Thursday, September 4, 2025

 


🙏 *రమణోదయం* 🙏

*ఏకమూ, పూర్ణమూ, ఆద్యమూ ఆ పరవస్తువు. అది "ఇటువంటిది" అని ఊహింప శక్యముగాని సద్వస్తువు. అందుచేత దానిని ఆరాధించేందుకే కావచ్చు, అది తనకు అన్యమైనదని భావించటం, తాను వ్యష్టి తత్త్వముగా విడివడి ఉండటం మహాదోషం అవుతుంది.*

భగవంతునిలోనే ఉన్నవాడు
భగవంతుణ్ణి ఎలా చేరగలడు?

తనువే తాను అనుకోవడమే
పెద్దరోగం.
మిగతా రోగాలన్నీ
రోగానికి వచ్చిన రోగాలే!

అన్ని మనకూడానే వుంటాయి..
వెంబడిస్తూనే వుంటాయి..
పాపం,పుణ్యం....అన్నీ...నీడల్లాగ!

అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ.
అరుణాచలా!🌹🙏

🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.776)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🦚🦚🪷🪷
 *స్మరణ మాత్రముననె 
పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
            
🌹🌹🙏🙏 🌹🌹

No comments:

Post a Comment