🙏 *రమణోదయం* 🙏
*స్చచ్ఛమైన జ్ఞానంతో అవిద్య పూర్తిగా దహించగా మనస్సు నశించి, ఆత్మయందు స్థిరమైన నిష్ఠగల జ్ఞానులు తమ చిత్తం శివస్థితిలో ఏకమై నిత్య సహజ సమాధి నొంది జీవన్ముక్తులుగా జీవిస్తారు.*
కర్మ గురించి మాట్లాడే వాడికి
దేవుడి గురించి మాట్లాడే అర్హత లేదు.
దేవుని గురించి మాట్లాడే వాడికి
కర్మ గురించి మాట్లాడే అవసరం ఉండదు!
ధ్యానమూ, విచారమూ - రెండూ వస్తుతః ఒక్కటే..
విచార పద్ధతిని అవలంబించలేని వారు ధ్యాన పద్ధతిని అవలంబించాలి.. ఈ పద్దతిలో సాధకుడు తనను మరచి, 'నేను బ్రహ్మను' అనో లేక 'నేను శివుడ' ననో ధ్యానిస్తాడు.. బ్రహ్మముగా గాని,
శివుడుగా గాని మిగిలేది తానే యని తుదకు గ్రహిస్తాడు.. విచారపద్దతిలో సాధకుడు తననే ఆలంబనంగా గైకొని, నేనెవరినని ప్రశ్నించుకుంటూ
తద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు!
🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹
🌹🙏సద్గురు రమణా..శరణం శరణం శరణం🙏
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో -సం.772)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*స్మరణ మాత్రముననె
పరముక్తి ఫలద* |
*కరుణామృత జలధి యరుణాచలమిది*||
🌹🌹🙏🙏 🌹🌹
No comments:
Post a Comment