Friday, June 6, 2025

 *ఎవరో ఏదో అన్నారు, మనకు మంచిగా అనిపించలేదు. కానీ, మనకు గుర్తుంది. ఏదైతే మనకు జరుతుందో... అదంతా మన కర్మ యొక్క రిటర్న్.* 

*వారు మనతో ఆవిధంగా మాట్లాడటం, ప్రవర్తించడం... మనకు మంచిగా అనిపించలేదు. బాధ కూడా చాలా ఎక్కువగా అనుభవం అవుతుంది.* 

*కానీ, "ఇదంతా నా గతకర్మ యొక్క రిటర్న్. నా కర్మల ఖాతా ఈవిధంగా నా ముందుకు వచ్చింది' అనే మాటను స్వయానికి చెప్పాల్సి ఉంటుంది.*

*నేను పంపిన ఎనర్జీనే నా ముందుకు వచ్చింది అని మనస్సుకు చెప్పిన తర్వాత... తదుపరి ప్రశ్న... ఈసారి ఏం పంపించాలి? ఇప్పుడు నేను ఏం చేయాలి?*

*మనకు మంచి ఎనర్జీ అనేదే రాకుంటే కనుక... ఇప్పుడు చాలా ధ్యాస పెడుతూ మంచి ఎనర్జీని తప్పక పంపిస్తూ ఉండాలి.* 

*అంతా మంచే జరుగుతున్నప్పుడు... మనం సహజంగానే తిరిగి మంచే పంపిస్తాము. మంచిగా ఆలోచిస్తాము, మంచిగా మాట్లాడుతాము, మంచిగా వ్యవహరిస్తాము. ఇదంతా మనం చేయగలము.*

*కానీ, మరీ ముఖ్యంగా... మనకు చెడు ఎదురైనప్పుడు, చాలా నెగటివ్ జరిగినప్పుడు... ఆ క్షణాల్లో మంచిని పంపించాలి. అప్పుడే మనకు చాలా శక్తి కావాలి.*

*మనకు చెడు చేసేవారి గురించి కూడా మంచిగా ఆలోచించాలంటే ఆత్మిక శక్తి కావాలి. కానీ, మన కర్మఫలమే ఈ రూపంలో వచ్చిందని గుర్తుంటే... ఇది చేయడం కూడా మనకు సులభం అవుతుంది.* 

*ప్రతీ ఆలోచన ఒక కర్మ, ప్రతీ కర్మ రూపి బీజాన్ని చాలా ధ్యాసతో నాటాలి. మనం ఎటువంటి ఫలాలు కావాలని ఆశిస్తున్నామో... అటువంటి బీజాలనే నాటుతూ వెళ్ళాలి.*

*చెప్పడం సులభమే కానీ ఎదుర్కొనేకి శక్తి (immediate Energy) కావాలి...*

*మన మనసుకు పరిస్థితులను ఎదుర్కొనే శక్తి కావాలంటే వెంటనే ఓంకారం (ఓం ధ్వని) చేయాలి...*

*🕉️ఓంకారం ఒక్క💫 బ్రహ్మాస్త్రం🪐*

*ఓంకారం🪷ఓం ధ్యానం చేయడం ద్వారా, ఒత్తిడి నుండి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఓం జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. మీలో కొత్త శక్తిని నింపుతుంది.*

*ఓం శబ్దం మీ పరస్పర సంబంధాలను మెరుగుపరుస్తుంది. మీ వ్యక్తిత్వంలోని మార్పు ప్రజలను ఆకర్షిస్తుంది, ప్రజలు మీమీద అసూయ పడడం మానేస్తారు. ఆరోగ్యంగా ఉండటానికి ఓం ఉత్తమ మార్గం.*

*┈┉┅━❀꧁ హరి ఓం ꧂❀━┅┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🧘‍♂️🍁 🙏🕉️🙏 🍁🧘‍♀️🍁

No comments:

Post a Comment