Wednesday, April 1, 2026

చర్మపు రంగు ఆధ్యాత్మిక ఎదుగుదలని ప్రభావితం చేస్తుందా? | Does Skin Color Impact Spiritual Growth

చర్మపు రంగు ఆధ్యాత్మిక ఎదుగుదలని ప్రభావితం చేస్తుందా? | Does Skin Color Impact Spiritual Growth

Author Name:Sadhguru Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=x0Z3cpTIJGA



Transcript:
(00:00) చర్మపు రంగు నా ఆధ్యాత్మికతపై ప్రభావం చూపిస్తుందా నేను ముందే చెప్పినట్లుగా అది చాలా జాత్య అహంకారంతో కూడిన ప్రశ్న అసలు ఉద్దేశం ఏమిటంటే ఎప్పుడూ స్పృహతో ఉండటం అదేమిటంటే మీ భౌతిక శరీరం మీరు నడుస్తున్న ఈ భూమికి కేవలం ఒక పైపొర మాత్రమే అని మీ మనసు కూడా అంతే కాబట్టి ముఖ్యమైన విషయం మీ శరీరం ఇంకా మనసు మీకు అడ్డంకిగా మారకూడదు [సంగీతం] ఈ ప్రశ్న ఇసాబెల్ నుండి సద్గురు వివిధ రంగుల దుస్తులు ధరించడం వల్ల కలిగే ప్రభావం గురించి మీరు మాట్లాడటం విన్నాను.
(00:47) అలాగే ఈసాలోని సన్యాసులు భారతదేశంలో కాషాయం ధరిస్తారు. అది వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో సహాయపడుతుందని నేను ఒక ప్రశ్న అలగాలనుకుంటున్నాను. కొన్ని రంగులు ధరించడం మన ఆధ్యాత్మిక ఎదుగుదలపై ప్రభావం చూపిస్తున్నప్పుడు చర్మపు రంగు మన ఆధ్యాత్మిక ప్రయాణంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇది జాత్యహంకారంతో కూడిన ప్రశ్న. [నవ్వు] నిజానికి భారతదేశంలోని సన్యాసులు కాషాయ రంగు బట్టలు ధరించరు.
(01:31) వాళ్ళు ఎక్కువగా తమ బట్టలకు మట్టితో రంగు అద్దుకుంటారు. ఎర్ర మట్టితో ఎందుకంటే మేము ఇక్కడ ఇలా జీవించాలనుకుంటున్నాం. ఎప్పుడు ఇది అర్థం చేసుకుంటూ అస్తిత్వపరంగా ఇంకా అనుభూతిపూర్వకంగా ఇది అర్థం చేసుకుంటూ జీవించాలనుకుంటున్నాం. అదేమిటంటే నా శరీరం అనేది కేవలం ఒక పైపొర మాత్రమేనని. కాబట్టి భారతదేశంలో ఒక సంప్రదాయం ఉంది. అదేమిటంటే వెళ్లి పుట్టల దగ్గర ధ్యానం చేయడం ప్రపంచంలోని ఈ ప్రాంతంలో నేను ఎక్కడా అలా చూడలేదు పుట్టలు ఇలా పెరగడం ఇక్కడ ఉన్నాయా
(02:18) ఈ ప్రాంతంలో నేను ఎక్కడా చూడలేదు. కానీ దక్షిణ భారతదేశంలో దేశమంతటా సాధారణంగా ఉష్ణమండల దేశాల్లో పుట్టలు అలా పెరుగుతాయి. అలాగే ప్రజలు ఇది నమ్ముతారు లేదా చాలా కాలంగా నమ్ముతూ వచ్చారు. ఇవి పాము పుట్టాలని నమ్మేవారు నిజానికి పాములు కొంత ప్రోటీన్ వెతుక్కుంటూ లోపలికి వెళ్తాయి. ఎందుకంటే చెదపురుగులు ప్రోటీన్ తో నిండి ఉంటాయి.
(02:47) ఎందుకంటే అవి నిర్మించే ఈ పుట్టనంతటిని వాటి లాలాజలంతో కలుపుతాయి. అది చాలా నాణ్యమైన ప్రోటీన్ చాలా చాలా నాణ్యమైన ప్రోటీన్ మట్టితో కలిపి ఎలాంటి వర్షాకాలాన్నైనా తట్టుకునేలా దాన్ని నిర్మిస్తాయి. ఎలాంటి వాతావరణాన్న అయినా సరే నిర్మాణపరంగా చూస్తే అది అద్భుతం. అలాగే ఒక విధంగా చెప్పాలంటే మా భవనాలు కూడా భారతదేశంలోని ఈషా యోగ సెంటర్ లో అచ్చం ఉట్టలాగే డిజైన్ చేయబడ్డాయి.
(03:23) నేను ఇంజనీరింగ్ నేర్చుకున్నది వాటి నుండే ఎందుకంటే ఎన్నో కారణాల వల్ల స్వయంగా నేనే పుట్టల్లోకి వెళ్ళేవాడిని ఆ కానీ ఏమంటారంటే కొన్ని సురంగాలు 700 కిలోమీటర్ల వరకు వెళ్తాయి. ఒక చెదపురుగు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటిని కనిపెట్టి అక్కడికి వెళ్ళగలదు స్వరంగం తవ్వుకుంటూ ఆ చాలామంది ఎలాంటి నీటి జాడను పసిగట్టే సామర్థ్యాలు లేని వాళ్ళకు
(04:08) పుట్ట ఎక్కడుంటే అక్కడ నీరు ఉంటుందని నమ్మే దారుణ ఉంటుంది. ఆ పై బావులు తవ్వుతారు పుట్ట దగ్గరలో కానీ అది 700 km దూరంలో ఉండొచ్చు. ఇది చాలా మందికి జరిగింది అదేమిటంటే వాళ్ళకు ఎలాంటి నీరు దొరకలేదు అయితే కొన్నిసార్లు ఇది నిజమే. కాబట్టి అసలు ఉద్దేశం ఏమిటంటే ఎప్పుడూ ఈ స్పృహతో ఉండటం. అదేమిటంటే మీ భౌతిక శరీరం మీరు నడుస్తున్న ఈ భూమికి కేవలం ఒక పైపొర మాత్రమే అని అది అంత పెద్ద విశేషం కాదు దాన్ని బాగా ఉంచుకోవడం ముఖ్యం దాన్ని బాగా ఉంచుకోవడం ఇతరులకు ప్రదర్శించడానికి కాదు
(04:55) కానీ దాన్ని బాగా ఉంచుకోవడం ఎందుకు ముఖ్యం అంటే అది మీకు అడ్డంకిగా మారకూడదు అది మీకు అడ్డంకిగా మారకూడదు అంటే అర్థం ఒకవేళ మీ శరీరం ఇబ్బందికరంగా మారితే దేని వల్లైనా సరే ఉదాహరణకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే అప్పుడు 100 శాతం మీ ధ్యాస అంతా దాని మీదే ఉంటుంది. శరీరం మీదే శరీరాన్ని చూసుకోవడానికే 100 శాతం సరిపోతుంది. మీ సమయం ఇంకా మీ జీవితం అంతా కాబట్టి శరీరాన్ని ఎలా ఉంచుకోవాలంటే మీరు ఇక్కడ కూర్చుంటే అది ఇక్కడ ఉందన్న ధ్యాస కూడా మీకు ఉండకూడదు లేకపోతే తెలుసా శరీరంలోని అనేక బలవంతపు ప్రక్రియలు
(05:44) మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి. ఎల్లప్పుడూ అసలు నేను ఈ దేశానికి వచ్చిన కొత్తలో జరిగిన వాదనలు మీరు చూడాల్సిందే. నేను ఈ సెషన్స్ మూడు గంటల పాటు ఉంటాయి అని చెప్పినప్పుడు వాళ్ళు అసాధ్యం. మా బ్లాడర్ కెపాసిటీ కేవలం గంటన్నర మాత్రమే మాకు బ్రేక్ కావాలి లేదంటే మేము ఇది చేయలేము అన్నారు. సరే రెండో రోజు తర్వాత ఎవరు బ్రేక్ అడగరనుకోండి అది వేరే విషయం కానీ వాళ్ళు వచ్చిన మొదటి రోజు వాళ్ళు లేదు ఇది చాలా క్రూరంగా ఉంది మూడు గంటలు టాయిలెట్ కి వెళ్ళకుండా ఉండాలా వెళ్లి వాడుకోలేనప్పుడు ఇన్నెందుకు కట్టారు అంటారు.
(06:27) టాయిలెట్స్ కట్టింది మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి కాదు. శరీరపు అవసరాలు డిమాండ్ చేసినప్పుడు వాడతాం. కానీ ఈ బలవంతపు ప్రక్రియల వ్యవధి మరీ తక్కువగా ఉంటే అప్పుడు అది మిమ్మల్ని ఎల్లప్పుడూ బిజీగా ఉంచుతుంది. తినడం టాయిలెట్ విసర్జించడం ఆగకుండా ఇదే మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. కానీ ఒకసారి ఏదైనా జబ్బు నొప్పి లేదా ఇంకేదైనా శరీరంలో బయట పడితే అదిఒక్కటే మిమ్మల్ని 100 శాతం బిజీగా ఉంచుతుంది.
(06:58) కాబట్టి దాన్ని బాగా ఉంచుకోవడం అనేది ఎవరికో ప్రదర్శించడానికి కాదు నా శరీరం ఎలా ఉందో అని దాన్ని బాగా ఉంచుకోవడం అంటే అది మీకు అడ్డంకిగా లేదు అదొక అడ్డంకి కాదు అదొక వేదిక దాని మీద మీరు నిలబడగలిగేలా ఉండాలి. మానసిక నిర్మాణానికి కూడా ఇదే వర్తిస్తుంది. ఇంకా మానసిక నిర్మాణాలు నాకు తెలుసు చాలామంది దీనిపై వాదనలు మొదలు పెడతారు.
(07:24) కానీ మీ మానసిక నిర్మాణం ఇంకా మీ భౌతిక నిర్మాణాలు చాలా అనుసంధానమై ఉంటాయి. మీరు కనుక మీ భౌతిక నిర్మాణాన్ని ఇంకా శరీరంలోని ప్రక్రియల్ని ఒక నిర్దిష్ట స్థిరత్వ స్థాయిలో ఉంచితే మానసిక స్థిరత్వం అనేది దాని ఫలితంగా వస్తుంది. సరే దీనిపై ప్రజలు వాదిస్తారు ఎందుకంటే మనసు అనేది దానంతట అదే ఒక ప్రత్యేక ప్రపంచం అని వాళ్ళు అనుకుంటారు అవును వాళ్ళ మనసు అలాంటిదే ఎందుకంటే అదొక ప్రత్యేకమైన మనసు అదొక ప్రత్యేక ప్రపంచం అది ఇక్కడ లేదు కానీ మీ మెదడు కూడా శరీరమే కదా అవునా అలాగే ఈరోజు మీకు తెలుసు మీకేమైనా మానసిక సమస్యలు ఉంటే మీ తలలోకి ఏదో ఇంజెక్ట్ చేసుకోరు కడుపులో లో మాత్ర వేసుకుంటారు
(08:09) ఆపై అది పనిచేస్తుంది. కాబట్టి స్పష్టంగా శారీరక స్థిరత్వం శరీరంలో రసాయన స్థిరత్వం అనేది చాలా కీలకం మీ మనసు ఎలా ఉంటుంది అనే విషయంలో కాబట్టి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ శరీరం ఇంకా మీ మనసు మీకు అడ్డంకిగా మారకూడదు. ముఖ్యంగా శరీరానికి అతీతమైన దానిపై దృష్టి పెట్టిన వాళ్లకు తన శరీరం అడ్డం రావడం ఇష్టం ఉండదు.
(08:42) కాబట్టి సన్యాసులు ఎలాంటి బట్టలు ధరిస్తారంటే అవి మట్టిలో ఉతికినవి ఎందుకంటే శరీరాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి ఉత్తమమైన మార్గం భూమితో అనుసంధానమై ఉండటమే. ఈ రోజుల్లో రకరకాల అరకొర సైన్సులు వస్తున్నాయి. ప్రజలు బొటనవేలికి రాగితీగ కట్టుకొని నిద్రపోతున్నారు. ఇంకా దాన్ని నేలలో ఎర్త్ చేస్తున్నారు. ఇలా రకరకాల పనులు చేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా బహుశా ఈ దేశంలో ఇలాంటి వాతావరణంలో మీరు నిజంగా చెప్పులు లేకుండా అన్ని చోట్ల నడవలేరు.
(09:21) కానీ కనీసం ఇంట్లోనైనా చెప్పులు లేకుండా నడవండి. కనీసం ఇంట్లోనైనా నిజానికి అది భూమి కాదు. మీకు భూమికి మధ్య చాలా పొరలు ఉంటాయి. కానీ కనీసం అక్కడ ఎందుకంటే అయినా సరే ప్రయోజనం ఉంది. కాబట్టి అది అచ్చం భూమితో మిమ్మల్ని కప్పినట్టు ఎందుకంటే ఈ దుస్తులు భూమి లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఇంకా అది మిమ్మల్ని అనుసంధానం చేస్తుంది ఎన్నో విధాలుగా మీ శరీరాన్ని పక్కన పెడుతుంది.
(09:44) అలాగే మీరు ఎప్పుడూ స్పృహలో ఉంటారు. మీ శరీరం ఈ భూమిలో భాగమేనని. కాబట్టి మరణం వచ్చినప్పుడు కూడా మీకు ఎలాంటి పెద్ద సంఘర్షణ ఉండదు. ఎందుకంటే ఏదేమైనా ఇది ఎప్పుడూ ఇందులో భాగమేనని మీకు తెలుసు కానీ మీ బుర్రలో మీరు ఏవేవో ఊహించుకోవచ్చు ఆ ఊహల్ని ఆపడానికే ఇదంతా మరి చర్మపు రంగు నా ఆధ్యాత్మికతపై ప్రభావం చూపిస్తుందా నేను చెప్పినట్లుగా అది చాలా జాత్య అహంకారంతో కూడిన ప్రశ్న కానీ ఏదేమైనా మీరు అడిగారు కాబట్టి ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి? ఇదే ఉత్తమమైన చర్మపు రంగు మీరు ఆధ్యాత్మికంగా ఉండాలనుకుంటే
(10:32) మిమ్మల్ని మీరు ఈ రంగుకి మారేలా కాల్చుకోవాలి లేదంటే మీరు అక్కడికి చేరుకోలేరు. [గురకలు] కాబట్టి చర్మపు రంగు ఆధారంగా మీరు అక్కడికి చేరుకుంటారా లేదా? ఇది ఎలా ఉంటుందంటే తెలుసా? మొన్న రెండు రోజుల క్రితం నేను ఒకసారి పాల్ క్రీక్ ఫాల్ దగ్గర డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు ఇద్దరు వ్యక్తులు బురదలో కాస్త నాని ఉన్నారు.
(11:04) ఇంకా వాళ్ళు అకస్మాతుగా అడవిలో నుంచి బయటిక వచ్చారు. దగ్గరలో ఎక్కడో వాళ్ళ ట్రక్ను పార్క్ చేశారు. ఇంకా వాళ్ళు ఆ ట్రక్ వైపు వచ్చారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి చూశాను. అడ్డవిల్లు తెలుసా వాళ్ళ దగ్గర బాణాలు అడ్డవిల్లు ఉన్నాయి. సో దే ఆర్ హంటర్స్ అంటే వాళ్ళు వేటగాళ్ళు వాళ్ళను చూసినప్పుడు నేను గమనించిన మొదటి విషయం వాళ్ళు మట్టిలో నాని ఉన్న విధానం చూస్తే వాళ్ళు అక్కడ ఎక్కడో పడుకొని ఉండిఉంటారు.
(11:33) అలాగే ముందురోజు రాత్రి ఆ ప్రాంతంలో వర్షాలు పడ్డాయి కాబట్టి వాళ్ళంతా కాస్త తడిసి ఉన్నారు. అది అడవిలో నా పాత రోజుల్ని గుర్తు చేసింది. సరే నేనెప్పుడూ అడ్డవిల్లు తీసుకెళ్ళలేదు. ఎందుకంటే నాకు వేటాడే ఉద్దేశం లేదు. కేవలం అడవిలో ఉండేవాడిని ఒక వారం తర్వాత వీళ్ళు వెళ్ళింది కేవలం రెండు గంటలు లేదా బహుశా కొన్ని గంటలే కానీ నేను వారాల తరబడి అక్కడ ఉండేవాడిని తిరిగి వచ్చినప్పుడు అంతటా మట్టే ఉండేది తెలుసా వచ్చి చెవులు ముక్కురంధ్రాలు అన్ని శుభ్రం చేసుకోవాల్సి వచ్చేది.
(12:10) ఎందుకంటే ఆ మట్టి మీలోకి ఇంకిపోతుంది. కానీ వాళ్ళ దగ్గర అడ్డవిల్లులు ఉన్నాయి ఉదాహరణకు ఈ ఇద్దరు వ్యక్తులు డిసెంబర్ నెలలో మరుసటిసారి వాళ్ళు వేటకు వెళ్ళినప్పుడు దారి తప్పారనుకోండి గేమ్ వార్డెన్ ఇలా చెప్పాడనుకోండి మీరు దారి తప్పితే కంగారు పడకండి పర్వతాల్లో దారి తప్పితే కంగారు పడకండి. గాలిలోకి మూడు సార్లు ఫైర్ చేయండి. నేను వచ్చి మిమ్మల్ని కనిపెడతాను అని చెప్పాడు అనుకోండి వాళ్ళు దారి తప్పారు.
(12:44) ఇంకా మూడు సార్లు గాలిలోకి ఫైర్ చేశారు ఏమీ జరగలేదు. మరో 15 నిమిషాలు ఆగి ఇంకో మూడు సార్లు ఫైర్ చేశారు ఏమీ జరగలేదు. మరో 15 నిమిషాలు ఆగి మళ్ళీ మూడు సార్లు ఫైర్ చేశారు ఏమీ జరగలేదు. ఇక వాళ్ళకు భయం పట్టుకుంది. అప్పుడు ఒకతను ఐ హావ్ ఓన్లీ త్రీ యరోస్ లెఫ్ట్. నా దగ్గర ఇంకా మూడే బాణాలు మిగిలిన్నాయి అన్నాడు. కాబట్టి మీరు మీ చర్మపు రంగును చూసుకుంటూ జ్ఞానోదయం అవుతుందో లేదో అని ఆలోచిస్తుంటే [నిట్టూర్పులు]
(13:32) [నవ్వు] వల్ల అసలు మీరు నిజంగా కనీసం ఆ చర్మపు లోతుకి కూడా వెళ్ళట్లేదు. తెలుసా ఈ చర్మపు రంగు అనేది కనీసం చర్మమంత లోతు కూడా వెళ్ళదు తెలుసా అది చాలా పైపైన విషయమే అక్కడే ఆగిపోకండి మీరు దానికంటే కొంచెం లోతుకు వెళ్ళాలి. [సంగీతం]

No comments:

Post a Comment