్స్ కి షాక్ అవ్వకుండా ఉండగలుగుతాను. ఇంకా మనుషుల మీద బెటర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం ఒకవేళ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోయినా కొన్ని సిచువేషన్స్ లో క్షమించగలగడం అలానే రిలేషన్షిప్స్ ని రియలిస్టిక్ గా అంటే వాస్తవికంగా చూడడానికి హెల్ప్ అవుతుంది. మనం కూడా కొన్ని హెల్దీ హద్దులు పెట్టుకోవచ్చు ఎంతవరకు చేయాలో అంతవరకు చేయొచ్చు. గివ్ అండ్ టేక్ అనేది హెల్దీగా మెయింటైన్ చేసుకోవచ్చు. నో చెప్పడానికి గిల్టీగా ఫీల్ అవ్వము ఇతరులు నో చెప్పిన ట్రిగ్గర్ అవ్వము. కొన్ని విషయాలు పర్సనల్ గా తీసుకోకుండా ఉంటాము మేబీ వాళ్ళ సిచువేషన్స్ వల్ల వాళ్ళకున్న అవసరాల వల్ల వాళ్ళకున్న స్ట్రగుల్స్ అండ్ స్ట్రెస్ వల్ల అలా బిహేవ్ చేసి ఉండొచ్చు మన వల్ల కాదు ఇది వాళ్ళ ప్రాబ్లం మనల్ని హర్ట్ చేయాలని చేయలేదు అని కొన్ని సిచువేషన్స్ ని బెటర్ గా అర్థం చేసుకోగలుగుతాం. ఇంకా మన అవసరాలు ఇతరులు తీర్చాలి అని ఎమోషనల్ గా ఇతరుల మీద డిపెండ్ అవ్వకుండా మన హ్యాపీనెస్ ప్రశాంతత గురించి మనం రెస్పాన్సిబిలిటీ  నెక్స్ట్ చేదు నిజం ఏంటంటే మరీ మంచిగా ఉంటే ఇతరులు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఎక్కువ బాధ్యతగా ఉండే వాళ్ళ మీదే పనులు ఎక్కువ పడతాయి. ఎక్కువ ప్రేమగా ఉండే వాళ్ళనే గ్రాంటెడ్ గా తీసుకుంటారు. ఎక్కువ ఇచ్చే వాళ్ళ మీదే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. ఎక్కువ అవైలబుల్ గా ఉండే వాళ్ళనే చులకనగా చూస్తారు. కైండ్ గా ఉండడం హెల్ప్ చేయడం చాలా గొప్ప విషయాలే కానీ మరీ అతి మంచిదనంతో ఉండడం అస్సలు మంచిది కాదు ప్రతిదానికి ఎస్ చెప్పడం ఎంతవరకు అవసరమో తెలుసుకోకుండా హెల్ప్ చేయడం మనకి చేయగలిగిన టైం ఎనర్జీ లేకపోయినా పనులు నెత్తి మీద వేసుకోవడం అతిగా కాంప్రమైజ్ అవ్వడం ఇలాంటి వాటి వల్ల మనం బర్న్ అవుట్ అయిపోవడమే కాదు మనమే ఇతరులకి రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తాం. అది వాళ్ళక కూడా మంచిది కాదు. ఇతరులకి హెల్ప్ చేయడం ఎంత ఇంపార్టెంటో మన గురించి మనం కేర్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. మంచితనానికి హద్దులు ఉండాలి స్వార్థానికి విలువలు ఉండాలి. అతి మంచితనం వద్దు అని నేను ఇంతకుముందు చేసిన వీడియోలో చెప్పిన మంచి ఆలోచన ఇది స్వార్థాన్ని మంచితనాన్ని బ్యాలెన్స్ చేసుకుంటేనే మనకి మంచిది. నెక్స్ట్ చేదు నిజం ఏంటంటే మన లైఫ్ లో ఎవ్వరు పర్మనెంట్ కాదు. మన లైఫ్ లోకి మనుషులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఎవ్వరూ ఫర్ఎవర్ ఉండరు. ఇదొక హార్ష్ ట్రూత్ లైఫ్ లో ఎవరూ పర్మనెంట్ కాదు. చిన్నప్పుడు స్కూల్లో చాలా క్లోజ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. కానీ పెరిగే క్రమంలో ఇద్దరు ఇంట్రెస్ట్లు మారిపోవచ్చు వేరే ప్లేసెస్ కి షిఫ్ట్ అయిపోవచ్చు మెమరీస్ అలానే ఉన్న బాండింగ్ తగ్గిపోవచ్చు. ఆఫీస్ లో మంచి ఫ్రెండ్ కనెక్ట్ అవ్వచ్చు కానీ వేరే అపర్చునిటీ రావడం వల్ల వేరే జాబ్ కి వెళ్ళడం వల్ల దూరం అయిపోవచ్చు. ఇంకా ఫ్యామిలీ విషయానికి వస్తే ఫ్యామిలీస్ లో ఎన్నో మార్పులు రావచ్చు పిల్లలు పెద్దవాళ్లే వేరే ప్లేస్ లో సెటిల్ అవ్వచ్చు క్లోస్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య దూరాలు పెరగొచ్చు లేదా ఇష్టమైన వాళ్ళు చనిపోవచ్చు. మన లైఫ్ లో ఎవరూ పర్మనెంట్ కాదు అనే విషయాన్ని మనం యక్సెప్ట్ చేస్తే మనక ఇష్టమైన వాళ్ళని గ్రాంటెడ్ గా తీసుకోకుండా వాళ్ళు మనతో ఉన్నప్పుడు వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అని తెలుసుకోవచ్చు. ఎందుకంటే శాశ్వతం కానిది ఏదైనా విలువైనది. ఇంకా చిన్న చిన్న విషయాలు గొడవ పడకుండా లైట్ తీసుకోవడం నేర్చుకోవచ్చు. ప్రతి పర్సన్ నుంచి ప్రతి రిలేషన్షిప్ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు ఆ రిలేషన్షిప్ మనకి నష్టం చేసినా సరే ఇంకా మన హ్యాపీనెస్ ని పూర్తిగా వేరే వాళ్ళ చేతిలో పెట్టకుండా ఎవరున్నా లేకపోయినా మనల్ని మనం ప్లెజెంట్ గా ఉంచుకోవడం నేర్చుకోవచ్చు. ముగిసిపోయిన రిలేషన్షిప్స్ గురించి బాధపడకుండా కొత్త రిలేషన్షిప్స్ కి వెల్కమ్ చెప్పొచ్చు. నెక్స్ట్ చేదు నిజం ఏంటంటే లైఫ్ ఇస్ నాట్ ఫెర్ లైఫ్ ఇస్ నాట్ ఫెయర్ అంటే మంచి చేసిన వాళ్ళకి మంచే జరగాలని లేదు. చెడ్డ పనులు చేసే వాళ్ళకి చెడు జరుగుతుందని లేదు. ఒకసారి మనం ఎంత కష్టపడినా చేయాల్సింది చేసినా మనకి దక్కాల్సింది దక్కదు. కొంతమంది తప్పు చేసినా ఈజీగా సక్సెస్ చూసేవాళ్ళు ఉంటారు. అందరికీ హెల్ప్ చేసే పర్సన్ హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోవచ్చు. ఒక సెల్ఫిష్ పర్సన్ 90 ఏళ్ళు బతకొచ్చు. మనకి ఇవన్నీ అన్యాయంగా అనిపించిన ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ మన కష్టం మన బిహేవియర్ మన యాక్షన్స్ మన కంట్రోల్ లో ఉంటాయి కానీ మన కంట్రోల్ లో లేని విషయాలు చాలా ఉంటాయి. అవి ఎవరికీ అనుకూలంగా ఉంటాయో చెప్పలేము. వాటి వల్ల కొన్నిసార్లు చాలా అన్ఫెర్ గా జరుగుతాయి. లైఫ్ ఫెయిర్ గా ఉండాలి అని ఎక్స్పెక్టేషన్ ఎలాంటిదో తెలుసా నేను జంతువుల్ని అంటే నాన్ వెజ్ తినను కాబట్టి సింహం ఎదురైనప్పుడు సింహం నన్ను తినకూడదు అని ఎక్స్పెక్ట్ చేయడం లాంటిది. లైఫ్ ఇస్ నాట్ ఫెయర్ అనేదాన్ని మనం అర్థం చేసుకొని యక్సెప్ట్ చేస్తే లైఫ్ మీద మన ఎక్స్పెక్టేషన్స్ మారుతాయి. అన్ని ఫెయిర్ గా జరగాలని ఎక్స్పెక్టేషన్ ఉంటే అలా జరగనప్పుడల్లా కోపం ఫ్రస్ట్రేషన్ వస్తాయి. ఎప్పుడైనా అన్ఫెర్ గా జరగొచ్చు అన్న అండర్స్టాండింగ్ ఉంటే మనం కొన్ని సిచువేషన్స్ లో స్ట్రాంగ్ గా ఓపిక్ గా ఉండగలుగుతాం. మనకి అనుకూలంగా జరగని ప్రతిసారి ప్రపంచాన్ని బ్లేమ్ చేయకుండా మనం ఏమి కంట్రోల్ చేయగలం అనే దాని మీద ఫోకస్ చేయగలుగుతాము. అఫ్కోర్స్ కొన్ని సిచువేషన్స్ యాక్సెప్ట్ చేయడం అంత ఈజీ కాదు కొన్ని యక్సెప్ట్ చేయడానికి చాలా టైం పట్టొచ్చు. కానీ మనం చేసినా చేయకపోయినా లైఫ్ ఆగదు. సో యక్సెప్ట్ చేస్తే వ కెన్ ఫీల్ బెటర్ వ కెన్ హ్యాండిల్ బెటర్. ఈ కాంటెక్స్ట్ లో త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను మీరు పెట్టే ఎఫర్ట్స్ మీద ఫోకస్ చేయండి అవుట్కమ్ మీద కాదు ఎందుకంటే అవుట్కమ్ ఒక్కొకసారి ఫెయిర్ గా అనిపించకపోవచ్చు. అండ్ నాకు అనుకూలంగా జరగలేదు అని బాధపడుతూ కూర్చోవద్దు అది మనల్ని ఇంకా వీక్ చేస్తుంది. ఇంకా కొన్ని విషయాలు షార్ట్ టర్మ్ లో అన్ఫెర్ గా అనిపించిన మంచి హ్యాబిట్స్ కైండ్ గా ఉండడం మన హార్డ్ వర్క్ ని ఆపాల్సిన అవసరం లేదు. మన వాల్యూస్ ప్రకారం మనం ముందుకు వెళ్ళొచ్చు. అదే మనం ఏంటి మన క్యారెక్టర్ ఏంటి అనేదాన్ని డిఫైన్ చేస్తుంది. మన లైఫ్ లో అన్యాయం జరగొచ్చేమో కానీ మన క్యారెక్టర్ ని ఎవరు అన్యాయంగా దూరం చేయలేరు. అది మన సొంతం సో లైఫ్ ఇస్ నాట్ ఫెర్ కానీ మనం మన తెలివితేటలతో స్ట్రాంగ్  వెళ్లొచ్చు. నెక్స్ట్ చేదు నిజం మనం ఏదో ఒక రోజు చనిపోతాం. లైఫ్ లో ఏది నిజమైనా అవ్వకపోయినా ఇది కచ్చితంగా నిజం మనం అనుకోవడానికి ఇష్టపడని ఒక నిజం మనం ఒకరోజు కచ్చితంగా చనిపోతాం. ఈ భూమ్మీద మన టైం అండ్ ఎనర్జీ లిమిటెడ్ అది రేపో కొన్ని దశాబ్దాల తర్వాతో ఎప్పుడైనా జరగొచ్చు. ఊపిరి పీల్చడం నడవడం తినడం ఫోన్ చూడడం ఇవన్నీ ఆగిపోతాయి. కానీ దాన్ని యక్సెప్ట్ చేయడం ద్వారా మన టైం లిమిటెడ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సిల్లీ విషయాలను పక్కన పెట్టి లైఫ్ లో ఇంపార్టెంట్ విషయాలు ప్రయారిటైజ్ చేసుకోవచ్చు. ఇది మనక ఒక సెన్స్ ఆఫ్ అర్జెన్సీ క్రియేట్ చేస్తుంది ఇంపార్టెంట్ విషయాల మీద యక్షన్ తీసుకునేలా చేస్తుంది. లైఫ్ టెంపరరీ అనుకున్నప్పుడు మనకవచ్చే ప్రతి కొత్త రోజుని గిఫ్ట్ గా చూడొచ్చు. చిన్న చిన్న ఆనందాల్ని మరింత ఆస్వాదించొచ్చు. ఏదో ఒక రోజు చనిపోతాము అనే నిజాన్ని గుర్తుపెట్టుకోవడం మనం బాధపడడానికి కాదు మనం మేల్కోవడానికి. [సంగీతం] నెక్స్ట్ చేదనిజం ఏంటంటే మనం అందరిని ఎప్పటికీ మెప్పించలేము. మనం ఎంత కష్టపడినా ఎన్ని చేసినా ఎంత మంచిగా ఉన్నా అందరిని మెప్పించలేము. మనం నచ్చని వాళ్ళు మనతో ఏకీభవించని వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేయని వాళ్ళు కొంతమందయనా తప్పకుండా ఉంటారు. అందరినీ మెప్పించాలి అంటే అలసిపోయేది మనమే. మన బెస్ట్ మనం పెట్టి ఇంట్లో ఒక మంచి వంట చేస్తాం. ఒకళ్ళు బాగుంది అంటారు ఒకళ్ళు స్పైసీగా ఉందంటారు. సోషల్ మీడియాలో వీడియో పెడతాం ఒకళ్ళు చాలా బాగుంది అంటారు ఒకళ్ళు బోరింగ్ గా ఉంది అంటారు రకరకాలుగా జడ్జ్ చేస్తారు. జాబ్ చేయకుండా హోమ్ మేకర్ గా ఉంటే కొంతమంది మంచి పని చేసాం అంటారు. కొంతమంది చదువు వేస్ట్ అయిపోయింది అంటారు. అందరినీ ఎప్పటికీ ఒప్పించలేము అనేది మనం బాగా గుర్తుపెట్టుకుంటే మనకి చాలా ఫ్రీడమ్ వస్తుంది అందరి ఒపీనియన్స్ గురించి ఓవర్ థింక్ చేయము. చాలా క్లారిటీ వస్తుంది మనకి ఏది ఇంపార్టెంటో దాని మీద ఫోకస్ చేస్తాం. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కంఫర్టబుల్ గా నో చెప్పగలుగుతాము కొన్ని హద్దులు పెట్టుకోగలుగుతాము. రిలేషన్షిప్స్ బెటర్ అవుతాయి మనకి వాల్యూ ఇచ్చే వాళ్ళతోనే కనెక్ట్ అవుతాము. ఈ ప్రపంచంలో మోస్ట్ టేస్టీ ఫ్రూట్ అయిన మ్యాంగో కి కూడా హేటర్స్ ఉన్నారంట. మనం మనుషులం మనం ఇక్కడ ఉంది అందరి టేస్ట్లకు తగ్గట్టు నడుచుకోవడం కోసం కాదు. నెక్స్ట్ చేదు నిజం ఏంటంటే యు విల్ ఫెయిల్ యు విల్ ఫెయిల్ లైఫ్ లో ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో ఫెయిల్యూర్ ని చూస్తారు. ఫెయిల్యూర్స్ ని మనం ఫేస్ చేయక తప్పదు. దీని అర్థం మనం తెలివిగా ఆలోచించలేదు కష్టపడలేదు అని కాదు కొన్ని మిస్టేక్స్ జరగొచ్చు కొన్ని వర్క్ అవ్వవు కొన్ని అనుకున్న ప్లాన్ ప్రకారం జరగవు మన కంట్రోల్ లో లేని రీజన్స్ చాలా ఉండొచ్చు. ఎంత కష్టపడి చేసినా వంట చెడిపోవచ్చు. ఒక చిన్న మిస్టేక్ వల్ల ఎగ్జామ్ లో చాలా మార్క్స్ పోవచ్చు. కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే వర్క్ అవ్వకపోవచ్చు. ఫెయిల్యూర్స్ అనేవి పార్ట్ ఆఫ్ లైఫ్ అని యక్సెప్ట్ చేస్తే అవి జరిగినప్పుడు షాక్ అవ్వకుండా ఉంటాము మిస్టేక్స్ జరుగుతాయని భయపడకుండా క్యాలిక్యులేటెడ్ రిస్క్స్ తీసుకోగలుగుతాము ఎక్కువ ఛాన్సెస్ తీసుకోగలుగుతాము కొత్తగా ట్రై చేయగలుగుతాము. ప్రతి ఫెయిల్యూర్ మైండ్ కి వర్కవుట్ లాంటిది ఫెయిల్యూర్స్ ఫేస్ చేసే కొద్దీ మనం స్ట్రాంగ్ అవుతాము బాలెన్స్డ్ గా ఉండడం నేర్చుకుంటాము. గెలవాలి అని మాత్రమే కాకుండా ఏమి నేర్చుకున్నాము అని ఆలోచించే మైండ్సెట్ బిల్డ్ అవుతుంది. నడక నేర్చుకునే పిల్లల్ని చూడండి ఎన్ని సార్లు పడతారు లేస్తారు ఏడుస్తారు మళ్ళీ ట్రై చేస్తారు. సక్సెస్ స్టోరీస్ అన్నీ అలానే మొదలవుతాయి. సో ఫెయిల్ అవ్వడం పార్ట్ ఆఫ్ లైఫ్ దానినుంచే నేర్చుకోవాలి తిరిగి నిలబడాలి మరింత తెలివితో ముందుకు వెళ్ళాలి. సో అవన్నమాట నేను షేర్ చేయాలనుకున్న కొన్ని చేదు నిజాలు అండ్ వీటిని యక్సెప్ట్ చేయడం కొన్ని సిచువేషన్స్ లో చెప్పినంత ఈజీ కాదు చాలా కష్టం బట్ సంవేర్ ఎక్కడో ఒక చోట యక్సెప్ట్ చేయక తప్పదు అండ్ నౌ ఇట్స్ యువర్ టర్న్ మీరు చెప్పాలి ఇందులో ఏ పాయింట్ కి మీరు బాగా రిలేట్ అయ్యారు అండ్ మీ ఎక్స్పీరియన్స్ లో మీరు ఫేస్ చేసిన ఒక చేదు నిజం ఏదైనా ఉంటే కామెంట్స్ లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. బద్ధకం ఆశయాన్ని చంపుతుంది కోపం జ్ఞానాన్ని చంపుతుంది భయం కలలను చంపుతుంది. అహంకారం అభివృద్ధిని చంపుతుంది అసూయ మనశశాంతిని చంపుతుంది. అనుమానం ఆత్మవిశ్వాసాన్ని [సంగీతం] చంపుతుంది. సో అదండి ఈ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు జీవితమస్తు

No comments:

Post a Comment