🙏 *రమణోదయం* 🙏
*ఉత్తమము, గొప్ప శక్తివంతమైన తపస్సని, దానిని మనం ఆచరించాలని భగవాన్ శ్రీ రమణ మహర్షులు ఉపదేశించినది ఇదే! ఇంతే! " ఊరక యుండట"మే. ఇది తప్ప మనం అనుష్ఠించవలసిన ధర్మాలు(ధ్యాన, యోగ) వేరేవీ లేవు.*
వివరణ: *మనోవాక్కాయములతో చేస్తున్న కర్మల చేతనే జన్మలు కల్గుతున్నాయి. వాటిని ఉన్నట్లుంచితే జన్మరాహిత్యం సిద్ధిస్తుందని భావం.*
అరువుగా వచ్చిన ఈ దేహం
ఏదో ఒకరోజు భూమికి
ఎరువుగా మారిపోతుంది!
భోగి అద్దంలో క్షయమయ్యే
శరీరాన్ని చూసుకుంటాడు.
యోగి తనలో అక్షయమైన
ఆత్మను దర్శించుకుంటాడు!
🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹
🌹🙏సద్గురు రమణా..శరణం శరణం శరణం🙏🌹
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.773)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*
🪷🪷🙏🏻🪷🪷
No comments:
Post a Comment