Youth is a state of mind, soul, and body - Paramahamsa Yogananda
https://youtu.be/T8jjZqXRFnQ?si=iCr1Yoc8DEtKcfAA
యవ్వనం అన్నది మనసుకు ఆత్మకు అలాగే శరీరానికి కూడా సంబంధించిన స్థితి ప్రతి ఒక్కరు యవ్వనోత్సాహంతో ఉండడంపై ఆసక్తి చూపుతారు. ఏదో ఒక మార్గంలో కానీ ఇంకో మార్గంలో కానీ కథల్లో చెప్పిన యవ్వనం అనే నీటి బుగ్గనే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కానీ యవ్వనం అంటే ఏమిటి వయస్సులో ఉన్న వారందరూ యవ్వనోత్సాహంతో ఉండాల్సిన అవసరం లేదు వారిలో కొంతమంది ఇప్పటికే ముసలివారు వారి వయసును మించి అలసిపోయి క్షీణించి పోయినట్లుగా ఉంటారు దానికి విరుద్ధంగా కొంతమంది పెద్దవారు తమ వయస్సు మీద పడుతున్నప్పటికీ కూడా యవ్వనోత్సాహంతో ఉంటారు వారి చిరునవ్వులు వారి ఆత్మల నుంచి శరీరాల్లోకి ముఖాల్లోకి జాలు ఊరుతూ ఉంటాయి వారి శరీరంలో ప్రవహించే ప్రాణ రక్తం వారి అస్తిత్వపు ఆనందంతో స్పందిస్తూ ఉంటుంది. తరువాత నిరుత్సాహంగా నిర్జీవంగా ఉన్న కొంతమంది వ్యక్తులు ఉంటారు. వారు మరణించకముందే మరణించిన వారిలా ఉంటారు. కానీ వారికి ఆ విషయం కూడా తెలియదు. వారు నడిచే మృతులు మీరు అలాంటి వారిని చాలా మందిని చూస్తారు. నకారాత్మకంగా విమర్శనాత్మకంగా చిరాకు పడుతూ నిరాశగా ఒక తప్పుడు మానసిక స్థితిలో ఉండడం క్షమార్హం కాదు. మీరు ఎల్లప్పుడూ సానుకూలమైన దోరణి కలవారై ఉల్లాసంగా నవ్వుతూ తుళ్లుతూ ఉండాలి. మీ అస్తిత్వ లోతుల్లోనుంచి వచ్చే ఈ మానసిక యవ్వనాన్ని అన్ని విధాలుగా అభ్యసించండి. శరీరం యొక్క వయస్సుకు యవ్వనంతో నిజమైన సంబంధం ఏది లేదు మానసిక స్థితి ఆత్మ యొక్క వ్యక్తీకరణ ఇవే ఒక వ్యక్తి యవ్వనంతో ఉండేటట్లు చేస్తాయి. యవ్వనానికి నిర్వచనం ఏదంటే తనలోని ఆనందం శక్తి పరాకాష్టకు చేరుకున్న ఒక వ్యక్తి యొక్క శారీరక మానసిక ఆత్మీయ స్థితే యవ్వనోత్సాహాన్ని వ్యక్తం చేస్తున్న స్థితి. మీరు కోరుకుంటే ఆ స్థితిని మీరు నిర్వధికంగా నిలుపుకోవచ్చు దానికి విరుద్ధంగా నిర్లక్ష్యం వల్ల మీరు దాన్ని చాలా సులువుగా కోల్పోవచ్చు మనం ఈ అంశాన్ని మొదట మానసిక దృక్కోణం నుంచి సమీక్షిద్దాం. మనసే నియంత్రించేది అంటే అది శరీరాన్ని నియంత్రిస్తుంది. శరీరం మనసు చేత రూపకల్పన చేయబడింది. జన్మ జన్మల కాల వ్యవధిలో మనంతట మనమే తయారు చేసుకున్న చైతన్యం యొక్క మొత్తమే మనం బహుముఖాలైన ఉత్పత్తులతో నిండిన ఈ దేహమనే కర్మాగారంలోని అన్ని సంకల్పిత అసంకల్పిత చర్యలను నిర్వహించే అత్యున్నత శక్తి మనస్సు లేక చైతన్యమే.
No comments:
Post a Comment