(వేదాంతం)
వేదాంతము ఇతరులకు చెప్పడం సులభం, మొదట తాను ఆచరించి ఆ ఉనికిలో ఉండడం బహు కష్టం,
దీనికి ఉపమానం రామన్న తిమ్మన్న అనే ఇద్దరు గురుపుత్రుల సంఘటనలో రామన్నకొడుకు విమానం ప్రమాదంలో చనిపోయాడు అని టీవీలో న్యూస్ రావడంవల్ల రామన్న పుత్రశోకముతో తల్లడిల్లిపోయాడు అప్పుడు తిమ్మన్న వచ్చి రామన్నను సముదాయిస్తూ ఓదారుస్తూ ఒకప్పుడు అందరూ పోయేవారమే అంతా లేనేరుకనే వుత్తది జగము ఉన్నది బయలుకదా నువ్వే లేనివాడవైనప్పుడు నీకు ఒక కుమారుడు ఎక్కడ అంటూ ఎన్నో రకాల ఓదార్పు మాటలతో ఓదార్చాడు వెంటనే టీవీ న్యూస్ లో పొరపాటు పడ్డాము రామన్నకొడుకు కాదు తిమ్మన్న కుమారుడు విమాన ప్రమాదంలో చనిపోయాడని తెలియజెప్పారు అప్పుడు తిమ్మన్న లబోదిబో అంటూ నేలమీద పడి పోరులుతూ ఏడవడం ప్రారంభించాడు ఏమి తిమ్మన్న ఇంతవరకు నాకు చెప్పిన నీ అచలబోధ ఏమైనది అంత లేనిదే అన్నావు మళ్లీ ఇంత దుఃఖం నీకెందుకు అంటూ నాకు చెపేవరకేనా నీ హితబోధ అంటాడు, ఇలాగే ఒక వ్యక్తియొక్క దుర్మార్గపు పనులతో నమ్మకద్రోహంవల్ల పడే బాధను దానిని వదిలేయమని చెప్పడం చాలాసులభం తనవరకు అలాంటి బాధ వచ్చినప్పుడు అనుభవించడం బహు కష్టం. అలాగే ఎరుక లేనిదని గంటలకు గంటలు ఉపమానాలతో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం బహు సులభం ఎరుకచేష్టలు వదలి ఎరుకలేని ఉనికిలో తానుండడము దానికి గురుభక్తి గురుకృప తప్ప ఇంకొక మార్గము లేదు, ఇది కుదురుటకు మొదటి కందార్తములో కనుడీ పుస్తకమంతా అంటూ చొక్కా మీ గ్రంధము చూడుము కొనవేళ అంటూ తెలియజేశారు కృష్ణ ప్రభువులు. జి మల్లికార్జున్
అన్నట్లు టైటిల్ వేదాంతము అని పెట్టాను వేదములకు మూలము ఓంకారమనే ప్రణవం అటువంటి ప్రణవముతోనే వేదాలు వాక్యములు మంత్రములు అయినవి గురుముకత వేదములకు మూలమైన ప్రణవముయొక్క విషయమును తెలుసుకొని ప్రణవరహితస్థితికి తాను చేరుకోవడమే వేదాంతము అదియే మాట మంత్రము లేని ఉనికి. జి మల్లికార్జున్
No comments:
Post a Comment