ఓంకారం రహస్యం | ప్రాణశక్తి పెంచే ధ్యానం శక్తి | Brahmacharya Power & Om Chanting
https://youtu.be/_zbpRy2WZEo?si=RHsyFMpq31zeO9uE
నమస్కారం మిత్రులారా మనము శక్తిని సృష్టించలేము అలాగే నాశనము చేయలేము కానీ ఒక రూపం నుండి మరొక రూపానికి దాన్ని మార్పు చేయవచ్చని తెలుసు కానీ మన శరీరంలో ఉండే శక్తిని ఎలా మార్పు చేసుకోవాలో తెలుసా ప్రతి సంఘటనకి ఎంతో కొంత శక్తి అవసరం అసలు బ్రహ్మచర్యానికి విశ్వశక్తికి మధ్య ఉండే సంబంధం ఏమిటి ఓంకారం ఎందుకు చేయాలి దాని వల్ల కలిగే ప్రయోజనాలు పాజిటివ్ ఎనర్జీని ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేశాము. అణువు నుంచి అనంతం వరకు ఈ శక్తి వల్ల అన్ని పనులు జరుగుతాయి. అన్నింటికీ మూల పదార్థం పరబ్రహ్మం దీనికి రంగు, రూపం ఉండదు ఎలా కావాలంటే అలా మేనిఫెస్ట్ అవ్వగలదు. వేదాల ప్రకారం అఖిల చరాచర సృష్టి మొత్తం ఇదే నిండి ఉంది. దీనికి రూపం ఉన్నది. అలాగే రూపం లేదు కూడా దీనిని జ్యోతి స్వరూపం అని అంటారు. మాంస నేత్రాలతో మనం దీనిని దర్శనం చేయలేము. దీనిని అనుభవించగలం మాత్రమే. అది ఏ రూపంలోనైనా మార్పు చెందగలదు. దీనికి ఫిజికల్ అపీరియన్స్ ఉంది అలాగే లేదు కూడా ఉదాహరణకు ఒక అణువాయుధాన్ని మనం చూస్తే దానిలో అనంతమైన శక్తి నిక్షిప్తమై ఒక రూపంలో ఉంటుంది. అది విస్ఫోటనం చెందినప్పుడు ఆ శక్తికి ఒక స్పష్టమైన రూపం ఉండదు. మంటల వెలుగులా కనిపిస్తుంది. అంత మంటలు వ్యాపించడానికి మూల పదార్థం దాని బ్యాక్ గ్రౌండ్ లో ఉండేది శక్తి అందుకే దేవాలయాల్లో ప్రాణ ప్రతిష్ట చేసి కొంత శక్తిని ఆ విగ్రహంలో ఉంచుతారు. ఆ శక్తి ఆలయం చుట్టూ వ్యాపించి ఉంటుంది. అందుకే నిత్యం దేవాలయాలు దర్శనం చేసిన వాళ్ళకి బుద్ధి ప్రచోదనం అవుతుంది. వారికి ఏం కావాలో ఎలా నడుచుకోవాలో లోపల నుండే మార్పు మొదలవుతుంది. ఇది నాకు ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ ఉంది. విశ్వంలో శక్తి ఉంది. అదే శక్తి మన అందరిలోనూ ఉంది. ఆ విశ్వశక్తిని మనం ప్రాణశక్తిగా, శారీరక శక్తిగా మరియు మానసిక శక్తిగా వినియోగించుకుంటున్నాం. మనిషి శరీరంలో శక్తి రెండు రకాలుగా మార్పు చెందుతుంది. ఒకటి కైనెటిక్ ఎనర్జీ గాను, రెండవది పొటెన్షియల్ ఎనర్జీగా ఉంటుంది. మనం సరిగ్గా నిద్రపోయినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ మన శరీరంలోకి వస్తుంది. అదే శక్తితో మనం కావాలి అనుకుంటున్న పనులు చేస్తున్నాం. సరిగ్గా నిద్రపట్టడం లేదు అంటే మీ శరీరంలో బ్లాక్స్ ఉన్నాయని అర్థం. మీరు వెంటనే ఏదో ఒక దేవాలయానికి నిత్యం వెళ్ళాలి. అక్కడ ఓంకారం జపించడం లేదా విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు పారాయణం చేయడం మంచిది. మీకు పారాయణం చేయడం రాకపోతే విన్నా మంచిదే. శరీరంలో బ్లాక్స్ ఆటోమేటిక్ గా క్లియర్ అవుతాయి. కావలసినంత ప్రాణశక్తి శరీరంలోకి వస్తుంది. అకార్డింగ్ టు ది యోగి సైన్స్ విశ్వశక్తి శరీరంలో ఉండే సత్చక్రాలకు అందించబడుతుంది. అవి చక్కగా పని చేస్తున్నప్పుడు శరీరంలో ఎటువంటి రోగాలు ఉండవు. ఎప్పుడైతే సత్చక్రాల్లో బ్లాక్స్ ఏర్పడతాయో అప్పుడు శరీరంలో ఏదో ఒక రోగం రావడం మొదలవుతుంది. ఆ రోగం రావడానికి ముందు మానసిక ప్రవర్తనలో కూడా మార్పులు వస్తాయి. మన శరీరంలో ఉండే సప్తధాతువుల్లో వీర్యధాతువు అతి ముఖ్యమైనది మరియు శక్తివంతమైనది. మిమ్మల్ని తేజోవంతంగా ప్రొజెక్ట్ చేసేది కూడా ఇదే. అలాగే మీలో విపరీతమైన జ్ఞాపక శక్తిని అందించే మూల పదార్థం కూడా ఇదే. ఈ వీర్యధాతువు శరీరంలో కింద నుండి పైకి ప్రయాణిస్తే దైవ దర్శనం చేయడానికి కావలసిన శక్తి శరీరానికి అందించబడుతుంది. అలాగే ఇదే వీర్య ధాతువు కిందికి ప్రయాణిస్తే సృష్టి యజ్ఞం చేయడానికి సహాయపడుతుంది. కేవలం కొన్ని క్షణాల్లోనే ఖాళీ గోళ్ళ నుండి తల వెంట్రుకల దాకా ఉన్న అన్ని లక్షణాలను తనలో ఇముడ్డుచుకుని ఒక జీవిగా మారే శక్తి ఈ వీర్యధాతువుకు మాత్రమే ఉంది. అంత శక్తివంతమైన ధాతువును పరిరక్షించిన వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా ముందుకు వెళతాడు. అయితే ఈ వీర్యధాతువు శరీరంలో నిలుపుదల చేయడం అంత సులభమా అంటే ఖచ్చితంగా కాదు చాలా ప్రమాదకరం కూడా మరి దీనిని శరీరంలో ఎలా ఉంచాలి దీనికోసం హటయోగంలో ప్రాణాయామం చేసి నాడులను శుద్ధి చేస్తారు. అగ్నిసార క్రియ చేసి ఆ ధాతు శక్తిని పైకి లాగుతారు. దానితో పాటు నిత్య సాధన ఆసనాలు వేస్తారు. అలా చేయడం వల్ల మనసు శుద్ధి చేయబడి కామశక్తి అదుపులోకి వస్తుంది. అదే శక్తి లైఫ్ ఎనర్జీగా రూపాంతరం చెంది స్పిరిచువాలిటీలో ముందుకు వెళ్ళడానికి మార్గం సుగమం చేస్తుంది. పసుపు వేపన కలిపి బిల్లలను తీసుకొని తిన్నప్పుడు కూడా వీర్యశక్తి వృధా కాకుండా ఎక్కువ స్థాయిలో శరీరానికి అందించబడుతుంది. ఇవి మీరు తెలిసిన వ్యక్తి వద్ద సలహా తీసుకొని పాటించాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే బ్రహ్మచర్యాన్ని 90 రోజులు కఠినమైన దీక్షతో చేస్తారో సుషుమ్న నాడి మార్గం సుగమం అవుతుంది. మన బ్రెయిన్ లో ఉండే న్యూరల్ నెట్వర్క్ లో చాలా మార్పులు వస్తాయి. మన శరీరంలో జరిగే అన్ని మార్పులకు మూలమైన పీనియల్ గ్లాండ్ అదే జ్ఞాన నేత్రం యాక్టివేట్ అవుతుంది. దాని విధులను అది సక్రమంగా వినియోగిస్తే చాలు. జీవితం మొత్తం దాని చేతిలో మీరు పెట్టేయవచ్చు. చాలా ప్యూరిఫైడ్ థాట్స్ వస్తాయి. దైవం మద్దం ముందు నిలబడితే ఎలా ఉంటుందో మీ మనసు అంత మలిన మాహిత్యమై మీరు తేజస్సుతో కనిపిస్తారు. మనిషి తేజస్సుతో కనిపించడం దైవిక లక్షణం అని గుర్తించండి. పరమాత్ముడి రూపమే జ్యోతి స్వరూపం అదొక అద్భుతమైన వెలుగు. మీరు తేజస్సుతో ఉంటే ఆ పరమాత్ముడి శక్తి మీలో అంత ఎక్కువగా ఉందని గమనించండి. ఒక విషయం మీద మీకు స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. ఇదివరకు కంట్రోల్ కాని మనసు మీ ఆధీనంలో వస్తుంది. మీకు ఇదివరకు టచ్ లో ఉన్న వాళ్ళు మాయమవుతారు. మీతో సరితూగే మనుషులు మీకు పరిచయం అవుతారు. ఇలా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నిత్యం ఓంకార సాధన చేయాల్సి ఉంటుంది. ఓంకారం ఉచ్చరిస్తున్న సమయంలో దృష్టి ఏ స్థానంలో పెట్టాలో తెలియకపోతే భూమధ్యంలో అంటే రెండు కర్బమ్మల మధ్య పెట్టి ఓంకారం జపించవచ్చు. ఓంకారం నిత్యం చేయడం వల్ల బుర్రలో నెగిటివ్ థాట్స్ పోతాయి. సమయానికి చక్కగా నిద్రపడుతుంది. మీ మనసు మంచి వైపు ప్రయాణిస్తుంది. సత్సంగం చేయాలి అనిపిస్తుంది. ఎవరికీ తెలియని విషయాలు మీకు మాత్రమే అర్థం అవ్వడం మొదలవుతుంది. మీలో ఒక డిఫరెంట్ వైబ్రేషన్ కనిపిస్తుంది. ఈ విశ్వంలో ఉండే పంచభూతాలు మీకు సహకరించడం మొదలు పెడతాయి. ఇదివరకులా కాకుండా మీ థాట్ ప్రాసెస్ లో చాలా మార్పులు వస్తాయి. కాలక్రమేణ మీరు సంపూర్ణమైన జీవితం ఎలా గడపాలో మీ లోపల ఉండే మీకు సమాధానం దొరుకుతుంది. ఓంకార సాధన శివాలయంలో ప్రదోష కాలంలో గాని ఉదయం సమయంలో గాని అభిషేకం చేసిన తర్వాత చేస్తే ఆ శక్తి స్వరూపంలో ఉన్న శివానుగ్రహం మీకు దక్కుతుంది. ప్రయత్నించని వాడికి కర్మానుసారంగా కొంత ఫలితం వస్తుంది. కానీ ఇలా నిష్టగా ప్రయత్నించిన వాడికి దైవానుగ్రహం వల్ల జీవితంలో ఎప్పుడూ చెడిపోకుండా ఏది మీ జీవితానికి మంచిదైతే అటువంటి ఫలితం దక్కుతుంది. భగవంతుడితో మీకు ఒక బాండింగ్ ఏర్పడుతుంది. అకార్డింగ్ టు ది భగవద్గీత నిత్యం నా నామస్మరణ చేస్తున్న వాడి యొక్క యోగము క్షేమము నేనే చూస్తున్నాను అన్నారు. మీ యోగము క్షేమము ఆయనే చూసుకుంటాడు. భగవంతుడు మీలోనూ ఉంటాడు అలాగే బయట విగ్రహంలోనూ ఉంటాడు. ఆకార నిరాకార రూపమై ఉన్నవాడు అన్నింటిలోనూ ఉంటాడు. వాడు లేని చోటు లేదు అంతా శక్తిమయం అదే పరబ్రహ్మం. ఈ శక్తిని మనం స్వయంగా అనుభవించగలం. ఇది అక్షర సత్యం. నిత్యం స్వాధ్యాయం చేస్తూ ధర్మ మార్గంలో ఉన్నవాడికి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు తప్పకుండా అనుభవంలో ఉంటాయి. మీరు ఇప్పుడు వింటున్న ప్రతి శబ్దం మీ లోపల నుండి వినిపిస్తుంది. నాదబిందు కళలు అన్నీ మీ లోపలే జరుగుతున్నాయి అనే విషయాన్ని మీరు గమనిస్తారు. ఈరోజు వినిపిస్తున్న సంగీత ధ్వనులు నృత్యాలు అన్నీ కూడా మన లోపల నుండి జనించినవే రోజూ ధ్యానం చేసే సమయంలో రెండు చెవులు మూసుకుని ఒకసారి మీ శరీరం లోపల నుండి వచ్చే శబ్దాన్ని గమనించండి. మొదట్లో సముద్ర దోష లాంటి శబ్దాలు ఫ్యాక్టరీ శబ్దాలు మీకు వినిపిస్తాయి. కొంచెం ఇబ్బంది పడే అతి భయంకరమైన శబ్దాలు కూడా వినిపిస్తాయి. భయపడకండి భగవంతుడిని శరణ వేడి మళ్ళీ ప్రయత్నించండి. సాధన బలంగా ఉంటే స్పష్టమైన ఓంకారం వినిపిస్తుంది. ఇంకా సాధనలో ముందుకు వెళితే సంగీత ధ్వనులు వినిపిస్తాయి. ఏదైతే బయట సృష్టి జరిగిందో అది లోపల నుండి ఉద్భవించింది అని గుర్తించి రోజు ఒకటి వస్తుంది. డబ్బు కావాలా కావలసిన సమయంలో అదే వస్తుంది. సమస్యలు ఉన్నాయా పోవలసిన సమయంలో పోతాయి. కర్మ ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టదు. కానీ భగవన్ నామ స్మరణ సత్ప్రవర్తలతో ఉంటే ఆ కర్మను అనుభవించడానికి కావలసిన శక్తి మీకు దొరుకుతుంది. ధర్మ మార్గంలో ఉండి కర్మను బ్రహ్మార్పణం ఎవరైతే చేస్తారో అట్టి వారికి కర్మ అంటదు. ఆ ఫలితం భగవంతుడికి అందుతుంది. అంటే అది మంచి కర్మగా మారుతుంది. మీరు ఉద్దేశపూర్వకంగా ఒక కర్మ చేశారు అనుకుంటే దాని ఫలితం ఎలా అనుభవిస్తారో ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక వ్యక్తి కష్టపడి జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. అటువంటి వారి దగ్గర లంచం తీసుకొని పని చేస్తే లంచం తీసుకున్న వ్యక్తి కూడా సరదాగా కాలం గడుపుతాడు. కానీ లంచం ఇచ్చిన వ్యక్తి ఆ డబ్బులు చెమటోడ్చి సంపాదించిందయ ఉంటే వాడు పిల్లల్ని వాడు చదివించలేడు. వారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టలేరు. ఇలాగే 10 మంది జీవితంలో జరిగితే వ్యవస్థలో ఉండే ఆ 10 మంది జీవితాలు అదుపు తప్పుతాయి. వారు మంచి యువకులుగా రేపు సమాజంలో మెలగలేకపోవచ్చు. వారు ఇంకో నలుగురిని చెడగొడతారు. ఆ నలుగురు 400 మంది అవుతారు. ఆ 400 మందిలో ఒక్కడు ఆ లంచం తీసుకున్న వ్యక్తికి గాని లేదా ఆ లంచం సొమ్ముతో బ్రతికిన కుటుంబ సభ్యులకు గాని ఏదో ఒక రూపంలో అది శారీరకంగానైనా లేదా మానసికంగానైనా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఒక దుష్కర్మక విత్తనం గతంలో వేశారు కాబట్టి ఆ ఫలితం తప్పకుండా అనుభవం ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. కలుపు విత్తనాలు వేస్తే కలుపే వస్తుంది. ధాన్యం విత్తనాలు వేస్తే ధాన్యమే వస్తుంది. మీరు ఈ సమయంలో మంచి పనులు చేయలేకపోతున్నారు మీకు తప్పటం లేదు అనుకుంటే ఏ విషయాలు అడ్డు వస్తున్నాయో ఒక నోట్ బుక్ లో రాసుకోండి నిజాయితీగా రాయండి. రాసిన రాతలన్నీ తగలబెట్టేయండి. రోజు ధ్యానం చేయండి. ధ్యానం కుదరడానికి మూల మంత్రం ఒకటి ఉంది. ఇది గాయత్రీ మంత్రం ఎంత ఫలితాన్ని ఇస్తుందో ఇది కూడా అంతే ఫలితాన్ని ఇస్తుంది. శ్వాస తీసుకుంటున్నప్పుడు షో అని వదులుతున్నప్పుడు హం అని ఈ సోహం మంత్రాన్ని చేయండి. దీనిని అసప గాయత్రి అంటారు. దీనిని శ్వాసత మానసికంగా అనుసంధానం చేయండి. ఒక్క 40 రోజులు చేయండి. మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. కుదిరితే సర్వకాల సర్వవస్థల యందు చేయండి. మనసు ఒక దగ్గర ఆగుతుంది. మీలో వచ్చిన మార్పును మీరు కూడా నమ్మలేరు. దూరదృష్టి పెరుగుతుంది. ఒక కార్యం ఎందుకు చేయాలో మీకు అర్థమవుతుంది. మీ ప్రాణశక్తి మీ అదుపులోకి వస్తుంది. దీర్ఘంగా శ్వాసించడం అలవాటవుతుంది. అంటే మీరు ఎక్కువగా శరీరంలో ప్రాణశక్తిని నిక్షిప్తం చేయడానికి మీ శరీరం అలవాటు పడుతుంది. మీ శరీరంలో ఎంత ప్రాణశక్తి ఉంటే జరిగే పనులు అంత అద్భుతంగా ఉంటాయి. యంజైటీ డిప్రెషన్ మొత్తం పోతుంది. దేహం ఆరోగ్యవంతంగా మారుతుంది. రోగ భయాలు పోతాయి. దీని ద్వారా కర్మక్షయం కూడా జరుగుతుంది. జ్ఞానం కర్మను కాల్చేస్తుంది. ఈ మాట రాను రాను మీకే అర్థమవుతుంది. మీలో సంకల్ప బలం పెరుగుతుంది. మీ సంకల్ప బలంతో ఇప్పటివరకు మీ వల్ల నష్టపోయిన వ్యక్తులకు మంచి జరుగుతుంది. మీ వల్ల నష్టపోయిన వారికి మంచి జరిగింది అంటే మీకు కర్మక్షయమైనట్టే కదా. ఈ సోహం మంత్రం మీద మీకు పట్టు వచ్చినప్పుడు అధిక దానంతట అది జరుగుతుంది. దాని యొక్క మూలాల వరకు మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది. సర్వేజన సుఖినో భవంతు
No comments:
Post a Comment