🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️
*పంచాయతనం అంటే...?*_
https://youtu.be/h-aeH0_IvYU?si=KlfO44BeeJQ_ర్సఫ్
🕉️ ఆదిశంకరుల వారు భారతదేశంలో అనేక అవైదిక మతాలు ఉన్నటువంటి సందర్భంలో వారందరితో వాదించి ఓడించి అందులో చిట్టచివరిగా ఆరు మతాలను స్థాపన చేయడం జరిగింది♪.
🕉️ ఆరు మతాలు అంటే మహమ్మదీయ మతము, క్రైస్తవపతము అని కాదు. 🚫
🕉️ _*గాణా పత్యము, శైవము, సౌరము, వైష్ణవము, శాక్తేయము, కౌమారము. ఈ ఆరింటిని షణ్మతాలు అంటారు♪.*_
అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే...
_*గణపతి, శివుడు, విష్ణువు, అమ్మవారు, సూర్యుడు, కార్తికేయుడు.*_ ఈ ఆరు మతాలను శంకరులు స్థాపించారు కనుక ఆయనను షణ్మతాస్థాపనచార్యుడు అంటారు♪.
🕉️ ఎవరైనా సరే ప్రతిరోజు ఇంట్లో గణపతి, అమ్మవారు, విష్ణుమూర్తి, సూర్యనారాయణ, శివుడు ఈ ఐదుగురిని తప్పకుండా పూజించాలి అని శాస్త్రం తెలియజేస్తుంది.
🕉️ ఇక కార్తికేయుడు అగ్నిస్వరూపం కనుక అగ్ని ఆరాధన హిందువులలో సనాతన ధర్మంలో మొదటి నుంచి ఉంది కనుక కార్తికేయునికి అగ్ని ఆరాధనతో సంబంధం ముడి పెట్టడం జరిగింది.
🕉️ కార్తికేయుని వదిలివేస్తే ఇక మిగతా 5 దేవతామూర్తులను అందరూ తప్పకుండా ప్రతినిత్యము ఆరాధించి తీర వలసిందే♪.
🕉️ ఈ ఐదు మూర్తులను _*"పంచాయతనము"*_ అని అంటారు♪.
🕉️ శివుడు మధ్యలో ఉండి మిగతా మూర్తులు చుట్టూ ఉంటే ....అంటే ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము ఈ స్థానంలో ఇతర మూర్తులు ఉండి మధ్యలో శివుడు ఉంటే అది _*"శివపంచాయతనము"*_ అవుతుంది.
🕉️ మధ్యలో అమ్మవారు ఉండి మిగతా మూలలో ఇతర మూర్తులు ఉంటే అది _*"అంబికా పంచాయతనము"*_ అంటారు,
🕉️ మధ్యలో విష్ణుమూర్తి ఉండి చుట్టూ ఇతర మూర్తులు ఉంటే దానిని _*"విష్ణు పంచాయతనము"*_ అంటారు♪.
🕉️ మధ్యలో గణపతి ఉండి చుట్టూ ఇతర దేవతామూర్తులు ఉంటే అది _*"గణపతి పంచయతనము"*_ అవుతుంది♪.
🕉️ అదేవిధంగా, మధ్యలో సూర్యనారాయణ మూర్తి ఉండి చుట్టూ ఇతర మూర్తులు ఉంటే అది _*"సూర్యపంచాయతనము"*_ అవుతుంది♪.
🕉️ ఎవరు ఏ విధంగానైనా గాని ఈ పంచాయతన పూజను ఆచరించుకోవచ్చు♪. ఇది విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది♪. మనము కొన్ని ఆలయాలకు దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ శివ పంచాయతనము, మనకు కనబడుతూ ఉంటుంది♪. శివలింగము మధ్యలో ఉండి చుట్టూ మిగతా మూర్తులు ఉండడం గమనించి ఉంటారు♪. అలాంటి పూజ విశిష్టమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అని శాస్త్రం చెప్తుంది♪. నిత్యము ఈ పంచాయతన స్మరణ ఈ పంచాయతన శ్లోకములను పటించడం చేత ఆ పంచాయతన దేవత ఆరాధన ఫలితము మనకు దక్కుతుంది కనుక నిత్యము ఈ స్తోత్రమును వినడం గాని లేదా నేర్చుకొని చదవడం గాని చేయండి♪.
✅👉 ఆ పంచాయతన మూర్తుల అనుగ్రహము మీ పైన ఉండాలి♪.
❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు*
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*
✡️🌼✡️🌼✡️🌼✡️🌼✡️
No comments:
Post a Comment