Wednesday, September 3, 2025

 🕉️ ఓం నమో శివ కేశవాయ నమః 🕉️

🙏 శివాయ గురవే నమః... మిత్రులకు శ్రేయోభిలాషులకు శుభ జ్ఞానోదయం తెలుపుతూ మీ ఆత్మీయుడు తుమ్మల పల్లి గంగాధరయ్య స్వామి 🙏

ఎవరు ఎవరో ఎక్కడ ఎక్కడో పుట్టి...
ఎక్కడెక్కడో ప్రయాణించి...
చివరికి ఇక్కడికి చేరుకున్నావు.
ఈ ప్రయాణంలో ఏమి తెలియకుండా
జీవిత సత్యాన్ని తెలుసుకోకముందే మారుభూమి చేరావు..

ఏది ఎక్కడ నీ బలగం?
ఎక్కడ నీ చుట్టాలు?
ఎక్కడ నీ భార్య / భర్త, పిల్లలు?
ఎక్కడ నీ అమ్మ నాన్న?
ఎక్కడ నీ స్నేహితులు?
వీర్రావిగావే నా ధనం, నా నగలు, నా ఆస్తులు? ఎక్కడ??
మరుగున పడిపోయిన నీ ప్రేమ, నీ ఆశలు, నీ ఆలోచనలు?
ఎన్ని అవమానాలు పడ్డావ్..., ఎన్ని మోసాలు భరించావ్..
ఎన్నో మిగిలిపోయిన కలలు...

నచ్చిన చదువు లేదు.
నచ్చిన ఉద్యోగం లేదు.
నచ్చిన జీవితం లేదు.

ఎప్పుడూ ఏదో కావాలి, ఇంకేదో చేయాలి అని పరుగులు.
వాడు బాగుంటున్నాడు, వీడు హ్యాపీగా ఉన్నాడు అని పక్కవాడి జీవితం చూసి చింతలు.
తన జీవితాన్ని మాత్రం జీవించడం మర్చిపోతున్నాడు.

చివరికి నిన్ను చితి వరకు తీసుకెళ్ళడానికి
నాలుగు మంది తప్ప వేరెవరు ఉండరు.

ఇప్పటికైనా... తలకేక్కిన అహాన్ని వదులు..
ఇది చూసైనా మారు. చితి చూసాయినా చింత లేని జీవితాన్ని గడపడానికి చూడు..

శాశ్వతం కానీ ఈ జీవితంలో చావు, పుట్టుకే నిజం..
మిగతావన్నీ నిజం తాలూకు జ్ఞాపకాలు మాత్రమే..

🙏 ఓం నమః పార్వతి పతయే హర హర మహాదేవ శంభో శంకర 🙏

No comments:

Post a Comment