Sunday, April 26, 2026

SECRET God State | Why Top Achievers Use This | Vishwak Datta

SECRET God State | Why Top Achievers Use This | Vishwak Datta

Author Name:Vishwak Datta

Youtube Channel Url:https://www.youtube.com/@vishwakdatta

Youtube Video URL:https://www.youtube.com/watch?v=a0rJ0Rfwjaw



Transcript:
(00:00) ఒకసారి ఊహించుకోండి మీరు మీ డెస్క్ ముందు కూర్చున్నారు. ఏం చేయాలో మీ లైఫ్ ని ఇంకొక మెట్టుకి ఎలా ఎక్కించాలో ఏ పని పూర్తి చేయాలో మీకు 100% తెలుసు. మీ చేతిలో ఉన్న పుస్తకాన్ని లేదా మీ లాప్టాప్ ని ఓపెన్ చేశారు. సరిగ్గా అప్పుడే మీలో మీకే తెలియని ఒక కనపడని బరువు బయట అంతా ప్రశాంతంగానే ఉంటుంది. కానీ మీ మైండ్ లోపల మాత్రం ఒక సైలెంట్ గా యుద్ధం మొదలవుతుంది.
(00:21) అది చాలా నెమ్మదిగా ఒక చిన్న సాకుతో స్టార్ట్ అవుతుంది. చాలా పెద్ద పనే చేయబోతున్నాం కదా మైండ్ కొద్దిగా అలసిపోయినట్టు ఉంది. ఒక్క ఐదు నిమిషాలు జస్ట్ అలా ఫోన్ చూసి రీసెట్ అవుదాం. తర్వాత ఫుల్ ఫోకస్ తో మొదలు పెట్టొచ్చు. ఆ విధంగా స్క్రీన్ ని అన్లాక్ చేసిన మరుక్షణం అసలు ఏం జరుగుతుందో మీకు తెలిసే లోపలే 30 నిమిషాలు గాలిలో కలిసిపోతాయి.
(00:40) మీ ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయి ఒక్క ముక్క పని చేయకుండానే ఆ మెరుస్తూ ఉన్న స్క్రీన్ వైపు బ్లాంక్ గా చూస్తూ ఉండిపోతారు. వెంటనే మీలో ఒక గిల్ట్ మొదలవుతుంది. నాకు డిసిప్లిన్ లేదు నా లైఫ్ ఇంతే అని మిమ్మల్ని మీరే తిట్టుకుంటారు. మీలో మీరే కుమిలిపోతారు. మీరు బద్ధకస్తులు కారు మీ విల్ పవర్ కి ఎటువంటి రోగము రాలేదు. నిజానికి మీ బ్రెయిన్ ఎంత పర్ఫెక్ట్ గా పని చేయాలో అంతే పర్ఫెక్ట్ గా పని చేస్తూ ఉంది.
(01:04) కానీ ఇక్కడే మీరు తెలుసుకోవాల్సిన ఒక భయంకరమైన నిజం ఉంది. మనం మన మొబైల్స్ ని పట్టుకొని ఈ యప్స్ తో డిజిటల్ ప్రపంచాన్ని వాడుకుంటున్నామ అని అనుకుంటాం. లేదు ఇక్కడ మనం వేటాడబడుతూ ఉన్నాం. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒకసారి వెనక్కి వెళ్ళాలి. వేల సంవత్సరాల క్రితం దట్టమైన అడవుల్లో మన పూర్వీకులు ప్రాణాలతో బయటపడడానికి ఒకటే దారి ఒక జంతువుని వేటాడాలన్న ఒక ప్రమాదం నుండి తప్పించుకోవాలన్నా వాళ్ళకి కావాల్సింది రేజర్ షార్ప్ ఫోకస్ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి కేవలం ఆ ఒక్క క్షణం మీదే ప్రాణాలు పెట్టే ఒక బయాలాజికల్ ఇన్స్టింట్ అది.
(01:35) ఇన్స్టింట్ అంటే ఏదో ఆలోచించి ఆచి తూచి చేసే పని కాదు. ఏదైనా ఒక పరిస్థితి ప్రాణాల మీదకుి వచ్చినప్పుడు మన శరీరం ఆటోమేటిక్ గా రియాక్ట్ అయ్యే ఒక రిఫ్లెక్స్ యక్షన్ ఆ ఫోకస్ వలనే మనిషి జాతి భూమి మీద బ్రతికి బట్టకట్టింది. కానీ మనం ఇప్పుడు ఆ అడవిల్లో లేము. మనం ఒక కొత్త అడవిలోకి వచ్చాం. అదే ద డిజిటల్ జంగిల్. ఇక్కడ మీ చుట్టూ ఉన్న ప్రతి మొబైల్ యాప్ మీ ఫోన్ లో మోగే ప్రతి నోటిఫికేషన్ మీరు చేసే ప్రతి ఇన్ఫినిట్ స్క్రోల్ వాటన్నిటి వెనక ప్రపంచంలోని అత్యంత తెలివైన న్యూరో సైంటిస్ట్లు కూర్చొని ఉన్నారు. వాళ్ళ టార్గెట్ ఒక్కటే.
(02:04) మీ ప్రాణాలని నిలబెట్టే ఆ పవర్ఫుల్ ఫోకస్ ని మీ నుండి దొంగలించడం వాళ్ళు చాలా సైలెంట్ గా మీ మైండ్ లో ఒక కనిపించని జైలుని కట్టారు. ఆ జైలు ఎంత కంఫర్టబుల్ గా ఉంటుందంటే జీవితాంతం అక్కడే ఉండిపోవాలి అని అనిపించేంత మత్తులో మిమ్మల్ని ముంచేస్తారు. ఇదినూకి 99% మంది యొక్క పరిస్థితి. కానీ ఈ ప్రపంచంలో ఆ 1 శాత మంది ఉన్నారు.
(02:26) ది టాప్ క్రియేటర్స్, బిల్డర్స్ వాళ్ళ సొంత సామ్రాజ్యాలను నిర్మించుకునే ఎలైట్ పర్ఫార్మర్స్ వాళ్ళు ఈ డిజిటల్ మాయలోకి పడడానికి అస్సలు ఒప్పుకోరు. వాళ్ళు కంప్లీట్ గా ఒక డిఫరెంట్ డైమెన్షన్ లో బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు పని చేయడం మొదలు పెడితే వాళ్ళకి వాళ్ళ పనులకి అస్సలు తేడా కనిపించదు. వాళ్లే ఆ పనిగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళలో భయం ఉండదు.
(02:46) ఓవర్ థింకింగ్ అస్సలే ఉండదు. రోజులో కొన్ని గంటల పాటు వాళ్ళు ఎంత హైపర్ ప్రొడక్టివ్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తారంటే మిగతా ప్రపంచంఅంతా వీళ్ళని చూసి వీళ్ళకఏదో సూపర్ పవర్ ఉందని అనుకుంటుంది. దీనినే ఫ్లో స్టేట్ అని అంటారు. మీరు ఆ స్టేట్ లోకి ఎలా వెళ్ళాలో ఎప్పటికీ తెలియకూడదని ఈ సిస్టం కోరుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆ పవర్ మీకు వస్తే మిమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోలేరు.
(03:08) ఈ సిస్టం కే మీరు ఒక త్రెట్ గా మారతారు. ప్రస్తుతం మీరు ఆ పవర్ కి చాలా దూరంగా ఉన్నారు. దానికి కారణం మీకు డిసిప్లిన్ లేకపోవడం కాదు. దీన్నంతటికీ కారణం మీ బ్రెయిన్ లో మైక్రోస్కోపిక్ లెవెల్ లో ఉండే ఒక చిన్న కెమికల్ మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీకు వచ్చే ప్రతి కోరికని మీరు ఫోకస్ కోల్పోయే ప్రతి క్షణాన్ని మీ తలలో ఒక చీకటి గదిలో కూర్చొని సైలెంట్ గా కంట్రోల్ చేస్తూ ఉన్న మాస్టర్ మైండ్ అది.
(03:30) మీ బుర్రలోనే ఉంటూ మిమ్మల్ని ఆడిస్తూ ఉన్న ఆ అదృశ్య శక్తి ఏంటో అది మిమ్మల్ని ఎలా బానిసని చేసిందో నేను మీకు చూపిస్తాను. మీ బ్రెయిన్ లోపల ఎప్పుడూ వేటాడడానికి రెడీగా ఉండే ఒక అదృశ్యమైన సింహం ఉంది. దాని ఏకైక లక్ష్యం మిమ్మల్ని బ్రతికించడం మిమ్మల్ని గెలిపించడం ఒక మనిషి తన లైఫ్ లో అద్భుతాలను సాధించడానికి కష్టాలని దాటుకొని ఎదగడానికి కావలసిన పవర్ఫుల్ ఇంజన్ ఇదే.
(03:56) ఈ సింహాన్ని నడిపించే ఒకే ఒక ఇంధనం డోపమైన్. ఇక్కడే చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. డోపమైన్ అంటే ఏదో సాధించిన తర్వాత వచ్చే సంతోషం అని అనుకుంటూ ఉంటారు. అది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే మీరు ఒకటి సాధించిన తర్వాత వచ్చే ఆ కిక్ కోసం మిమ్మల్ని ముందుకు నడిపించేలా చేసే ఒక కోరిక. ఎముకలు కొరికే చలిలో వణకుతూ ఉన్నా సరే ఆ వేట కోసం పరిగెత్తేలా చేసే భయంకరమైన ఆకలి అది.
(04:19) వేల సంవత్సరాల క్రితం మీలో ఉన్న ఈ సింహం ఒకే ఒక్క చుక్క డోపమైన్ కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఆహారం సంపాదించడం, ఇల్లు కట్టుకోవడం, కొత్త ప్రాంతాలను వెతకడం వీటన్నిటికీ విపరీతమైన ఎనర్జీ కావాలి. ఆ పని చాలా కష్టంగా ఉండేది. కానీ ఆ కష్టం చివరిలో దొరికే ఆ చిన్న డోపమైన్ స్పైక్ ఆ నొప్పులన్నిటిని మర్చిపోయేలా చేసేది. మన బ్రెయిన్ డిజైన్ అయింది ఈ కష్టం కోసమే.
(04:40) కానీ ఈ డిజిటల్ జంగిల్ వచ్చిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. మీ ఉదయం ఎలా ఉంటుందో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. మంచం మీద నుండి కాళ్ళు కింద పెట్టకముందే మీ చెయ్యి ఆటోమేటిక్ గా ఫోన్ వైపు వెళ్తుంది. స్క్రీన్ మీద ఒక రెడ్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. అంతే మీ లోపల ఆకలితో ఉన్న ఆ సింహానికి ఎవరో వచ్చి ఏ కష్టము పడకుండా ఫ్రీగా ఒక మాంసం మొక్కను విసిరినట్టు అవుతుంది.
(05:03) ఒక షార్ట్ వీడియోని ఓపెన్ చేస్తారు. నవ్వుతారు. ఇంకో మాంసం మొక్క స్క్రోల్ చేస్తుంటే ఎవరో పెట్టిన ఒక నెగిటివ్ కామెంట్ కనిపిస్తుంది. మీకు కోపం వస్తుంది. మరికొంత ఫ్రీ ఫుడ్ ఉదయం 10 గంటల కల్లా మీరు మీ లైఫ్ కి ఉపయోగపడే ఒక్కటంటే ఒక్క అసలైన పని కూడా చేయకముందే మీ బుర్రలో ఉన్న ఆ సింహం కాస్త బాగా మేసి బద్ధకంగా తయారైపోతుంది.
(05:24) ఎలాంటి కష్టం పడకుండానే ఫ్రీగా దొరికే ఆ చీప్ డోపమైన్ తో మీ బ్రెయిన్ ని నింపేశారు కదా. ఆ తర్వాత ఉదయం 11 గంటలకి డస్క్ ముందు కూర్చొని సరే ఇప్పుడు నా ప్రాజెక్ట్ పని చూద్దాం. లేదా నా లైఫ్ ని మార్చే ఆ కొత్త స్కిల్ ఏదో నేర్చుకుందాం. అని మీరు అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? మీలో ఉన్న ఆ సింహం మీ వైపు చూస్తుంది. కానీ కదలడానికి అస్సలు ఒప్పుకోదు.
(05:44) ఏ కష్టము పడకుండా చేతిలో ఉన్న ఫోన్ ని చూసినప్పుడు ఫ్రీగా ఫుడ్ దొరుకుతూ ఉంటే మీ కష్టమైన లక్ష్యాల కోసం ఆ సింహం ఎందుకని వేటాడుతుంది. మీలో చాలా మంది జీవితంలో అలసిపోయారు అని అనుకుంటూ ఉంటారు. మీరు అలసిపోలేదు. మీరు అతిగా మేపబడ్డారు. చీప్ డోపమైన్ అనే కెమికల్ తో మీరు మేపబడ్డారు. ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడానికి వాడాల్సిన ఆ పవర్ఫుల్ ఎనర్జీని వృదహగా ఆ మొబైల్ స్క్రీన్ మీద ఖర్చు పెట్టేశారు.
(06:07) మీ లక్ష్యాలను జయించాల్సిన ఆ కసిని ఈ చీప్ డిజిటల్ మాయ కోసం అమ్మేశారు. రోజంతా ఏమి చేయకున్నా సరే రాత్రి పడుకునేటప్పుడు మీరు ఎందుకని అంత డిప్రెసడ్ గా మైండ్ అంతా ఎంటీగా ఫీల్ అవుతారో తెలుసా? కారణం ఇదే ఆ సింహం పుట్టిందే వేటాడడానికి కానీ మీరు దాన్ని తీసుకువచ్చి ఒక బోనులో బంధించారు. బట్ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది. మన బ్రెయిన్ పూర్తిగా పాడైపోలేదు.
(06:28) దాన్ని తిరిగి మళ్ళీ ట్రాక్ లోకి తీసుకురావచ్చు. అయితే దీనికోసం ఏదో ఒక మోటివేషన్ వీడియో చూడగానే ఆ సింహం ఆ పంజరాన్ని బద్దలు కొట్టుకొని బయటకి వచ్చి పరిగెడుతుందని ఆశించకండి. మీ బ్రెయిన్ ని రీసెట్ చేయడానికి మీ లోపల ఉన్న ఆ చీప్ డోపమైన్ ని బయటకి పంపేసి మీ ఫోకస్ ని మళ్ళీ ఆ అడవిలోకి పంపడానికి ఉన్నది ఒకే ఒక మార్గం. మీరు ఆ సింహాన్ని బస్తూ ఉంచాలి.
(06:49) ఆ ఫ్రీ డోపమిన్ సప్లై ని కట్ చేయాలి. మిమ్మల్ని మీ పనితో పాటు ఒక గదిలో బంధించుకోవాలి. ఏది ఏమైనా సరే వేరే ఎటువైపు చూడకూడదని మీరు డిసైడ్ అవ్వాలి. మీరు ఇలా చేసినప్పుడు మొదటిగా మీ బ్రెయిన్ పానిక్ అవుతుంది. ఆ చీప్ గా వచ్చే ఆ ఫ్యూయల్ కోసం అరుస్తుంది. లోపల ఎక్కడో ఒక నరకం కనిపిస్తుంది. ఈ కష్టం నావల్ల కాదు అని గెలగెలా కొట్టుకుంటుంది.
(07:09) ఆ మొదటి 15 నిమిషాలు మీకు ఒక సైకలాజికల్ టార్చర్ లాగా అనిపిస్తుంది. ప్రపంచంలో ఉండే టాప్ పర్ఫార్మర్స్ ఈ స్థితినే ది ఫ్రిక్షన్ అని పిలుస్తారు.నకి 99 మంది మొదటిగా ఈ ఫ్రిక్షన్ ని ఫేస్ చేయగానే భయపడిపోయి సరెండర్ అయిపోతారు. కంఫర్టబుల్ గా ఉండే ఆ డిస్ట్రాక్షన్ వెనక్కి వెళ్లి దాదాకుంటారు. ఆ జైలులోనే ఉండిపోవడానికి ఇష్టపడతారు.
(07:29) మన జీవితాలు ఓడిపోయే క్షణం అదే కానీ ఒకవేళ మీరు ఓడిపోకపోతే ఏం జరుగుతుంది? ఆ నిశశబ్దంలోనే అలాగే కూర్చొని ఆ పానిక్ ని పంటి బిగువన భరించి మీ పని వైపే అలాగే చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది? మీరు ఈ ఫ్రిక్షన్ అనే అగ్ని పరీక్ష నుండి బయటపడిన మరుక్షణం మీ బ్రెయిన్ లో ఒక బయోలాజికల్ స్విచ్ ఆన్ అవుతుంది. మీ మైండ్ లో నిరంతరం గోల చేసే ఆ భయం ఆ ఇన్నర్ క్రిటిక్ పూర్తిగా శాశ్వతంగా సైలెంట్ అయిపోతుంది.
(07:54) సరిగ్గా అప్పుడే మీరు ఒక కొత్త శూన్యంలోకి అడుగు పెడతారు. వెల్కమ్ టు ద ఫ్రిక్షన్. 99% మనుషుల యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళు కనే కలలు చనిపోయే స్మసానం ఇదే. మీరు డెస్క్ ముందు కూర్చుంటారు. బ్రౌజర్ లో అనవసరమైన టాబ్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు. ఫోన్ ని సైలెంట్ లో పెట్టి దూరంగా పాడేస్తారు. మీ ముందు ఉన్న ఆ బ్లాంక్ పేజీ వైపు లేదా మీ బిజినెస్ ప్లాన్ వైపు చూసిన మరుక్షణం మీ చాతి మీద ఎవరో 100 కిలోల బరువుని పెట్టినట్టు అనిపిస్తుంది.
(08:20) ఊపిరి ఆడని ఫీలింగ్ ఎందుకంటే మీ బ్రెయిన్ కి ఆ చీప్ డోపమైన్ సప్లై అనేది కట్ అయిపోయింది కాబట్టి అప్పుడే మీ మైండ్ లో ఒక వాయిస్ చాలా గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తుంది. అది మీతో ప్రాధేయ పడుతుంది. బేరాలు మాట్లాడుతుంది. ఒక్క ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకుందాం. రాత్రి సరిగ్గా నిద్రపోలేదు కదా ఇది రేపు చేద్దాం. అసలు దీన్ని పూర్తిగా ఎలా చేయాలో నీకు తెలియదు.
(08:39) మధ్యలో ఫెయిల్ అయ్యే ఛాన్సులు చాలానే ఉన్నాయి. ఈ విధంగా వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. చాలా మంది ఈ వాయిస్ ని వినగానే భయపడిపోయి మొదట్లోనే గివ్ అప్ ఇచ్చేస్తారు. మళ్ళీ ఆ డిజిటల్ జైలీలోకి వెళ్ళిపోయి ఒక బానిసలాగా ఉండిపోవడానికి ఇష్టపడతారు. కానీ మీరు ఆ సూపర్ హ్యూమన్ ఫ్లో లోకి ప్రవేశించాలి అని అనుకుంటే సరిగ్గా ఇదే క్షణంలో అసలు మీ బ్రెయిన్ లో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి.
(09:00) మీ బుర్రలో వినిపిస్తూ ఉన్న ఆ వాయిస్ మీరు కాదు అది మీ బ్రెయిన్ లోని ఒక భాగం దాని పేరు ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఇదే మీ ఈగో ఉండే చోటు ఎప్పుడూ టైం ని లెక్కిస్తూ ఫ్యూచర్ గురించి భయపడుతూ మీరు చేసే ప్రతి చిన్న తప్పుని భూతద్దంలో చూపిస్తూ మిమ్మల్ని జడ్జ్ చేసే ఇన్నర్ క్రిటిక్ ఇదే. నిరంతరం గజిబిజిగా ఉండే ఈ మోడర్న్ ప్రపంచంలో మీ యొక్క ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది ఎప్పుడూ హైపర్ యక్టివ్ గా ఉంటుంది.
(09:24) ఇది మీ మీద మీకే అనుమానం వచ్చేలా చేస్తూ నిరంతరం గొనుగుతూనే ఉంటుంది. కానీ ఈ వాయిస్ ని కట్ చేసి పడేసే ఒక బయోలాజికల్ ఓవర్న్రైడ్ కోడ్ అనేది మీ బ్రెయిన్ లోనే దాగి ఉంది. ఒకసారి ఊహించండి. 1000 అడుగుల ఎత్తులో ఉన్న ఒక నెటారైన కొండను ఎలాంటి తాడు సేఫ్టీ లేకుండా ఎక్కుతూ ఉన్న ఒక ఫ్రీ సోలో రాక్ క్లైంబర్ అతను కేవలం తన వేళన పట్టుతోనే ఆ కొండని పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు.
(09:46) ఆ క్షణంలో కనుక తన బ్రెయిన్ లో ఈ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనేది ఆన్ అయితే కిందకు చూసి పడిపోతే ఏమవుతుంది అనో లేదా నా చేతులు నొప్పులు పెడుతున్నాయని ఆలోచించడం మొదలు పెడితే అతడు భయంతో ఒక్క క్షణం పాటు ఆగిపోతాడు. ఆ ఒక్క క్షణం చాలు ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అంటే ఇటువంటి చావో రేవో అనే సిచువేషన్స్ కి మన బ్రెయిన్ ఎలా డిజైన్ చేయబడింది అంటే అది ఆటోమేటిక్ గా ఒక ఎమర్జెన్సీ ప్రొటోకాల్ ని స్టార్ట్ చేస్తుంది.
(10:10) ప్రాణాలతో బయటపడడానికి ఒక న్యూరోలాజికల్ షట్ డౌన్ ని ఫోర్స్ చేస్తుంది. సైంటిస్టులు దీన్నే ట్రాన్సియంట్ హైపోర్ ఫ్రంటాలిటీ అని అంటారు. సింపుల్ గా చెప్పాలంటే మీ మెదడులో నిరంతరం గోల చేసే ఆ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ని కాసేపటి పాటు స్విచ్ ఆఫ్ చేయడం. ఇది ఎలా ఉంటుందంటే నేను మీ తలని పట్టుకొని బలవంతంగా ఒక వాటర్ ట్యాంక్ లోపల ముంచేసి అలాగే పట్టుకుంటే ఎలా ఉంటుంది? ఆ క్షణంలో మీకు బయట ఎన్ని సమస్యలు ఉన్నా సరే బ్యాంకులో ఎన్ని లక్షలు అప్పులు ఉన్నా సరే మీరు సాధించాల్సిన పనులు ఎన్ని ఉన్నా సరే ఆ క్షణం అవన్నీ మీకు అనవసరం మీకు అవసరమైనదల్లా ఒక్కటే కొద్దిగా ఆక్సిజన్
(10:45) ఊపెరి ఆ క్షణంలో మీ బ్రెయిన్ లో ఉన్న మిగతా భయాలన్నీ ఆఫ్ అయిపోతాయి. కేవలం ప్రస్తుతం ఉన్న ఈ ప్రాణ సంఘటనం నుండి బయటకు రావడం మాత్రమే దాని ఏకైక లక్ష్యం అవుతుంది. ఆ పరిస్థితికి అది పూర్తిగా సరెండర్ అవుతుంది. చూసారా మన మనసులో నిరంతరం గోల చేసే ఆ అంతర్గత గందరగోళాన్ని ఆపాలంటే మనకు కావలసింది ఒక ప్రెజర్ ఒక భరించలేని తపన.
(11:08) ఇక వేరే ఏ దారి లేదు అనే ఒక ఫోకస్. మీరు ఆ ఫోన్ ని పక్కన పెట్టి ఆ డిస్ట్రాక్షన్ ని కట్ చేసినప్పుడు మీ బ్రెయిన్ ఫీల్ అయ్యే ప్రెజర్ కూడా సరిగ్గా ఇదే. ఈ ప్రెజర్ ని తట్టుకొని ఆ 15 నిమిషాలు కూర్చుంటే ఆ భయపెట్టే వాయిస్ ఆగిపోతుంది. మీకున్న ఈగో మాయమైపోతుంది. మీలో ఉన్న భయం ఆవిరైపోతుంది. గంటలు నిమిషాలలాగా కుదించుకుపోతాయి. మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచించడం ఆపేసి మీరు మీ పనిని చేసుకుంటూ వెళ్ళిపోతారు.
(11:34) ఎగజాక్ట్లీ వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధభూమిలో ఆ వాసుదేవుడు అర్జునుడికి చెప్పిన సీక్రెట్ కూడా ఇదే. దీన్నే మనం స్థిత ప్రజ్ఞత అని అంటాం. స్థిత ప్రజ్ఞతలో ఉన్న వ్యక్తికి అతని ఎదురుగా ఉన్న పరిస్థితికి అస్సలు తేడా ఉండదు. ఆ రెండు ఒక్కటే ఇదే ఫ్లో ఇక్కడ మీ మైండ్ ఒక సూపర్ హ్యూమన్ స్పీడ్ తో పని చేస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు మీ డెస్క్ ముందు కూర్చొని ఏదో ఒక అద్భుతం జరిగి ఆ ఫ్లో దానంతట అదే మీ దగ్గరకు వస్తుందని ఆకాశం వైపు చూస్తూ ఎదురు చూడలేరు.
(12:03) ఫ్లో అనేది దానంతట అదే వచ్చే ఒక మ్యాజిక్ కాదు. మీరు మీ చుట్టూ క్రియేట్ చేసుకునే వాతావరణానికి మీ బ్రెయిన్ ఇచ్చే ఒక బయోలాజికల్ రెస్పాన్స్. మీరు దానికోసం ఎదురు చూడలేరు. దాన్ని పట్టుకోవడానికి ఒక ట్రాప్ ని సిద్ధం చేయాలి. మీకు కావాల్సినప్పుడల్లా మీ బ్రెయిన్ ని ఆ ఫ్లో స్టేట్ లోకి ఫోర్స్ చేయగలగాలి. ఆ ట్రాప్ ని ఎలా సెట్ చేయాలో ఖచ్చితమైన స్టెప్ బై స్టెప్ ప్రొటోకాల్ ని నేను మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాను.
(12:26) ఆకాశంలో 300 మిలియన్ల వోల్ట్ల విద్యుత్ తో వచ్చే ఆ పిడుగు కోసం మీరు ఆసగా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఆ పిడుగును మీకు కావాల్సినప్పుడు మీకు కావాల్సిన చోట ఆకర్షించే స్తంభాన్ని మీరే నిర్మిస్తారు. మీ బ్రెయిన్ ని ట్రాన్సియంట్ హైపో ఫ్రంటాలిటీ అనే స్థితిలోకి ఫోర్స్ చేయాలి. ఫ్లో స్టేట్ మాత్రమే ఏకైక బయోలాజికల్ ఆప్షన్ అయ్యే విధంగా మీరు ఒక వాతావరణాన్ని డిజైన్ చేయాలి.
(12:50) మీ కాన్షియస్నెస్ కి ఒక ట్రాప్ వేయాలి. ఆ ట్రాప్ కి మూడు స్తంభాలు ఉన్నాయి. అందులో ఏ ఒక్కటి మిస్ అయినా సరే ఆ ట్రాప్ విరిగిపోతుంది. ఆ వేటాడే సింహం తప్పించుకుంటుంది. మళ్ళీ మీరు ఆ మ్యాట్రిక్స్ లో పడిపోతారు. మొదటి పిల్లర్ ది సెన్సరీ లాక్. మీ బ్రెయిన్ కి ప్రమాదాలని పసిగట్టే ఎబిలిటీ ఎంత ఉంటుందో కష్టాల నుండి తప్పించుకోవడానికి ఒక్క చిన్న షార్ట్ కట్ దారి కనిపించిన దాన్ని వెంటనే పట్టుకునే ఎబిలిటీ కూడా అంతే ఉంటుంది.
(13:14) మీ ఫోన్ ని స్క్రీన్ కిందకి తిప్పి మీ డెస్క్ మీద పెట్టడం అనేది స్ట్రాటజీ కాదు. అది లోడ్ చేసిన తుపాకి లాంటిది. మీ చేతికి సరిగ్గా 12 అంగుళాల దూరంలో అంతులేని ఫ్రీ డోపమైన్ ఉందని మీ సబ్కాన్షియస్ మైండ్ కి తెలుసు. దాన్ని పట్టుకోకుండా ఆపుకోవడానికే మీ బ్రెయిన్ తన ఎనర్జీని సగం ఖర్చు చేసేస్తుంది. ఫ్లో ని ట్రిగర్ చేయాలంటే ఈ ఎస్కేప్ రూట్స్ అన్నిటిని మీరు బ్లాక్ చేయాలి.
(13:36) ఫోన్ వేరే గదిలో ఉండాలి. ఎక్స్ట్రా టాబ్స్ అన్ని క్లోజ్ చేయాలి. మీ నెర్వస్ సిస్టం కి ఒకే ఒక సిగ్నల్ వెళ్ళాలి. మనం ఇప్పుడు వేటలో ఉన్నాం. ఇక్కడ ఎస్కేప్ అవ్వడానికి ఏ దారి లేదు. ఈ పనిని పూర్తి చేయాల్సిందే. వేరే దారి లేదని బ్రెయిన్ కి అర్థమైనప్పుడు అది ఆ పనిని ఖచ్చితంగా చేయాలి అని పూర్తిగా సరెండర్ అవుతుంది.
(13:55) రెండవ పిల్లర్ ది గోల్డెన్ రేషియో ఆఫ్ డిఫికల్టీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా ఉంటుందంటే ఒక వీడియో గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు ఫస్ట్ లెవెల్ మరీ ఈజీగా ఉంటే మీకు బోరు కొట్టేసి పక్కన పడేస్తారు. అదే ఫస్ట్ లెవెల్ లోనే అత్యంత కష్టమైన ఛాలెంజ్ వస్తే చిరాకు వచ్చి గేమ్ ని డిలీట్ చేసేస్తారు. కానీ ఆ గేమ్ మిమ్మల్ని గంటల తరబడి ఎలా కట్టిపడేస్తుందో తెలుసా మీ స్కిల్ కి సరిగ్గా సరిపోయే ఛాలెంజ్ ని మీకు ఇస్తూ నెమ్మదిగా కష్టం పెంచుకుంటూ వెళ్తుంది.
(14:21) ఎగజక్ట్లీ మీ పని కూడా ఇంతే. మీ ముందు ఉన్న పని మీ ప్రస్తుత కెపాసిటీ కంటే ఒక 4% ఎక్కువగా కష్టంగా ఉండాలి. జిమ్ లో వెయిట్ లిఫ్ట్ చేసే వ్యక్తి తన బార్కి ఇంకొకరెండున్నర కిలోలు యాడ్ చేసినట్టు. ఉదాహరణకి 10 పేజీలు చదవగలిగే వ్యక్తి మరో రెండు పేజీలని ఎక్స్ట్రాగా చదవడం 10 తో పోలిస్తే 12 అనేది కొంచెం పెరిగినట్టే కదా అలాగే 10 పేజీలని ఆ ఎక్స్ట్రా రెండు పేజీలతో పోలిస్తే అది చాలా చిన్నదిగా కూడా కనిపిస్తుంది.
(14:48) ఎగజక్ట్లీ ఇదే ఆ స్వీట్ స్పాట్. ఇక్కడే మీ బండి ముందుకు కదలడం మొదలవుతుంది. ఈ స్వీట్ స్పాట్ ని మీరు కరెక్ట్ గా పట్టుకుంటే మీ బ్రెయిన్ కి బోర్ కొట్టదు. భయము వేయదు. మీ బ్రెయిన్ 100% తన ప్రాసెసింగ్ పవర్ ని ఆ పని మీద పెట్టాల్సి వస్తుంది. గతం గురించో భవిష్యత్తు గురించో ఆలోచించడానికి తన దగ్గర ఇక పవర్ ఉండదు. మీరు ఆ పనిలో పూర్తిగా లాక్ అయిపోతారు.
(15:09) మూడవ పిల్లర్ ది ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ లూప్ గుర్తుపెట్టుకోండి మీ బ్రెయిన్ అని చెప్పే ఆ సింహాన్ని నడిపించే ఇంధనం డోపమైన్ ఫ్లో లో ఉన్నప్పుడు అది సరైన దారిలోని వెళ్తున్నానని ఆ వేటాడే సింహానికి తెలియాలి. ఒక పెద్ద బిజినెస్ ని బిల్డ్ చేయాలి. ఇటువంటి గోల్స్ ని పెడితే ఆ సింహానికి అర్థం కాదు. ఎప్పుడూ మూడేళ్ల తర్వాత వచ్చే రిజల్ట్ కోసం మీ బ్రెయిన్ ఇప్పుడు మీకు ఎనర్జీని ఇవ్వదు.
(15:30) అందుకే ఆ పెద్ద గోల్ ని చిన్న చిన్న మైక్రో యాక్షన్స్ గా బ్రేక్ చేయాలి. మీరు ఒక సబ్జెక్ట్ లో ఉన్న కష్టమైన కాన్సెప్ట్ ని అర్థం చేసుకున్నారు. డోపమైన్ హిట్ అవుతుంది. మీ బిజినెస్ ఐడియాని మొదటిసారిగా ఒక పేపర్ మీద క్లియర్ గా రాశారు. డోపమైన్ హిట్ అవుతుంది. లేదా మీ ఇంట్లో ఎప్పటి నుంచో చిందరవందరగా ఉన్న గదిలో కనీసం ఒక టేబుల్ నైనా నీట్ గా సర్దుకున్నారో డోపైన్ హిట్ అవుతుంది.
(15:50) ఇలా చిన్న చిన్న విజయాలని కలుపుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మీ బ్రెయిన్ కి ఒక రియల్ టైం ఫీడ్బ్యాక్ వస్తుంది. నేను సరైన దారిలోనే ఉన్నాను అని ఆ డోపమైన్ బూస్ట్ తో మీ బ్రెయిన్ ఇంకా వేగంగా పరిగెడుతుంది. సెన్సరీ లాక్, గోల్డెన్ రేషియో, ఫీడ్బ్యాక్. ఈ మూడు పిల్లర్స్ ని మీరు సరిగ్గా వాడుకుంటే మీరు మీ పనిని పూర్తి చేయడం మాత్రమే కాదు దానిని చించి పాడేస్తారు.
(16:11) ఒక వారం రోజులో చేయాల్సిన పనిని మూడు గంటల్లో ముగించేస్తారు. కానీ ఈ ఫ్లో స్టేట్ ని ఏదో విజిట్ చేస్తూ రావడం కాకుండా ప్రతిరోజు ఇందులోనే జీవించడం మొదలు పెడితే ఏమవుతుంది? ఈ ఫ్లో స్టేట్ లో ఉన్న వాళ్ళకి ప్రొడక్టివిటీ అనేది ఒక ఆరంభం మాత్రమే. మీరు ఈ ఫ్లో స్టేట్ ని సిద్ధి పొందినప్పుడు ఒక ఫైనల్ ఫేజ్ ని అన్లాక్ చేస్తారు. రియాలిటీని మీరు ఎక్స్పీరియన్స్ చేసే విధానాన్నే మార్చేసే ఒక సైకలాజికల్ షిఫ్ట్ అది.
(16:35) వెల్కమ్ టు ద యూనియన్. మీరు ట్రాప్ ని సిద్ధం చేశారు. సక్సెస్ఫుల్ గా ఫ్రిక్షన్ అనే ఆ అగ్ని పరీక్ష నుండి బయటపడ్డారు. మీ మనసులో నిరంతరం గోల చేసే భయపెట్టే ఆ ఇన్నర్ క్రిటిక్ ఇప్పుడు శాశ్వతంగా చనిపోయింది. ఇలా ఈ ఫ్లో స్టేట్ లోకి మీరు ప్రతిరోజు వెళ్తూ ఉంటే మీ సైకాలజీలో ఒక అద్భుతం జరుగుతుంది. కష్టపడడం గురించి సక్సెస్ గురించి ఈ లోకం మీకు నేర్పించిందంతా అబద్ధం అని మీకు అర్థమవుతుంది.
(16:58) చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే గొప్ప గొప్పవి సాధించాలంటే పళ్ళు కొరుకుతూ ఏడుస్తూ ప్రతి అడుగు భయపడుతూ ఫోర్స్ ఫుల్ గా ముందుకు వేయాలి అని నమ్ముతూ ఉంటారు. సక్సెస్ అనేది ఎక్కడో భవిష్యత్తులోనే ఉంది అని నమ్ముతూ ఆశపడుతూ జీవితాంతం ఒక పిచ్చివాడిలా దాని వెనక పరిగెడుతూనే ఉంటాడు. కానీ ఫ్లో లోని అత్యంత లోతైన ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కష్టపడటం ఉండదు.
(17:20) దేని వెనుక పరిగెత్తడం ఉండదు. అక్కడ కేవలం యూనియన్ అంటే పూర్తిగా లేనమైపోవడం మాత్రమే ఉంటుంది. ఈ స్థితిలో ఏం జరుగుతుందంటే మీకు మీ పనికి మధ్య [సంగీతం] ఉన్న ఆ గీత పూర్తిగా చెరిగిపోతుంది. పని చేసేవాడు వేరు పని వేరు అనే భావనే ఉండదు. ఒక పరీక్ష కోసం భయపడుతూ కష్టపడి పుస్తకం చదువుతున్న సాధారణ స్టూడెంట్ లాగా మీరు మిగిలిపోరు. ఆ క్షణంలో అసలు మీరు ఆ పుస్తకం వేరు వేరు కాదు. మీరే ఆ సబ్జెక్ట్ అయిపోతారు.
(17:46) ఆ కాన్సెప్ట్ అంతా మీ బుర్రలోకి ఒక ప్రవాహం లాగా వెళ్ళిపోతుంది. ఆఫీస్ లో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నా లేదా 10 మంది ముందు నిలబడి మాట్లాడుతూ ఉన్నా నేను ఎక్కడ తప్పు చేస్తాను వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడే వ్యక్తిలా మీరు ఇకపై ఉండరు. ఆ క్షణం అసలు మీరు ఆలోచించకుండానే మీ నోట మాట వస్తుంది.
(18:04) ఒక ప్రవాహం లాగా మీ బ్రెయిన్ ఆటోమేటిక్ గా అత్యంత అద్భుతమైన ఆలోచనలను బయటకి పంపుతూ ఉంటుంది. గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు బంతి ఎటు వస్తుందో అని లెక్కలు వేసుకునే సాధారణ ఆటగాడిలా మీరు ఉండరు. ఆ క్షణంలో మీ చేతుల్లో ఉన్న బ్యాట్ మీకు వేరే వస్తువులా అనిపించదు. అది మీ శరీరంలో ఒక భాగం అయపోతుంది. మీరే ఆ గేమ్ లాగా మారిపోతారు. మీరు ఎంత సాధారణమైన పని చేస్తున్నా సరే ఎంత పెద్ద పని చేస్తూ ఉన్నా సరే దానిని ఇబ్బంది పడుతూ చేస్తూ ఉన్న ఫీలింగ్ మీకు ఉండదు.
(18:31) ఒక ఆర్టిస్టు బొమ్మని గీస్తూ ఉన్నప్పుడు అతని చేతులు వాటంతటా అవే ఎలా కదులుతాయో మీ పనులు కూడా అంతే స్మూత్ గా జరిగిపోతాయి. అంటే దీని అర్థం ఏంటంటే మీ మైండ్ లో నేను ఈ పనిని చేస్తున్నాను అనే ఆలోచనే చనిపోతుంది. మీలోని ఆ ఈగో ఆ భయం అదృశ్యం అయపోతాయి. అక్కడ మీరు ఉండరు. కేవలం ఆ కర్మ మాత్రమే ఎలాంటి తప్పులు లేకుండా అత్యంత వేగంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. రేపటి గురించి భయం అనేది ఉండదు.
(18:54) ఎందుకంటే ఫ్లోలో భవిష్యత్తు అనేదే లేదు. నిన్నటి గురించి ఆందోళన ఉండదు. ఎందుకంటే గతం అప్పటికే చనిపోయింది. అక్కడ కేవలం ఒకటే ఒకటి ఉంది. ఈ క్షణంలో ఈ ఒక్క మిల్లీ సెకండ్ లో మీరు చేసే ఒక పర్ఫెక్ట్ యాక్షన్. ఇదే ద గాడ్ స్టేట్. ఒక మనిషి తన అత్యున్నత శిఖరం వద్ద పని చేసే క్షణం ఇది. మీరేదో కొత్తగా ఒక మ్యాజిక్ చేయడం లేదు. మన పూర్వీకులు వేటాడేటప్పుడు వాడిన ఆ ప్రాచీన ఇన్స్టింట్ ని ఈ మోడర్న్ ప్రపంచం మీ నుండి తీసేయడానికి ప్రయత్నించిన ఆ పవర్ఫుల్ ఫోకస్ ని మీరు తిరిగి నిద్రలేపుతున్నారు.
(19:28) అంతే ప్రపంచాన్ని శాసించే వాళ్ళని ఒకసారి గమనించండి. ఏ రంగంలో అయినా టాప్ స్థానంలో ఉన్నవాళ్ళు తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వాళ్ళు ఎవరు గ్రహంతవాసులు కారు. వాళ్ళకేమి మనకంటే డిఫరెంట్ బ్రెయిన్ ఏమీ లేదు. కానీ ఈ బుర్ర అనే ఈ యంత్రాన్ని ఎలా వాడాలో వాళ్ళకి బాగా తెలుసు. మన చుట్టూ వల్లిన ఈ డిజిటల్ పంజరం అనేది వాళ్ళు ముందే పసికట్టారు.
(19:48) అందుకే దాని యొక్క గేట్లని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చేశారు. ఆ వేటాడే సింహాన్ని పస్తూ ఉంచారు. వాళ్ళ ఫోకస్ ని తిరిగి సంపాదించుకున్నారు. కానీ ప్రస్తుతం మనం బతుకుతూ ఉన్న ఈ సిస్టం కి మీకు ఈ నిజాలు తెలియడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకు? ఎందుకంటే మీ బుర్ర సరిగ్గా పనిచేసి మీ ఫోకస్ అంతా మీ లక్ష్యం మీద ఉంటే వాళ్ళ ట్రాప్ లో ఇంకెవరు పడతారు వాళ్ళకి కావాల్సింది మీరు ఎదగడం కాదు మీ సమయాన్ని మీ ఫోకస్ ని నాశనం చేసి వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు.
(20:14) ఇదంతా వింటున్నప్పుడు మీకంటూ కూడా ఒక డౌట్ రావచ్చు. ఈ డిజిటల్ పంజరం నుండి బయట పడమని చెబుతూ ఉన్నది నువ్వే కదా మరి నేను నిన్ను చూస్తూ ఉన్నది కూడా ఆ ఫోన్ స్క్రీన్ మీదే కదా అలాగైతే నువ్వు కూడా ఈ సిస్టం లో ఒక భాగమే కదా అని అవును మీరు అనుకున్నది 100% కరెక్టే నేను ఈ సిస్టం ని వాడుకుంటున్నాను. కానీ ఇక్కడ ఒక చిన్న తేడా ఉంది.
(20:34) వాళ్ళు మిమ్మల్ని బానిసగా మార్చడానికి మీ జీవితంలో అసలు ఎదుగుదలే లేకుండా ఒక బ్రాయిలర్ కోడిలాగా ఒకే చోట వంచడానికి మీ డోపమైన్ ని హైజాక్ చేస్తున్నారు. కానీ ఆ పంజరం యొక్క తలుపుని ఎలా బద్దలు కొట్టాలో మీకు నేర్పించడానికి నేను ఇదే స్క్రీన్ ని ఒక ఆయుధంలా వాడుతున్నాను. ఈ అడవిలో తప్పిపోయిన మీకు బయటకి వచ్చే దారిని చూపించడానికి ఈ వీడియోలోనే చేస్తున్నాను.
(20:52) ఇదంతా విన్న తర్వాత మీలో ఇంకో ప్రశ్న కూడా రావచ్చు. అంటే ఈ టెక్నాలజీకి ఇప్పుడు మనం దూరంగా వెళ్ళిపోవాలా ఈ స్మార్ట్ ఫోన్స్ మొబైల్ యప్స్ అనేవి అంత చెడ్డవా ఎంటర్టైన్మెంట్ కి పూర్తిగా దూరంగా ఉండాలా అని కచ్చితంగా కానే కాదు నేను ఈ ఆధునిక ప్రపంచానికి టెక్నాలజీకి వ్యతిరేకం కాదు. నేను ఈ మొబైల్ యప్స్ కి ఇంటర్నెట్ కి వ్యతిరేకం కాదు.
(21:10) అసలు మీరు వాటికి వ్యతిరేకంగా అవ్వాల్సిన అవసరమే లేదు. నిజం చెప్పాలంటే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడానికి దాన్ని నాశనం చేసుకోవడానికి మధ్య చాలా సన్నని గీత ఉంటుంది. అది ఎలానో వివరిస్తాను. బాగా గమనించండి. వేల సంవత్సరాల క్రితం మనిషి మొదటిసారి నిప్పును చూసినప్పుడు ఏం జరిగిందో తెలుసా అది అడవులను దహించి వేసింది. ఆ భయంకరమైన మంటలను చూసి సగం మంది మనుషులు భయంతో గుహల్లోకి పారిపోయారు.
(21:32) నిప్పు అంటేనే నాశనం అని ఫిక్స్ అయ్యారు. ఎప్పటికీ దాన్ని ముట్టుకోకూడదని డిసైడ్ అయ్యారు. కానీ ఒక మనిషి మాత్రం పారిపోలేదు. ఆ నిప్పుని దగ్గరగా గమనించాడు. దాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ నిప్పు చుట్టూ రాళ్ళను పేర్చి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకున్నాడు. ఆ కంట్రోల్ చేసిన నిప్పుతోనే మనిషి వంట వండుకున్నాడు.
(21:51) చలికాలంలో తనని తాను కాపాడుకున్నాడు. అదే నిప్పుతో ఇనుముని కరిగించి ఆయుధాలు చక్రాలు తయారు చేశాడు. గుహల్లో తాక్కున్న మనిషి అద్భుతమైన నగరాలను నిర్మించే స్థాయికి వెళ్ళడానికి కారణం ఆ ఒక్క నిప్పే. నిప్పు అనేది మంచి కాదు చెడు కాదు అది ఒక శక్తి. దానిని చూసి పారిపోయిన వాడికి దానిని కంట్రోల్ లోకి తీసుకొని వాడుకున్న వాడికి మధ్య ఉన్న సన్నని గీతే మనిషి చరిత్రను మార్చేసింది.
(22:12) ఇప్పుడు మీరు మీ చేతిలో పట్టుకున్న ఆ స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రతి ఒక్కటి ఆ నిప్పు లాంటివే. ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో నాలెడ్జ్ మొత్తాన్ని మీ అరిచేతిలో పెట్టే ఒక అద్భుతమైన లైబ్రరీ ఎంటర్టైన్మెంట్ అనేది తప్పు కాదు. మీరు రోజంతా కష్టపడి మీ లక్ష్యం కోసం ఒక పెద్ద పనిని పూర్తి చేసిన తర్వాత మీ బ్రెయిన్ కి రిలాక్సేషన్ అవసరం.
(22:32) దానికి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఈ యప్స్ అన్నీ మన జీవితాన్ని ఈజీ చేయడానికి మనల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వచ్చిన పవర్ఫుల్ టూల్స్ కానీ ఆ సన్నని గీత ఎక్కడ ఉందంటే ఆ టెక్నాలజీని మీరు కంట్రోల్ చేస్తున్నారా లేదా ఆ టెక్నాలజీ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా అనే విషయంలో మీరు ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడానికి మీ బిజినెస్ పెంచుకోవడానికి లేదా ఒక పని తర్వాత ఉద్దేశపూర్వకంగా రిలాక్స్ అవ్వడానికి ఆ ఫోన్ ని వాడితే ఆ నిప్పుని వాడుకొని మీరు వంట వండుకున్నట్టు కానీ గంటల తరబడి ఏ ఆలోచన లేకుండా కనీసం మీరు ఏం చేస్తున్నారో కూడా మీకు తెలియకుండా ఒక జాంబీ లాగా ఆ స్క్రీన్ ఆటోమేటిక్ గా స్క్రోల్ చేస్తూ
(23:03) కూర్చుంటే ఆ నిప్పుతో మీరు మీ ఇంటినే తగలబెట్టుకున్నట్టు నేను మీ ఫోన్లు విసిరేసి అడవుల్లోకి వెళ్ళిపోమని చెప్పట్లేదు. ఆయుధం అత్యంత పదునైనది. అది మీ చేతుల్లో ఉండాలి దాని బటన్ మీ కంట్రోల్ లో ఉండాలి. మీరు ఆ ఆయుధం చేతిలో కీలు బొమ్మ కాకూడదు అని మాత్రమే చెబుతున్నాను. ఫ్లో లోకి వెళ్ళడం అంటే టెక్నాలజీని వదిలేసి సన్యాసిలా మారడం కాదు.
(23:21) ఆ టెక్నాలజీని మీ అటెన్షన్ ని ఒక దేవుడిలా మీరు శాసించడం. ఆ సన్నని గీతను దాటి పంజరంలో ఉన్న ఆ నిప్పుని మీ చేతుల్లోకి తీసుకోండి. గుర్తుపెట్టుకోండి మీరు చేసేది సరైన పనే అయితే అది ధర్మంగా ఉంటే సామ్రాజ్యాలు వాటంతటా అవే నిర్మించబడతాయి. ఇప్పుడు మీలో ఉన్న సింహం యొక్క బోను తాళాలు తీసివేయబడ్డాయి. మిమ్మల్ని ఛాలెంజెస్ లోకి రిస్క్ లోకి నెట్టే ఆ ఫ్రిక్షన్ మీకోసం ఎదురుచూస్తూ ఉంది.
(23:46) ఇది వేటాడాల్సిన సమయం.

No comments:

Post a Comment