Thursday, June 26, 2025

 కాకి కావు కావు కావు అని ఎందుకు అరుస్తుందో తెలుసా... ఈ భూమ్మీద నువ్వు ఎన్ని దుర్మార్గాలు ఎన్ని అడ్డదారులు తొక్కి ఎందరో అమాయకులను నమ్మించి మోసం చేస్తూ వాళ్లకి ప్రలోభాలు పెడుతూ నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదించిన ఎన్ని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న అవేమీ నీవి కాదు
అని...
చివరికి నీతో వచ్చేది మాత్రం శూన్యం.. కేవలం నువ్వు చేసిన మంచే నువ్వు పైలోకానికి వెళ్లిన తర్వాత కూడా ఈ భూమ్మీద ఓ పదిమంది గొప్పగా చెప్పుకునే 
నీకోసం ఒక సువర్ణ అవకాశం నీకు ఇస్తుంది
 ఇప్పటికైనా  మారు ఓ మనిషి సాటివారిని ప్రేమించు సాటి వారు కూడా ఒక మనిషి అని గుర్తించు సాటివారిని హింసించి మోసం చేసి ప్రలోభాలు పెట్టి నువ్వు తినే కూడు అశుద్ధం కన్నా దరిద్రం... 
ఈ ఊపిరి ఉన్నంతవరకే నువ్వైనా నేనైనా గొప్పవాళ్ళము ఈ ఊపిరి ఆగిందంటే మన ఇద్దరము శవాలమే... మన చుట్టూ ఉన్నవారు ఒక్కరోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు ఆ తర్వాత ఈ దుర్గంధం భరించలేము వారు  ఎవరైనా మాకు అనవసరమని.. వెంటనే స్మశానానికి తీసుకువెళ్లి దహనం చేయమని అనే అంటారు 
 ఇది నేటి సమాజం  మనం గౌరవం ఇస్తున్న సమాజం
ఇప్పటికైనా ఆలోచించు ఓ మనిషి 
 ఆలోచించు ఓ మనిషి... అర్థమైతే ధన్యవాదాలు అర్థం చేసుకుంటే శతకోటి దండాలు...
 పశువులకు ఉన్న విలువ 
 సాటి మనసులకు లేదు ఈ రోజుల్లో.. ఈ దరిద్రపు రోజుల్లో...మీ సురేష్

No comments:

Post a Comment