భక్తి: మీలోని 'నేను' అనే భావం కరిగిపోయిన వేళ | Devotion When You Dont Matter Anymore
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZsA88Kbx2y8
Transcript:
(00:01) భక్తి అనేది చాలా మధురమైన జీవన విధానం అని మీరు చెప్తారు. ప్రకృతి అంత సులభంగా తనను తాను ఆవిష్కరించుకోదని కూడా చెప్పారు. ఆ ప్రకృతి తనను తాను అంత సులభంగా ఆవిష్కరించుకోదని చెప్పారు. సత్యాన్ని తెలుసుకోవాలంటే గుండెలు పగిలే సాధన కావాలంటారు కాబట్టి నా ప్రశ్న ఏంటంటే భక్తి సరిపోతుందా? మీరు ఈ ప్రశ్నని ఒక స్త్రీగా అడుగుతున్నారా లేక బ్యాంకర్ గానా? స్త్రీగా మీరు స్త్రీ అయితే భక్తి సరిపోతుంది.
(00:35) ఒకవేళ మీరు బ్యాంకర్ అయితే మీచే తలబద్దలయ్యేలాగా గుండెలు పగిలేలా సాధన చేయాల్సి ఉంటుంది. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక ప్రక్రియ మీకు ఎంత కష్టంగా ఉండబోతుంది అన్నది మీ వల్లే నిర్ణయించబడుతుంది. ప్రకృతి వల్ల కాదు మీ గురువు వల్ల కాదు. ప్రకృతి లేదా ఈ సృష్టి లేదా సృష్టికర్త ఇంకా మీ గురువు దీన్ని వీలైనంత సులభంగా వీలైనంత సరళంగా వీలైనంత త్వరగా ఎలా చేయగలరో చూస్తున్నారు.
(01:13) ఎందుకంటే మీరు ఎక్కువ సమయం తీసుకుంటే అది మీ జీవితం వృద్ధ అవ్వడం గురించి కాదు అది నా జీవితం వృద్ధ అవ్వడం గురించి మీరు సాధించకపోతే అది మీరు విఫలం అవ్వడం గురించి కాదు అది నేను విఫలం అవ్వడం గురించి చూడండి నాకు ఓడిపోవడం అంటే ఇష్టం ఉండదు. మీకు అది తెలుస్తుంది కదా ఓడిపోయే పక్షాన ఉండటం నాకు ఇష్టం ఉండదు మీరు అది చూడగలరు నేను వీధిలో డ్రైవ్ చేయడం మీరు చూడాలి ఓడిపోయే పక్షాన ఉండటం నాకు ఇష్టం ఉండదు.
(01:49) మీరు ఇక్కడ ఒక స్త్రీగా ఉంటే అది చాలా సరళం కానీ మీరు ఎన్నో ఇతర గుర్తింపులతో ఉన్నారు. ఫారెన్ బ్యాంకులని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ హిడెన్ క్లాసెస్ ఉంటాయి. మనం సంతకం చేసే ప్రతి ఒప్పందంలో ఒక రహస్య శరత్ ఉంటుంది. మైక్రో ప్రింట్ లో చదవడానికి జీవితకాలం పడుతుంది. [నవ్వు] అందుకే చాలామంది సంతకం చేసేస్తారు చదవకుండానే కాబట్టి ఆ రహస్య శరతులన్నిటిని తుడిచి పెట్టేసేయండి.
(02:28) ఇక్కడ కేవలం ఒక స్త్రీగా ఉండండి అప్పుడు అది చాలా సరళం. మీరు ఇక్కడ కేవలం ఒక పురుషుడిగా లేదా కేవలం ఒక స్త్రీలా ఉంటే అంతే అవసరమయ్యేది. ఈ మాటలు ఈ నాన్సెన్స్ చెత్త ఇవేవి అవసరం లేదు నేను ఇలా చేస్తే చాలు మీరు అలా ఉండాలి. కాబట్టి భక్తి అనేది మేదస్సుకున్న మరొక పార్శ్వం ఆ దురదృష్టవశాత్తు నేటి ప్రపంచం దీన్ని కోల్పోయింది. ఇప్పుడు వయలిన్ వాయిస్తున్న చిన్న కుర్రాడు అతని వయసు కేవలం 16 ఏళ్ళు అంతే మేధావి అయిన అతని తండ్రికి పెద్ద దూరంలో ఏమీ లేడు.
(03:11) అతని తండ్రి ప్రతిభకి పెద్దగా వెనుకుబడి లేడు. అతను దగ్గరలోనే ఉన్నాడు. ఎంతో కాలం పట్టదు ఆ అబ్బాయి అందుకోవడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అది వచ్చింది శిక్షణ వల్ల కాదు అది వచ్చింది కేవలం సరళమైన భక్తి వల్ల ఎలా కూర్చున్నాడో చూసారా వాళ్ళ నాన్న పక్కన ఎలా కూర్చున్నాడో చూడండి. అపారమైన ప్రేమ భక్తితో తన కళ్ళను చూడండి. వాళ్ళ నాన్న వంక ఎంతటి ప్రేమ భక్తితో చూస్తాడో అలా ఉన్నప్పుడు అభ్యాసం పూర్తిగా భిన్నమైన రీతిలో జరుగుతుంది.
(03:47) అయితే ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన సాధువు ఉండేవారు. ఈ సాధువు గురించి కనీసం ఒక చిన్న పుస్తకం కూడా లేని ఇల్లు ఆంధ్రప్రదేశ్ లో ఉండదు. ఆయన పేరు వేమన. ఆయన పేరు యాక్చువల్లీ ఆయన పేరు ఇంకేదో ఉండేది ఆయన్ని వేమన అని పిలిచేవారు. ఆయన పేరు వేమన. ఆయన తన గురువు గారితో ఉండేవారు. అయితే ఈ అబ్బాయి కొంచెం మందబుద్ధి మందకుడి సహచరుడు చాలా అమాయకుడు ఏది సరిగ్గా అర్థం చేసుకోలేడు.
(04:27) నా దగ్గర అలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు ఏదైనా సాధించగలరు. ఈ తెలివైన వాళ్లే తాము మేధోపరంగా చాలా స్మార్ట్ అనుకునే వాళ్లే ఈశాలో గందరగోళానికి గురవుతూ ఉంటారు. అమాయకులు గొప్పగా చేస్తున్నారు వేరేవాళ్ళు అతని పనికి రానివాడు అని అనుకోవచ్చు. బట్ జస్ట్ ద రిసల్ట్ ఇస్ క్రియేటింగ్ ఇట్స్ ఫెంటాస్టిక్ కానీ అతను సృష్టించుకున్న ఫలితాన్ని చూడండి అద్భుతం కాబట్టి ఇతను ఒక అమాయకుడు అందరూ అందరి చెలోక్తులకు ఇతనే కేంద్రబిందువు ఒకరోజు కానీ గురువుగారు ఈ అబ్బాయి పట్ల దయతో ఉండేవారు. ఇతను ఇతరులాగా తెలివైనవాడు
(05:11) కాదని ఒకరోజు గురువుగారు ఒక ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్ళాల్సి ఉంది. ఆ ఆయన స్నానం కోసం నదికి వెళ్ళారన్నమాట. అప్పుడు బట్టలు మడత పెట్టి ఆ అబ్బాయితో బట్టలు చేతిలో పట్టుకో ఇక్కడే నిలబడు కింద పెట్టకు అని చెప్పారు. ఎందుకంటే నేల తడిగా ఉంది బట్టలు మురికయపోతాయి కింద పెట్టకు పట్టుకొని ఉండు అంతే అన్నారు. అయితే గురువుగారు స్నానం చేసి రావడానికి వెళ్ళారు బయటికి వచ్చేసరికి అక్కడ ఆ అబ్బాయి కింద పెట్టేసాడు.
(05:47) బట్టలన్నీ మూరికైపోయాయి. అతను కింద పెట్టేసాడు ఎందుకంటే గురువుగారు ఇలా చూసేసరికి ఆయనకి ఏదో కావాలనుకొని కింద పెట్టేసి గురువుగారి దగ్గరికి పరిగెత్తాడు. అమాయకుడు [గురకలు] ఒక్కసారి ఒకటే అతను ఒకేసారి రెండు చేయలేడు అన్నమాట. ఇవేమో రెండు విషయాలు కదా బట్టలు గురువు రెండు అతనికి కష్టం ఆ ఇక అది చూసిన గురువుగారు ఆయన ఎక్కడికో వెళ్ళాలి బట్టలేమో పాడైపోయాయి పదే పదే చెప్పారు ఆయన కింద పెట్టొద్దు కింద పెట్టొద్దు అని అయినా కూడా పెట్టేశారు.
(06:26) దాంతో ఆయన చిన్న చాక్ పీస్ ఇచ్చి అతనితో మూర్ఖుడా నువ్వు ఇంకేమి చేయలేవు ఇక్కడ కూర్చొని ఈ రాయి మీద రామ రామ రామ అని రాయి ఇంకేం వద్దు ఇంకేమి చేయలేవు ఇది మాత్రం చెయ్యి నీపై అనుగ్రహం కలుగుతుందేమో చూద్దాం ఇక్కడే కూర్చొని రామ రామ రామ అని రాయి ఒకే చోట మళ్ళీ మళ్ళీ రాయి అని చెప్పారు. ఆ అబ్బాయికి చాలా సిగ్గు చేయట అనిపించింది చాలా బాధపడ్డాడు ఎందుకంటే తన గురువుని నిరాశ పరిచాడు ఆయన ఎన్నో సార్లు చెప్పారు heక కానీ ఎలాగో తనకు అది ఎక్కలేదు.
(07:06) సరే రాయడం మొదలు పెట్టాడు గురువుగారు హడావిడిగా వెళ్ళిపోయారు. రోజంతా గడిచాక గురువుగారు సాయంత్రం తిరిగి వచ్చారు. మొదట ఆ అబ్బాయి గురించి అడిగారు ఎక్కడున్నాడు అని ఎందుకంటే అంత కఠినంగా మాట్లాడినందుకు బాధపడుతున్నారు. అతను ఎక్కడా కనిపించలేదు. ఓ నేను రామ అని రాయమన్నాను కదా తర్వాతి ఆదేశం ఇవ్వలేదు బహుశా అక్కడే ఉండిఉంటాడు అని అక్కడికి వెళ్ళారు.
(07:38) ఆ అబ్బాయి ఇంకా రామా అని రాస్తూనే ఉన్నాడు. చాక్ పీస్ ఎప్పుడో అరిగిపోయింది. అతని చూపుడు వేలు బొటని వేలు ఇక్కడిదాకా అరిగిపోయాయి అయినా ఇంకా రామ రామ రామ అని రాస్తూనే ఉన్నాడు. అప్పుడు గురువుగారు అతన్ని కౌగలించుకున్నారు. ఈ అబ్బాయి ఎన్నో నాకు తెలీదు దీని గురించి తెలిసిన వాళ్ళు చెప్పాలి అతను వందల కొద్ది అద్భుతమైన పద్యాలు రాశాడు.
(08:07) అవి ఈరోజుకి కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ఈరోజు కూడా వేమన పద్యాల పుస్తకం లేని తెలుగు ఇల్లు ఉండనే ఉండదు. దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది ఆ పుస్తకం. చదవడం రాయడం వచ్చిన ఎవరి ఇంట్లోనైనా ఉంటుంది. దాదాపు అందరికీ ఈ పద్యాలు పరిచయమే అద్భుతమైన కవిత్వం తన భక్తిలో నుండి ఆసువుగా చెప్పేసాడు. భక్తి చేయగలిగేది అదే ఎందుకంటే భక్తి అనేది మేదస్సుకు మరో పార్శ్వం.
(08:36) భక్తి అంటే ఈ తెలివి ఉండడం మరింత పెద్ద మేదస్సు ఉంది అని అర్థం చేసుకొని మీ చిన్నపాటి తర్క బుద్ధిని పక్కన పెట్టడం నేర్చుకోవడం అదే భక్తి. భక్తి అంటే రోజు పూజ చేసేయడం అది ఇది చేయడం కాదు సింపుల్ గా చెప్పాలంటే భక్తిలో జీవంతో మీరు మమేకం అవ్వడం ఎంత సంపూర్ణంగా ఉంటుందంటే ఇక మీరు కూడా ముఖ్యం కారు. మీరు చేపట్టిన పనిలో మీ మమేకం ఎంత సంపూర్ణంగా ఉంటుందంటే మీరు ఎవరు అన్నది ముఖ్యం అవ్వదు అప్పుడు మీరు భక్తులు భక్తి అంటే మిమ్మల్ని మీరు పక్కన పెట్టారు అదే కదా భక్తి దానికంటే గొప్ప మేధస్సు లేదు దానికంటే గొప్ప మాధుర్యం లేదు ఒక భక్తుడికి తెలిసిన
(09:21) మాధుర్యం ఏ ప్రేమికుడికి తెలియదు. ఏ సుఖాన్ని వెతికే వారికి తెలియదు మీరు స్వర్గానికి వెళ్ళినా మీకు తెలియదు స్వర్గం ఒక చెత్త ప్రదేశం నన్ను నమ్మండి మీరు ఇక్కడే చూసుకోవడం మంచిది. ఎటువంటి వాళ్ళు స్వర్గానికి వెళ్ళారో మీకు చెప్పారు. అటువంటి వాళ్ళతో అది గొప్ప ప్రదేశం అవుతుందా? మేఘాల మీద తేలియాడాలని అనుకునే వాళ్ళు అది వాళ్ళకి గొప్ప ఆనందం 12 మంది కన్యలు గొప్ప ఆహారం పానీయం గురించి ఆలోచించేవాళ్ళు మీరు శాశ్వతంగా వాళ్ళతో ఉండిపోవాలనుకుంటున్నారా వీళ్ళతో ఇరుక్కుపోవాలనుకుంటున్నారా కేవలం నదుల్లో నుంచి తాగడం కోసం ఎంతో దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వాళ్ళతో
(10:06) దయచేసి అక్కడికి వెళ్ళకండి ఇది గొప్ప ప్రదేశం అలాగే మీకు తర్వాతి ప్రదేశం ఉండకూడదు. [సంగీతం]
No comments:
Post a Comment