10 Energy Draining Habits Protect ur Mental Energy Peace Productivity #overthinking #mentalhealth
Author Name:Jeevithamastu
Youtube Channel Url:https://www.youtube.com/@Swapna_Jeevithamastu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ccWQStt6faM
Transcript:
(00:00) మన లైఫ్ లో చాలా విలువైన వాటిలో ఒకటి మన ఎనర్జీ మనం రోజువారి పనులు ఎలా చేసుకుంటున్నాం మన డేస్ ఎంత క్వాలిటీగా గడుస్తున్నాయి మనం అనుకున్న లక్ష్యాలు ఎంతవరకు సాధించగలుగుతున్నాము టోటల్ గా మన లైఫ్ ని మనం ఎంత బాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము అనేది మన ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం మన డబ్బుని మన ఇంటిని మన ఫోన్ ని మన వస్తువుల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం.
(00:26) కానీ మన ఎనర్జీని ఎలా ఖర్చు పెడుతున్నామో మాత్రం చాలా రేర్ గా ఆలోచిస్తాం. ఈ రోజుల్లో మనకి తెలియకుండానే ఎన్నో అనవసరమైన విషయాలకు మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అందుకే చాలామందికి చిన్న వయసులోనే మెంటల్ గా అలిసిపోయినట్టు ఎప్పుడు ఎనర్జీ లేనట్టుగా అనిపిస్తుంది. ఈ వీడియోలో మన ఎనర్జీ ఎక్కడెక్కడ నెమ్మదిగా లీక్ అవుతుంది ఆ లీక్స్ ని ఎలా తగ్గించుకోవచ్చు మన ఎనర్జీని ఎలా కాపాడుకోవచ్చు అనేది చూద్దాం.
(00:50) వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈసారి వీడియో చివర్లో మీకు ఒక మంచి యాక్టివిటీ ఇస్తాను. అందరికీ [సంగీతం] నమస్కారం నేను మీ స్వప్న జీవితమస్తు ఛానల్ కు స్వాగతం. మీరు ఈ సామెత విన్నారా ఏమి తోచక ఒక ఆవిడ తోడి కోడలి పుట్టింటికి వెళ్ళిందంట. ఈ రోజుల్లో అయితే ఏమి తోయక కాదు ఉన్న పనిని పక్కన పెట్టి లేదా పని మధ్యలో ఫోన్లో నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి మనకి పరిచయం లేని ఇల్లకి గొడవలకి అవసరం లేని షాపింగ్లకి వెళ్ళవస్తున్నాం.
(01:19) అండ్ ఇలా చేస్తూ మనకి తెలియకుండానే మన అటెన్షన్ ని మన ఎనర్జీని కొంచెం కొంచెంగా కోల్పోతున్నాం. ఒక్కసారి ఊయించుకోండి రాత్రి పడుకున్నప్పుడు ఒక దోమ మన చుట్టూ గుయి గుయి అంటూ తిరుగుతుంటే ఎంత చిరాగ్గా ఉంటుంది ఈ రోజుల్లో మన ఫోన్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ కూడా అచ్చం అలాంటివే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అవి మళ్ళీ మళ్ళీ మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూనే ఉంటాయి.
(01:42) ఏంటి నోటిఫికేషన్ అని ఓపెన్ చేస్తే అక్కడి నుంచి ఇంకో పోస్ట్ ఇంకో మెసేజ్ ఇంకో రీల్ ఇలా మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. ఇక్కడ అసలు సమస్య నోటిఫికేషన్ కాదు మన అటెన్షన్ పదే పదే షిఫ్ట్ అవ్వడం ప్రతిసారి మన బ్రెయిన్ ఒక పని నుంచి మరో పనికి మారి మళ్ళీ మొదటి పనిపై ఫోకస్ చేయడానికి ఎక్స్ట్రా ఎనర్జీ ఖర్చు చేస్తుంది. అది మనకు కనిపించదు కానీ ఎండ్ ఆఫ్ ద డే అదే మనల్ని మెంటల్ గా అలసిపోయేలా చేస్తుంది.
(02:04) అందుకే అవసరం లేని నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయండి. ప్రతి నోటిఫికేషన్ ని వెంటనే చూడాల్సిన అవసరం లేదు. నేను కొన్ని నోటిఫికేషన్స్ కి వేరే వేరే సౌండ్స్ పెట్టుకుంటాను దాన్ని బట్టి అవి అర్జెంట్ గా చూడక్కర్లేదు అని ఫోన్ ఓపెన్ చేయకుండానే అర్థంవుతుంది. అలానే ఏదైనా ఫోకస్డ్ గా వర్క్ చేస్తున్నప్పుడు టైమర్ లేదా పోమోడో టైమర్ పెట్టుకొని ఆ టైం అంతా ఫోన్ ని దూరంగా పెట్టేసేయండి టైమర్ పెట్టడం వల్ల కొంచెం కాన్షియస్ గా ఉండటం కంట్రోల్ చేసుకోవడం కొంచెం ఈజీ అవుతుంది.
(02:30) అలానే ల్యాండ్లైన్ లాగా ఫోన్ కి ఒక ప్లేస్ ఇవ్వడం కొంచెం డిస్టెన్స్ ని క్రియేట్ చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి ప్రతి నోటిఫికేషన్ మన సమయాన్ని మాత్రమే కాదు మన ఎనర్జీని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటుంది. నెక్స్ట్ మొదలు పెట్టిన పనులని పూర్తి చేయడం ఈ రోజులో మనకి పనులు ఎక్కువ ఉండడమే కాదు మొదలుపెట్టి పూర్తి చేయని పనులు కూడా చాలా ఉంటున్నాయి.
(02:52) ఆ మెసేజ్ కి రిప్లై ఇవ్వాలి ఈ షెల్ఫ్ సర్దాలి ఆ పేపర్స్ కొరియర్ చేయాలి ఎప్పుడో ఒక ఆర్టికల్ సేవ్ చేసుకున్నాం అది చదవాలి రెసిపీ ట్రై చేయాలి ఇలా ఎన్నో చిన్న చిన్న పూర్తి చేయని పనుల లిస్ట్ మన మైండ్లో అలాగే ఉండిపోతున్నాయి. ఒకటి రెండు అంటే పెద్ద విషయం కాదు కానీ అలాంటివి ఎక్కువైతే అవన్నీ మన మైండ్ లో స్పేస్ ఆక్యుపై చేస్తూ మన మెంటల్ ఎనర్జీని నెమ్మదిగా డ్రైన్ చేస్తూ ఉంటాయి.
(03:15) ఈ రోజుల్లో మనకి ఇంకో విషయం కూడా జరుగుతుంది. మనం ఒక పని చేయడానికి కిచెన్ కి వెళ్తాము అక్కడ ఇంకో పని కనిపిస్తుంది అది చేస్తుండగా మరో పని గుర్తొస్తుంది. ఇంతకీ మెయిన్ పని మర్చిపోతాము ఇలా ఒక పని నుంచి ఇంకో పనికి మారుతూ ఉంటాం. రోజంతా చాలా బిజీగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఏ పని పూర్తయనా ఫీలింగ్ ఉండదు. నేనైతే ఒక్కోసారి ఇలా క్లియర్ గా అనుకోవాల్సి వస్తుంది.
(03:35) ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఈ పని చేద్దాం ఈ పని పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ పనికి షిఫ్ట్ అవుదాం అని అప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఆ పని పూర్తి చేయగలుగుతున్నాను తర్వాత ఇంకో పని గురించి ఆలోచిస్తున్నాను. సో చిన్న పనులైనా పెద్ద పనులైనా పూర్తి చేయడం అలవాటు చేసుకుందాం ఎందుకంటే పూర్తి చేసిన పని మనసుకి ప్రశాంతతని ఇస్తుంది పూర్తి చేయని పని మాత్రం మన ఎనర్జీని నెమ్మదిగా డ్రైన్ చేస్తూనే ఉంటుంది.
(03:58) నెక్స్ట్ నిర్ణయాల అలసటను తగ్గించుకుందాం. నిర్ణయాలు తీసుకోవడానికి మన మైండ్ చాలా ఎనర్జీని తీసుకుంటుంది. అందుకే అనవసరమైన నిర్ణయాలను తగ్గించుకోవడం అంటే మన ఎనర్జీని సేవ్ చేసుకోవడమే. ఎలా అంటే ఒకటి ప్రతి విషయాన్ని మనమే నిర్ణయించాల్సిన అవసరం లేదు ముఖ్యంగా మనం హోమ్ మేకర్ గా మదర్ గా ఇంట్లో అందరి అవసరాలు చూసే క్రమంలో ప్రతి చిన్న విషయానికి మనమే నిర్ణయం తీసుకోవాలని మనమే చూసుకోవాలని అనిపిస్తుంది మైక్రో మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాం కానీ కొన్ని విషయాలు వాళ్లే నిర్ణయించుకోగలరు అలాంటి వాటిని వాళ్ళకే వదిలేద్దాం. నెక్స్ట్ మంచి రొటీన్స్
(04:29) క్రియేట్ చేసుకోవడం ప్రతి రోజు ఎప్పుడు ఏం చేయాలని కొత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేకుండా మంచి రొటీన్స్ ఉంటే చాలా పనులు ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. అలానే ముందుగానే ప్లాన్ చేసుకోవడం నైటే నెక్స్ట్ రోజు ప్లాన్ చేసుకోవడం కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవడం లేదా మీల్ ప్లాన్ చేసుకోవడం ఉదయం లేవగానే తీసుకోవాల్సిన ఎన్నో చిన్న చిన్న నిర్ణయాలను తగ్గిస్తాయి.
(04:50) నెక్స్ట్ కొన్ని సింపుల్ రూల్స్ పెట్టుకోవడం ఫ్రైడే పూజ చేసుకోవాలి సాటర్డే వాటర్ బాటిల్స్ క్లీన్ చేసుకోవాలి. ఇలాంటివి ప్రతిసారి కొత్తగా ఆలోచించాల్సిన అవసరాన్ని తగ్గిస్తాయి. నెక్స్ట్ వీలైన చోట ఆటోమేట్ చేసుకోవడం బిల్ పేమెంట్స్ లాంటివి డిజిటల్ గా ఆటోమేట్ చేస్తే ప్రతి నెల గుర్తుపెట్టుకోవడం నిర్ణయం తీసుకోవడం అనే అవసరం ఉండదు.
(05:09) ఇంకా పెద్దగా ఇంపాక్ట్ లేని చిన్న చిన్న నిర్ణయాలని ఎక్కువసేపు నాంచకుండా క్విక్ గా ఒక నిర్ణయం తీసుకుంటే ఒక పని అయపోతుంది మనకి టైం అండ్ ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది. తీసుకోవాల్సిన నిర్ణయాలు తగ్గితే మన మెంటల్ ఎనర్జీని కాపాడుకున్నట్టే నెక్స్ట్ కన్స్ూమ్ చేసేదానికంటే క్రియేట్ చేయడం మీద ఫోకస్ చేద్దాం. ఈ రోజుల్లో ఇన్ఫర్మేషన్ కి కొరతే లేదు ఎటు చూసిన బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ మనల్ని రీచ్ అవుతూనే ఉంది.
(05:36) ఎన్నో రీల్స్ వీడియోస్ ఆర్టికల్స్ పాడ్కాస్ట్లు కానీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అసలు మనం ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాం 10 వంటలు సేవ్ చేసుకుంటాం ఒక్కటన్నా చేస్తున్నామా పేరెంటింగ్ టిప్స్ బోల్ అని వింటాం ఒక్కటన్నా కన్సిస్టెంట్ గా పాటించడానికి ట్రై చేస్తున్నామా మనం ఎంత తెలుసుకున్నా దానిలో ఒక్కటి కూడా పాటించకపోతే మన మెంటల్ ఎనర్జీని దానికోసం వేస్ట్ చేసుకున్నట్టే నేను కూడా ఇదివరకు ఏదైనా కొత్త విషయం కనిపిస్తే వెంటనే తెలుసుకోవాలని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు ఏదైనా నేర్చుకున్న విషయం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఇవాళ
(06:08) నేను కొత్తగా ఏం నేర్చుకున్నాను అనే కంటే నేర్చుకున్న దాంట్లో ఇవాళ నేను ఏం చేశాను అనేదే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇంకో వీడియో చూడడం కంటే ఇప్పటికే నేర్చుకున్న ఒక విషయాన్ని ఆచరించడం ఎక్కువ మార్పు తీసుకొస్తుంది. ఎందుకంటే నాలెడ్జ్ మన జీవితాన్ని మార్చదు యాక్షన్ మారుస్తుంది. కాబట్టి కొంచెం తక్కువ కన్స్యూమ్ చేద్దాం కొంచెం ఎక్కువ క్రియేట్ చేద్దాం.
(06:29) క్రియేట్ చేయడం మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది యక్షన్ మనకి ఎనర్జీని ఇస్తుంది. కానీ కన్స్ూమ్ మాత్రమే చేస్తూ ఉంటే మన ఎనర్జీ నెమ్మదిగా లీక్ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ మనం పనులు పూర్తి చేసినా నిర్ణయాలు తగ్గించుకున్న తక్కువ కన్స్ూమ్ చేసినా ఇంకా ఒక విషయం మన ఎనర్జీని బాగా డ్రైన్ చేస్తూనే ఉంటుంది. అదే ఓవర్ థింకింగ్ చాలాసార్లు మన ఎనర్జీ డ్రైన్ చేసేది బయట జరిగే విషయాలు కాదు మన మైండ్ లో మళ్ళీ మళ్ళీ తిరిగే ఆలోచనలు గతంలో జరిగిన విషయాల గురించి రిగ్రెట్స్ గిల్టీ ఫీలింగ్స్ వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా చేశారు అని పదే పదే గుర్తు చేసుకోవడం లేదా రేపటి గురించి లేనిపోని వర్రీస్ మనకు
(07:06) తెలియకుండానే ఇవన్నీ మన మెంటల్ ఎనర్జీని నెమ్మదిగా తగ్గిస్తుంటాయి. ఓవర్ థింకింగ్ గురించి నేను ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను కానీ ఈరోజు మీకు ఫైవ్ రిమైండర్స్ ఇస్తున్నాను ఓవర్ థింకింగ్ మొదలైనప్పుడల్లా వీటిని గుర్తు చేసుకోండి. మనకు వచ్చే ప్రతి ఆలోచన నిజం కాదు ప్రతి ఆలోచనని పట్టుకొని ఆలోచించాల్సిన అవసరం లేదు.
(07:28) రేపటి సమస్యలను ఈరోజే మనసులో మోస్తే ఈరోజు బలం కూడా తగ్గిపోతుంది. ఒకే ఆలోచనని 100 సార్లు ఆలోచించడం వల్ల పరిష్కారం [సంగీతం] రాదు అలసట మాత్రం వస్తుంది. మనశశాంతి కంటే విలువైంది ఏదీ లేదు దాన్ని కాపాడుకోవడానికి కొన్నిటిని వదిలేయడం కూడా ఒక మంచి నిర్ణయమే. [సంగీతం] ప్రతి విషయం పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రతి సమస్యకి వెంటనే సమాధానం దొరకాల్సిన అవసరం కూడా లేదు.
(07:54) కొన్ని విషయాలకు కాలమే సమాధానం చెప్తుంది. కాబట్టి ఆలోచిద్దాం [సంగీతం] కానీ అవసరానికి మించి కాదు ఎందుకంటే మన సమస్యల కంటే వాటి గురించి ఎంతసేపు ఆలోచిస్తున్నామ అన్నదే మన ఎనర్జీని ఎక్కువగా డ్రైన్ చేస్తుంది. నెక్స్ట్ మన బ్రెయిన్ కి కొంచెం స్పేస్ ఇద్దాం. మనం ఎప్పుడు పని చేస్తూ ఉంటే అలసిపోతాం కదా రెస్ట్ కోరుకుంటాం కదా అలాగే మన బ్రెయిన్ కి కూడా కొంచెం ఖాళీ సమయం అవసరం.
(08:20) దానికోసం మెడిటేషన్ చేయాలని లేదు రోజులో కేవలం 10 నిమిషాలయనా ఫోన్ లేకుండా నడవడం బాల్కనీలో ప్రశాంతంగా నేచర్ ని చూడడం లేదా కొన్నిసార్లు కొంచెం ప్రశాంతమైన మ్యూజిక్ పెట్టుకోవడం మన బ్రెయిన్ కి చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. మనం ఎలా స్పేస్ కావాలి అని అనుకుంటున్నామో మన బ్రెయిన్ కి కూడా కాస్త స్పేస్ కావాలి. అప్పుడే అది రోజంతా వచ్చిన ఆలోచనలని ప్రాసెస్ చేసుకొని కొత్త ఆలోచనలకు కూడా చోటిస్తుంది.
(08:44) ఆ ఖాళీ సమయాన్ని మన బ్రెయిన్ కి ఇవ్వడం అంటే మన మెంటల్ ఎనర్జీని కాపాడుకోవడమే లేకపోతే రోజు మొత్తం వచ్చిన ఇన్పుట్స్ ని ప్రాసెస్ చేయడంలోనే మన బ్రెయిన్ కి ఎక్కువ ఎనర్జీ ఖర్చయిపోతుంది. నెక్స్ట్ లైఫ్ లో అన్ని ఏరియాస్ ని ఒకేసారి మార్చాలని ప్రయత్నించొద్దు. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చూస్తే ఒకరు పర్ఫెక్ట్ గా జిమ్ కి వెళ్తూ ఉంటారు. ఒకరు పిల్లలకి పర్ఫెక్ట్ హెల్దీ డిషెస్ చేసి పెడుతూ ఉంటారు.
(09:08) ఒకరు ఇంటిని చాలా అందంగా డెకరేట్ చేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం అప్పుడు మనకు అనిపిస్తుంది ఇవన్నీ నేను చేయాలి అని లైఫ్ లో ప్రతి ఏరియాలో ఒకేసారి ఇంప్రూవ్ అవ్వాలని ప్రయత్నిస్తాం. కానీ నిజానికి అది చాలా కష్టం. ఒక గార్డెన్ లో అన్ని మొక్కల్ని ఒకేసారి పెంచలేం కదా అలాగే లైఫ్ లో కూడా ప్రతి సీజన్ కి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి.
(09:29) ఈ టైంలో మన లైఫ్ కి మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు ఏంటి ఆ ఒకటి లేదా రెండు విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయగలం కాబట్టి తక్కువ ప్రయారిటీస్ ఎక్కువ ఫోకస్ ఎక్కువ ఎనర్జీ లేకపోతే అన్నిటిని ఒకేసారి పట్టుకోవాలనే ప్రయత్నంలో మన ఎనర్జీని మనమే నెమ్మదిగా డ్రైన్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ మనకి ఎనర్జీని ఇచ్చే ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసుకుందాం. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మన ఎనర్జీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది.
(09:52) ఒకసారి గమనించండి ఇల్లు చిందరవందరగా ఉంటే మన మైండ్ కూడా కొంచెం డిస్టర్బ్ గానే ఉంటుంది. అదే ఇల్లు శుభ్రంగా నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మనం ఉండే ప్లేస్ ని వీళ్ళనంత శుభ్రంగా నీట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నిద్దాం. అలాగే ఇది కేవలం ఫిజికల్ ఎన్విరాన్మెంట్ గురించే కాదు డిజిటల్ ఎన్విరాన్మెంట్ కూడా అంతే ముఖ్యం.
(10:10) అనవసరమైనవాట్సాప్ గ్రూప్స్ ఫార్వర్డెడ్ మెసేజెస్ అవసరం లేని ఈమెయిల్స్ ఇవన్నీ కూడా రోజంతా మన అటెన్షన్ ని మన ఎనర్జీని కొంచెం కొంచెంగా డ్రైన్ చేస్తూనే ఉంటాయి. అందుకే మన లైఫ్ కి ఉపయోగపడని వాటిని కొంచెం కొంచెంగా తగ్గించుకుందాం ఫిజికల్ అయినా డిజిటల్ అయినా మనకి నిజంగా అవసరమైనవి మాత్రమే ఉంచుకుందాం. ఎందుకంటే మన ఎన్విరాన్మెంట్ ఎంత ప్రశాంతంగా ఆర్గనైజ్డ్ గా ఉంటే మన మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది.
(10:38) లేకపోతే అనవసరమైన వస్తువులు అనవసరమైన ఇన్పుట్స్ మన ఎనర్జీని నెమ్మదిగా డ్రైన్ చేస్తూనే ఉంటాయి. ఇప్పటివరకు మన ఆలోచనలు మన అలవాట్లు మన చుట్టూ ఉండే వాతావరణం గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇంకో ముఖ్యమైన విషయం ఉంది మనం ఎంత బాగా ఆలోచించినా మన శరీరానికి అవసరమైన ఎనర్జీ లేకపోతే మిగతావన్నీ చేయడం కూడా కష్టంగానే అనిపిస్తుంది.
(10:59) ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా ఈరోజు పెద్దగా ఏం పని చేయలేదు అయినా ఎందుకు ఇంత అలసటగా ఉంది అని నిజానికి ఈ కంప్లైంట్ ఈ రోజుల్లో చాలా మంది నుంచి వింటున్నాం అస్సలు ఎనర్జీ ఉండట్లేదు అనే మాట ఫ్రీక్వెంట్ గా వింటున్నాం. దానికి ఒక ముఖ్యమైన కారణం ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం. ఈ రోజుల్లో మనం గంటలు తరబడి కంప్యూటర్ ముందు పనిచేస్తున్నాం లేదంటే ఫోన్ చూస్తూ ఒకే చోట కూర్చుంటున్నాం.
(11:20) కానీ మన బాడీ తయారైంది ఇన్ని గంటలు కూర్చోడానికి కాదు మన శరీరం [గొంతు సవరించుకోవడం] కదలడానికి తయారైంది. మూమెంట్ అనేది మన బాడీకి చాలా అవసరం. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది బాడీ నెమ్మదిగా బద్ధకానికి అలవాటు పడుతుంది అండ్ దాని ఎఫెక్ట్ మన మనసు మీద కూడా పడుతుంది అందుకే కొన్నిసార్లు పెద్దగా పని చేయకపోయినా మెంటల్ గా కూడా చాలా డల్ గా అలిసిపోయినట్టుగా ఉంటుంది.
(11:43) అందుకే ప్రతి 30 40 నిమిషాలకు ఒకసారి లేచి నడవాలి కొంచెం స్ట్రెచ్చింగ్ చేయాలి. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ కూడా మన శరీరానికి మళ్ళీ ఎనర్జీని ఇస్తాయి. దీంతో పాటు మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన కొన్ని బేసిక్ అలవాట్లు కూడా ఉన్నాయి. మంచి నిద్ర హెల్తీ ఫుడ్ హెల్తీగా తినడం టైం కి తినడం ఇంకా సరిపడా వాటర్ తాగడం రెగ్యులర్ ఎక్సర్సైజ్.
(12:02) ఇవి కేవలం మంచి అలవాట్లు మాత్రమే కాదు మన ఫిజికల్ ఎనర్జీకి ఫౌండేషన్. అండ్ కొన్నిసార్లు ఎనర్జీ లేకపోవడానికి కారణం కేవలం మన అలవాట్లు మాత్రమే కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అది హెల్త్ కి సంబంధించిన కారణం కూడా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డి విటమిన్ బి12 డిఫిషియన్సీస్ లాంటివి హార్మోనల్ ఇంబాలెన్స్ లేదా ఇంకేవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అందుకే మన ఏజ్ అండ్ సిచువేషన్ బట్టి డాక్టర్ ని కలిసి అవసరమైన హెల్త్ చెక్ప్ చేయించుకోవడం మంచిది ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు సజెస్ట్ చేసే సప్ప్లిమెంట్స్ కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకోవచ్చు. మన ఎనర్జీని కాపాడుకోవాలంటే
(12:35) మన బాడీ చెప్పే మాట కూడా వినాలి లేకపోతే మన బాడీని నిర్లక్ష్యం చేసిన ప్రతిసారి దానికి చెల్లించాల్సిన మూల్యం మన ఎనర్జీయే. ఇప్పటివరకు చెప్పినవన్నీ మన చేతిలో ఉన్న విషయాలే కానీ మనలో చాలామంది మన చేతుల్లో లేని విషయాల కోసమే చాలా ఎనర్జీని ఖర్చు చేస్తూ ఉంటాం. మన ఎనర్జీని ఎక్కువగా డ్రైన్ చేసే విషయాల్లో ఇది కూడా ఒకటి ఇందులో రెండు రకాలు ఒకటి ఇతరులని మార్చాలని ప్రయత్నించడం రెండోది అందరూ మనల్ని అర్థం చేసుకోవాలి అందరికీ మనం నచ్చాలి అని ఆలోచన ఇతరులని మార్చాలి అనే విషయం తీసుకుంటే మన స్పౌస్ ఇలా మారాలి పిల్లలు ఇలా ఆలోచించాలి ఇంట్లో వాళ్ళు ఇలా
(13:11) చేయాలి ఆఫీస్ లో వాళ్ళు ఇలా ఉండాలి అని మనం కోరుకోవడం సహజమే ఇతరుల మీద మన ఇన్ఫ్లుయెన్స్ మన ప్రభావం ఉంటుంది మన మాట మన బిహేవియర్ మన ప్రేమ ఇవన్నీ ఇతరుల మీద మంచి ఇన్ఫ్లయెన్స్ చూపించొచ్చు కానీ పూర్తి కంట్రోల్ మాత్రం మన చేతుల్లో ఉండదు అలాగే చాలాసార్లు ఎవరైనా మన గురించి ఏమనుకుంటున్నారు అని కూడా మనం చాలా ఎనర్జీని ఖర్చు చేస్తూ ఉంటాం.
(13:33) నేను ఇలా చెప్పి ఉండకూడదేమో వాళ్ళు ఏమనుకుంటారో అందరికీ నచ్చాలి అని ఆలోచిస్తూ మన ప్రశాంతతని మనమే కోల్పోతుంటాం. నిజానికి మనల్ని అందరూ ఇష్టపడాల్సిన అవసరం లేదు మనల్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం చేయాల్సింది మన వాల్యూస్ కి తగ్గట్టుగా మనకి మీనింగ్ఫుల్ గా అనిపించే విధంగా లైఫ్ లీడ్ చేయడం మిగతా వాటిని లైట్ తీసుకుందాం.
(13:56) ఒకటి ఇతరులని కంట్రోల్ చేయాలనే ప్రయత్నం ఇంకోటి ఇతరుల వాలిడేషన్ కోసం ఎదురు చూడ్డం. ఈ రెండు మన చేతుల్లో లేని విషయాలే. వాటి మీద మన ఎనర్జీని ఖర్చు పెట్టే బదులు మన చేతుల్లో ఉన్న వాటిపై ఫోకస్ చేద్దాం. ఎందుకంటే మన చేతుల్లో లేని వాటిపై ఎంత ఎక్కువ ఫోకస్ పెడతామో అంత ఎక్కువగా మన ఎనర్జీని కోల్పోతూ ఉంటాం. సో అవన్నమాట.
(14:18) నేను షేర్ చేయాలనుకున్న ఎనర్జీ డ్రైనింగ్ హ్యాబిట్స్ అండ్ వాటిని మార్చుకోవడానికి హెల్ప్ అయ్యే కొన్ని థాట్స్ అన్ని ఒకేసారి కాకుండా ఒక్కొక్క అలవాటుని స్లోగా మార్చుకోవడానికి ట్రై చేయండి. ఫైనల్ గా అనవసరమైన విషయాలకు ఎనర్జీని డ్రైన్ చేసుకోకుండా ఉంటే మనకి బాగా ముఖ్యమైన విషయాలకి మన ఫుల్ ఎనర్జీని ఇవ్వచ్చు. ఇంకా మీకు ఒక యాక్టివిటీ ఇస్తాను అన్నాను కదా అది క్వైట్ లీడర్షిప్ బుక్ నుంచి ఇన్స్పైర్ అయింది.
(14:41) అదేంటంటే మీలో మీరు ఆలోచించుకుంటున్నా లేకపోతే ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు కానీ ఎప్పుడైనా మీరు ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తుంటే దాన్ని గుర్తించి సొల్యూషన్ వైపు మీ ఫోకస్ ని షిఫ్ట్ చేయండి. అంటే ఏంటి ఇలా జరిగింది అనిపిస్తే దాన్ని ఇప్పుడు ఏం చేయొచ్చు అనే వైపు షిఫ్ట్ చేయండి. అబ్బా ఏంటి ఈరోజు అసలు పనిఏమి అవ్వలేదు అని అనిపించినప్పుడు దాన్ని మీరు గుర్తించి సరే పని అవ్వలేదు మిగిలిన టైంలో ఇప్పుడు ఏం చేయొచ్చు ఎలా ప్రయారిటీస్ చేయొచ్చు అని మన మైండ్ ని షిఫ్ట్ చేయడం అన్నమాట ఈ యాక్టివిటీ వన్ వీక్ ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది హెల్ప్
(15:16) అయిందా మీ ఎనర్జీలో ఏమన్నా మార్పు వచ్చిందా అనేది కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది మీరు రిలేట్ అయిన విషయాలు మీ థాట్స్ ఒపీనియన్స్ ఎక్స్పీరియన్సెస్ కామెంట్ [సంగీతం] చేయండి ఇతరులకి హెల్ప్ అవ్వచ్చు రిలేట్ అవ్వచ్చు అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి తప్పకుండా హెల్ప్ అవ్వచ్చు సో షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
(15:37) [సంగీతం] మీ లైక్స్ కామెంట్స్ లవ్ అండ్ సపోర్టే నాకు మోటివేషన్ అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు జీవితమస్తు [సంగీతం]
No comments:
Post a Comment