Wednesday, September 3, 2025

*వైదిక ధర్మమార్గ పరతాః.....*

*మానవజన్మ, పుంస్త్వ లక్షణాలు, విప్రత్వం.. ఇవి లభించటం నిజంగా వరమే. అయితే ఈ లక్షణాలతో ముందుకు పోయినప్పుడే గదా ప్రయోజనం. నా దగ్గర సరైన మందు ఉందిగదా అని కూర్చుంటే రోగం తగ్గిపోతుందా. ఆ మందు సేవిస్తేనే గదా ఉపయెగం...*

*అలాగే పై లక్షణాలు గలవాడు ముందుకు పోవాలంటే ఏమిటి మార్గం... వేదాలు చూపిన ధర్మమైన మార్గంలో ముందుకు నడవాలనే నిష్ఠ ఉండాలంటున్నారు.*

*మన బుద్ధిని ఏకాగ్రం చేసుకొనుటకు వేదాలు కొన్ని మార్గాలు మనకు చూపుతాయి. అవె...*

*నిస్వార్థ కర్మాచరణ,* 
*మానసిక పూజ,* 
*జపం,* 
*తపం (ధ్యానం),*
*శ్రవణ,* 
*మనన,*
*నిధిధ్యాసన.*

*మొదలైన సాధనలు. ఇవి సక్రమంగా ఆచరించినప్పుడు మన అంతరంగం పరిశుద్ధమౌతుంది. మనస్సు శాంతించి ధ్యానానుకూలమవుతుంది. భగవంతుని పట్ల ఏకాగ్రత కుదురుతుంది.*

*కనుక... "సత్త్వగుణ ప్రధానులై వేదాంత శాస్త్రాలను శ్రవణం చేస్తూ అవి చూపే* *మార్గాన ప్రయాణం చేయాలి"... అట్టి మనోబుద్ధులు కలిగి ఉండటమే గొప్ప అదృష్టం. వేద విరుద్ధ మార్గాల వైపుకు ఆకర్షించబడితే ఈ లభించిన జన్మ కూడా వృధాయే. వేదాలను, వేదాంతాన్ని, భగవద్గీతను ఎగతాళి చేసే వారితో చేరకూడదు...*

*┈┉━❀꧁గురుభ్యోనమః꧂❀━┉┈*
         *SPIRITUAL SEEKERS*
🍁🧘🏻‍♂️🍁 🙏🕉️🙏 🍁🧘🏻‍♀️🍁

No comments:

Post a Comment