Sunday, April 26, 2026

నేనే భయం-భయమే 'నేను'

 నేనే భయం-భయమే 'నేను'

భవిష్యత్తులో ఏమవుతుందో అన్న అనిశ్చితి నుంచి మరణభయం వరకూ- మనిషికి అనేక భయాలుంటాయి. ప్రతి సమస్యకీ సులభమైన పరిష్కారం, దగ్గర దారి వెత కడం మనసు సహజ లక్షణం. అందుకే భయాన్ని అవగాహన చేసుకోవడానికి బదులు 'నమ్మకం' అనే షార్ట్కట్ను ఆశ్రయిస్తుంది. చుట్టూ సమాజంలో కూడా దాదాపు అందరూ అదే దారిలో నడుస్తుంటారు. అలా నమ్మకం చాలా సహజమైన విషయంగా, అలవాటుగా మారిపోతుంది.

మనిషి లోపలి భయాలూ కోరికల బయటి రూపమే నమ్మకం. అది ఇచ్చే భరోసా తోనో, ఆచారాలూ ప్రార్థనలతోనో, నిర్ణయాలు వాయిదా వేసో, వినోద కాలక్షేపాలతో నో మన భయాలను దారి మళ్లించాలని చూస్తూంటాం. నమ్మకం ఉన్నప్పటికీ ఆశిం చినట్లుగా అన్నీ జరగవు. అనిశ్చితి వెంటాడుతూనే ఉంటుంది. ఏదీ మన చేతుల్లో లేదన్న అశక్తత ఒకవైపు, నమ్మకం లాంటిదేదో ఊతంగా ఉంటే బాగుంటుందన్న ఆశ మరోవైపు ఇలా జీవితం పరాధీనంగా, సంఘర్షణామయంగా అయిపోతుంది. భయం నుంచి పారిపోవడమో, దానితో పోరాడటమో భయానికి పరిష్కారం కాదం టారు జిడ్డు కృష్ణమూర్తి లాంటి తాత్వికులు. భయం వెనక కారణాలను మేధోపరంగా విశ్లేషించి తేల్చుకోవడం ఒక స్థాయి. ధ్యానం లాంటి పద్ధతులతో మాన సిక ఆందోళనలను ఒకింత నియంత్రించ వచ్చు. అయితే ఈ ఉపశమనాలు తాత్కా లికమైనవి. మరోవైపు, ధైర్యం అనే సుగుణం అలవరచుకుంటేనో, నేను ధైర్య శాలినని పదే పదే మనసుకు చెప్పుకొంటేనో భయం పోదు. మరేం చేయాలి?
భవిష్యత్తులో ఏం జరగనుందో అని వర్త మానంలో కలత చెందడమే 'భయం' అంటే ప్రస్తుత క్షణంలో ఉండకపోవడం వల్ల కలిగే అనేక అనర్థాల్లో భయం కూడా ఒకట న్నమాట. గత జ్ఞాపకాన్ని, అభద్రతనూ భవిష్యత్తులోకి చొప్పించే ఆలోచనే 'మానసిక’ కాలాన్నీ, భయాన్నీ సృష్టిస్తుంది. భయం పుడుతున్నప్పుడే దాని తీరును ఎరుకతో గమ నించాలి. ఏ పేరూ పెట్టకుండా, ఏ నిరోధం, అణచివేతా లేకుండా దానికి ముఖాముఖీ నిలబడాలి. అలాంటి జాగరూక పరిశీలనలో ఆ మానసిక కదలిక తన స్వరూపాన్ని ప్రకటిస్తుంది. అదే ఎరుకలో భయానికి మూలమైన ఆలోచన తన శక్తినీ, పట్టునూ కోల్పోతుంది. ఇది ఏ పద్ధతీ, సాధన ద్వారా కాదు; తర్కం, విశ్లేషణ ద్వారా కాదు; వర్తమాన క్షణంపై ఎరుక వల్ల వచ్చే సహజ పరిణామం.

'నేను' వేరు, 'ఇతరం' వేరు అన్న 'ద్వైత' భావనే భయానికి మూలం అంటుంది బృహదారణ్యక ఉపనిషత్తు. బాహ్యప్రపంచం దృష్ట్యానే కాకుండా ఈ విభజన అంతర్గ తంగానూ పనిచేస్తుంది. భయపడే 'నేను', భయం వేరు వేరని మన భావన. నిజా నికి రెండూ ఒకటే. భయపడేవాడే భయం! నిరంతర భద్రత, స్వీయ కొనసాగింపు కోసం పాకులాడే 'నేను' అన్న ఆలోచనలో భాగమే భయం కూడా. ఆ విభజనే లేదని, అది మనసు కల్పించే భ్రాంతి అన్న అవగాహనతోనే సంఘర్షణకు తెర పడుతుంది. భయం అంతమవుతుంది.

ఈదర రవికిరణ్

No comments:

Post a Comment