The DEATH of Cinema in Theatres😭 (Tollywood Edition📉 )
Author Name:Movie Matters
Youtube Channel Url:https://www.youtube.com/@MovieMatters
Youtube Video URL:https://www.youtube.com/watch?v=LUogbD4YG4U
Transcript:
(00:00) ది నాస్టాల్జియా వర్సెస్ ది నైట్ మేర్ ఒకప్పుడు ఫ్రైడే వచ్చిందంటే తెలుగు స్టేట్స్ లో అదొక పండగ పొద్దున్నే ఫోర్ కి లేచి బెనిఫిట్ షోలు లేదా అదే టైం కి నూన్ షో కోసం థియేటర్ల దగ్గర క్యూ లైన్ లో కొట్లాటలు థియేటర్ ముందు కటౌట్లకు పాలాభిషేకాలు నీకు టికెట్ దొరికిందారా నాకు దొరికింది అని ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి కాళ్ళ ఎగరేసుకునే ఆ ఫీలింగ్ లోపల సీట్లలో కూర్చుంటే పక్కనోడితో హీరో ఎంట్రీ గురించి జరిగే డిస్కషన్ అది కేవలం ఒక సినిమా కాదు అది తెలుగు సినిమా ప్రేమికుడి కల్చర్ మన నర నరాలు లో పారుతున్న ఎమోషన్ కానీ కట్ చేస్తే వెల్కమ్ టు ఏప్రిల్ 2026
(00:36) సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి. ఒకప్పుడు ఈ టైంలో థియేటర్ల ముందు ఈగ వాలడానికి కూడా చోటు ఉండేది కాదు ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేసి చూడండి పచ్చగా కలకలలాడుతుంది మొత్తం పచ్చదనంతో అంటే కలెక్షన్స్ తో కాదు గ్రీన్ కలర్ అవైలబుల్ సీట్లతో గో గ్రీన్ నడుస్తుంది అన్నమాట అంటే 10 మంది కూడా లేక మార్నింగ్ షోలు మ్యాట్నీలు కాన్సిల్ అవుతున్న దారుణమైన పరిస్థితి అదొక స్మశాన నిశశబ్దం నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ మ్యాటర్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన గుండెకి సంబంధించిన విషయం అసలు సినిమా పిచ్చి సిటీస్ లలో ఉన్న తెలుగు ఆడియన్స్ థియేటర్లను ఎందుకు బ్యాన్ చేశారు
(01:15) మన డైరెక్టర్లు మర్చిపోయిన మ్యాజిక్ ఏంటి? ఈ డెత్ ఆఫ్ సినిమా ఇన్ థియేటర్స్ టాలీవుడ్ ఎడిషన్ వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటి? తప్పు ఎవరిది ఆడియన్స్ దా ప్రొడ్యూసర్లదా కక్కుర్తి పడుతున్న డిస్ట్రిబ్యూటర్లదా? ఈరోజు కొన్ని నిమిషాలు మీ టైం నాకు ఇవ్వండి. కొన్ని విషయాల్ని డీప్ గా వెళ్తూ మాట్లాడుకుందాం. లెట్స్ బిగిన్.
(01:35) ముందైతే మన మూవీ మేటర్స్ ఛానల్ ని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టుకోండి చాప్టర్ వన్ ది టైం లైన్ ఆఫ్ డిస్ట్రక్షన్ చాలామంది ఏమనుకుంటున్నారు అంటే జనాలకి ఓటిటీలు అలవాటు అయిపోయింది అందుకే థియేటర్లకు రావట్లేదు అని ఓటిటీ అనేది ఉంది ఇలా అవ్వడానికి గల కారణాలు బట్ ఓటిటీ వల్లే అంటే మటుకు అది పచ్చి అబద్ధం సో అలా గాల్లో మాటలు కాకుండా మనం ఫాక్ట్స్ తో మాట్లాడుకుందాం కోవిడ్ తర్వాత థియేటర్ లో తెరుచుకున్నప్పుడు అంటే 21, 22 టైంలో జనాలు ఆకలి మీద ఉన్న పులుల్లాగా ఎగబడి సినిమాలు చూశారు థియేటర్లో క్రాక్, అఖండ,
(02:11) పుష్ప, త్రిబుల్ఆర్, కార్తికేయ టు సీతారామం ఇలా చాలానే సినిమాల్ని థియేటర్లలో జనాలు బ్రహ్మరథం పట్టారు. కోవిడ్ టైం లో ఓటిటీ బాగా పెరిగింది చాలా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. కొత్త కొత్త మూవీస్ స్ట్రీమ్ అవ్వడం మొదలెట్టాయి. ఆఫ్టర్ కోవిడ్ కూడా మనోళ్ళు ఎగబడి థియేటర్ లో చూసిన అన్ని మూవీస్ కూడా ఓటిటీ లోకి వచ్చాయి.
(02:29) థియేటర్ లో కొన్నాళ్ళు ఉన్న తర్వాత అప్పుడు థియేటర్స్ లో చూశారు నెక్స్ట్ ఓటిటీ లోనూ చూశారు. మరి అప్పుడు లేని ఓటిటి ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు ఏమైంది అనేది చూస్తే అసలు పతనం 2024 లో మొదలైంది. 2024 ది వార్నింగ్ బెల్ ఆల్రెడీ హమనే బోల్ ఆల్రెడీ ఆల్రెడీ కాషన్ కియా ఇక్కడ మనం చూడాల్సింది హిట్ రేట్ కాదు బ్రేక్ ఈవెన్ అయింది హిట్ అయింది.
(02:56) అది కాదు ఇక్కడ పాయింట్ బికాజ్ హిట్ రేట్ చూస్తే బానే ఉంటది ఆఫ్టర్ కోవిడ్ ఎలాగ ఉందో అలాగే ఉంది కదా అని అనిపించింది 2024 25 కూడా 10 నుండి 15 సినిమాలు హిట్స్ అవ్వటం సో అది చూశారు అనుకోండి మీరు మోసపోయినట్టే గట్టిగా బికాజ్ పైన పటారం లోన లొటారం లాగా ఉంటది దీని వెనుక ఒకటి ఉందిలే కానీ అది చెప్తాను బట్ అంతకంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫుట్ ఫాల్స్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ అది మనం చూడాల్సింది అది చూస్తే మీకు క్లారిటీ వచ్చేసిద్ది 2011 నుంచి మాట్లాడుకుందాం కోవిడ్ కి ముందు వరకు అంటే 2011 నుంచి 2019 వరకు ఇందులో 2015 2017
(03:33) తీసేద్దాం బికాజ్ బాహుబలి ఉంది అక్కడ సో ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం మిగతా ఇయర్స్ లలో యావరేజ్ గా మన తెలుగు స్టేట్స్ లో ₹18 క్రోర్స్ ఉండేది పర్ ఇయర్ అంటే ఇండస్ట్రీ వర్గాల అంచనా ప్రకారం ప్రతి ఇయర్ సుమారు 18 క్రోర్స్ మూవీ టికెట్లు అమ్ముడిపోయేవి అప్పుడు 2015 అండ్ 2017 లో బాహుబలి హవా ఎక్కువ ఉంది కాబట్టి 2015 లో 21.5 క్రోర్స్ వచ్చాయి టోటల్ గా.
(03:57) ఇంకా 2017 అయితే 22.5 క్రోర్స్. స్టిల్ అన్ బీటబుల్ రికార్డ్ అది. అండ్ ఫ్యూచర్ లో కూడా కష్టం ఇంపాసిబుల్ అనొచ్చు. మరి కోవిడ్ టైం నుంచి చూస్తే 2020 కోవిడ్ టైం ఇక్కడ 3.5 క్రోర్స్ ఫుట్ ఫాల్స్ పడ్డాయి మన తెలుగు స్టేట్స్ లో, అంటే అదే ఎక్కువ అనొచ్చు ఆ టైం లో, ఇంకా 2021, 10.5 క్రోర్స్, థియేటర్స్ చాలా వరకు ఓపెన్ అవ్వటం మొదలయ్యాయి.
(04:21) ఫుట్ ఫాల్స్ పెరగటం స్టార్ట్ అయ్యాయి. 2022 13 క్రోర్స్ రాజమౌళ గారు త్రిబుల్ ఆర్ దింపారు సో మళ్ళీ కొద్దిగా పెరిగింది. 2023 12 క్రోర్స్ రాజమౌళ సినిమా లేదు సో యధావిధిగా తగ్గాయి 2024 11.5 క్రోర్స్ ఇంకా తగ్గాయి 2025 10.8 క్రోర్స్ ఇంకా ఇంకా తగ్గాయి. సినిమా హిట్ అని పోస్టర్ వేస్తున్నారు కదా అని జనాలు థియేటర్ కి గట్టిగా వస్తున్నారు అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే కోవిడ్ కి ముందు యవరేజ్ గా 18 క్రోర్స్ ఉన్న ఫుట్ ఫాల్స్ 2025 కి వచ్చేసరికి 11 క్రోర్స్ కి పడిపోవడం అనేది మనం చూడాల్సి ఉంది అది రియాలిటీ హిట్స్ బ్లాక్ బస్టర్స్ పైన చెప్పుకోవడానికే తప్ప అక్కడ చూస్తున్న
(05:03) ఆడియన్స్ తగ్గడం ఎప్పుడో మొదలైపోయింది. మరి ఎవరూ లేకుండా హిట్స్ బ్లాక్ బస్టర్స్ పడుతున్నాయా అని మీరు అనొచ్చు. 500 1000 క్రోర్స్ కొట్టిన సినిమాల దగ్గర ఫుట్ ఫాల్స్ బానే పడ్డాయి బికాజ్ బస్ హెవీగా క్రియేట్ అవుతుంది కానీ ప్రాబ్లం ఎక్కడ అంటే మిడ్ రేంజ్ అండ్ స్మాల్ బడ్జెట్ ఫిలిమ్స్ దగ్గర ఇవి పోస్టర్స్ లో హిట్స్ బట్ ఫుట్ ఫాల్స్ విషయంలో జరగాల్సిన దానికన్నా చాలా తక్కువ అదేంటి అనుకుంటున్నారా ఇక్కడే ఉంది అసలైన కిటుకు చాలా మందికి తెలియని సీక్రెట్ నేను రివీల్ చేయబోతున్నాను ఇప్పుడు ఓటిటి పాపులారిటీ పెరిగాక ఏమైందంటే ప్రొడ్యూసర్స్ ఓటిటి
(05:36) బిజినెస్ ని ఎక్కువ చేసుకోవడం స్టార్ట్ చేశారు. దానికి తోడు ఫోర్ వీక్స్ ఓటిటి అనేది ఒకటి యాడ్ అయింది. ఒకప్పుడు బడ్జెట్ కి తగ్గ థియేట్రికల్ బిజినెస్ జరిగితే దానికి బ్రేక్ ఈవెంట్ పెట్టేవాళ్ళు, బట్ ఇప్పుడు బడ్జెట్ తో కాదు, ఓటిటి డీల్ ఎంతకి లాక్ అయింది అనేది ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని థియేట్రికల్ బిజినెస్ ఎంత పెట్టుకోవాలని చూసుకుంటున్నారు మార్జిన్.
(05:56) ఫర్ ఎగ్జాంపుల్ తండేల్ అనే మూవీ తీసుకుందాం. బడ్జెట్ 80 క్రోర్స్, గీత ఆర్ట్స్ బ్యానర్ నుంచి బన్నీ వాస్ టేకప్ చేసిన హై బడ్జెట్ ఫిలిం ఇది. మరి అంత పెడితే ఎంత బిజినెస్ జరగాలి? బిఫోర్ కోవిడ్ ఒకటి ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. రుద్రమదేవి అనే మూవీ బడ్జెట్ 60 క్రోర్స్ దాని థియేట్రికల్ బిజినెస్ ఎంత అంటే అది కూడా అంతే 60 క్రోర్స్ కి అమ్ముకున్నారు.
(06:18) మరి లాభం ఎలా అని అడిగితే డిజిటల్ అండ్ సాటిలైట్ బిజినెస్ చేసుకున్నారు కాబట్టి అది చూసుకుంటారు లాభం కింద ఇఫ్ థియేట్రికల్ బిజినెస్ అనుకున్నట్టుగా జరిగితే మరి ఫైనల్ గా సినిమా ఎంత చేసింది అంటే 50 క్రోర్స్ షేర్ సో 10 క్రోర్స్ లాస్ అయింది యావరేజ్ అయింది. ఇప్పుడు ఇది తండేలు విషయంలో ఎలా జరగాలి 80 క్రోర్స్ బడ్జెట్ పెడితే 80 క్రోర్స్ అయినా అవ్వాలి థియేట్రికల్ బిజినెస్ ఒకప్పుడు అలాగే ఉండేది బడ్జెట్ కి మించి బిజినెస్ జరిగేది కంపల్సరీ ఆ బడ్జెట్ కి డబల్ మార్జిన్ లో ఎక్కువ వస్తే హిట్ కి వెళ్లే స్టేజి లో ఉంది లాగా కానీ ఎగ్జాంపుల్ గా తీసుకున్న తండేల విషయంలో
(06:49) జరిగిన బిజినెస్ ఎంతో తెలుసా 36 క్రోర్స్ అంతే అంటే 36 క్రోర్స్ షేర్ వస్తే సినిమా హిట్ అయిపోయినట్టే 80 క్రోర్స్ బడ్జెట్ అయితే 36 క్రోర్స్ కి థియేటర్ కల్ గా అమ్ముకున్నారు అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఓటిటి డీల్ తోనే చాలా వరకు జరిగిపోయింది. సో ముందుగా అనుకున్న దాంట్లో 40% ఆడియన్స్ వచ్చినా హిట్టు కొట్టేసినట్టే ఇదే ఇప్పుడు నడుస్తున్న బోగస్ బ్రేక్ ఈవెన్ హవా ఫోర్ వీక్స్ ఓటిటి డీల్ వల్ల ప్రొడ్యూసర్స్ సేఫ్ అయిపోతున్నారు.
(07:17) సగం పైన ఆల్రెడీ అక్కడే వచ్చేస్తున్నాయి. కొద్దిగా మంది చూస్తే చాలు సెట్ ఇక హిట్ అయిపోద్ది. ఆ కొద్దిమందికి తోడు టికెట్ ప్రైజులు పెంచుతున్నారు 2 టు త్రీ డేస్ లో హిట్ పోస్టర్లు దింపుతున్నారు. అందుకే చెప్పేది హిట్ రేట్స్ కాదు ఫుట్ ఫాల్స్ ఇంపార్టెంట్ అనేది. సినిమా హిట్ ది ఏముంది ఓటిటి డీల్ మంచిగా వస్తే చాలు 10 కోట్ల సినిమా కూడా రెండు కోట్ల బ్రేక్ ఈవెన్ అని పెట్టి టు డేస్ లో హిట్ అని పోస్టర్ దింపేస్తారు.
(07:39) కానీ సినిమా రిలీజ్ కి ముందే సాాటిలైట్ అండ్ ఓటిటీ డీల్స్ వల్ల ఆల్రెడీ ప్రాఫిట్ జోన్ లోనే ఉన్నారు అనే విషయం చాలా మందికి తెలీదు. అందుకే ఇప్పుడు మన కొన్ని ఫిలిమ్స్ ఇలా ఉంటున్నాయి. ఓటిటీ డీల్ బట్టి డిసైడ్ చేస్తున్నారు రైటింగ్ ఎలా పెట్టుకోవాలా అని గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే థియేటర్ లో సినిమా చూసే ప్రేక్షకుల కౌంట్ ఎప్పుడో పడిపోయింది 2024 నుంచి తూనే ఉంది పడిపోతూనే ఉంది ఇక ఈ 2026 చాలా దారుణంగా పడిపోద్ది చూడండి ఆల్రెడీ కనబడుతుంది కూడా ఇక్కడే ఇంకొకటి కూడా ఉంది అదేంటంటే 2025 ది ఫేక్ 100 క్రోర్ బాక్స్ ఆఫీస్ డ్రెస్సింగ్ ఎరా 2025 ఒక పీడకల ఈ
(08:20) సంవత్సరంలో ప్రొడ్యూసర్స్ సినిమా క్వాలిటీ పెంచడం మానేసి పోస్టర్స్ ని ముస్తాబు చేయడానికి 100 కోట్లు అని రంగులు బూసి వేసే ఫేక్ స్కామ్ ని పీక్స్ కి తీసుకెళ్లారన్నమాట. సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన థియేటర్లలో ఈగలు తోలుకుంటున్న సక్సెస్ పెట్టి బ్రేక్ ఈవెన్ కంప్లీటెడ్ 100 కోట్లు గ్రాస్ 186 క్రోర్స్ డే వన్ గ్రాస్ అని ఫేక్ పోస్టర్స్ వేశారు.
(08:40) ఓటిటి రైట్స్ ని ఆడియో రైట్స్ ని థియేటర్ కలెక్షన్లలో కలిపేసి ఫేక్ బబుల్ క్రియేట్ చేశారు. కానీ లోపల థియేటర్ ఓనర్లు కరెంట్ బిల్లులు కట్టలేక ఏడ్చారు. ఈ దెబ్బతో ఒక మిడ్ రేంజ్ సినిమా నిజంగా బ్రతకడం దాదాపు అసాధ్యమైపోయింది. ఇంకా 2026 ది ప్రెసెంట్ నైట్ మేర్. ఇక కరెక్ట్ గా ఈరోజు మాట్లాడుకుందాం సంక్రాంతి సీజన్ లో ఒకటి రెండు సినిమాలు సీజన్ లో వచ్చి గట్టెక్కాయి అది కేవలం పండగ అడ్వాంటేజ్ కానీ ఫిబ్రవరి మార్చ్ ఇప్పుడు ఏప్రిల్లో వారం వారం రిలీజ్ అవుతున్న 10 సినిమాల్లో కనీసం తొమ్మిది సినిమాలు కూడా జనాలకు తెలియట్లేదు. అంతెందుకు నా గురించే
(09:15) చెప్తాను. మొన్న మధ్య ఏప్రిల్ 17 ఫ్రైడే ఏవో రిలీజ్ అయ్యాయంట. త్రివీరుతది ఒక సినిమా కిరణ్భవరం ప్రొడ్యూస్ చేసిన ఒక సినిమా. పేర్లు కూడా తెలీదు నాకు. ఇంకా మిగతావి ఏమేమి ఉన్నాయో కూడా తెలీదు. నా పరిస్థితే ఇలా ఉంది ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి మీరే ఊహించుకోండి ఎందుకు అసలు జనాలు థియేటర్ వైపు ఎందుకు రావట్లేదు దీనికే చాప్టర్ ది మిడిల్ క్లాస్ బాయికాట్ ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా అయిపోయిందండి మాక్సిమం బాయ్కాట్ చేసేసినట్టే మిడిల్ క్లాస్ పీపుల్ ఏదైనా గాని వీళ్ళ మీద డిపెండ్ అవుద్ది.
(09:52) వీళ్ళు లేపేస్తే లేసిద్ది వీళ్ళు పడేస్తే పంట పడిపోద్ది. వేసుకునే గోల్డ్ నుంచి రుద్దుకునే సోప్ వరకు మిడిల్ క్లాస్ హవా మీదే డిపెండ్ అయిద్ది. సో థియేటర్లలో మన తెలుగు సినిమాలు అంతరించిపోయే స్టేజ్ కి రావడానికి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఎకనామిక్స్ ఒక సినిమా అనేది మిడిల్ క్లాస్ వాడికి ఒక సామాన్యుడికి ఉన్న ఒకే ఒక్క చీప్ అండ్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆ ఎంటర్టైన్మెంట్ ని కాస్త మన ప్రొడ్యూసర్లు ఎగ్జిబిటర్లు కాస్త అందరూ కలిసి లగ్జరీ కార్పొరేట్ వ్యాపారంగా మార్చేశారు.
(10:22) ఒక చిన్న క్యాలిక్యులేషన్ వేద్దాం. ఈ రోజు ఏప్రిల్ 2026 లో ఒక సగటు మిడిల్ క్లాస్ పర్సన్ తన పార్ట్నర్ తో ఇద్దరు చిల్డ్రన్ తో వీకెండ్ లో మల్టీప్లెక్స్ కి వెళ్ళాడు అంటే ఏంటి పరిస్థితి నాలుగు టికెట్లు యావరేజ్ గా 250 నుండి 300 వేసుకున్న టికెట్స్ కే 1200 స్వాహా ఇంటర్వెల్ లో పిల్లలకి ఒక పాప్కార్న్ రెండు కూల్ డ్రింక్స్ ఇప్పించాలి అదంతా మినిమం లో మినిమం 600 వేసుకుందాం ఇంక ట్రావెలింగ్ చార్జెస్ ఒక 200 వేసుకుందాం టోటల్ గా ఒక యావరేజ్ ఆ రొటీన్ సినిమా కోసం ఆ పర్సన్ తన జాబులోనుంచి 2000 తగలేయాలి ఆలోచించండి అదే 2000 కి వాళ్ళ ఇంట్లో ఒక నెలకి ఎన్ని
(10:57) సరుకులు వస్తాయి లేదంటే స్కూల్ ఎడ్యుకేషన్ వద్దులే గానీ ఇక్కడ ఎంటర్టైన్మెంట్ మాట్లాడుకుందాం కాబట్టి స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్స్ ప్రైసెస్ తో చూస్తే Amazon ప్రైమ్ వన్ ఇయర్ జియో హాట్స్టార్ వన్ ఇయర్ తీసుకోవచ్చు. మరి అంత డబ్బు పెట్టి వస్తాడా థియేటర్ కి రాడు ఎందుకు వస్తాడు? రిస్క్ తీసుకోడు. సినిమా బాగుంటే వెళ్దాంలే అనే కాలం పోయింది సినిమా అద్భుతంగా మైండ్ బ్లోయింగ్ గా ఉంటే తప్ప 2000 ఖర్చు పెట్టను అనే స్టేజ్ కి ఆడియన్స్ వచ్చేశారు.
(11:24) ఎప్పుడైతే ప్రొడ్యూసర్స్ గవర్నమెంట్ ని బతిమాలుకొని ఫ్లెక్సిబుల్ టికెట్స్ ప్రైసింగ్ పేరుతో రేట్స్ పెంచారో ఆ రోజు ఆ రోజే మిడిల్ క్లాస్ ఆడియన్స్ ని థియేటర్ కి దూరం చేసేసారు. అది ప్రొడ్యూసర్లు తవ్వుకున్న ఫస్ట్ గోయి. చాప్టర్ 3 ది ఫోర్ వీక్ ఓటిటి ట్రాప్. టికెట్ రేట్స్ పెంచారు సరే దానికి తోడు ప్రొడ్యూసర్లు దవ్వుకున్న రెండో పెద్ద గొయ్యి అలా చెప్పు మన దగ్గర మోసాల కుదరవు అదే ఫోర్ పీక్ ఓటిటి విండో కోవిడ్ కంటే ముందు సినిమా మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు టీవీలో వస్తుందో అని భయపడేవాళ్ళు అప్పట్లో ఒక సినిమా థియేటర్లో 50 రోజులు 100 రోజులు ఆడేది కానీ ఇప్పుడు ఆడియన్స్ బ్రెయిన్ ఎలా
(12:03) ట్యూన్ అయిపోయిందంటే శుక్రవారం సినిమా రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ రాంగానే మైండ్ లో క్యాలిక్యులేటర్ ఆన్ అయిపోతుంది. ఏముంది మనం ఆల్రెడీ Amazon ప్రైమ్ నెట్ ఆహా సబ్స్క్రిప్షన్స్ అంటూ వేలు కడుతున్నాం కదా మహా అయితే నాలుగు వారాలు నెల రోజులు ఆగితే అక్కడే ఫోర్ కే రిసొల్యూషన్ లో వస్తుంది. హాయిగా ఇంట్లో ఏసీ వేసుకొని ఇష్టమైన ఫుడ్ చేసుకొనో లేక స్విగ్గి జొమాటో లో ఆర్డర్ పెట్టుకొనో ఎక్కడ కావాలంటే అక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రొస్తుంటే పాస్ చేసుకొని రొటీన్ రొట్ట వస్తుంటే ఫార్వర్డ్ చేసుకొని మరీ చూసుకుందామని ఫిక్స్ అయిపోయారు. దీని
(12:35) ఎఫెక్ట్ ఏంటి ఒకప్పుడు బ్రహ్మాండంగా కలెక్షన్స్ తెచ్చే ప్యూర్ ఒరిజినల్ ఫ్యామిలీ డ్రామాలు, రొమాంటిక్ కామెడీలు, చిన్న బడ్జెట్ త్రిల్లర్లు అన్ని ఇప్పుడు థియేటర్ల దగ్గర వాష్ అవుట్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఇవి ఇంట్లో టీవీలో చూడాల్సిన సినిమా కదా థియేటర్ కి ఎందుకు అని ఒక బౌండరీ గీసేశారు. థియేటర్ కి వెళ్లడం అనేది ఇప్పుడు ఒక ఈవెంట్ అయిపోయింది అన్నమాట.
(12:58) ఆ ఈవెంట్ కి తగ్గ సినిమా వస్తేనే వెళ్తున్నారు చాలామంది లేకుంటే తక్కువకే అమ్ముకొని అక్కడ హిట్ అని వేసుకోవడం తప్ప నిజంగా ప్రేక్షకులు ఆదరించిన సినిమా లాగా అవ్వట్లేదు అది. చాప్టర్ఫోర్ ది డెత్ ఆఫ్ సింగిల్ స్క్రీన్స్ దీని రిజల్ట్ ఏంటో తెలుసా మన తెలుగు స్టేట్స్ లో అప్పట్లో ప్రతి ఊరిలో ప్రతి గల్లీలో ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటే ఇప్పుడు మాక్సిమం తీసేశారు మూతపడిపోతున్నాయి.
(13:21) 2026 కల్లా చూస్తే తెలంగాణ ఆంధ్రాలో వందల థియేటర్లు కళ్యాణ మండపాలుగా గోడౌన్స్ గా మారిపోయాయి. ఎందుకంటే వాళ్ళకి కరెంటు బిల్లులు స్టాఫ్ శాలరీ కూడా రాని స్థాయిలో కలెక్షన్స్ పడిపోయాయి. డిస్ట్రిబ్యూటర్ల మాఫియా పర్సెంటేజ్ లు ఇవ్వక థియేటర్ల ఓనర్లు నష్టపోతున్నారు. సింగిల్ స్క్రీన్స్ పోతే టాలీవుడ్ కి వచ్చే నష్టం ఏంటి అని మీరు క్వశ్చన్ చేయొచ్చు.
(13:41) మెయిన్ థింగ్ అక్కడే ఉంది మరి. అది చేయడం వల్ల మాస్ ఆడియన్స్ ఎలిమినేట్ అయిపోతారు, ఎలిమినేట్ అయిపోయారు కూడా. మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ అని రోజువారి కూలీలు వీళ్ళు మల్టీప్లెక్స్ కి వెళ్లి 300 పెట్టి సినిమా చూసే అంత బడ్జెట్ ఉండదు. సో వాళ్ళు కంప్లీట్ గా థియేటర్లకి దూరమైపోయారు. మిడ్ రేంజ్ సినిమా కానీ చిన్న సినిమా గాని వస్తే సింగిల్ స్క్రీన్స్ లలో నేల బెంచ్ అంటే థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇవి అంతా ఫిల్ అయిపోయాయి.
(14:07) నాకు ఇంకా గుర్తు ఇంకా ఈ సమ్మర్ టైంలో అయితే ఆ ఎండకి తట్టుకోలేక పొద్దున పని చేసుకొని మాట్నీకి నేలలో బెంచో టికెటో కొనుక్కొని ఏసీ కోసం థియేటర్ కి వెళ్ళేవాళ్ళు కొసేపు హాయిగా సరదాగా ఏదో ఒకటి చూస్తూ చిల్లు అవుతూ ఉండొచ్చు అని ఇప్పుడు నేల బెంచ్ ఎక్కడ ఎక్కడో ఒక చోట మొత్తం మల్టీప్లెక్స్ అయిపోయాయి. వీళ్ళ దగ్గర ఏమైంది చూద్దామని థియేటర్ కి వెళ్తే సారీ సార్ ఆడియన్స్ లేరు షో క్యాన్సిల్డ్ అని బోర్డ్స్ పెడతారు.
(14:31) మిడ్ రేంజ్ స్మాల్ ఫిలిమ్స్ కి కూడా అంత ప్రైసెస్ పెడితే ఎవరు వచ్చేది రాకపోగా వచ్చినోళ్ళకి కూడా ఇయ్యారు. ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని ఎన్ని దారుణాలు కొన్నిసార్లు నాకే అనిపించేది ఆన్లైన్ లో చూసుకుంటాను ఏమన్నా బుక్ అయ్యాయా అని లేకపోతే వెళ్ళడం కూడా మానేసాను చాలా వరకు బికాజ్ చాలా ఎక్స్పీరియన్స్ ఇక్కడ అంతా కష్టపడి ఆ ఎండకి ట్రాఫిక్ కి పొల్యూషన్ కి గురై వెళ్తే ఆడియన్స్ లేరు షో క్యాన్సిల్ అని చెప్పేసి ఈజీగా బోర్డు పెట్టేస్తాడు విసుగ వచ్చేసేది నాకైతే సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్ గా అవ్వడం వల్ల జరిగిన అనదర్ డిజాస్టర్ ఇది మాస్ ఆడియన్స్
(15:05) లేని టాలీవుడ్ ప్రాణ ప్రాణం లేని దేహంతో సమానం. చాప్టర్ఫైవ్ ది క్రియేటర్స్ ఫాల్ట్ టిక్టాక్ అటెన్షన్ స్పాన్ అండ్ లేజీ రైటింగ్ ఇంత జరుగుతున్న జనాలు మనల్ని బ్యాన్ చేస్తున్న మన మేకర్స్ అస్సలు ఆలోచించట్లేదు. ఎవ్వరికీ ఎక్కట్లేదు. ఎందుకంటే ప్రాబ్లం, ప్రైజెస్, ఫోర్ వీక్ ఓటిటి బ్రేక్ ఈవెన్ బోగస్ మాత్రమే కాదు. అసలు ప్రాబ్లం మన టాలీవుడ్ రైటింగ్ రూమ్స్ లో ఉంది.
(15:31) మనం ప్రెజెంట్ రీమేక్స్ చేయట్లేదు. కొత్త కథలే రాస్తున్నాం కదా అని డైరెక్టర్లు కాళ్ళు ఎగరేస్తున్నారు. కానీ ఆ ఒరిజినల్ కథల్లో ఒరిజినాలిటీ ఎక్కడ ఉందంటే ఫేస్ లల్లో బ్లాంక్ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి. మన డైరెక్టర్లు ఏసీ రూమ్లలో కూర్చొని ట్wిitటter లో ట్రెండ్స్ చూసి వాళ్ళేదో హాలీవుడ్ రేంజ్ క్రియేటర్స్ అనుకుంటున్నారు.
(15:50) పక్కా లోకల్ ఒరిజినల్ ఎమోషన్స్ వదిలేసి ప్ాన్ ఇండియా పిచ్చిలో పడిపోయారు. అందరికీ నచ్చాలని చెప్పి ఏ స్టేట్ కి కనెక్ట్ అవ్వని కిచిడీ కథల్లా రాస్తున్నారు. 10 నిమిషాల్లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ 40 నిమిషాల్లో సంబంధం లేకపోయినా 10 మందితో గాలిలో లేచే ఇంటర్వెల్ ఫైట్. సెకండ్ హాఫ్ లో ఒరి ఫ్లాష్ బ్యాక్ ఆర్ ఎల్స్ మార్పు మంచిదే అని మాడిపోయిన మసాలా దోస.
(16:10) ఇంకేమన్నా అంటే ఇంటర్నేషనల్ డాన్ రకరకాల రక్తపాతం 25 ఏళ్ల క్రితం వచ్చిన కొన్ని రొట్ట ఫార్ములాలు పట్టుకొని ఇంకా వేలాడుతున్నారు. దానికి తోడు ఇప్పుడున్న యూత్ మైండ్ సెట్ మారిపోయింది రీల్స్ ట్రెండ్ పెరగడంతో అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. వాళ్ళు 30 సెకండ్లు Instagram రీల్స్ కి అలవాటు పడిపోయారు నార్మల్ గా ఉన్న సినిమాని కూడా లాగ్ లాగా ఫీల్ అవుతున్నారు.
(16:31) ఇంకా స్లో పేజింగ్ కి వస్తే సినిమా చూడటం ఆపేసి ఫోన్ తీసి స్క్రోల్ చేస్తున్నారు. ఆ భయంతో మన డైరెక్టర్లు క్యారెక్టర్ డెవలప్మెంట్ రాయటమే మానేశారు. లాస్ట్ టైం మన తెలుగు సినిమాలో క్యారెక్టర్ డెవలప్మెంట్ ని విట్నెస్ చేసిందంటే గాల్లోకి చూడాల్సిందే ఎప్పుడా అని మొదటి ఫ్రేమ్ లోనే గన్ కాల్చాలి లేదా పంచ్ డైలాగ్ వేయాలి. ఆ వైలెన్స్ బ్లడ్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకి రావడం మానేశారు.
(16:54) ప్యూర్ ఒరిజినల్ త్రిల్లర్ తీసుకున్న మధ్యలో కమర్షియల్ ఎలిమెంట్స్ అని చెప్పి ఐటెం సాంగ్ అని పెట్టి కథని చంపేస్తున్నారు. ఏదేమైనా ఒరిజినల్ లొకేషన్స్ ఉండవు సోల్ ఉండవు ఆ అంతా ప్లాస్టిక్ సీట్స్ లలో ఒక ఫేక్ ఎమోషన్ వేసి సినిమాలు తీస్తున్నారు. చాలా వరకు ఇవే ఇలాంటి సోల్ లేని స్క్రిప్ట్స్ కోసం జనాలు 2000 ఖర్చు పెట్టడానికి థియేటర్ కి ఎందుకు వస్తారు.
(17:13) ఫైనల్లీ కంక్లూజన్ ది వేకప్ కాల్. చివరగా చెప్పొచ్చేది ఏంటంటే డెత్ ఆఫ్ సినిమా ఇన్ థియేటర్స్ అనేది ఆడియన్స్ కి ఉన్న సినిమా పిచ్చి చచ్చిపోయిందని కాదు మీరు తీసే వరస్ట్ మీ ఫేక్ 100 క్రోర్ పోస్టర్స్ ని మేము ఇక భరించలేమని జనాల నుంచి వస్తున్న ఒక చివరి వార్నింగ్ బెల్ థియేటర్లకు మళ్ళీ కలకలలాడాలంటే ఈ సిస్టం మారాలి థియేటర్ రేట్లు సామాన్యుడికి అందుబాటులో రావాలి వందల వందలు దోపిడీ ఆగాలి ఓటిటి విండో రిలీజ్ అయిన నాలుగు వారాలకే కాకుండా కనీసం ఎనిమిది వారాలు పెంచాలి అప్పుడే జనాల్లో ఫోమో అనేది క్రియేట్ అవుతుంది.
(17:49) ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ రైటింగ్ అన్నిటికంటే ముఖ్యంగా మేకర్స్ తమ ఏసీ రూముల్లో నుంచి బయటికి రావాలండి. ట్రెండ్స్ ని నమ్మడం మానేసి పబ్లిక్ పల్స్ ని పట్టుకోవాలి. కోట్లకి కోట్లలో హీరోలకు అడ్వాన్సులు ఇచ్చే బదులు బౌన్ స్క్రిప్ట్స్ రాసే నిజమైన తెలుగు రైటర్స్ కి లక్షలు ఇవ్వండి. ఈ సిస్టం మారకపోతే మరో ఐదేళ్లల్లో థియేటర్ కి వెళ్లి సినిమా చూడడం అనేది కేవలం ఒక జ్ఞాపకంగా హిస్టరీ బుక్స్ లో చదువుకునే మేటర్ గా మిగిలిపోతుంది.
(18:16) ఈరోజు ఉన్న స్మశాన నిశశబ్దం రానున్న నెలల్లో కొన్ని ఒరిజినల్ కంటెంట్ తో మళ్ళీ పండగలా మారాలని కోరుకుందాం ఎలా ఉందిరా యస్ ఉంది అదే మనం ఇందాక కార్లో ఉన్న పాట సేమ్ సార్. ఆ సీడ్ ఇస్తే మనోళ్ళు చరణాలు వేసేస్తారు. బాయ్ ఎందుకు ఏడుస్తావ్? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది? దీనిపై మీరేమంటారు అసలు మీరు థియేటర్ కి వెళ్ళడం ఎందుకు తగ్గించేశారు లేదా మీ ఏరియాలో రీసెంట్ గా మూతపడ్డ థియేటర్ పేరేంటో కింద కామెంట్స్ లో చెప్పండి.
(18:43) ఈ ఇన్వెస్టిగేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని ప్రతి సినిమాల వారికి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దిస్ ఇస్ మూవీ మేటర్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్ జైహింద్.
No comments:
Post a Comment