Sunday, June 29, 2025

 "🙏🙏👍👍🙏🙏
 👍.  " *కరణం గారి ఇంటి అరుగు మీద* " *పంతులు గారి బృందం" ముచ్చట్లు*.!"
   *MAZUMDAR*
    *BANGALORE*
      🔥🔥🔥

   "*కత్తెర*" -  అందరి ఇళ్ళలో, కార్యాలయాలలో, వ్యాపార సంస్థలలో, దుకాణాలలో విధిగా ఉండాల్సిన వస్తువు? ఏదీ? అని అడిగితే.. వెంటనే నేను..  మీరు "*కత్తెర*.". అని అందరూ  చెప్పగలము. కదా!

  🚩 ""*ఇనుము లేదా స్టీల్  &ఇత్తడి* తో తయారు చేసిన ఈ *కత్తెర అవసరం మన దైనందిక జీవితంలో ఎన్నో సందర్భాల్లో వస్తుంది.  కత్తెర కి "*ప్రొఫెషనల్" టైలరింగ్ వృత్తి వారి కి శిక్షణ*, పొందిన వారికి, దాని  విలువ బాగా తెలుస్తుంది.  దాని గుర్తింపు, అవసరం,  ఉంది.  మా పల్లెటూరిలో టైలర్ ని పిలిస్తే మా ఇంటికి వచ్చేటప్పుడు, *పెన్సిల్, టైలరింగ్ టేపు, కత్తెర, చిన్న సైజు పాకెట్ బుక్కు*, తో రావటం ఇంకా నాకు బాగా గుర్తే!

🚩"మరి నేటి"వాడకం ఎక్కడ? 

          💐" మన తోటలో చెట్లకి ఆకులు క్రమ పద్ధతిలో "కట్" చేయడానికి *కత్తెర* ఉండాలి.  గులాబీ లాంటి చెట్లు ఎక్కువ పూలు పూయటకు కొమ్మలు "*కత్తిరిస్తారు*  కదా!

             🔔" కొలతల ప్రకారం ప్యాంట్లు, షర్టులు, బ్లౌజ్ లు, కుట్టడానికి "టైలర్".  కి "కత్తెర" చాలా అవసరం..  *కత్తెర లేకపోతే టైలరింగ్* జరగదు.  ఈ "కత్తెర"లు సాధారణంగా పాత కాలంలో "ఆకురాయి" కత్తెర లు  వాడేవారు. తరువాత "సాన కత్తెర," నేడు ఆధునిక టైలర్స్, "Up Grade"  అయై, రబ్బరుతో కూడిన స్టీల్ కత్తెరలు,  వాటికి నంబర్లుకి సైజ్ ను పట్టి కూడా ఉంటాయి.  అవి నేడు వాడు చున్నారు.  ఈ "*కత్తెర"లు ఎలా పట్టుకొని సపోర్ట్ తో వాడాలో*, అనుభవం గల వారిని అడిగి నేర్చుకోవాలి.  సాధారణంగా "కత్తెర " కిందపడిన  పదులు పోయి ఉపయోగించుటకు పనికిరాదు.  చప్పిడి లేకుండా స్మూత్ గా అలసడ లేకుండా, 2 వేళ్ళు  మాత్రము దూర్చి ఉపయోగించాలి.  తెలియకపోతే,*చేతులు కాయలు కాస్తాయి*.

      🔥"బట్టల దుకాణాల్లో మీటర్ కొలతలో "ప్యాంటింగ్ క్లాత్" జీన్స్ క్లాత్, కట్ చేయడానికి, తాను నుండి  బట్ట కటింగ్ కి తప్పక  "కత్తెర" ఉండాలి. 

                  🌷"హెయిర్ కటింగ్" కి, మీసం కట్ కి, మంగలికి "కత్తెర" కంపల్సరీ.              ఆరంగ చెక్కలు ముక్కలు చేయడానికి "*అడకత్తెర*" ఉండాలి.  సుమా!

                                  👍"*శస్త్ర చికిత్స*" కు "కత్తెర" వైద్యుల వద్ద తగిన కత్తెర కంపల్సరీగా ఉండాలి.  ఆ కత్తెరలను  *స్టెర్లింగ్* చేస్తారు.  ఈ మధ్య *వైద్యులు కత్తెర పొట్టలో మరిచిపోయి పెట్టి* , పైన కుట్టి వేస్తున్నారు. అని ఆ మధ్య పేపర్లో చదివినట్టు గుర్తు!  టీ.వీ వార్తలలో కూడా విన్నవాళ్లు చెప్పుకుంటే విన్నాను.

             💅🏼"మన ఇంట్లో ఐతే రెండు ,మూడు కత్తెరలు అందుబాటులో ఉంచుకోవాలి‌.    "పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, టిఫిన్ ప్యాకెట్లు ఓపెన్ చెయ్యడానికి *కత్తెరే "శరణ్యం*"

                   🙏"దూర ప్రయాణాల్లో, *తీర్థయాత్రలకు* పోయేటప్పుడు, *విహారయాత్రలకు* వెళ్లేటప్పుడు  కూడా" "*కత్తెర*" అవసరం ఎంతైనా ఉంది.

                    🔥" *మజ్జిగ ప్యాకెట్లు, పలుకుల ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు ఇత్యాది వాటిని కట్* చేయడానికి.  "కత్తెర" అవసరం వచ్చును.

            👍" *ఫిలిం సెన్సార్ బోర్డు" వారికి "కత్తెర"*  ఆవశ్యకత చాలా ఎక్కువ.  కొన్ని కట్స్ వేస్తేనే గాని  "సెన్సార్ సర్టిఫికెట్ "   జారీ చేయరు.  ఫిలిం రీల్స్ గా సినిమాలు వేసేవారు.  ఆ రీల్స్ కట్ అయిన ముక్కలు, మేము చిన్నప్పుడు కొనుక్కునే వాళ్ళం!  1 కాణీ, అర్ధణా, ఇచ్చిన , డబ్బా కెమెరా వాడు వచ్చి చూపించేవాడు.  ఆనాడు "ప్యాస్ బెల్" కొట్టగా స్కూలు ఎదుట ఉండేవాడు అప్పుడప్పుడు మేము చూసేవాళ్ళం!

           🏃‍♂️ నేటికీ    పిల్లలకి, విద్యార్ధులకి పనే కత్తెరతో..  అవసరమైన పేపర్లు, పుస్తకాలకి అట్టలు  కత్తిరించడానికి, "*డ్రాయింగ్ షీట్*" లకి ఉపయోగం.   మరియు పిల్లలు "క్రియేటివిటీ"  పెంచుటకు *పిల్లలకి ఇచ్చే కత్తెర్లు వేరు* గా వుంటవి.

           👍" ఇక "*జేబుదొంగ*"లకి "*కత్తెర*" అవసరమే. బ్లేడు పనిచేసేవారు, కత్తెర తో పని చేసేవారు, *వారి యొక్క  వృత్తి నైపుణ్యమును బట్టి* కత్తెర ,( Modesto- Offenders) ఉపయోగిస్తారు.

       🌹 "శ్రీమతి మనపై కినుక వహిస్తే.. మీకీ పూట "టిఫిన్ కట్" , ఇది కట్, అది కట్ట్ అనడం పరిపాటే, కదా!  ఇది వారి నోటితో " *కత్తెర*" వేస్తారు.

                                   🌻"మా చిన్నతనంలో "*సిజర్స్*" ఒక పాప్యులర్ బ్రాండ్ "సిగరెట్"   "గుల్షన్ నందా"  హిందీ నవల కటీ పతంగ్ హిట్.   ఇదే నవల ఆధారంగా ఇదే పేరుతో వచ్చిన,  ఆశాపరేఖ్, రాజేష్ ఖన్నా నటించిన హిందీ చిత్రం "కటీ పతంగ్"  సూపర్ హిట్ అయిన చిత్రం.  ఇక సినిమా పాటలు, సన్నివేశాలు గురించి చెప్పవలసిన పనిలేదు. చూశారా ఫ్రెండ్స్..  చిన్న "కత్తెర" వలన ఎన్ని పెద్ద పెద్ద అవసరాలో.. ఉపయోగాలో. మరి *కత్తెర పదును*  పెట్టుటకు, మా బెంగుళూరులో మైకు తో,
రికార్డ్ చేసి బండిమీద వచ్చి, కత్తులు, కత్తెర్లు సాన పట్టేవాళ్ళు, జిప్పులు వేయుట చేస్తారు.  ఎక్కువగా
*మన ఆంధ్రా* నుంచి వస్తుంటారు.

🙏👍" అర్జెంటుగా ఇంటి వద్ద నే, గ్యాస్ స్టవ్ మీద High Flame లో పెట్టి, కాల్చి  పదును పెట్టుట,  మరియు ఎమిలీ పేపర్,
20 రూ! Sheet తో ఇంట్లో ఉంచుకొని, ఒక పక్కనే పదులు పెట్టుట, నేను నిత్యం వాడే మందులు, తగరం పేపర్లను దాచి సొంతంగా ఖాళీ సమయాలలో కటింగ్ చేస్తూ!  గడిపి "కత్తెర"ను పదును పెడతాను.
ఈ పదును కత్తెరకు లేకపోతే మన సమయము "వృధా" అవుతుంది.  దేవుడి గూట్లో ఒక "కత్తెర " కూడా ప్రత్యేకంగా ఉంచుకోవడం జరుగుతుంది.  
ఇలా నేను ఈ *కత్తెర భాగవతం* చెప్పుతూ పోతే, తరగదు కాబట్టి మరో విషయం మీద రేపు చర్చను కొనసాగిద్దాం!
🚩" సమర్పణ: & సేకరణ: *MAZUMDAR* BANGALORE Karnataka

👍🔥🙏👍🙏🔥

No comments:

Post a Comment