*ఆణిముత్యాలు.....*
*విమర్శించేవారు అడుగడుగునా ఉంటారు... వెనక్కి లాగేవారు వెన్నంటే ఉంటారు. నీ మేలు కోరేవారు ఒకరు మాత్రమే ఉంటారు. అలాంటి నేస్తాన్ని నీ మాటలతో, చేష్టలతో ఎన్నడూ దూరం చేసుకోకు.*
*వేయి అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే... ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగడం చాలా ఉత్తమం.*
*స్వార్థం లేనప్పుడు మనసు శాంతిస్తుంది... జ్ఞానం పొందినప్పుడు బుద్ధి సహాకరిస్తుంది... తప్పు చేయనప్పుడు మానసిక, శారీరక ఆరోగ్యం వికసిస్తుంది.*
*చెవులతో శబ్దాన్ని, కంటితో రూపాన్ని, ముక్కుతో పరిమళాన్ని, నాలుకతో రుచిని, చర్మంతో స్పర్శని దేవుడు మనిషికి ఇచ్చాడు.*
*అలాగే మనస్సుతో మానవత్వాన్ని చూడమని కూడా ఇచ్చాడు. అందుకే దేవుడి పట్ల కృతజ్ఞతతో, ప్రక్కవాడు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలని, పుణ్యమార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరుకుందాం.*
*సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా, బిందెడు మంచి* *నీటికే విలువ ఉంటుంది. అలానే నీ దగ్గర ఎంత సంపద ఉన్నా, నీలో ఉన్న మంచితనానికే విలువ ఎక్కువ.*
*ఇష్టమైన పనిని ఎవరైనా చేస్తారు... కానీ గొప్పవారు మాత్రం చేస్తున్న ప్రతి పనినీ ఇష్టపడతారు.*
*-సదా మీ శ్రేయోభిలాషి... 👏*
🪸🪷🪸 🛐🙇♂️🛐 🪸🪷🪸
No comments:
Post a Comment