Sunday, September 3, 2023

" ART Of PARENTING" " నేడు పిల్లలను పెంచడం ఒక కళ"

 "💐💐💐💐💐💐,"
" ART Of PARENTING"
" నేడు పిల్లలను పెంచడం ఒక కళ"
     ‌‌🙏🙏🙏
   " ఇది ఒక సముద్రం లాంటి విషయముకలది.  ఎంత రాసిన తక్కువే?  మీరు ఆదర్శవంతమైన "భారత భావి పౌరులు" గా మీ పిల్లలను తీర్చిదిద్దాలని కలలు కంటున్నారా?  అయితే తప్పక ఓర్పుతో, పట్టుదలతో పూర్తిగా చదవండి ఇది మీ కోసం మీ పిల్లల కోసం అని,
గుర్తుంచుకోండి!
      🔥🔥🔥
🙏సమర్పణ:- MAZUMDAR, BANGALORE
87925-86125.
        🔥🔥🔥
 🙏సేకరణ: చిన్నపిల్లల '" మానసిక శాస్త్రవేత్తలు, 
ఇతర విద్యావేత్తలు, సౌజన్యముతో,
  
🙏" పిల్లలతో పెద్దలు ఎలా ఉండాలి.   " పిల్లలు పెద్దలు ఏది చెబితే అది సరిగా  అర్థం చేసుకోలేకపోవచ్చు.  కానీ పెద్దలు ఏది చేస్తే అది పిల్లలు చేస్తారని, గమనిస్తారని గుర్తుంచుకోండి!  
" మాతృదేవోభవ- " "పితృదేవోభవ-" "ఆచార్యదేవోభవ-" "అతిధిదేవోభవ" అన్నారు.  ఇవి విశిష్టమైన వాక్యాలు.  తల్లి ,తండ్రి విలువ చాలా గొప్పది.  వారి లక్ష్యము తల్లితండ్రుల చేతుల్లో నే నేడు వుంటుంది, అని చెప్పక తప్పదు.  పిల్లలు ఎప్పుడూ స్వచ్ఛమైన కాగితం లాంటి వాళ్లు తెరిచిన పుస్తకం లాంటివాడుగా గోచరమవుతారు.  మనము ఏది రాస్తే అలాగే ఉండును.    మనం ఏ బీజం వేస్తే ,ఆ మొక్క వచ్చును.  మనం వారికి ఇచ్చే సంస్కారము వల్ల మనం వృద్ధాప్యంలో ఆశ్రమాలు  పాలు కావటం జరగదు.   చత్రపతి శివాజీ ని " తల్లి "జిజియాబాయి" చిన్నతనము నుండి పెంచిన తీరు లో "దేశభక్తి" అలవాడేలా చేసింది.

    🔥" నేడు "అపార్ట్మెంట్ కల్చర్ ' వచ్చి న్యూక్లియర్ ఫ్యామిలీలు ఏర్పడుచున్నవి.  బామ్మ, తాత ,మామ, అమ్మమ్మ,
పరిచయము చేయట, బాల్యం నుండి " మానవ సంబంధాలు 'సామాజిక, మానసిక  విషయాల పట్ల శ్రద్ధ, తీసుకుని పెంచడం నేడు  ఒక సవాలు అయింది. 
 
      🙏" నేడు మనము పెంచే బిడ్డలు సమాజమునకు చీడపురుగులుగా పెంచిన మనము "దేశ ద్రోహం" చేసిన జాబితాలోకి చేరగలమని గుర్తించండి!
మేధో వికాసము మేదో మదనము చేస్తూ మెదడుకు పదులు పెట్టు పజిల్స్ ,మైండ్ గేమ్స్ ట్రేడింగ్ గేమ్స్, పచ్చీసు,
ఆటలు మరియు "అవుట్ డోర్ గేమ్స్"  కు అవకాశం, వారి కి
ఆలోచనా, అవగాహన కలగజేయ వలెను.  మీ పిల్లలను వీకెండ్స్ నందు జూ పార్కు, మ్యూజియం , ఎగ్జిబిషన్,
సర్కస్ తో పాటు నిత్యము మనకు ఉపయోగపడు, రైల్వే స్టేషన్స్, బస్టాండు, కూరగాయల మార్కెట్, పోస్ట్ ఆఫీస్, బ్యాంకులు,
తీసుకుని పోయి, అచట జరుపు, లావాదేవీలు, కార్యనిర్వహణ, చేయు పద్ధతులు,  ప్రాథమికమైన
విషయాలను సులభముగా అర్థము చేసుకునే విధముగా, చెప్పుకుంటూ, వారి నుంచి " సరిగా అర్థం అయినదా? అని పిల్ల చేత, ఇంకొకసారి మననం చేయించవలెను.   నేడు అన్నియు" ఆన్లైన్" విధానము నడుచుచున్నది.  అయినా మనము ప్రాక్టికల్ గా తగు నాలెడ్జి"
ఇవ్వవలెను.   ఇతిహాస పురాణములపై, అవగాహన కొరకు చిత్రములతో, మరియు సినిమా, నాటకాలు, చూపండి.   మంచి పుస్తక పఠనను అలవాటు చేయండి.   పిల్లలను లేపి తట్టి "ఆత్మవిశ్వాసము" కలగజేసే విధము, వారికి నీ కష్టసుఖము నాకు చెప్పు అని వారికి తగు "భరోసా", ఇవ్వండి.  నేడు
లైంగిక వేధింపులు కూడా,
ఎక్కువ అయినాయి.  వాళ్లు ధైర్యముగా, చాకచక్యముగా, ఎదుర్కొనుటకు, అవసరమైన, నైపుణ్యం కూడా నేర్పండి!

   🔥" పిల్లలు "గాలిపటాలు" "లాంటివారు.  దారం మీ వద్ద గట్టిగా పట్టుకుంటూ, వదులుతూ , గాలిని బట్టి నేర్పుతో ప్రవర్తించేట్టు నేర్పాలి.    నేటి పిల్లలకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి వేసినారు.   పేదవాళ్ల స్థితిగతులు గ్రామ వాతావరణము, ప్రకృతి సౌందర్యము  వారికి తెలియదు.  వారికి సేవ, దయ, ప్రేమ, ఆప్యాయత, అభిమానము, అనురాగం, మానవత్వము, ఉదార స్వభావము, వేరుకరితో పంచుకొనుట,
డబ్బు విలువ, ఆర్థిక విద్యబోధన, సమయము విలువ, తెలియదు కనుక, వాటి పట్ల ఆసక్తి అవగాహన పెరిగేటట్లు, వారిని చైతన్య పరచాలి.   వారు ఒకరిపై ఆధారపడి జీవించటం కాదు.  వారికి "నాయకత్వం" లక్షణాలు, చిన్నతనము నుండే తగు శిక్షణ, ఇచ్చుటకు కృషి చేయవలెను.

    🙏" నేడు మీ పిల్లలు తప్పు చేస్తున్నారు అంటే,
తల్లిదండ్రుల పెంపక విధానములో లోపాలు, గురువులు తీర్చిదిద్దవలసిన వారు మిన్న కుండుట, చుట్టుపక్కల సమాజంలో, చెడుకు ఆకర్షణ కు  లోనవుతున్నారు.   పిల్లలు భగవంతుని యొక్క ప్రతిరూపాలు, లాలి పాటలు, జోల పాటలు,  లాలించి, పాలించి ఆలకించాలి.  కానీ నాడు తల్లిదండ్రులు "చందమామ' ను చూపించి, ప్రకృతి అందాన్ని చూపించి, పిల్లల్ని  అన్నము తినేలా చేసేవారు.  కానీ నేడు ఉరుకుల పరుగుల ప్రపంచంలో, ఇరువురు ఉద్యోగము చేస్తూ, వారికి ఒక మొబైల్, లేదా కంప్యూటర్, గేమ్స్ పెట్టి,
వారి చేత అన్నము తినిపించుచున్నారు.  
తల్లిదండ్రుల స్పర్శ వల్ల కెమిస్ట్రీ కలుగును, పిల్లల వ్యక్తపరచు "ఫేస్ ఫీలింగ్స్"  గత జన్మ విశేషాలు చెబుతారు.  ఆడపిల్ల మంచి తండ్రి కను సన్నలలో పెరిగిన, పెద్ద అయినా భర్తను కూడా గౌరవించుట తెలియను "అద్దె గర్భం" లో పెరిగిన పురుడు పోసుకున్న పిల్లలు, తదుపరి "డే కేర్"లో పెరిగిన పిల్లలను,  నేటి తరంలో మనము చూస్తున్నాం! పిల్లలు లేక తపనతో బాధతో, ఆవేదన పడుచున్నారు మరి ఎందరో!  నవభారత నిర్మాణ , నిర్మాతలు భావి భారత పౌరులుగా తల్లిదండ్రులు తీర్చిదిద్దావలసిన బాధ్యత ,కర్తవ్యం , ఎంతైనా కలదు.  అప్పుడే మన భారత దేశము ఇంకనూ ఉచ్చస్థితికి, చేరును.  
    
     👍" నేడు పిల్లలలో Demanding Nature, Selfish Nature, Fighting Nature, ఏడవటం మారం చేయుట ( క్రూరియాసిటీ)
కుతుహులము  పెరుగును.  అందుకే పెద్దలు యాక్సెప్ట్ చేసి, Yes, అంటూ మన దారికి వారిని తెచ్చుకోవాలి.
Identify చేయవలసిన వయస్సు వారిది కానీ,
Orgument చెయ్యటంలో ముందు ఉంటారు.  వారి కళ్యాలు  పట్టుకోకండి? పిల్లలకు నిజాయితీ అలవర్చటం, విద్యాభ్యాసములో తొలిమెట్టు.   ఆలన,  పాలన వారి కి  మనము నేర్పాలి.
"సామాజిక రక్షణ" కల్పించాలి.   స్త్రీ, పురుషులు కలిస్తే భార్య భర్తలు అవుతారు, కానీ మంచి' తల్లిదండ్రులు" అని అనిపించుకోలేరు.
నేడు ఎవరైనా ఇంటికి వస్తే, ఇంట్లో గల మా అమ్మ ,తాతయ్య, మామయ్యలను పరిచయము చేయరు.
ఇంట్లో ఫ్రిడ్జ్, వారి కొన్న కారు, వాళ్లు సందర్శించిన హోటల్, వస్తువుల గురించి చెబుతారే గాని,
అనగా పెద్దలను, ఒక వస్తువు కన్నా తక్కువగా చూస్తారు.  ఈ విధానము పోవలెను.

🧤"SMART " PARENTING TIPS"
        🙏🙏🙏
1)" Encourage Innovative  Thinking.

2)" Read books to your  child."

3)" Encourage Mutual Questions."

4)" Play with your child mind games, educational games."

5)" Teach them bed getting and everything'

6)" Teach  Finance and every thing to your child".( వారికి తగిన పనిని ఇచ్చి ప్రోత్సహించాలి వాటికి పాయింట్స్ ఇవ్వాలి)

7)" Learning,/ speaking /  Thinking"

8)" stories on health food, growth mind set improve."

9)" Scenario -- Basied 
Questioning.'

10)" Passion Oriented Content."

11)" motivational content to beat can do Attitude.'

12)" help your child get organised'.( పిల్లలను ఒక భాగస్వామిగా చేస్తూ వారికి తగిన పని అప్పగించు)

13)" applicate & puzzle. Your child and give some points.

14)" goal oriented discussions."

15)" don't micro manage your child' (accept it) ఆ విషయాన్ని పాఠంగా చెప్పు . ఏమి పైకి అనకు.

16)" Ask positive solutions oriented questions.'

17)" తొందరగా పడుకొని తొందరగా లేవాలి. ( ఈ విధానము వల్ల రెండు గంటలు టైం, మీకు మిగులును)

18)" నీతులు"  ఉన్నత విలువలు కలిగిన కథలు చెప్పి వారిని చైతన్య పరచాలి.

19)" బాధ్యతాయుత ప్రవర్తన, వాళ్ల పనులు వారే చేసుకునే టట్లు  నేర్పాలి.

20)" నిర్వహణ-- నియంత్రణ," "Leadership Mentality"  నేర్పె
 స్కూల్స్ నందు , మీ పిల్లలకు బోధన విధానము ఉన్న చోటికి పంపండి.

21)" వారు అడిగింది ఇవ్వటం ( దేనికి ఖర్చు పెట్టాలి- వారికి నియంత్రణ నేర్పండి )

22)" వారిని ఎలా కంట్రోల్ చేయాలి పంచుకో- పెంచుకో ,ఎవరికి పెట్టకూడదని మీరు చెప్పవద్దు.   వస్తువు ఇవ్వు, అనుబంధము పెంచుకోవడానికి ప్రోత్సాహం చేయండి.

23)" నిత్య పరిశీలన" చేసుకొను లాగున అలవాటు చేయండి
( వారికి రోజు డైరీ రాయుట అలవాటు చేయండి)

24)" Yes, No, please, thank you ,sorry, ఈ పదాలు మీరు వాడుతూ, వుంటే,  పిల్లలు, చూసి అనుసరిస్తారు, ఆచరిస్తారు.

25)" ఎప్పుడూ చిరునవ్వుతో ఉండుట వారికి అలవాటు చేయండి!

26)" "శిక్ష" లతో కాకుండా,  "శిక్షణ" రూపేణా చెప్పాలి.  వారి పుస్తకాలు మరియు బొమ్మలు క్రమ పద్ధతిలో అందముగా పెట్టుకునేటట్లు నేర్పండి.

27)" తల్లిదండ్రులు తమ ఉద్యోగ హోదా, అధికార దర్పం ,పరపతి,  డబ్బు విలాసాల జీవితం మీ పిల్లలకు తెలిసేలాగా మీరు ప్రవర్తించకండి.
ఇంటిలో సీ.సీ కెమెరాలు అమర్చండి.  మీరు చేర్చే చోటు" డేకేర్ ' అయిన సీసీ కెమెరాలు ఉన్నచోట చేర్పించి వారిని వాచ్ చేయండి.

28)" గవర్నమెంట్ చట్టాలు దానికి బద్ధులై ఉండేలా " నైతిక విలువలు అవగాహన ఏర్పరచండి.  అనగా హెల్మెట్,  డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయుట, సిగ్నల్స్ సరిగా పాటించుట ,మాస్క్ లాంటి ఇతర "సోషల్"స్పెషల్ లోకల్ లాస్ "తెలిపి,మీరు పాటించి వారికి నేర్పించండి.

29)" TIME" :- వారికి ఇవ్వండి ,మంచి ఆలోచనలు పెరిగే ప్రశ్నలు వేయండి ,పజిల్స్, Cess ఇచ్చి" మైండ్ గేమ్స్" ఆడించండి.

30)" TALK":- వారితో మాట్లాడుతూ, ఆటలు, పాటలు, కవితలు పై తెలుగు భాష పై, సంస్కృత భాష యెడల మక్కువ కలుగునట్లు అవగాహన చెయ్యండి.

31)" TEACH":- " బోధించండి . జీవిత పాఠాలు, విజయ సారధులు పడిలేచిన సముద్రం కెరటంలా, వారి జీవితాలు ఎలా తీర్చి దిద్దుకున్నారో వారి వీర గాథలు తెలపండి!  " "Dignity of labour" 
నేర్పిన భవిష్యత్తులో విలువ , గౌరవము ఇస్తారు.

32)" TRUST":- " మీ పిల్లలను పూర్తిగా నమ్మండి.  మీరు నిజం చెప్పడానికి వారికి ధైర్యము నేర్పండి.  తప్పు చేసిన కొట్టిన "భయము" ఏర్పడి నిజము చెప్పరు.  కనుక తగు జాగ్రత్త తీసుకోండి.
మీ పిల్లలపై ఇతరులను ఎంక్వయిరీ చేయకండి,
వారికి తెలిసే విధంగా!

33)" TOUCH":- " మీ ఆత్మీయ స్పర్శ ద్వారా మంచి కొటేషన్స్ చెప్పండి రాత్రి నిద్రించే ముందు మంచి నీతి కథలు చెప్పండి . మంచి కలలకు సకారము చేకూర్చండి.

34)" TREAT":- 6 నుండి 12 సంవత్సరముల పిల్లలు  సిగ్గుపడతారు, వారిని "అబ్జర్వ్ "చేయండి.  మీ పిల్లలను హీనంగా చూడకండి, చులకన హేళన చేయకండి , వారిని ఉత్సాహపరచండి వారిలో "ఆత్మవిశ్వాసం" పెంపొందించుకునే  టట్లు చేయండి.  నేడు అనాధ పిల్లలను అవమానపరిచిన బయటపెట్టిన "సోషల్ యానిమల్"  గా తయారవుతారు, అదే మీరు ప్రోత్సాహం ఇస్తే, అనేక  అద్భుతాలు చేస్తారు ,అని తెలుసుకోండి!

35)" YES":- మీ పిల్లలు ఏది చేసినా అడిగిన ముందు "ఎస్ "అని చెప్పండి . దానికి కొంత టైం ఇచ్చి , నెరవేర్చగలను అని చెప్పి,  తగు విధముగా వారికి "కౌన్సిలింగ్ " ఇవ్వండి. "పాజిటివ్ "సమాధానం మీ నుండి వారు ఆశిస్తారు అని గుర్తుపెట్టుకోండి . "వద్దు " అన్న  ఆ పని వారు తప్పక చేస్తారు. ఉదా:" పేదరాశి పెద్దమ్మ' కథలలో , నీవు ఉత్తర దిక్కుగా పోవద్దు అంటే వారు అటే  వెళ్లి ,తిరిగి అన్వేషణ చేస్తారు.

36)" మీ పిల్లలను "విజయసారదులు' గా తీర్చిదిద్దండి , వారికి మీరు తగు వారధిగా మీరు ఉండండి అంతే! వారికి పూర్తి భరోసా ఇవ్వండి.

37)" మీ ఫ్యామిలీలో రిలేషన్స్ ఎవరైనా చనిపోతే వారు ఎందుకు ఎలా చనిపోయినది?  వివరాలు చెప్పి, వారిని ఆ కార్యక్రమాలలో పాల్గొనేటట్లు చేయండి మేనమామ ,అత్త ,బావ, అమ్మమ్మ ,వైపు బంధువులు , నాన్న వైపు బంధువులు ఎవరు? ఏమిటి? వివరాలు తెలిసేలా అవగాహన కలిగేలా చెప్పండి. "మానవ సంబంధాలు" మెరుగుపడతాయి.  లేక అవి "ఆర్థిక సంబంధాలు" గా మారిపోవును.

38)" మీ పిల్లలకు "money management , TIME management , communication skills, moral stories,
తెలియజేయండి.  మొక్కలు పెంచుటకు, వాటి సంరక్షణ నీరు పోయుట, మీ పిల్లలను " ఇన్వాల్వ్" చేయండి.

39)" గుడి, విహారయాత్రలు, మ్యూజియం, ఎగ్జిబిషన్,
వండర్ వరల్డ్, సర్కస్, జూ పార్కులు, వివిధ కోటలు బురుజులు, చారిత్రిక కట్టడాలు, ప్రకృతి సౌందర్యము,
వీకెండ్ ప్లాన్ చేయండి.
పుట్టిన స్థలాలు, ఆ గ్రామము నందు వారికి పుస్తకము , పెన్ను ఇచ్చి వాళ్ళ అనుభూతులు డైరీలో రాసుకుననే  అలవాటు చేయండి.

40)" మాతృభాషతో పాటు ఇతర భాషలు, సంస్కృత భాష మీద మోజు, అభిరుచి పెంచి ప్రోత్సహించిన అన్ని భాషలు వారికి వచ్చును అని వారికి తెలియపరచండి.  మీరు నేర్చుకుంటూ వారిని ప్రోత్సహించండి.

41)" పిల్లలకు మీరు ఆస్తులు కన్నా సంస్కారము నేర్పిన రేపు మిమ్ములను వారు" ఓల్డ్ ఏజ్ హోము" నకు పంపరు.

42)" 0-6 వయసు పిల్లలకు గుర్తుండని దశ,
7-నుండి 12 సంవత్సరముల పిల్లల తో ఫ్రెండ్లీగా ఉండండి.
12-18 యూత్ వారికి శారీరిక ,మానసిక లైంగిక హార్మోన్స్ ఉత్పత్తి అనేక మార్పులు వచ్చును గొంతు కూడా మారును.
వారిని ఫ్రెండ్లీగా చూడండి.
ప్రేమతో పుష్పాలుగా భావించండి, వారికి బాధ్యతలు కుటుంబ గౌరవం బోధపరచి, finance management, చెయ్యమని నేర్పి, "Budget Management" ఇవ్వండి.  20 నుండి 30 సంవత్సరములు లలో, "Life Turning Point"
నిర్ణయాలు, సలహాలు ఇవ్వండి.   30 సంవత్సరములు దాటిన ఏమి సలహాలు ఇవ్వకండి.  అడిగితే చెప్పండి.

43)" ఇద్దరు పెద్దలు మాట్లాడుకుంటే ఎదుటి ఉన్న పెద్దవాళ్లు 30% అర్థమవుతుంది.  అదే తల్లి ,తండ్రి మాట్లాడుకున్నప్పుడు,
ఎదుట మీ పిల్లలు ఉంటే 90% అబ్జర్వ్ చేయగలరు జాగ్రత్త!

44)" application పొగడ్తలతో స్ఫూర్తి ఇవ్వాలి.

45)" Advised by others social media 
ప్రభావము పడకుండా తల్లిదండ్రుల కంటే పక్క వాళ్ళు చెప్పిన వింటారు.

46)" Asking there opinion: వాడి ద్వారా అడగాలి.

47)" adventure oriented task photos short films, తీయమని చెప్పండి.

48)" పిల్లలకు శ్రమ పడుటలోని విలువలు నేర్పాలి.  ఇష్టపడుతూ చెయ్యాలి కానీ కష్టపడుతూ కాదు అని తెలియపరచండి.

49)" పిల్లలను మానసిక, శారీరిక ,ఎదుగుదల సామాజిక ,ఆధ్యాత్మిక వికాసము, కలిగించేలా పెంచాలి.

50)" పిల్లలకు సంస్కారము, సభ్యత, నిరాడంబరత, స్థితప్రజ్ఞతా, నీతి నిజాయితీ, లాంటి నైతిక విలువలు పెంచి పోషించాలి.

51)" మీరు పిల్లల విషయంలో పొరపాట్లు చేశారా ? వారు మీకు జీవిత చరమాంకంలో, వారి వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

52)" ఆడపిల్లలలో "ఆత్మస్థైర్యాన్ని" నింపాలి.
కుల సంఘాలు ర్యాగింగ్ పాల్పడకుండా, friendly classes, interactive classes, introduction classes, ప్రవేశపెట్టి, ఒక నెల తరువాత "friendship day" నిర్వహణలో స్నేహితుడు, తత్వ బోధకుడు, మార్గదర్శిగా గురువుగా ఉండాలి.

53)" మీరు తెచ్చిన బహుమతి చెల్లాయికి ఇవ్వు తమ్ముడికి ఇప్పించి వారి పట్ల అనురాగము, ఆపేక్ష, పెరుగే లాగా చూడండి.  అలాగే ఇంటికి ఎవరు వచ్చినా వారి చేత మంచినీళ్లు ఇప్పించుట, కూర్చోమని చెప్పుట, 
బహుమతులు కూడా వారి చేత ఇప్పించండి.
వారికి బంధుమిత్రుల,  గురించి అవగాహన కలిగించండి.

55)" నేటికి అమెరికాలో పిల్లలు స్కూలుకు వచ్చు వారిని, సీనియర్ క్లాస్  వాళ్లు రిసీవ్ చేసుకొనుట చేస్తారు.  స్కూల్ ఓపెన్,
స్కూల్ క్లోజ్ చేయు సమయములలో, security traffic police 
లేదా ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుతారు.  వారికి ఒక గంట డ్యూటీ గా ప్రత్యేకముగా నియమించుతారు.

56)" పేరెంట్స్ మాతో ఎదురింటి వారితో మాట్లాడినట్లు మాట్లాడాలి అనుకుంటారు.

57)" ఇంటికి వచ్చిన బంధుమిత్రులు ఎదుట వారిని చులకన చేసి మాట్లాడుట వారి గురించి చెడుగా చెప్పరాదు.

58)" పెద్ద కలలు కనటం వాటిని సహకారం చేసుకునేటట్లు ప్రోత్సహించండి.

59)" మీ పిల్లలకు లౌకిక విద్య ,ఆధ్యాత్మిక విద్య, తోపాటు, బిజినెస్ స్కూల్స్ ద్వారా "ఆర్థిక విద్య " బోధన నేర్పాలి.

60)" మీ పిల్లలకు చైతన్య శక్తితో సంభాషించే, ప్రముఖ వ్యక్తుల యొక్క వ్యాఖ్యలను తెలియ చెప్పండి.
    🔥" నేను రాసింది గోరంత మాత్రమే, రాయవలసినది కొండంత ఉన్నది.  విసిగించటం నా పని కాదు.   నచ్చిందా? షేర్ చేయమని నేను చెప్పను.  అది మీ వివేకానికి, మీ ఓర్పుకు,
స్వార్థ చింతన లేని, మీకు చెప్పనవసరం లేదు, అని అనుకుంటాను. ( రేపు కలుద్దాం)
   
     👍👍👍
🙏సమర్పణ: మజుందార్ బెంగళూరు,87925-86125.
జై భారత్, వందేమాతరం
🔥🔥💅🏿💅🏿🧤🧤🧤

దండ సర్ప మారణ న్యాయము

 *దండ సర్ప మారణ న్యాయము*
**************
*దండము అంటే కఱ్ఱ. సర్పము అంటే పాము. మారణము  అంటే చంపడం.కర్రతో పామును చంపుట అని అర్థం.*

 *విష పూరితమైన కట్ల పాము ,త్రాచుపాము లాంటివి అప్పుడప్పుడూ  దారి తప్పి జనావాసాలలోకి వస్తూ వుంటాయి.అవి చిన్నవైనా, పెద్దవైనా వానిని చంపడానికి అనువైన ఆయుధం కర్రనే.అవి తలఎత్తే లోపు వాటికి మరీ దగ్గరగా పోకుండా  దూరం నుండే చంపడానికి పొడగాటి కర్ర ఉపయోగపడుతుంది.అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు.*

*దీనిని వ్యక్తులుగా మనకు అన్వయించి చూస్తే ..పాము లాంటి దురలవాటు కానీ, దురాలోచన, స్వార్థం కానీ మనలోకి ప్రవేశిస్తుందని ఏమాత్రం అనుమానం వచ్చినా దాన్ని వెంటనే గుర్తించి సమూలంగా తొలగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి.దానికి కర్రలాంటి క్రమశిక్షణ చాలు.*

*అంతే కానీ మనల్ని మనం కఠినంగా హింసించు కోవాల్సిన అవసరం లేదు.*
 *పామును చంపడానికి పొడగాటి కర్ర చాలు కానీ గొడ్డలి పట్టుకుని బయలు దేరాల్సిన అవసరం లేదు కదా!.*

*దీనినే మరో పార్శ్వంలో చూద్దాం.చిన్న  సమస్య అయినా అది చిలికి చిలికి గాలి వానలా కాకుండా పెద్ద తరహాగా వ్యవహార దక్షతను కనబరిచి సమస్యను పరిష్కరించుకోవాలి.*

 *చిన్నవే కదా అని నిర్లక్ష్యం చేస్తే అవి మన చేయి దాటి పోయే ప్రమాదమూ లేకపోలేదు.*

*కాబట్టి సమస్య అయినా,పామైనా, మనలో పొడసూపే విపరీత భావనలైనా ఆదిలోనే  త్రుంచేటందుకు తగు ప్రయత్నాలు జరగాలి.ఇవన్నీ పాముల్లా విషపూరితమైనవి.కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.*

*లేదంటే "గోటితో పోయేది గొడ్డలి దాకా పోతుంది.ఇలా ప్రతి న్యాయము వెనుక అంతర్లీనంగా మనకో హెచ్చరికతో పాటు హితకరమైన సందేశం ఉందని గ్రహించ వచ్చు.*

*ఇలా దండ సర్ప మారణ న్యాయమును సాధారణ ఉదంతాలకూ, మానవీయ జీవన విలువలకూ ఉపయోగించవచ్చు.*

*ప్రభాత కిరణాల నమస్సులతో  🙏*

మీరు ఐస్ క్రీములు తింటున్నారా ?

 *మీరు ఐస్ క్రీములు తింటున్నారా ?*

ఐస్ క్రీమ్ ల తయారీలో ఉపయోగించే పదార్థాలలో ఒక్కటి కూడా మన ఆరోగ్యం పై మంచి చేసిది లేనేలేదు.                    .      *.  ఇందులో చాలా భాగం గాలి నింపబడి ఉంటుంది మిగిలిన 30 శాతం నీరు 6 శాతం పశువుల కొవ్వు ఏడు లేక ఎనిమిది శాతం చక్కెర ఉంటాయి ఇవన్నీ మన శరీరాన్ని మనస్సును పాడు చేసే పదార్థాలే .                                   *. ఇవే కాకుండా ఐస్క్రీములు విషానికి మాత్రం తీసుకొని అనేక రసాయనాలను కూడా కలుపుతారు. పేర రోనిల్, ఎమి ల్ సీటెట్, నైట్రేట్లు వంటివి

పేర రోనీ ల్ ను  క్రిమికీటకాలను చంపేమందుగాఉపయోగిస్తుంటారు

అలాగే ఇథైల్ ఏసీటెట్ వలన ఊపిరితిత్తులు గుండె జబ్బులు వస్తాయి మిగిలినవి కూడా యధాశక్తి తమ ప్రతాపం చూపుతాయి.                              *ఐస్ క్రీములు నిర్మాణం ఒక అతిశీతలమైన గదిలో జరుగుతుంది మొదట కొవ్వును సాగదీసి రబ్బర్ లాగా చేస్తారు అప్పుడు దానిలో గాలి నింపితే అది ఉంది దానికి ఐస్క్రీమ్ రూపం తీసుకు వచ్చేందుకు అనేక ఇతర రసాయనాలు కూడా కలుపుతారు దీనిలో జంతువుల తోకలు ముక్కు స్థానాల నుంచి నుంచి సేకరించిన ఒక ప్రత్యేక జిడ్డు  పదార్థం కూడా ఉంటుంది దీని వలన  కొవ్వుతో కలసినపుడు ఐస్ క్రీం జిడ్డుగా నెమ్మదిగా కరిగిపోయేలా గా మారుతుంది ఈ విధముగా తినకూడని అనేక పదార్థాలను 5 లో కలిపి వేరే తెల్లని గదిలో పెడతారు అక్కడి నుండి అనేక రకాల ఆకర్షణ పాకెట్లు తయారవుతాయి. ఒక గది నుండి వేరే గదిలోకి తీసుకెళ్లేటప్పుడు కొంత ఐస్ క్రీమ్ నేలమీద పడుతూ ఉంటుంది . కిందపడిన దాన్ని కూడా కలిపి చేస్తారు. తెలియకుండా ఉండేందుకు చాక్లెట్ సేవర్ లాంటివి కలుపుతారు .

మిత్రులారా ఒక్క సారి ఆలోచించండి మీ పొట్ట ఏదైనా మురుగుకాలువ లేక చెత్త కుండీనా ఈ పదార్థాలన్నీ మీ పొట్ట లో వేయడానికి కాస్త ఆలోచించండి.....


*ఐస్ క్రీములు మీరు తినకండి మీ పిల్లలకు కొని ఇవ్వవద్దు*.

స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ టిప్స్.......ఒత్తిడి నిర్వహణ చిట్కాలు...* మరియు వాటిని అధిగమించుట ఎలా?

 ,:*స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ టిప్స్.......ఒత్తిడి నిర్వహణ చిట్కాలు...*
           మరియు
వాటిని అధిగమించుట ఎలా?
🔥🔥🔥🔥🔥🔥

😀😀సమర్పణ:- Mazumdar Bangalore,Karnataka
87925-86125.
      🙏🙏🙏
1. *మనసారా నవ్వండి*;-
మనసారా నవ్వడం అన్ని విధాలా ఆరోగ్యదాయకం. మీరు నవ్వుతూ ఇతరులను నవ్వించడానికి ప్రయత్నిస్తే మీకూ ఆనందం, ఆహ్లాదం కలగడమే కాక ఇతరుల్నీ ఆనందంగా ఉంచుతారు. "మానసిక ఒత్తిడి"  నుంచి రిలాక్స్‌ అవుతారు. నవ్వడం వల్ల ఫేషియల్‌ మజిల్స్‌, చెస్ట్‌, భుజాలు, మెడ, స్కల్‌ మజిల్స్‌, రిలాక్స్‌ అవుతాయి.

🙏2. *నడక - వ్యాయామం*:-
ఉదయం పూట నడక మంచిది. అలా కుదరని పక్షాన సాయంత్రం పూట కూడా నడవచ్చు. నడుస్తూ ప్రకృతి అందాలను తిలకించండి. మంచి స్వచ్ఛమైన గాలిని పీల్చండి. అలాగే వ్యాయామం చేయడం వల్ల శరీరం రిలాక్స్‌ అవడమే కాకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

👍3. *చక్కటి నిద్ర*:-
రోజుకు 6 గంటలు తక్కువ కాకుండా నిద్రపోవాలి. నిద్రవల్ల మంచి రిలాక్సేషన్‌ ఏర్పడుతుంది. మనస్సు, శరీరం చక్కగా ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంటుంది. మధ్యమధ్యలో నిద్రాభంగం కలగకుండా చక్కటి గదివాతావరణం, నీలం రంగు లైట్ మంచి పడక, మంచిగాలి ఉండేటట్లు చూసుకోవాలి.

🙏4. *చల్లటి నీళ్లతో స్నానం*:-
మీరు ఎక్కువగా మానసిక ఒత్తిడికి లోనయినప్పుడు చల్లటి నీళ్లతో స్నానం చేసినట్లయితే శరీరం, మనస్సు హాయిగా ప్రశాంతంగా ఫీల్‌ అవుతారు. అలా కుదరని సందర్భాలలో చల్లటి నీళ్లతో కాళ్లు, చేతులు, ముఖం కడుక్కుని, కావాల్సిన మంచినీరు త్రాగి కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం వల్ల ప్రశాంతంగా ఫీలవుతారు.

❤️5. *వీకెండ్‌ ఎంజాయ్‌ చేయండి*:-
బయటకు వెళ్లండి. అందుకోసం చక్కటి ప్రణాళికలు వేయండి. అలా కొన్ని కొత్త ప్రదేశాలకు కాని, మీకు ఇష్టమైన ప్రదేశాలకు కుటుంబ సభ్యులతో లేదా ఫ్రెండ్స్‌తో వెళితే బాగా ఎంజాయ్‌ చేస్తారు. అలా చేస్తే మానసికంగా, శారీరకంగా ,ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు.

👍". *సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనండి.*:-
సంగీతం, సాహిత్య కార్యక్రమాలు మరి కొంతమందికి స్పోర్ట్స్‌, గేమ్స్‌, నృత్యం లాంటి ఇష్టమైన కార్యక్రమాలలో పాల్గొనడం లేదా తిలకించడం చేయడం వల్ల 'ఒత్తిడికి" దూరమవుతారు.

🌹. "*వీలుకానప్పుడు నో చెప్పండి.*:-
మీ పరిమితులు, పరిధులు మీకున్నాయి. ప్రతి ఒక్కరు మీతో ఏదో పని చేయించాలని చూస్తారు. అందరినీ సంతోషపెట్టడం అనేది మీకు అలివి కాని పని అని తెలుసుకోండి. ఎదుటివారికి కోపం వస్తుందనుకుని అందరి సమస్యలు మీ నెత్తిన వేసుకుంటూ ఉంటే మీరు "మానసిక ఒత్తిడి' కి గురి అవుతారని తెలుసుకోండి.

🙏8. *టైమ్‌ మేనేజ్‌మెంట్‌ (సమయ పాలన)*:-
ఎవరికైనా 24 గంటల సమయమే ఉంటుంది. అయితే కొంతమంది తమకున్న సమయాన్ని వివిధ కార్యక్రమాలకు చక్కగా ఉపయోగించుకుంటారు. అలా కాలాన్ని సద్వినియోగ పరిచే "స్కిల్‌"  మీలో ఉంటే ఒత్తిడిని అధిగమిస్తారు.  అంటే మీరు ఏఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తారో ఒక "ప్రయారిటీ లిస్ట్‌ ' ప్రతిరోజూ రాసుకోవాలి. ముందు ఏ పని చేయాలి. రెండో ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి అనే అంశాలు ముందుగా నిర్ణయించుకోవాలి. దానిప్రకారం మీ పనులు సక్రమంగా నిర్వహించుకుంటే "ఒత్తిడి" ఏర్పడకుండా ఉంటుంది.  కొన్ని పనులు అర్జంట్‌ కానివి ఉంటాయి. మరికొన్ని ముఖ్యమైనవి, ఇంకొన్ని ముఖ్యమైనవి కానివి ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో వాటా ప్రాధాన్యత గుర్తించగలిగితే మీకు "ఒత్తిడి ' లేకుండా ఉంటుంది.

 🪷9. *ప్లానింగ్‌ (ప్రణాళిక)*:-
మనకు రకరకాల లక్ష్యాలు ఉంటాయి. అయితే వాటిని ఎలా చేరుకోవాలి ,అనే విషయంలో అనేక సమస్యలు ఏర్పడుతుంటాయి. మనం ఒక చక్కని ప్రణాళికను ఏర్పరుచుకున్నట్లయితే ఆ ప్రణాళిక ప్రకారం ఈజీగా ముందుకు వెళ్లగలుగుతాం.  కాని కొంతమంది ఎటువంటి ప్రణాళిక లేకుండా పనులు తలపెడుతుంటారు. ఇటువంటి వారు ,"ఒత్తిడికి" లోనవుతుంటారు. కనుక మీరు ఏది చేయాలన్నా మంచి ప్రణాళిక వేసుకోవడం మరిచిపోవద్దు.

🍓10. *ఎమోషనల్‌ ఇంటెలిజెన్సీ (ఉద్వేగ ప్రఙ్ఞ)*:-
"అంటే మీలోని ఎమోషన్లను బేలెన్స్‌ చేసుకునే ప్రజ్ఞ మీలో ఉండాలి.   ప్రతి ఒక్కరికీ భావోద్వేగాలు ఉంటాయి. అయితే వాటిని సక్రమంగా ఉపయోగించుకున్నట్లయితే " ఒత్తిడి"కి లోనుకాకుండా ఉంటారు. మీరు ఇతరులపై కోపం ప్రదర్శించాలనుకున్నప్పుడు , అది మీకు మీతోటి వారికి మధ్య సంబంధ బాంధవ్యాలు చెడిపోకుండా ఉండే విధంగా సున్నితంగా ఉండాలి.   అలాకాకుండా అవతలివారిని బాధించే విధంగా ఉన్నా లేదా మీరు అతిగా "భావోద్వేగానికి ' గురి అయినా ఒత్తిడి మిమ్మల్ని వెంబడిస్తుంది.

🔥11. *పాజిటివ్‌ థింకింగ్‌ (సానుకూల ఆలోచన)* :-
"ఆశావహ దృక్పథంతో ఉన్న వ్యక్తులలో సహనం ఎక్కువగా ఉంటూ వారు ఎలాంటి సమస్యలు ఎదురైనా చాలా సున్నితంగా ఆ సమస్యలకు పరిష్కారాలు కనుగొంటారు.  వారిలో "ప్రొయాక్టివ్‌ బిహేవియర్‌' ఉంటుంది.   ఇతరులతో సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉంటాయి. వారి ఆలోచనలు, ఆచరణాత్మకం గా ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇలాంటివారిలో "ఒత్తిడి" ఏర్పడకుండా ఉంటుంది. ఒకవేళ ఒత్తిడి ఏర్పడ్డా దాన్నించి బయటపడగల నేర్పు, ఓర్పు కూడా వారిలో ఉంటుంది.

🌺12. *స్కిల్‌  నాలెడ్జ్‌*:-
"ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు మీరు చేసున్న ఉద్యోగంలో మీకు మంచి నైపుణ్యం ఉండాలి.   అలాగే ఆ పనిలో మీకు నాలెడ్జ్‌ కూడా బాగుండాలి.   అలా మీలోని నైపుణ్యాలను పెంచుకోకుండా ఉంటే, మీరు తరచుగా ఒత్తిడికి గురి అవక తప్పదు. మీరు మీకు ఇచ్చిన పనుల్ని సరిగా చేయలేకపోవడం,  సరి అయిన సమయంలో మీరు మీబాస్‌కు ఆ పనిని అప్పగించలేక పోవడం తద్వారా ఒత్తిడికి లోనవడం జరుగుతుంది. కనుక "స్కిల్‌`నాలెడ్జ్‌" ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి.

🌼13. *ఎసెర్టివ్‌ (దృఢమైన ప్రవర్తన) బిహేవియర్‌*:-
మీరు ఎగ్జిక్యూటివ్‌ కావచ్చు. లేదా ఆ క్రింది స్థాయి వ్యక్తి కావచ్చు.   మీ ప్రవర్తన " ఎసెర్టివ్‌గా" ఉండాలి.   అంటే ప్రతివ్యక్తిలోనూ మూడు రకాలైన ప్రవర్తనలు ఉంటాయి.        అంటే 2పాసివ్‌ బిహేవియర్‌, 2'"ఎగ్రెసివ్‌ బిహేవియర్‌ ,అలాగే ఎసెర్టివ్‌ బిహేవియర్‌, 1)"ఎగ్రెసివ్‌ బిహేవియర్‌' వల్ల ఇద్దరి మధ్యా ట్రాన్సాక్షన్స్‌ దెబ్బతింటాయి.  అలాగే ఎవరైతే ఎగ్రెసివ్‌గా ఉంటారో వారు మానసికంగా, శారీరకంగా, ఎమోషనల్‌గా అప్‌సెట్‌ అవుతారు.   తొందరగా ఒత్తిడికి గురవుతారు. 2)"పాసివ్‌ బిహేవియర్‌:"- ఆమోదయోగ్యం కాదు. అది ఇతరుల ఆత్మాభిమానాన్ని కించపరుస్తుంది.   కనుక ఇతరుల్ని అభిమానించి, గౌరవించేది అంతేకాక వారి ఆత్మాభిమానాన్ని పెంపొందించేది. 'ఎసెర్టివ్‌ బిహేవియర్‌' ను అనుసరించడం వల్ల ఇద్దరి మధ్య మంచి మానవ సంబంధాలు ఏర్పడి "ఒత్తిడి " లేకుండా ఉంటుంది.
అలాగే భార్యాభర్తలు మధ్యకాని, స్నేహితుల మధ్యకానీ, ఆఫీసులో మీతోటి ఉద్యోగస్తుల మధ్యకాని ఎసెర్టివ్‌నెస్‌ అనేది ఒత్తిడి లేకుండా చేస్తుంది.    ఉదాహరణకు మీ అభిప్రాయం బాగుంది. మీరు చెప్పింది కూడా పరిశీలించాల్సిన అంశమే.    నేను ఇలా అనుకుంటున్నాను. మీరు ఈ విషయంలో ఎలా స్పందిస్తారు... ఇలా సంభాషణ కొనసాగితే ఇద్దరి మధ్య అనుబంధం బాగుంటుంది.

🪷14. *డెలిగేషన్‌*:-
అన్ని పనులు మీరు ఒక్కరే చేయాలనుకోవడం సాధ్యం కాదు.   ఆఫీసులో కాని, ఇంట్లో కాని కొన్ని పనులను మీరు ఇతరులకు కేటాయించాలి.   అజమాహియిషి   మీ వద్దనే ఉండాలి.   ఆయా పనుల ప్రాధాన్యతను బట్టి   మీ క్రింది ఉద్యోగులకు, అసిస్టెంట్స్‌కు అలాగే ఇంట్లో అయితే , కొన్ని పనులు ఇతర కుటుంబ సభ్యులకు కేటాయించడం వల్ల పని పంచబడుతుంది. దీనివల్ల మీకు  'ఒత్తిడి' ఏర్పడదు.కదా! రాజు నేనే, మంత్రి  పి నేనే అనే తత్వంతో ఉండరాదు.

🌻15. *సానుభూతి గల*.  (Empathy")
ఇతరులు ఉన్న పొజిషన్‌లో మీరు ఉంటే ఎలా ఫీల్‌ అవుతారు. అనే కోణంలో ఆలోచిస్తే, మీ "ఆలోచనా ధోరణి" సవ్యంగా ఉంటుంది. అప్పుడు మీరు ఇతర వ్యక్తులతో అనుబంధం సవ్యంగా ఉంటాయి. "ఎంపతీ ఫీలింగ్‌ "మనిషిని ఒత్తిడికి గురికాకుండా చేస్తుంది.

💐16. *డెడ్‌లైన్స్‌*":-
మీ ఆఫీసులో మీకు ఇచ్చిన జాబ్‌ ఆఖరి క్షణం వరకూ పూర్తి చేయకుండా ఉంటే  "లెవెన్త్‌ అవర్‌' టెన్షన్‌కు గురి అవుతారు. దాంతో మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుంది. అందుకే మీరు చేయాల్సిన పనులు డెడ్‌లైన్‌కు ముందే ముగించండి.

🌸17. *కుటుంబ సభ్యులతో సరదాగా*:-
ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం చాలా ఆరోగ్యకరమైన విషయం. ఇలాంటివారు ఎంతో కాన్ఫిడెంట్‌గా సరదాగా ఉంటారు.    అందరితో మంచి కమ్యూనికేషన్‌, సత్సంబంధాలు ఉంటాయి.   దాంతో ఒత్తిడి మీ దరికి చేరదు.

🙏18. మీ లైఫ్‌ పార్టనర్‌తో:-
ఆఫీసులో బిజీ షెడ్యూల్‌తో ఇంటికి లేటుగా వచ్చి హడావుడిగా మీ కార్యక్రమాలు ముగించుకుని మంచం మీద మౌనంగా పడుకుంటే మీ పార్టనర్‌తో, మీకు మంచి రిలేషన్స్‌ ఎలా ఉంటాయి? అందుకు మీ "లైఫ్‌ పార్టనర్‌" కు కొంత టైమ్‌ కేటాయించండి. మాట్లాడండి... అభినందించండి.... ప్రేమించండి, ముద్దూ ముచ్చట్లతో ఆనందంగా గడపండి. ఇక "ఒత్తిడి" పరార్‌!

🔥19. పిల్లలతో ఎక్కువ ఆనందం
మీకు పిల్లలు ఉన్నారా? అయితే పిల్లలతో ఆఫీసు నుంచి ఇంటికి రాగానే వారితో మాట్లాడండి.... వారి ఎమోషన్స్‌, వారి అభిరుచులు, వారితో కలిసిపోండి. ఆడుకోండి. ఆనందించండి.... వారు చిన్న పిల్లలయితే ఎత్తుకోండి. ముద్దాడండి... టీనేజర్స్‌ అయితే వారితో స్నేహితులుగా మారిపోండి. ఇక "ఒత్తిడి" కి  మీరు దూరం అవుతారు.

🌷20. 'బుక్‌ రీడింగ్‌":-
పుస్తకాలు చదివే అలవాటు మిమ్మల్ని అనేక విషయాలవైపు ఆలోచింపచేస్తుంది.  మీలో విజ్ఞానంతో పాటు క్రియేటివిటీ, ఆనందం కలుగుతాయి.   ఇది మీకు ఎంతో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది.

🦚21. ఫోటో ఆల్బమ్‌:-
మీరు టెన్షన్‌ ఫీల్‌ అవుతున్నారా? మానసికంగా గజిబిజిగా ఉందా? ఆలోచనలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? అయితే మీ ఇంట్లో ఆల్బమ్‌ ఒకసారి తీయండి. ఎన్నోసార్లు  ఫోటోలు, చిన్నప్పటి మీ అనుభూతులు, గుర్తు చేసుకుంటూ, ఆనందంతో, తన్వయతం, తో పరిశీలించండి.  హాయిగా ఫీల్‌ అవుతారు.

🍇22. గార్డెనింగ్‌:-
మీ ఇంట్లో గార్డెన్‌ ఉందా? "పూలకుండీలు చక్కగా సర్దండి... వాటికి నీరు పోయండి. అలా మీరు ఒక అరగంట సమయాన్ని పూలమొక్కలతో గడపండి... రిలాక్స్‌గా ఫీల్‌ అవండి.

🔥23. మ్యూజిక్‌ వినడం:-
"మీకు ఇష్టమైన సంగీతాన్ని వింటుంటే మీరు ఎంతో ప్రశాంతతకు లోనవుతారు.   ఒంటరిగా ఆలోచించే దాని కన్నా ఓ మంచి సంగీతం వింటే ఎంతో హాయిగా ఉంటుంది.

🔥24.  ఆఫీసు - ఇల్లు పరిశుభ్రత,
ఆఫీసు కావచ్చు. ఇల్లు కావచ్చు. చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గోడలకు మంచి రిలాక్స్‌డ్‌గా ఉన్న కలర్స్‌ వాడాలి. వస్తువులు టేబుల్స్‌, పుస్తకాలు, బట్టలు చిందరవందరగా ఉండకూడదు.... ఇల్లూ, ఆఫీసు మంచి వాతావరణం మీకు చూసేవాళ్ళకు, స్ఫురించాలి.

👍25. టెలిఫోన్‌ కాల్స్‌:-
మీ సెల్‌ఫోన్‌ కాల్స్‌ను పరిమితం చేసుకోండి. ఎక్కువ సమయం పిచ్చాపాటీ విషయాలతో విపరీతమైన కాల్స్‌తో ఉక్కిరిబిక్కిరి అయిపోవద్దు. కాల్స్‌కు హద్దులు పెట్టండి.

🔥26. "ఫైల్‌ - టేబుల్‌ మేనేజ్‌మెంట్‌":-
"ఆఫీసులో మీ టేబుల్‌ మేనేజ్‌మెంట్‌పై శ్రద్ధ వహించండి.   ఫైల్స్‌ ఎలా మెయింటైన్‌ చేయలో తెలుసుకుంటే మీ టేబుల్‌పై ఏఏ ఫైల్స్‌ మీ దగ్గరుండాలో, ఏ ఫైల్స్‌ దాచిపెట్టాలో వాటి ఆర్డర్‌ నెంబర్‌ ఎలా ఉండాలి. తిరిగి వాటిని  సులభంగా తీయడానికి ఎలాంటి జాగ్రత్తలు తగువి తీసుకోవాలో జాగ్రత్త పడండి.

🙏27., "కమ్యూనికేషన్‌ స్కిల్స్‌":-
"ఆఫీసులో కాని ఇంట్లో కాని కమ్యూనికేషన్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. కమ్యూనికేషన్‌ సరిగా లేకుంటే చాలా టైమ్‌ గ్యాప్‌ ఏర్పడుతుంది. ట్రాన్సాక్షన్స్‌ కూడా దెబ్బతింటాయి.   దాంతో ఒత్తిడి ఏర్పడుతుంది... మంచి  కమ్యూనికేషన్‌ ఏర్పాటు చేసుకోండి.

🪴28. టైప్‌ ఎ పర్సనాలిటీ నుంచి.... టైప్‌ బి.  పర్సనాలిటీకి మారండి.
"కార్డియాలజిస్టులు' వ్యక్తులలో టైప్‌ ఎ అని టైప్‌ బి పర్సనాలిటీ అని రెండు రకాలుగా గుర్తించారు.    టైప్‌ ఎ పర్సనాలిటీ గల వ్యక్తులు ఎక్కువ టెన్షన్‌కు గురి అవుతారు.  ఎప్పుడూ హర్రీబర్రీగా ఉంటారు. దీంతోవారు స్ట్రెస్‌కు ఈజీగా లోనవుతారు.


🔥 అలాగే "టైప్‌ బి" పర్సనాలిటీ వారు నిదానంగా ఆలోచిస్తూ సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ వారివారి పనులు చక్కదిద్దుకుంటారు. వీరిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.   వీరు రిలాక్స్‌డ్‌గా పనులు చేస్తారు. దీనిని గురించి మరింత వివరంగా  మీరు - మీ వ్యక్తిత్వంలో చదవండి.

🙏29. "ఇంటర్‌ పర్సనల్‌ రిలేషన్స్‌":-
"ఇతరులతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి అనే అంశంపై కూడా మనకు ఏర్పడే ఒత్తిడి ఆధారపడి ఉంటుంది.    నిత్యం మనం ఒకరిపై ఒకరం ఆధారపడి ఉంటాం.  ఇలాంటి సందర్భంలో ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరుచుకుంటే మనం, ఇతరులు సంతోషంగా ఉండ గలుగు తాము.

🙏30. "ఇంట్రాపర్సనల్‌ రిలేషన్‌"
మన మనసుతో మనకు ఉండే సంబంధాన్ని "ఇంట్రాపర్సనల్‌ రిలేషన్‌" అంటారు.    మన మనసుని మనం ఎలా నియంత్రించుకుంటున్నాం? మనం ఎలా ఆలోచిస్తున్నాం... మనం ఎటువంటి అభిరుచులు కలిగివున్నాం... మన లావాదేవీలన్నీ సవ్యంగా జరుగుతున్నాయా?  నా బాధ్యతలు  నేను సక్రమంగా నిర్వర్తిస్తున్నానా ? అనే ఆలోచనల్ని మనం నిరంతరం గమనిస్తుంటాం.    ఈ రిలేషన్‌ సక్రమంగా ఉన్నట్లయితే ఒత్తిడి లేకుండా ఉంటుంది.

🙏31. అంతర్మధనం వద్దు...:-. ఓపెన్‌ అవ్వండి!
ఏదో ఒక సమస్యపై మీలో మీరు తర్కించుకుంటూ బాధపడేదానికన్నా , మీ స్నేహితులకు లేదా మీ లైఫ్‌ పార్టనర్‌కు సమస్య వివరించండి.    మీకు సొంతంగా పరిష్కారం దొరకని విషయలకు ఇతరుల అనుభవాల నుంచి "పరిష్కార మార్గాలు"  లభిస్తాయి. అందుకే మనలో మనం మానసికంగా కుంగిపోవడం కన్నా మిత్రులతో పంచుకుంటూ ఉంటే చాలా 'రిలాక్స్‌' అవుతాం.

A. Avod: 100% perfection, 30 రోజులలో 29 రోజులు బాగా చేసి ఒకరోజు లేకపోయినా "ఎఫెక్ట్" మీరు చెయ్యరు.  అక్కడ ఆ తగువిధంగా స్పందించండి.

🪴" Accept it change it, leave it.:- "ఏదో జరిగిపోయింది లే ఇప్పుడు ఏమీ చేయలేవు చేంజ్ చేయుటకు వీలు లేదు ప్రయత్నం జరగకుండా చూసేందుకు సిద్ధంగా ఉండండి.

💜" To what you do develop sources:- ఏమీ జరగకుండా ఉన్న
నీవు మార్చటానికి ప్రయత్నం చేయాలి. ఎక్కువ చేయాలి , చేంజ్ చేయుటకు ప్రయత్నం 100% ఆలోచించవలసిన పనిలేదు.  వదిలే ఒకళ్ళ మీద ఒకళ్ళు  దూషించుకొనుట అనే విషయాన్ని వదిలిపెట్టు,
మనము ఏమి తలుచుకున్నాము అదే చెయ్యి అంతే! వాదులాటలో వాగ్వివాదములు, విమర్శలు ,చేయకండి.

❤️' Develop Sources":- కొత్త మార్గాల ద్వారా అన్వేషించి వాటిని పెంపొందింప చెయ్యి.   కమ్యూనికేషన్ కే స్కిల్స్ నీవు పెంచుకున్న సమయము ఒత్తిడి తగ్గే అవకాశము వస్తుంది.

💚" Are pursue  do not go Reserve.:-" 
జరిగిన విషయాన్ని ఏ విధంగా నీవు చూస్తున్నావు .  మీరు ఒక బాటిల్ వాటర్ కానీ మీరు పట్టుకొని రండి అంటే, ఇప్పుడు ప్రస్తుతం మీ చేతుల్లో ఉంది, అనగా సమస్య మీ చేతుల్లో ఉంది ,ఇప్పుడు ఆ వాటర్ బాటిల్ను పైన గాని కింద గాని పెట్టండి.   అప్పుడు మీ చేతుల్లో ఏముంది ఏమీ లేదు కదా!  అంటే సమస్య కూడా లేనట్టే, అందుకే మీరు పట్టుకున్న ఉంటుంది , అది వదిలేస్తే పోతుంది అనే విషయాన్ని గ్రహించండి.

🦚" ముఖ్యంగా మగవాళ్ళు గ్రహించవలసిన రహస్యమేమిటంటే ఇంటి దగ్గర నుండి ఒత్తిడి లేకపోతే ఆఫీసులో "ఒత్తిడి "చాలా మటుకు తగ్గుతుంది . మీరు ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసవంతంగా ఉండగలరు.

🐅" ఒత్తిడిని "సింహం" తో పోలుస్తారు.   మచ్చిక చేసుకుంటే అద్భుతాలు మీరు చేయవచ్చు.   వదిలించుకోవటం కంటే దీనిని అధిగమించటం నేర్చుకుంటే మంచిది.   "హార్ట్ ఎటాక్ " కన్నా  ప్రమాదమైనది".         "థాట్ ఎటాక్" కి  మూల కారణము ఆలోచనలు అధికమయ్యే  ఒత్తిడికి లోను కావటమే.

🦀" నేడు అధికంగా కార్పొరేట్ హాస్పిటల్స్ ఎక్కువైనాయి.  అలాగే వృద్ధుల ఆశ్రమాలు కూడా ఎక్కువ అయినాయి.   ఒత్తిడి నుండి ఎవరూ తప్పించుకోలేరు .  ఇది నగ్నసత్యం,.  ఇది అనాధికాలకు నుండి ఉన్నది.  
        🙏🙏🙏
"Stress" నిర్వాహణ కోసం your dress wings and left fily away, Stress is the emotional and physical strain caused by our response to pressure from the outside world.  ఒక కొలమానం
  Pressure. ను Maintain చెయ్యి.

1) also a necessary part of our daily lives,any thing that stimulates us.

2)" To a act think or react simple for extreme.

3)' without Stress.

🔥" School ,college, office ,society 

🔥"ప్రతి ఒక్కరూ ఇంట్లో ఆఫీసులో ఒత్తిడికి గురి అవటం సహజము.  ఈ ప్రపంచంలో ఒత్తిడి లేని వారంటూ ఎవరు ఉండరు.  ఒత్తిడి అనేది సహజ లక్షణం.   ఒత్తిడి" తొలగించుకోవటం ఎవరివల్లా సాధ్యం కాదు.
కానీ దానిని కంట్రోల్ లో పెట్టడానికి  మాత్రమే మార్గాలు కలవు.  అందుకే దీనిని 
"Tress management"
అంటున్నాము.
 
🔥"మీరు సంపాదించేది బాగా జీవించడానికి ఒత్తిడితో మిమ్మల్ని మీరు చంపుకోవడానికి కాదు కదా!

🔥 ఏ పని ఒత్తిడిని కలిగించదు .  మీ శరీరము మనస్సు భావోద్రేకాలను మీరు సరిగ్గా నియంత్రించుకోకపోతె "ఒత్తిడి " కలిగిస్తుంది.

🔥" బయట పరిస్థితులు మీకు శారీరికమైన నొప్పిని మాత్రమే కలగజేయబడతాయి. బాధ మాత్రం మీ "మానసిక సృష్టి" అని గ్రహించండి.

🙏'"మిమ్మల్ని యాతనికి గురి చేస్తోంది మీ షెడ్యూల్ కాదు,  విషయము ఏమిటంటే మీరు కేవలం మీ ఆలోచన, భావోద్వేగాలలో ఊపిరి సలపనంతగా మునిగిపోయి ఉన్నారు.

🔥" మీకు సమస్య ఎదురైనా మీరు దానిని ఎదుర్కొంటారు,  దాని నుంచి మీరేమీ నేర్చుకుంటారు అన్నది పూర్తిగా మీ మీద ఆధారపడి ఉంటుంది.  అని తెలుసుకోండి!

👍" 1)" more depend:- less source.
ఒక విద్యార్థి చదవనప్పుడు, ఏ రోజు చదువు 'హోంవర్క్'  ఆ రోజే పూర్తి చేయనప్పుడు, "ఉద్యోగి "తాను చేయవలసిన ఆరోజు పనిని చేయనప్పుడు  మిగిలి పోతుంది , మరుసటి రోజుకు "వాయిదా ఏర్పడుతుంది " అలాగే ఇంటిలో పనులు కూడా రోజు చేయవలసిన పనులు   ఆరోజు చేయనప్పుడు "ఒత్తిడి" కి 
గురి అవుతారు.

🔥 Expectations:- ఎవరికివారు నా భార్య ఇలా ఉండాలని నిర్దేశించుకుంటే,  అలాగే నా భర్త ఇలా ఉండాలి అని అనుకుంటే అంతే నేను ఎలా,  పై స్థాయిలో వుండాలి. అని ముందే ఊహించుకొని ఆశ ,కోరిక ఉన్నవాళ్లు ఒత్తిడికి ఎక్కువ గురి అవుతారు.

❤️" Emotions:- " పొరపాటున నీరు మీద పోసిన, అప్పటికప్పుడు వచ్చే కోపం వల్ల లేదా అనుకోని విపత్తు సడన్  వచ్చిన,

🙏" Environment":-
   మాట మాట పెరిగి పోతుంది అప్పుడు మీరు ఒత్తిడికి గురి అవుతారు.

🌷"Ego:- అహంకారము వల్ల వచ్చేది , నా మాట మీరు వినరా ? అంటూ ఒత్తిడికి గురి అవుట జరుగును.
🙏మజుందార్,
బెంగళూరు
87925-86125.
    🙏🙏🙏
మీరు పూర్తిగా చదివి నందులకు నా ధన్యవాదములు, ఇష్టము లేని వారికి విసుగు  అని మీకు అనిపించవచ్చు.  ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించి రాయాలని నా తపన ఆరాటము, ఇది నా అభిప్రాయము మాత్రమే తప్ప మీకు ఇబ్బంది కలిగించాలని కాదు.  అర్థం చేసుకున్న వారు,
నచ్చినవారు ఇతరులకు షేర్ చేయండి! నేను రాసింది చాలా తక్కువ, రాయవలసింది చాలా ఉన్నది. అనిగ్రహించండి.
🔥🔥🔥🔥🔥🔥

"Time management". ("సమయ "పాలన నిర్వహణ)

 "🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳"Time management".       

("సమయ "పాలన  నిర్వహణ)                    

🚩"సమర్పణ": & సేకరణ: ఇంపాక్ట్ ఫౌండేషన్ సౌజన్యంతో, "మజుందార్
 బెంగళూర్," 87925-86125.

          🧭🕰️⏰⏲️
⌚"నీ   సమయం   డబ్బు కంటే ఎంతో విలువైనది  అని  గుర్తించు,   అది నీ ధనం, నీ సమయాన్ని దొంగిలించుకుని పోవాలని ఎదురు చూస్తూ ఉంటాయి?   సమయం ఆగదు,   మీరు  కూల్  గా ఉండండి.                     

🚨"నీ గతం ,నీ "History"   నీ భవిష్యత్తు "Mistory". నీవు ప్రస్తుతమున్న "వర్తమానం" దేవుడిచ్చిన "Gift" అని ఆలోచించండి తెలుసుకోండి, ఆచరణ చెయ్యండి.!               

🌅"ఒక రోజుకు నీ ఆస్తి "1440 నిమిషాలు, మనం టైము ని  సక్రమముగా ఉపయోగించుకోవాలంటే ముఖ్యమైనది,.      "Focus -- Most important Task" ఏమిటి?                     

🚦మీరు ప్రతి రోజు , ప్రతి వారాన్ని, ప్రతి నెలా, విభజించి  పెట్టుకోవాలి, పూర్తి చేయాలి అనేది మీ లక్ష్యం,   విభజించు కొనుట అనేది  చాలా  ముఖ్యము.                    

🚑1) Urgent and Important.                  

🛻2) Urgent but not Important.             

🚌3)Not Urgent but important.            

🚲4)Not Urgent and not Important.                

🚩పైన చెప్పిన విధంగా నాలుగు పాయింట్లు చాలా శ్రద్ధగా పనులు విభజించు కోండి.  

🌼కొన్నిసార్లు C ను నుండి  A కి , పనులు మారవచ్చు,.                 

🪴4) పాయింటు చాలా పనికిమాలిన ది, ఫేస్బుక్ చూడటం, వాట్సప్ చూడటం, చాటింగ్ చేయటం, టీవీ చూడటం, సినిమా చూడటం, ఈ విషయాలపై మీరు ఎక్కువ దృష్టి పెడతారు, మీ సమయాన్ని వృధా చేసుకుంటారు, అవి చూడవచ్చు  కాదు అనను,  దానికి ప్రత్యేక సమయం కేటాయించుకోండి?.   అప్పుడు  దానికి ఒక గంట , కేటాయించండి.  సమయాన్ని డబ్బుతో పోలుస్తున్నారు కదా!    అదే కరెక్టు విధానము, 

🚩నేటి యువత ప్రత్యేకముగా గమనించవలసినది, 
      🙏🙏🙏
🎈"మీరుఎక్కువ గ్రూపులో సభ్యులుగా ఉండరాదు, ఏ గ్రూపు అవసరము ? ఏది ఉపయోగము,?. సందేశాత్మకంగా, చైతన్యవంతంగా, మంచి కొటేషన్స్, భగవత్ సంబంధ విషయాలు గల ఒక గ్రూపు ని  లేదా రెండు గ్రూపులను ఎంచుకోండి, ఫార్వర్డ్ మెసేజ్లు పెట్టుట, చేసి మీ సమయం వృధా చేస్తున్నారు. 

⌚"నీవు చదవకుండా ఎదుటివారి "టైమ్"  వృధా చేసిన వాడివి, పనికి రాని వాడిగా మిగిలిపోతావు, సుమా!

🪔నిన్ను నీ నడత ను, నీ మనసు, నీ చేతలు, మీ వ్యవహార శైలి ఎదుటివాడు అంచనా వేయగలడు?                 

💃🏿"స్త్రీ సంబంధించిన సెక్స్, కుళ్ళు జోక్స్, మత, రాజకీయ విషయాలు, జోలికి వెళ్లకపోవటం ఉత్తమము.               

🤖అప్పు ఇచ్చిన "ప్రాంసరీ నోటు" రాయించుకోవడం ఎందుకు?  అతను ఇచ్చేవాడు  అయితే ఇస్తాడు కానీ టైముకు ముందుగా.  నీవు అతనికి ఫోన్ ద్వారా  హెచ్చరిక ఇచ్చుటకు.  ఉపయోగము.            

👨‍👩‍👦"నీవు  నీ సమయమును ఎవరితో గడుపుతున్న, నీ భవిష్యత్తు అలాగే ఉంటుంది ,  నీవు ఎవరితో తిరుగుతున్నావు?   నీ సమయము అత్యద్భుతమైన ఉపాధ్యాయుడు లాంటిది.                         నీ సమయాన్ని కొంత "మంచి పుస్తకాలు, చదవడం, మోటివేషన్, చైతన్యం, స్ఫూర్తిదాయకము మైన T.V programs తిలకించు, వినుటకు ఆసక్తి చూపు, 

🙏🏽"మీరుసమయానికి ఆహారం తీసుకోకపోతే, నీ ఆరోగ్యం దెబ్బతింటుంది,  

🕰️"సమయానికి పనిచెయ్యని" సోమరి " తనము, ఓ గుడ్డు లాంటిది .అందులో ఆకతాయితనం గుడ్డు పెడుతుంది జాగ్రత్త!         

⏲️"నీ సమయాన్ని ఆహ్లాదకరమైన ఆలోచనలతో నింపు, నీ జీవితం సుఖమయం అవుతుంది.     

⏰సమయాన్ని  సరిగ్గా వాడుకోవటం  తెలిసిన వారు  అనుకున్నది తప్పక  సాధించగలరు.              

🎎నీవు నీ స్నేహితుల గురించి చెప్పు నేను నీ గురించి చెప్తాను.             

⏱️"ఏ పనికైనా సమయము  కేటాయించడం చెయ్యకపోతే మీరు "నైపుణ్యము" సాధించలేరు.              

🧭"నీవు నీ సమయాన్ని ఏదైనా" సేవ కోసం" ఉపయోగించు తప్పులేదు.                

🔦నీకు గమ్యం లేని పని ఎప్పుడూ చేయకు?  

🐵సమయానికి కళ్లు తెరువు తగు నిర్ణయాలు తీసుకో?                       

🎪ఎప్పుడు కుర్చీకి అతుక్కుని ఉండకు మధ్య, మధ్య బ్రేక్ అవసరము,. మీ శరీరానికి ,మెదడుకు తగు వ్యాయామం అవసరం, మంచిది.                       

🪂నీపని కి నీవే రివార్డు ఇచ్చుకో?  నీవు స్నేహితులకు ఫ్యామిలీతో సెలవుదినాల్లో కొద్ది సమయం కేటాయించుకోవాలి?  

🎽నీవు చేసే మంచి పనులు రోజుకు 20 శాతమే ఉపయోగము, 80% శాతము దేనికీ, ఎవరికి పనికిరావు, అని తెలుసుకో?

🔥" సొల్లు" విషయాలు మాట్లాడవద్దు,  సరియైన "సొల్యూషన్ "ఇవ్వాలని మాత్రమే తెలుసుకో!       
        🔥🔥🔥
✒️1)నీవు చేయవలసినవి, చేయకూడనివి రాసుకో!

🙏🏽2) నీ గమ్యం (గోల్) వైపు సాగాలి, సాధించాలి,  అనే తపన ఉండాలి?      

👟3) "Short term Goals"--. Long term goals   నీవు  తయారు చేసుకోవాలి.               

👍రోజు అరగంట ముందే నిద్ర మేలుకో! పనిమీద వెళ్ళినప్పుడు పది నిమిషాలు ముందుగా వెళ్ళుట అలవాటు చేసుకో!                          

👥4) పని విభజన చెయ్యి , అన్నీ నేనే చెయ్యాలి అనేది పెట్టుకోకు, కొన్ని పనులు కొందరు చేయగలరు, వారికి ఆ పనులు కేటాయించు , నీవు  పర్యవేక్షణ చెయ్యి, 

☝🏿"నెపోలియన్" నేను రాజ్యాన్ని  నైనా వదులుకుంటాను, కాని సమయాన్ని   మాత్రము వదులుకోను. అని అంటాడు.           

👨🏿‍🚒"Effective Time Manegement" చేయుటకు స్క్రిప్ట్ తయారు చేసుకో, రంగస్థలము, నకు వెళుతున్నానని భావించు, ప్రాముఖ్యత, క్రమశిక్షణ, పట్టుదల, చాలా అవసరము.          

🤓నీ జీవితము లోని భూత, వర్తమాన, భవిష్యత్తు కాలములను గురించి ఆలోచించకు, భూత కాలం , భవిష్యత్తు కాలం గురించి పూర్తిగా మర్చిపో! ఇప్పుడు జరుగు "వర్తమానము" గురించే  మీ యొక్క దృష్టి కోణంలో చూడు,                      

😈"సరైన సమయంలో సరైన మార్గాన్ని, దశ- దిశ మార్చుట మీ చేతుల్లో ఉంది.                            

🌻1) ఒక ఆలోచన పూర్తి చేయి, ఈ ఆలోచన పూర్తి కానిదే మరొక కొత్త ఆలోచనను దరిచేరకుండా చూడు, 

(Maltitasking). సమయం మీ చేతుల్లో ఉండాలి, do not think at a time,. 

🌺2)Interruption, నీవు నీ ఫోను సైలెంట్లో పెట్టు తప్పులేదు .మీరు గెలిస్తే వాళ్లే అర్థం చేసుకుంటారు నిన్ను,   నీకు నీ జీవితం ,నీ గోలు ముఖ్యం,.   మీ సమయాన్ని   పదిలంగా జాగ్రత్తగా వాడుకో, అతి ముఖ్యము.          

🔥3)"Being Disorganised". :, మీ బైక్ తాళాలు ఎక్కడో పెడతారు, మర్చిపోతారు, ఆఫీస్ ఫైల్స్ ఆర్గనైజింగ్ గా ఎలా?   ఏ కేటగిరి ఎలా!   ఆర్డర్ ప్రకారము సర్దుకుంటాము కదా! 

🌹ఇంటిలో కూడా ప్రతి వస్తువు ఎక్కడ ఉండవలసిన వస్తువులు, అక్కడ సక్రమముగా పేర్చుకోండి?, మిమ్ములను చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. మీరు ఆచరించి చూపిన  మీ పిల్లలకు తప్పక నేర్చుకుంటారు.              

🥀4) "Perfection" (Post Pond) "నీ సమయాన్ని నీకు నచ్చినట్లు తీర్చిదిద్దుకోవాలి. వాయిదా వీరుడు కాకూడదు, work,-load పెరుగును, చిరాకు పడతాము, ఒకరోజు తినకపోతే , రెండు రోజుల ఆహారము ను ఒకరోజు తినగల మా! అంతులేని సమయాన్ని నష్ట పోతావ్,బద్దకాన్ని, పెంచి పోషించడం అలవాటు చేసుకోవద్దు , వాయిదా వీరుడు ఉండకు,సుమా!  

🚩వ్యక్తులలో రెండు రకాల వారు ఉంటారు.

🐚1)Monocritical :- "వీరు "ఋషి " లాంటివారు,  వీరికి  ఎలాంటివి విషయాలు  అక్కరలేదు, అన్నిసవ్యంగా చేస్తారు.  వీరిని గురించి విచారించవలసిన అవసరం లేదు.     

🌷2)"Polytramic:- మనము ఈ కోవకు చెందిన వాళ్ళము.          పై విషయాలన్నీ తెలుసుకొని ప్రవర్తించ వలెను.  "వివాహ సమయములో. "ఖచ్చితమైన" నిర్దిష్టమైన" గంటలు నిమిషాలు, చూసి, సుముహూర్తము సమయము లో వధూవరుల చేత 'జీలకర్ర +బెల్లము " సమపాళ్లలో కలిపి మిశ్రమాన్ని తలమీద పెట్టు తారు.  

🌼"మహాభారత యుద్ధము కూడా "సమయము" నిర్ణయించిన దే! ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సరైన సమయాన్ని, నిర్ణయించి చేస్తారు. కదా!  
 "MAZUMDAR, "
"మళ్లీ  సరియైన సమయానికి  కలుద్దాం!"
⏱️⏲️⏰🕰️🧭✒️

వీర్ సావర్కర్

 వీర్ సావర్కర్ 
....
ఒక కొబ్బరికాయ పీచుతీయాలంటే కత్తికోసం వెదుకుతాం! 
.
అదే గోళ్ళతో తీయమంటే!
 వామ్మో!  ఎంత కష్టం!
.
అట్లాంటిది ప్రతి రోజూ రెండు బస్తాల కొబ్బరికాయలు చేత్తో పీచుతీసి, గానుగలో వేసి ఎద్దుకు బదులుగా తాను గానుగాడి నూనె తీసి,ఒంటరిగా చీకటికొట్లో 
27 సంవత్సరాలు మగ్గిమగ్గి  ,
బొగ్గుతో గోడలమీద కవితలువ్రాసి, వ్రాసినదానిని కంఠస్తం చేసి తదనంతర జీవితంలో పుస్తకంగా అచ్చువేయడం మానవమాత్రుడికి సాధ్యమవుతుందా! 
.
దానికి ఎంత ఓర్పు! కావాలి!
ఎంత మానసిక దృఢత్వం కావాలి!
.
అసలు అలాంటి మనిషి పుట్టాడా?
.
లేకేం ఉన్నాడు !
.
అలాంటి మనిషొకడు మన స్వాతంత్ర్య సమరయోధుడని ఎంతమందికి తెలుసు? 
.
మన పాఠ్యపుస్తకాలు అసలు ఆయన గురించి చెప్పాయా!
.
అండమాన్ సెల్యులర్ జైలులో గాలి వెలుతురు దూరని గదిలో 27 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష ఏకబిగిన అనుభవించి జీవితంలోని యవ్వనాన్ని దేశంకోసం ధారపోసిన మహనీయుడు
" స్వాతంత్ర్య వీరసావర్కర్ "

 ఒకరిద్దరివల్లనే మనకు స్వాతంత్ర్యం రాలేదు !
.
అది ఎంతోమంది త్యాగధనులు జీవితాన్ని తృణప్రాయంగా భావించి స్వాతంత్ర్య కదనరంగంలో కొదమసింగాల్లా దూకటం వలన వచ్చింది !
.
 వారిలో సావర్కర్ అగ్రగణ్యులు !
.
వీరసావర్కర్ ఎంతోమంది వీరులలో స్ఫూర్తి రగిలించేవారు .ఆయన
చుట్టూ లండన్ లో ఎంతో మంది దేశభక్తులు గుమికూడేవారు ! వారికి గురుస్థానం ఈయనదే !
..
వారు ..భాయీపరమానంద్,వీరేంద్రనాధ్ చటోపాధ్యాయ, వి.వి.స్ అయ్యర్..,సర్దార్ సింగ్ రాణా ,మేడమ్ కామా !, బాపట్ , ఎమ్.పి.టి. ఆచార్య ,మదన్ లాల్ దింఘ్రా....... 
.
ఇలా ఎంతోమందికి ఉపదేశగురువు ఆయన !

మన దురదృష్టం ఏమిటో కానీ ఇంతమంది,ఇంకా ఎంతోమంది  అకళంక దేశభక్తుల త్యాగ ఫలం మన స్వాతంత్ర్యం అని మన పిల్లలకు తెలియకపోవడం !
.
 వీరుల చరిత్ర మనం పిల్లలకు చెప్పక ఎవరో ఒకరిద్దరి వల్ల స్వాతంత్ర్యం వచ్చింది అనే అబద్ధాలు విరివిగా ప్రచారం చెయ్యడం ! వాటినే పిల్లలు నమ్మడం ! 
.
వీరసావర్కార్ ను చదవండి చదివించండి !!!
..
సావర్కర్ అంటే మొక్కవోని ఉక్కు సంకల్పం 
సావర్కర్ అంటే స్ఫూర్తి
సావర్కర్ అంటే రగిలే నిప్పుకణం
సావర్కర్ అంటే సాహసం
సావర్కర్ అంటే తలవంచని వ్యక్తిత్వం
సావర్కర్ అంటే నిజాయతి
సావర్కర్ అంటే నీతి 
సావర్కర్ అంటే ధైర్యవంతుల గుండె చప్పుడు...

25సంవత్సరాలు ఒంటరి జైలు జీవితం ఎంత కఠినమో అర్ధం అవుతుంది..
వీర్ సావర్కర్ లాంటి వారు లక్షల మంది జీవితాలను ధార పోయడంతో  వచ్చిన స్వాతంత్ర్యాన్ని చాలా సుఖంగా అనుభవించేస్తున్నాం మనం....

భారత మాతకు జయము

ఇంతటి దేశభక్తుడి ఆస్తిని బ్రిటిష్ ప్రభుత్వం జప్తు చేసింది.. స్వాతంత్య్రం తరువాత వచ్చిన భారతీయ ప్రభుత్వం ఆస్తిని ఆయనకు అప్పగించలేదు కూడా..

తుష ఖండన న్యాయము

 *తుష ఖండన న్యాయము*
***************
*తుషము అంటే పొట్టు,ఉముక ఊక,బూసి,బూగర అనే అర్థాలున్నాయి.ఖండనము అంటే ఛేదనము,విరుచుట, ముక్కలుగా చేయుట, నాశనము చేయుట అనే అర్థాలు ఉన్నాయి.*

*తుష ఖండనము అంటే ఊకను ఎంత ముక్కలుగా చేసినా లేదా దంపినా దానివల్ల ప్రయోజనం ఉండదు.అలాగే ఉపయోగం లేని మాటలు ఎన్ని మాట్లాడినా ఆ మాటల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.అలా నిష్ప్రయోజనమైన మాటలను "ఊకదంపుడు" లేదా తుష ఖండనము లేదా తుషా ఘాతము అంటారు.*

*మాటల్లో పదాడంబరమే తప్ప కార్యాచరణకు పనికి వచ్చేది ఏమీ ఉండదు. అన్నీ ఊకలా గాలికి తేలిపోతాయి.ఒక్క మాట గట్టిమాట గుర్తుంచుకోదగినదీ ఉండదు. ఆ విధంగా చెప్పుకోదగినవిగా లేని మాటల్ని, అలా వక్తలు చేసే  ఉపన్యాసాలను ఈ తుష ఖండన న్యాయముతో పోలుస్తూ ఉంటారు.*

*ఇలాంటి వారిని ఉద్దేశించి రాసిన వేమన శతక పద్యాన్ని చూద్దాం.*

*" నిండు నదులు పారు నిల్చి గంభీరమై/ వెఱ్ఱి వాగు పారు వేగ బొర్లి/ అల్పుడాడు రీతి నధికుండు నాడునా/ విశ్వధాభిరామ వినురవేమ!"*

*అనగా నీటితో నిండి ఉండే నదులు గంభీరంగా నిలిచి ప్రవహిస్తూ ఉంటాయి. కానీ చిన్న చిన్న వాగులు, కాలువలు పైకి పొర్లి వేగంగా పెద్ద శబ్దం చేస్తూ గలగలా ప్రవహిస్తుంటాయి.వాటి వల్ల ఉపయోగం అంతగా ఉండదు.*

*అలాగే అల్పుడి మాటల్లో  వాగాడంబరమే కానీ పద విజ్ఞానం ఇసుమంతైనా  కనిపించదు.*

*అందుకే మనం మాట్లాడే మాటల్లో వందలో ఒకటైన గుర్తుంచుకోదగినదీ,ఉపయోగకరంగా ఉండాలి.*

 *ఇలాంటి న్యాయాలు లోకోక్తులు చదివినప్పుడు మన ముందు తరం వారి నిశిత దృష్టికి ఆశ్చర్యం, ఆనందం కలుగక మానదు.*

" పత్యాయమన' పద్ధతుల నిర్ణయాలు తీసుకోవడం వల్ల

 🌹🌹🌹🌹🌹🌹🌹
" పత్యాయమన' పద్ధతుల నిర్ణయాలు తీసుకోవడం వల్ల 
       🔥🔥🔥
సమర్పణ: Mazumdar Bangalore, Karnataka,87925-86125.
🙏🙏🙏

1)" నాకు ఏది? మాకు ఏది ?  కోణంలో ఆలోచించి నిర్ణయాలు ట్రాక్ మార్చాలి.

2)" సందర్భంగా నిర్ణయ పరిధి సమస్య నిర్ణయము ప్లేస్ కు తగినట్లు మరియు ప్రాంతమును బట్టి, తీసుకోవాలి.

3)" నా శక్తి సామర్ధ్యాల మేరకు పూర్వం అనుభవంతో సమస్యల పైన 

4)" నా జీవితానికి, గౌరవానికి, ముప్పు లేకుండా తిరిగి చూడు.

5)" ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ ద్వారా,

6)" కూలకషం " గా చర్చించి ఆలోచించి నిర్ణయ పరిణాల మీద అంచనాలకు రావలసి ఉన్నది.

7)" సరియైన సహజమైన పరిష్కార దిశగా అడుగులు వేస్తూ!

8)" ఈ రోజు తీసుకొన్న నిర్ణయాలు రేపు తప్పు అగును.  Outdated అగును.

9)" అంబులెన్స్ 90 K.M , స్పీడులో పోవుటలో తప్పులేదు,
అదే మీ యొక్క కారు
70K.M స్పీడు మించిపోరాదు.

10)"  ద్వైత సిద్ధాంతం" ప్రకారము "VIP "gallery
లోనికి అందరికీ ప్రవేశము ఉండదు కదా!
🧤💐🧤💐🧤💐🧤

మీరు తీసుకునే నిర్ణయాలు, ఈ పనులతో చేసిన ఈ సమాజానికి శోభను పెంచవు. అని గుర్తించండి!

 🧤🧤🧤🧤🧤🧤🧤
" మీరు తీసుకునే నిర్ణయాలు, ఈ పనులతో చేసిన  ఈ సమాజానికి శోభను పెంచవు. అని గుర్తించండి!
      🙏🙏🙏
🙏సమర్పణ: Mazumdar Bangalore, 87925-86125.
        🔥🔥🔥
1) " మీరు రాత్రిపూట నిర్ణయాలు చేయకండి.

2)" Negative mind
కలవారి సలహాలు సూచనలు వినకండి.

3)" కోపంలో, ఆవేశంలో ,
    దుఃఖముగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు సరే ఇది ఉండవు.

4)" ఎమోషన్స్, డిప్రెషన్ లో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు పనికిరావు.

5)" మీకు ఆచరణ సాధ్యము కానీ వాటి జోలికి పోరాదు.

6)" చదువుకున్న వారి నిర్ణయాలు బాగుంటాయని గుడ్డిగా ఆశించకండి.

7)" ఇతరులకు ఇబ్బందికరంగా ఉండే నిర్ణయాలు తీసుకోకండి.

8)" మీరు ఆడంబరాలు లేకుండా ,అప్పులు పాలు కాకుండా మీ నిర్ణయాలు చూసుకోండి.

9)" తక్కువ ధర అని, డిస్కౌంట్ ఇస్తున్నారని నాణ్యతలేని వస్తు కొనుగోలు చేసే నిర్ణయాలు చేయకండి.

10)" ఒకసారి తప్పు నిర్ణయం తీసుకున్న తిరిగి అటువంటి "నిర్ణయం" జోలికి పోకండి.

11)" ఇప్పుడు భయపడి రక్త సంబంధాలు తెగిపోతాయని నిర్ణయాలు తీసుకోవడం లో స్నేహం పాడైపోవునని  మొహమాటపడి నిర్ణయాలు మీరు ప్రకటించవద్దు.

12)" తొందరపడి సంతకాలు, ఆలోచించకుండా సంతకాలు, ఒత్తిడికి  భయపడి సంతకాలు, చేయుట చేయరాదు.

13)" మనలను పొగిడిన వారు సహజముగా మనకు నచ్చగలరు. 
వారు చెప్పిన విధముగా మీ నిర్ణయాలు తీసుకోవడం వల్ల

14)" Money mind" లాంటి ఆటలా నిర్ణయాలు చేయకండి.

15)" పదిమంది నడుస్తున్నారు కదా అని ఆ దారిలో మీరు నడవకండి.

16)" నీ మనసు చెప్పినట్లు నిర్ణయాలు మంచివి కాదు.

17)" గుణపాఠాలు నేర్చుకునే వారిగా ఉండకండి.

18)" అవగాహన , సమాచార సేకరణ, లేకుండా నిర్ణయాలు తీసుకోకండి.

19)" నైతిక విలువలు లకు లోబడి నిర్ణయాలు తీసుకోండి.

20)" షార్ట్కట్ లో వెళ్లిపోవాలని నిర్ణయాలు తీసుకోవద్దు.

21)" ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకముగా మీ నిర్ణయాలు ఉండరాదు.

22)" ఇతర మేనేజర్లు తక్కువగా చూడవద్దు, వారి నిర్ణయాలు కూడా వినవలసి ఉండును.

23)" ఇప్పుడు మీ ఆలోచనలు మూసా పోసినట్లు ఉండకూడదు.

24)" మీ "బాస్ "గురించి ఎక్కడ చెడుగా మాట్లాడవద్దు.

25)" నీ మాటే "ఫైనల్" అని అనుకోవద్దు.

26)" ఘర్షణలకు దూరంగా ఉండే నిర్ణయాలు తీసుకోవడం
ముఖ్యము.

27)" పరిస్థితులకు అనుగుణంగా Updated 
నిర్ణయాలు తీసుకుంటూ
మార్పులు ఆహ్వానించి, 
మీ నిర్ణయాలు ఉండాలి.

28)" మీ నిర్ణయాలు, కుటుంబ గౌరవానికి,వంశ గౌరవానికి, తల వంపులు తెచ్చేలా, మీ నిర్ణయాలు ఉండకూడదు.

29)" మీరు నిర్ణయాలు చేసేటప్పుడు, మీ క్రింది ఉద్యోగులు మనసు నోచ్చు కోకుండా, వారికి గల ఇబ్బందులు తెలుసుకొని, వారికి ఒప్పించి ,మెప్పించి , నిర్ణయాలు చేయండి.

30)" మీ నిర్ణయం వల్ల లాభనష్టాలు బేరేజు వెయ్యండి.  కేవలము లాభాల కొరకే మీ వ్యాపారం చేయవద్దు. వ్యాపారస్తుడు లా కాకుండా" ధనవంతులు" గా ఎదగండి!

🙏🙏🙏🙏🙏

జలమౌక్తిక న్యాయము

 *జలమౌక్తిక న్యాయము*
**************
*జలము అంటే నీరు. మోక్తికము అంటే ముత్యము.*

*ముత్యపు చిప్పలో పడిన నీరు ముత్యము అవుతుంది. "సమయం వచ్చినప్పుడు అల్పుడు కూడా దొడ్డవాడు అంటే గొప్పవాడవుతాడు' అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.*

*నీరు ఆకాశం నుండి భూమి మీద పడేటప్పుడు స్వచ్ఛమైనదే కానీ అది పడే తావులను బట్టి దానికి విలువ  పెరుగుతుంది.గౌరవం కలుగుతుంది.దీనిని వ్యక్తులకు వర్తింప చేస్తే ఎలా ఉంటుందో ఈ జల మౌక్తిక న్యాయమునకు సంబంధించిన చక్కని  భర్తృహరి సుభాషితమును చూద్దాం.*

*'నీరము తప్త లోహమున నిల్చి యనామకమై నశించు నా /నా నీరమె  ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు నా /నీరమే శుక్తిలో బడి మణిత్వము గాంచు సమంచిత ప్రభన్/ భౌరుష వృత్తు లిట్లదము మధ్యము నుత్తము గొల్చు వారికిన్!'*

 *నీరు  కాలుతున్న పాత్రపై పడితే కనిపించకుండా ఆవిరైపోతుంది/ నశిస్తుంది.అదే నీరు తామరాకు మీద పడితే ముత్యం వలె కనిపిస్తుంది.అదే నీరు ముత్యపు చిప్పలో పడితే నిజమైన ముత్యమై ప్రకాశిస్తుంది.*

*అలాగే మనిషి యొక్క వ్యక్తిత్వం కూడా. చేసే స్నేహాన్ని బట్టి పరిస్థితులు, పరిసరాలను బట్టి మారుతూ ఉంటుంది.*

*వేడి పాత్రలాంటి దుర్జనులతో చేరితే అధముడుగా పేరు కూడా లేకుండా నశించి పోతాడు.మంచి చెడులు మధ్యస్థంగా ఉన్న వారితో  చేరితే తామరాకుపై నీటిబొట్టులా కొంతైనా గుర్తింపు పొందగలడు.అదే ముత్యపు చిప్ప లాంటి మంచి వారితో చేరితే మంచి గుణాలను కలిగి ఆణిముత్యమై సమాజంలో గౌరవ, మర్యాదలతో ప్రకాశిస్తాడు.*

*శీల నిర్మాణం నిర్మాణము అనేది కుటుంబం నుండే మొదలవుతుంది కాబట్టి బాల్యం నుంచే వారికి నైతికత, మంచి నడవడిక  నేర్పాలి.అలాగే  వారిలో సహకారం, సామాజిక స్పృహ, దేశభక్తి,నీతీ నిజాయితీ లాంటి  మానవీయ విలువలు నేర్చుకునేలా  పాఠశాలతో పాటు సమాజం కూడా బాధ్యత వహించాలి.అప్పుడే  ముత్యమంటి చక్కని వ్యక్తిత్వం గల పౌరులు తయారవుతారు.  సమాజానికి  మేలు చేసే మానవతా తరం రూపొందుతుంది.*

ప్రతి మనిషీ- జీవితంలో సుఖంగా ఉన్నాడా

 ఆత్మీయ మిత్రులందరికీ శుభోదయం వందనాలు🌲🪴🌾🌱🌻🌷

🌹ప్రతి మనిషీ- జీవితంలో సుఖంగా ఉన్నాడా
అసలు సుఖం అంటే  మనసుకు శాంతి అన్నా, సుఖం అన్నా ఒక్కటేనాజీవితంలో డబ్బు ఉంటే సుఖం ఉన్నట్లేనా  డబ్బు ఉన్న ప్రతి ఒక్కరూ మానసిక శాంతి అనుభవిస్తున్నారాజీవితం ఎంత  చిత్రం,   విచిత్రం ఏమి లేనపుడు కడుపుకు ఇంత కూడు చాలు  అనిపిస్తూ తరువాత కాస్త గొంగళి, తర్వాత ఉండేదానికి కాస్త గూడుఅనీ ఇంతవరకు వచ్చి తృప్తిగా ఉన్నామా,  లేదే.
  🌹 ఇంకా,ఇంకా ఎదగాలి!  
ఎదిగావు..! 
🌹ఇంకా డబ్బు సంపాదించాలి !! 

🌹సంపాదించావు ..! 
నా పిల్లలు లగ్జరీగా పెరగాలి !! పెరిగారు 
పెద్ద భవంతులు కావాలి! కొన్నావు !!
 నా పరపతి పెరగాలి ! పెరిగింది !! 

🌹అయినా ఇంకా ఏదోఏమిటి ఆ ఏదో ఏదో తెలియని అసంతృప్తి !      

🌹ఎందుకు అంటే ఏమో  
   ప్రతి మనిషికి , ప్రతి మనసుకు ఎన్ని కధలు మరెన్ని వ్యధలు కథలు కథ మాటున దాగిన  కన్నీటి చెలమలు ఎన్నో ఎన్నెన్నో ... !

🌹డబ్బు ఉంటే ఆరోగ్యం ఉండక ఆరోగ్యం ఉంటే డబ్బు ఉండక భార్యా భర్తల గొడవలు ,               పిల్లలు మాట వినటంలేదని వేదన, ఉధ్యోగం , వ్యాపారం, పెళ్లి , ఇల్లు , వాకిలి, ఇలా ఎన్నో ఎన్నెన్నో ...

🌹ఎన్నో కధలు విని .. కలత పడిన మనసు ప్రశ్నిస్తుంది .... 'అసలు సుఖంగా ఉన్నవారు ఉన్నారా, సుఖం అంటే ఏమిటి 
అవును సుఖం అంటే ఏమిటి, శాంతి అంటే ఏమిటి, శాంతి ఎక్కడ దొరుకుతుంది
నీకు నచ్చిన విధంగా నీ మనసు మెచ్చిన విధంగా జరిగిన   ఏ విషయమైనా నీకు సంతోషం అనిపిస్తే అదే సుఖం !

🌹నీకు నచ్చని ఏ సంఘటన జరిగినా , అది దుఃఖం అనుకుంటావు  !
అంటే సుఖం అయినా దుఃఖం అయినా నీ మనసులో కలిగే భావాలే ! 
ఆ భావనకు అతీతంగా స్థిమితంగా జీవించ గలిగితే, స్థిత ప్రజ్ఞతే  !!

🌹ఈ స్థితికి మనసును ఎలా తీసుకు వెళ్ళాలి,
నేనే.. ఈ మేను..!'అనుకున్నంతవరకు                         యెద చీకటేగా...!  ''

🌹నేను నేనే మేను నేనే అనే భావన కంటిలో నలుసులా కుదుట పడనీయదు 
ఇక్కడ నేను అతిధిని మాత్రమే,
నాలుగు రోజుల అతిధిని మాత్రమే
'ఇది నాది కాదు కాదు..కానే కాదు.!'

 🌹అనే స్పృహ పరుగులు తీస్తున్న అరిషడ్వర్గాలను 'సత్యం' అనే  అంకుశంతో నిత్యం ఒక్కమారు స్పృశిస్తే సత్యం బోధపడుతుంది  సాక్షిగా నీ చూపు నిలబడుతుంది, డబ్బు, సిరులు, సంపదలు మేనికి సుఖాన్ని ఇస్తాయి కానీ... 
మనసుకు శాంతిని, ప్రశాంతతని ఇవ్వలేవు, 
మనసుకు శాంతి మాత్రం మరణం లేని 'మీరు .... మీరేన'ని గ్రహించిన క్షణం మాత్రమే ... !
🌹🌹🌹🌹🌹🌹

పెళ్ళిల్లలో వింత పోకడలు

 *పెళ్ళిల్లలో వింత పోకడలు*


1. *కేవలం ముఖ పరిచయం ఉన్న అందరిని వేల సంఖ్యలో పిలవడం* (పిలిచిన వారికి ఎవరు వచ్చారో కూడా గమనించే తీరిక ఉండదు. Attend అయిన వారికి 6 నెలల తరువాత అసలు సదరు పెళ్లికి వెళ్ళమని కూడా గుర్తుండదు) 
2. *ప్రొద్దున పెళ్లి అయితే, స్నానం కూడా చెయ్యని ,చెమట కంపు తో,   అపరిశుభ్రంగా ఉన్న వ్యక్తులు, అర్థ రాత్రి వంట చేసి, దానికి విందు అని పేరు పెట్టి, ప్రొదున వడ్డించడం.......రాత్రి పెళ్లి అయితే సీన్ రివర్స్ అంతే* .
3. *ఎంగేజ్మెంట్ పేరుతో పెళ్ళి అంత ఆర్భాటం చేయడం*. 
(కాబోయే వధూవరులను, పెళ్లి కాకుండానే, ఒక చోట కూర్చోపెట్టి, ఆహ్వానితులకు  అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించమనడం.)

4. *పెళ్లి కాకుండానే pre wed photo shoot అని సినిమా లెవెల్లో వింత, సామాజిక స్పృహ లేని భంగిమల్లో కాబోయే పెళ్లి కొడుకు,పెళ్లి కూతురు photos కి pose. ఇంకా ఆ photos(కొన్ని intimate వి) కూడా పెళ్లి తంతులో భాగంగా పెద్ద TV screen పైన ప్రదర్శించడం.*

5.*పెళ్లి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన డెకరేషన్ 10 గంటల్లో, ఇంకొ ఫంక్షన్ ఉంటే పీకి పారేయడం.*

6. *Photoస్ natural (candid) గా, తీయకుండా photographer కోసమే పెళ్లి చేసుకున్నట్టు, వాడు చెప్పిన వింత భంగిమల్లో pose ఇచ్చి  ఫోటోల పరమార్ధం లేకుండా పోయింది*.(photographer bill కూడా లక్షల రూపాయలు)

7. *పెళ్లి బట్టలకు కూడా లక్షల రూపాయలు ఖర్చు చేసి, జీవితంలో మళ్ళీ ఇంకో function కి వాడకుండా, డబ్బు వృధాచేయడం*.

8. *భోజనాల పేరుతో, సమయంతో నిమిత్తం లేకుండా, అల్పాహారం, chat, 20 రకాల స్వీట్స్, 50 రకాల వంటకాలు, 10 రకాల fruits, 5 రకాల desserts(ఇవన్నీ జీవితంలో ఎన్నడూ తిననట్టు,ఆహుతులు,  అన్ని తినే ప్రయత్నం చేయడం ఒక వింత*.(భోజనం ఖర్చు కూడా లక్షల రూపాయలు)

9. *పెళ్లి తంతు తరువాత కిలోమీటర్ క్యూలో నిలబడి, స్టేజి ఎక్కి, మొక్కుబడిగా అక్షింతలు, వధూవరుల నెత్తిన చల్లి, వాటిని బూట్లు తొడుకున్న కాళ్లతో తొక్కి,photos కి pose ఇవ్వడం*(ఆ photos జీవితంలో ఎవరికి చూసే తీరిక కూడా ఉండదు), *అనే ప్రక్రియ కూడా ఆక్షేపనీయం*.

10. *ఇక పెళ్లి జరిపించే పంతుళ్ళు కూడా రక రకాల packages తో, పెళ్లి వేడుకను ఒక వ్యాపార తంతుగా మార్చి , లక్షల రూపాయలు వసూలు చేయడం*.

11. *DJ MUSIC అనే పేరుతొ,  చెవులు, మెదడు  భరించలేని అత్యంత భయంకరమైన శబ్దంతో,అర్థం పర్థం లేని సినిమా పాటలు*.

12. *కర్ణ కఠోరంగా పాడే orchestra బృందం*(వీళ్లు కూడా భయంకరమైన సౌండ్ లెవెల్స్ maintain చేస్తారు).

13.*ఇంకా mehendi అని ,సంగీత్ అని, bachelor పార్టీ అని ,పనికిమాలిన events*.

14.*మద్యంతో కూడిన విందైతే, హాజరు 110%*(బందు మిత్ర సపరివారంగా అనే ఆహ్వానాన్ని సీరియస్ గా పాటిస్తారు).

15. *ఒక పెగ్గు కెపాసిటీ  వాడు 3 పెగ్గులు, 3 పెగ్గుల కెపాసిటీ వాడు 10 పెగ్గులు లాగేస్తారు*.

16.*తదనంతరం పెళ్ళికొడుకు ఇంటి వద్ద సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ రిసెప్షన్*.
*పూజ  పవిత్రత మంట కలుపుతూ, మాంసాహార వంటలతో, మళ్ళీ పెళ్లి నాటి ప్రహసనం repeat*.

17. *ఇంకా హనీమూన్ అనే  కార్యక్రమం కోసం ప్యాకేజీ టూర్స్*.(.ఇది కూడా లక్షల్లో).

18. *ఇక గిఫ్ట్స్ పేరుతో వచ్చే పనికిమాలిన వస్తువులను ఏమి చేసుకోవాలో అర్థం కాదు*.

19.*అందుకని పగ తీర్చుకొనేందుకు రిటర్న్ గిఫ్ట్ పేరుతో ప్లాస్టిక్ డబ్బాలు, పచ్చడి సీసాలు వగైరా ఇవ్వడం*.

**పైన చెప్పినవన్నీ మధ్యతరగతి వారు, తాహతు కి మించి, ఈ మధ్య విపరీతంగా పాటిస్తు, అప్పుల పాలవుతున్నారు*.

_*ఈ అనాలోచిత విధానాలు ఒకరిని చూసి మరొకరు అనుసరిస్తూ, ఫంక్షన్ హాల్స్ వాళ్లని, caterers వాళ్లని, photographers ని, decoraters ని,కోటీశ్వరుల్ని చేయడం మాత్రం  ఖాయం.*_

ఇంత జరుగుతున్నా marriage brokers కీ లేదా mediators కి మాత్రం కమిషన్ ఇవ్వరు.... వాళ్ళు మన కులస్తులే కదా హిందువులే కదా పెళ్లికోసం వాళ్ల పాత్ర కూడా ఉంది కదా అనే ఇంగిత జ్ఞానం మాత్రం లేదు

_*ఈపోస్ట్ చదివి ఒకరు మారిన సాంప్రదాయ పుణ్యం మనకు దక్కినట్టే*_
 *భార్య ఉన్నంత వరకే భర్త ఆనందం. భార్య ఉన్నంత వరకే భర్త ఆరోగ్యం. భార్య ఉన్నంత వరకే భర్త ఐశ్వర్యం. భార్యఉన్నంత వరకే భర్తకు ఉన్నతాలోచనలు. కావున భార్య ఉన్నప్పుడు వాటి విలువలు పొగొట్టు కోకండి.*
*మీ భార్యను ఒక పసి పిల్లలా చూసుకోండి. నీ చివరి దశలో ఒక తల్లిలా చూసుకునేది తనే అన్న విషయం మరువకండి.*
*నువ్వెక్కడ జన్మించావో, నేనెక్కడ జన్మించానో, మనం ఎవరికి, జన్మనిచ్చామో అవి మనతో ఉండవు. పరిణయం నుండి చివరి ప్రయాణం వరకు నాకు నువ్వు నీకు నేనే ఒకరికొకరం ఆసరా. ఆఖరి రోజుల్లో భర్తకు భార్య విలువ, భార్యకు భర్త విలువ పూర్తిగా అర్ధం అవుతుంది.  కాని వయసులో ఉన్నప్పుడే అర్ధం చేసుకుంటే ఆ బంధం ఇంకా మరింత గొప్పగా, సంతోషంగా ఉంటుంది కదా.*
*దేవుడు మనిషిలో ఉండలేడు. కావున భార్యనిచ్చాడు, తల్లిని ఇచ్చాడు. ఆ తల్లి సదా కొడుకుతో ఉండలేదు. అందుకే భార్య తన ప్రేమతో భర్త మనసులో నిలిచిపోతే ఆ బంధం శాశ్వతం అవుతుంది. భర్త మనసు అర్ధం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండటానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనను విడిచి ఉండలేడు. ఎవ్వరి పవిత్ర బంధానికి అయినా ప్రేమ, నమ్మకం ఉంటే జీవితకాలం ఆనందంతో కలిసి ఉంటారు🙏.*
 🤵‍♀️🙏🤵‍♀️🙏🤵‍♀️🙏🤵‍♀️🙏🤵‍♀️🙏🤵‍♀️
దైవాన్ని నేనెప్పుడూ చూడలేదు..
బహుశా నా ఇంటి కోవెలలో కొలువైన 
మా #అమ్మలా ఉంటుందేమో!?

ఆ చిట్టి సీతమ్మ తల్లి ఆటపాటలను 
నేనెప్పుడూ వీక్షించలేదు..
బహుశా నా కడుపున పుట్టిన నా #బిడ్డ
ఆటపాటల్లా ఉంటుందేమో!?

ఆ అన్నపూర్ణ దేవి వండి వార్చి 
శివయ్యకు పెట్టిన పంచభక్షపరమాన్నాలు 
నేనెప్పుడూ తినలేదు..
బహుశా నా #భార్య వండి వడ్డించే
వంటలా ఆ రుచి ఉంటుందేమో!?

ఆ శ్రీకృష్ణుడు ద్రౌపదికి వస్త్రదానం చేసిన
సన్నివేశంలో పాంచాలిని నేనెప్పుడూ దర్శించలేదు.
బహుశా నా కష్టంలో వెన్నంటి ఉండి
చేయూత నిచ్చే నా #చెల్లిలా ఉంటుందేమో!?

లక్ష్మీ దేవి కోసం తన బిడ్డ గణపతిని 
దత్తతు ఇచ్చిన పార్వతీ దేవిని 
నేనెప్పుడూ సందర్శించలేదు.
బహుశా నా సమస్యల పరిష్కారంలో తోడుగా
ఉండే నా #స్నేహితురాలిలా ఉంటుందేమో!?

నిత్యం పూజించే ఆ దేవతా మూర్తులను 
నేనెప్పుడూ కానలేదు.
బహుశా వారంతా నా ఇంటి అమ్మ,ఆలి,అక్క,బిడ్డ,స్నేహితురాళ్ళను 
పోలి ఉంటారేమో అనిపిస్తుంది వారిని చూసినప్పుడల్లా!!

ప్రతి స్త్రీ దేవతా స్వరూపమే!!
దేవతను ఎలా పూజిస్తామో..,,
ఆ రూపంలో మీ నట్టింట్లో నడయాడుతున్న
ఆడపడుచులను పూజించండి,గౌరవించండి, ప్రేమించండి.

మహిళా మణులందరికీ
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు💐💐💐
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

‘నాకు కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు’ అని చాలామంది నోట వింటుంటాం.

 ‘నాకు కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు’ అని చాలామంది నోట వింటుంటాం. ఈ వాక్యంలో నాలుగు అంశాలు దాగి ఉన్నాయి. ఒకటి కోపం, రెండోది రావడం, మూడోది చేయడం, నాల్గోది తెలియకపోవడం. ‘కోపం వస్తుంది’ అనడం వల్ల అది మానవుని సహజ స్వభావం కాదని తెలుస్తుంది. అది మనకు దూరంగా ఉన్నా మన బలహీనతను ఆసరా చేసుకొని మన దగ్గరికి వస్తుంది. అలాగే మనసులో తిష్టవేసుకోగలుగుతుంది. కొందరు ‘కోపాన్ని ప్రదర్శించకండి’ అంటారు. ఇది కూడా అలాంటి వాక్యమే.
కోపాన్ని నాటకంలోలా చూపించడం అనేది లోకంలో సామాన్యంగా జరిగేదే! కోపం సహజమైనది కాదు. అది ఆయా పరిస్థితులను బట్టి మనలో ప్రవేశిస్తుంటుంది. ఇంతకు మనిషిలో కోపం ప్రవేశించడానికి కారణం ఏమిటి? అందుకు కారణం ‘కామం’. కోరికకే కామం అని పేరు. ఎప్పుడైతే ఇష్టమైన వస్తువు లభించక, ఇష్టం కాని వస్తువు లభిస్తుందో అప్పుడు కోపం వస్తుంది. తద్వారా కోపానికి కారణం కోరిక అని తెలుస్తున్నది. మరి కారణభూతమైన కోరిక కూడా మానవుడి సహజ గుణమా? యోగులకు కోరికలు లేవని కదా భగవద్గీత చెబుతున్నది! నిష్కామ కర్మయోగుల గురించి మనకు తెలుసు. వాళ్లు కామాన్ని ఎలా జయించారు? అది సంక్రమించిందే కానీ సహజాతం కాదు కాబట్టి.
కోపమే.. క్రోధంగా పరిణమిస్తుంది. కోపమన్నా, క్రోధమన్నా ఒకటే. కోపానికి కారణం కామం (కోరిక) అయితే, మోహానికి కారణం క్రోధం అవుతుంది. ‘క్రోధోద్భవతి సమ్మోహః’ అని భగవద్గీత చెబుతున్నది. కామం, క్రోధం, మోహం- ఈ మూడింటితోపాటు లోభం, మదం, మాత్సర్యం అనే గుణాలు కూడా మనిషి సహజాతాలు కావు. అత్యాశ వల్ల, మోహం వల్ల లోభం ఏర్పడుతుంది. సద్వివేకం లేకపోవడం వల్ల లోభం ఏర్పడుతుంది. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతమో తెలియకపోవడం వల్ల లోభం కలుగుతుంది. ‘లోభి తాను తినడు, ఇతరులకు పెట్టడు’ అనే సామెత కూడా ఉంది. కొందరు సంపద కారణంగా విర్రవీగుతూ గర్వాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ గర్వానికే ‘మదం’ అని పేరు. ఎప్పుడైతే గర్వం కలుగుతుందో, అప్పుడే ఇతరులతో కలహించుకునే అలవాటు సంభవిస్తుంది. కలహించుకునే గుణాన్నే ‘మాత్సర్యం’ అని పిలుస్తారు.

మొత్తం మీద కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం అనే ఆరుగుణాలను ‘అరిషడ్వర్గం’గా పిలుస్తారు. ఈ ఆరింటిలో మొదటిది ‘కామం’. ఈ ఒక్క చెడుగుణమే మిగిలిన దుర్గుణాలకు కారణం అవుతుంది. కాబట్టి యోగులు మొట్టమొదట కామాన్ని జయించడానికి ప్రయత్నిస్తుంటారు. నిష్కామ కర్మ యోగులు అవుతారు, మోక్షగాములు అవుతారు. కామాది షడ్గుణాలు మనకు శత్రువుల వంటివి. వాటిని కోరి తెచ్చుకోవడం బుద్ధిమంతుల పనికాదు. వాటి మాయాజాలంలో చిక్కుకుంటే ఆపదలు కొనితెచ్చుకోవడమే అవుతుంది. అజ్ఞానంలో మునిగిపోవలసి వస్తుంది. ఈ సందర్భంగా సుమతీ శతకకారుడు చెప్పిన ‘తన కోపమె తన శత్రువు’ అనే మాటలను గుర్తు చేసుకోవాలి. ఎవరైనా శత్రువులను ఇంట్లోకి రానిస్తారా? ఈ ఆరుగురూ బలమైన శత్రువులే! వారిలో మొదటి శత్రువు మరీ బలమైనవాడు. కోపాన్ని జయిస్తే తక్కిన శత్రువులు మన ప్రమేయం లేకుండానే అణగిపోతారు.
షడ్గుణాలలో కార్యకారణ సంబంధం ఉంది. ఒకదానికి మరొకటి కారణం అవుతుంది. కారణాన్ని తొలగించుకుంటే కార్యం నశిస్తుంది. శాశ్వతమైన జీవాత్మకు జన్మకారణంగా షడ్గుణాలు సంక్రమించాయి. ఏ జన్మా శాశ్వతమైనది కాదు కదా! మానవ జన్మ శాశ్వతం అనుకోవడం వల్లే శాశ్వతం కాని అరిషడ్వర్గాన్ని ఆహ్వానించవలసి వస్తుంది. అరిషడ్వర్గం ప్రకృతి కారణంగా ఏర్పడింది. శరీరం ప్రకృతి మూలంగా సంభవించిందే! శరీరంతోపాటు ఈ ఆరుగురు శత్రువులు మనల్ని బాధించడానికి చూస్తారు. నిజానికి వీరంతా పరాయివాళ్లే. కానీ, బలవంతులు మనకు తెలియకుండానే మనసులోకి ప్రవేశించి మనలను పాపాలకు గురిచేస్తారు.

మనం కనిపించే శత్రువులను తేలికగా తీసుకోవచ్చేమో గానీ, ఈ అంతర్గత శత్రువులను జాగ్రత్తగా కనిపెట్టాలి. ఒక్కో శత్రువును ఒక్కో ఆయుధంతో మట్టుపెట్టాలి. శాంతంతో కోపాన్ని, అనాసక్తితో కామాన్ని, త్యాగంతో లోభాన్ని, జ్ఞానంతో మోహాన్ని, సమతాదృష్టితో మదాన్ని, మైత్రితో మాత్సర్యాన్ని జయించాలి. ఇంద్రియజయం ఒక ఎత్తయితే, అరిషడ్వర్గాన్ని జయించడం మరొక ఎత్తు. కానీ, యోగమార్గంలో నడిచేవారి విషయంలో ఇవేవీ లెక్కలోకి రావని తెలుసుకోవాలి.

మనపై ఉన్న ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు

 *మనపై ఉన్న ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు*

👉🌱1. ఒక రోజు ఒక సమయం లో నీకోసం నీవు కనీసం 60 నిముషాలు కేటాయించుకో !
👉🌱2. నీ ఒత్తిడి ని గమనించుకో ఎప్పుడు ఉద్రేకం నుండి బయట పడాలో ? శాంతం వహించాలో గమనించుకో !
👉🌱3. ప్రతి రోజు ధ్యానం చేయడం వలన నీ ఒత్తిడి రసాయనాలను 
తగ్గించగలదని గుర్తించుకో !
👉 🌱4. నీ ఆహారం లో పళ్ళూ , కాయగూరలూ , నీరూ తగినంతగా ఉండేలా చూసుకో ! మాంసాహారం -విషాహారం అని తెలుసుకో !
👉🌱 5. కక్ష కన్నా క్షమ గొప్పది 
క్షమ కన్నా *జీవుల పట్ల కరుణ* గొప్పదని  అని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో !
👉🌱 6. ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం నేర్చుకో !
👉 🌱7. నవ్వును , దగ్గరకు తీసుకో , ఇతరులతో నీ భావాలు పంచుకో!
👉🌱 8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని ధ్యానసాధన చెయ్యి.  రెండో సారి దానికే మళ్ళీ గురికాకుండా ధ్యాన సాధన ద్వారా తరిమి కోట్టడం నేర్చుకో  !
👉🌱9. ముందు నిన్ను నీవు సరిగా అంచనా వేసుకో ! ఎదుట వారిని అంచనాలు వేయడం మానుకో !
👉🌱 10. పాజిటివ్ గా ఆలోచించు. దాని వలన ఎనలేని సంతోషం నీసొంతం చేసుకో  !
👉🌱11. *మద్యానికి , మాదక ద్రవ్యాలకీ దూరంగా ఉండు . అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో*  *శాకాహారిగా* ఉండడం *ధ్యానం* చేయడం నేర్చుకో!
👉🌱12. డబ్బు విషయం లో జాగ్రత్త వహించు .నీడబ్బులో కనీసం 10 శాతం మంచి పనులకు ఖర్చు చెయ్యిడం నేర్చుకో!
👍🌱13. నాకు ఒద్దు , నాకు రాదు నాకు చేత కాదు అనే మాటలను చెప్పడం మానుకో !
👉 🌱14. బయటకు వెళ్ళు . మిత్రులతో , బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం  సత్సంగం వలన నీకు ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసుకో ! 
👉🌱 15. *టి వి కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుంది అని గ్రహించుకో* !
👉🌱16. *పొగ తాగడం ఒత్తిడి పెంచడమే కాదు నిన్ను చంపగలదు అని తెలుసుకో* !
👉🌱17. బంధాలను పెంచుకో , కాపాడుకో , ఎక్కువ విను , తక్కువ మాట్లాడు నేర్చుకో !
👉🌱18. ప్రతీదీ అనుభవించు; కాని దేనికీి బానిస కాకూడదు అని తెలుసుకో  !
👉🌱 19. వారానికి ఒక్కసారి ఉపవాసం ; ఉదయం సూర్యోదయం; సాయంత్రం సూర్యాస్తమయం  చూడడం నేర్చుకో  !
👉🌱 20. విషయాలను నీ కోణం నుండి కాకుడా ఎదుటి వారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో !
👍🌱21. విషయం పూర్తిగా తెలుసుకొని అప్పుడు బదులు ఇవ్వడం నేర్చుకో!
👉🌱22. నీ ఆందోళన వలన సమస్యలు తొందరగా గానీ , మంచిగా కానీ పూర్తి కావు .అని గుర్తించుకో !
👉🌱23. వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అనేది పక్కా ప్రణాళిక వేసుకో !
👉🌱24. ప్రతీ రోజూ భగవానుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని. నవ్వుతూ ఉండు. ఈ ప్రపంచం అనే అందమైన పెయింటింగ్ లో నువ్వూ ఒక భాగం అని తెలుసుకో !
👉🌱25. యోగా చెయ్యి. ప్రాణాయామం చెయ్యి.

👍🌱శ్వాస మీద ధ్యాస తో ధ్యానం చెయ్యి.
👉🌱 ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పు .
👉🌱 నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకు కృతజ్ఞతలు చెప్పు .

*ఇవి మానవ జీవితానికి కంప్లీట్ ఎగ్జామ్ పేపర్*
సేకరణ :✒️AVB సుబ్బారావు 🤝💐

Effect of Hatred on You

 🥔 Effect of Hatred on You:

Once a kinder garden teacher had decided to let her class play a game. She told each child in her class to bring along a plastic bag containing few potatoes.

She asked children that each potato will represent the person that child hates. So the number of potatoes to be kept in that plastic bag depends on the number of person that child hates.

So when the decided day came, she asked children to bring those potatoes which represent the persons they hate. Teacher noticed that some had 2 potatoes in that plastic bag and some had 3 and some had 5 potatoes in that plastic bag.

Now, she told them that they have to carry that plastic bag with them for a week, wherever they go. After 3-4 days passed children started to complain because of the unpleasant smell that was coming from rotten potato.

Beside, those kids who had 5 potatoes had to carry heavier bags. After one week all children were relieved because the game was finally ended.

Now at week end teacher asked children, “How did you feel while carrying these potatoes with you for one week?”

Children started complaining about the trouble they had to got through because of those rotten potatoes and their unpleasant smell, wherever they go.

Now after all complaining and discussion at last teacher asked all children to sit silent and told them the hidden meaning behind the game.

Teacher said, “This is exactly the situation when you carry hatred for somebody inside your heart. This stench of hatred will contaminate purity of your heart and you will carry it with you wherever you go.”

Teacher continued, “Now think for second, if you can not tolerate the unpleasant smell of rotten potatoes for just a week, can you imagine what it would be like to live with stench of hatred in your heart for lifetime??”

Moral: Hatred of someone will be a Burden to your Heart to Carry for Lifetime. Negativity about someone will keep peace of your own mind and heart away from you. Therefore, Forgiving others is Best attitude to Live a Peaceful and Happy Life.

@Story_oftheday
@kahaniya_channel
🏰  🏡  🏜  🏕  ⛪️.

బువ్వ కొద్దీ బుద్ధి!!

 🎻🌹🙏"బువ్వ కొద్దీ బుద్ధి!!"....!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿పూర్వం ఒక శివభక్తుడు కాశీ నడిచి వెళుతూ, ప్రతీరోజు చీకటి పడేటప్పటికి దగ్గర్లోని గ్రామంలో ఎవరో ఒక గృహస్తు ఇంట ఆశ్రయం సంపాదించి అతిధిగా ఉండేవాడు._ 

🌸అలాగే ఒకరాత్రి ఒక గ్రామంలోని ఇంట ఆశ్రయం సంపాదించాడు.
ఆ రాత్రి ఆ ఇంట భోజనం చేసి పడుకున్న శివభక్తుడికి, ఆ ఇంటి ముందు కట్టి ఉన్న 'ఆవు' కనిపించింది. 
ఆ ఆవుని దొంగతనంగా తీసుకుపోవాలనే ఆలోచన ఆ భక్తుడికి కలిగింది. 

🌿ఇంట్లోని వారందరూ నిద్ర పోగానే, ఏ మాత్రం చప్పుడు లేకుండా, ఆవుని తీసుకుని బయలుదేరాడు. 
ఉదయానికి ఆవుతో సహా ఒక చెరువు వద్దకు చేరుకుని, అక్కడ ఆవుని కట్టి, కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసాడు...

🌸అప్పుడు అతనికి రాత్రి తాను చేసిన పాపపు పని గుర్తుకు వచ్చింది. 
వెంటనే పశ్చాత్తాప పడుతూ, ఆ ఆవును తీసుకుని ఆ గ్రామంచేరి, ఆవును ఆ ఇంటి యజమానికి అప్పగించి 

🌿"అయ్యా, నన్ను క్షమించండి, ఆవును దొంగలించాలన్న దుర్భుద్ది ఎలా కలిగిందో  నాకు అర్ధం కాలేదు. 
ఉదయం కాలకృత్యాలు తరువాత నాపని నాకే చాలా సిగ్గుగా అనిపించింది" అన్నాడు.

🌸ఆ ఇంటి యజమాని శివభక్తుడికి నమస్కారించి "అయ్యా! అది మీ తప్పు కాదు, 
నేను ఒక దొంగను, రాత్రి మీరు తిన్నది నేను దొంగలించి తెచ్చిన డబ్బుతో తయారుచేసిన భోజనం. 
దాని ప్రభావంతో మీకు దొంగ బుద్ధి కలిగింది.

🌿కాలకృత్యాల తరువాత దాని ప్రభావం మీలో పూర్తిగా పోయింది, అందువల్ల ఆవును తిరిగి తీసుకువచ్చారు" అన్నాడు. 

🌸అప్పుడు శివభక్తుడు సంతోషించి, అక్కడి నుండి బయలుదేరాడు. 
ఆందుకే ... వంట చేసే ముందు కావలసినవి...

🌿పాత్ర శుద్ధి,
పాక శుద్ధి,
భావ శుద్ధి
ఇదంతా అయ్యాక , బగ్వద్ అర్పితం వుండాలి, అప్పుడే ఆ పదార్థము ప్రసాదంగా మారుతుంది ...
మనం తినే ఆహారాన్ని బట్టి మన ప్రవర్తన ఉంటుందని...

🌸ఎట్టి ఆహారమో - అట్టి ప్రవర్తన,
ఎట్టి ప్రవర్తనో అట్టి - అట్టి జీవితం,
ఎట్టి జీవితమో - అట్టి మోక్ష సాధన...స్వస్తి..🚩🌞🙏🌹🎻

🙏సర్వే జనాన్ సుఖినోభవంతు🙏

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Saturday, September 2, 2023

విద్యాధికారి

 *🌻విద్యాధికారి🌻*


🥀కాంచనపురిని పరిపాలించే చంద్రసేనుడు మంచి పరిపాలనాదక్షుడు. తండ్రి తరువాత అతి పిన్నవయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించి, అతడు పరిపాలనాపరంగానే కాక, సామాజికంగా కూడా చాలా మార్పులు తీసుకు వచ్చాడు. యువకుడు, సంస్కరణాభిలాషి కావడంచేత, విద్యాబోధనలో మార్పురావాలని తలచాడు, చంద్రసేనుడు. ఆస్థాన విద్వాంసులనూ, రాజగురువునూ, ప్రముఖకవి, పండితులనూ ఆహ్వానించాడు. సుదీర్ఘచర్చల అనంతరం, రాజ్యమంతటా ఒకే విధమైన విద్యాబోధన జరగాలనీ, విద్యార్థులు వేద వేదాంగాల్ని అభ్యసిస్తూనే, తమకిష్టమైన వృత్తి విద్య, సామాజికనీతి, రాజనీతి వంటివి కూడా తప్పని సరిగా నేర్వాలనీ, వారు నిర్ణయించారు.

🥀ఆపత్సమయంలో ఆత్మరక్షణ కూడా ముఖ్యమే! అందుచేత, శారీరక దృఢత్వం కోసం …యువకులు, వ్యాయామం, శస్త్రాస్ర్త విద్యలూ కూడా నేర్వాలని నిర్ణయం జరిగింది. ఇందుకుగాను, సమర్థుడైన ఒక విద్యాధికారిని నియమించి, ఆయన ఆధ్వర్యంలో రాజ్యంలోని గురుకులాలన్నీ ప్రమాణాలకు అనుగుణంగా నడుచుకోవాలని తీర్మానించారు.

🥀అయితే, విద్యాధికారి పదవి సామాన్యమైనది కాదు గనక, ఆ పదవిని అలంకరించే వ్యక్తిగొప్ప విద్యావంతుడూ, యుక్తాయుక్తాలు క్షుణ్ణంగా తెలిసినవాడూ అయివుండాలి. ఇందుకుగాను, రాజు చంద్రసేనుడు, విద్యాధికారిని నియమించే అధికారం, రాజగురువు మహేంద్రభట్టుకు అప్పగించాడు. మంచి ఉన్నత స్థానం, రాజుగారి వద్ద ప్రత్యేక ప్రాపకం, తగిన పారితోషికం లభించే విద్యాధికారి పదవి కోసం సహజంగానే పోటీ మొదలయింది.

🥀ఎంతో మంది యువకులు తమ అదృష్టాన్ని పరీక్షంచుకోవడానికి రాజధానికి రాసాగారు. రాజగురువు మహేంద్రభట్టు అనన్య సామాన్యమైన మేధావి. ఆయన అభ్యర్థులను ముందుగానే వ్యక్తిత్వ పరీక్షలకు  గురిచేసి, ఆ పిమ్మట మౌఖిక పరీక్షలు నిర్వహించదలచాడు.


🥀 ఈ విధంగా, వ్యక్తిత్వ పరీక్షలలోనే చాలామంది వెనుదిరగవలసి వచ్చింది. కాంచనపురి రాజ్యంలోని సుందరవరం అనే గ్రామంలో, ఇంద్రదత్తుడు అనే యువకుడుండేవాడు. అతడు గురుముఖంగా శాస్ర్తాలన్నీ నేర్చి, చిన్నతనంలోనే కాశీ వెళ్ళి గొప్ప పాండిత్యం సంపాయించాడు. తర్వాత, తన స్వగ్రామానికి తిరిగివచ్చాక, తను నేర్చిన విద్యలను ఇతరులకు బోధించాలన్న కుతూహలం కలిగింది. ఆ తరుణంలోనే ఇంద్రదత్తుడికి, రాజాస్థానంలో విద్యాధికారి పదవి విషయం తెలియవచ్చింది.

🥀అతడు వెంటనే రాజధానికి బయలుదేరాడు. రాజధాని చేరిన తర్వాత, ఇంద్రదత్తుడు ఒక పూటకూళ్ళ ఇంటిలో బసచేశాడు. రెండు రోజులపాటు రాజధానీ నగరం అంతా కలయ తిరిగి ముఖ్యమైన ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఎందరో యువకులు తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలనే తపనలోవున్నారని, అతడికి అర్థమయింది. అభిరుచి వున్నా అవకాశం లేక ఎందరో యువకులు విద్యార్జన
చేయలేక పోవడం అతణ్ణి కలవరపరిచింది.

🥀మూడవ రోజు ఉదయాన్నే ఇంద్రదత్తుడు, రాజగురువు దర్శనార్థం వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ తుదిపోటీకి సైనికాధికారి కొడుకు దుర్జ…యుడు, కోశాధికారి కొడుకు విక్రముడు మిగిలారని అతడికి తెలిసింది. ఇంద్రదత్తుడిని చూస్తూనే మహేంద్రభట్టుకు సదభిప్రాయం కలిగింది. ఆయన, అతణ్ణి గురించిన వివరాలు అడిగి తెలుసుకుని, ‘‘సరే, నీవు రాజధానికి వచ్చిన తర్వాత, రెండు రోజులు కాలయాపన చేయడానికి కారణం ఏమిటి?’’ అని అడిగాడు.

🥀‘‘ఆర్యా, క్షమించాలి, అందుకు కారణం కొంత వివరంగా చెబుతాను. నేను ఆశించే పదవి చాలా బాధ్యతాయుతమైనది. ఆ కారణంగా చాలా సమాచారం సేకరించవలసి వచ్చింది. మన నగరంలో మొత్తం ఎనిమిది విద్యాలయాలున్నాయి. రాజ్యం మొత్తంలో గురుకులాలనూ, విద్యాలయాలనూ కలిపితే, నూరుకు మించవు. మన రాజ్యంలోని విద్యార్థుల సంఖ్యకూ, సంస్థలకూ పొంతన కుదరడం లేదు, గురువుల అభిరుచిని బట్టి విద్యనేర్పడం జరుగుతున్నది.

🥀అందుచేత విద్యార్థుల మనస్తత్వాన్ని బట్టీ, అర్హతలను బట్టీ అందరికీ అవకాశం కల్పించే సంస్థలు కావాలి.


🥀ఈ సమాచార సేకరణకు, నాకు రెండు రోజుల సమయం అవసరం అయింది,’’ అన్నాడు ఇంద్రదత్తుడు. విద్యాధికారి పదవీబాధ్యతలను, అంత బాగా ఊహించిన ఇంద్రదత్తుడి మీద అభిమానం కలిగింది, మహేంద్రభట్టుకు.
‘‘ఈ పదవి నీకే లభిస్తుందని, ఎలా అనుకుంటున్నావు?’’ అని అడిగాడు మహేంద్రభట్టు. ‘‘పూనిన ఏ కార్యాన్నయినా సాధించి తీరాలన్నది నా నైజగుణం. అంతే కాక, ఆశ అనేది లోపిస్తే, భవిష్యత్తు శూన్యం అవుతుంది,’’ అన్నాడు ఇంద్రదత్తుడు.

🥀ఆ సమాధానానికి తృప్తి చెందిన మహేంద్రభట్టు, ఇంద్రదత్తుణ్ణి, దుర్జయ, విక్రములతో పాటుగా పరీక్షంచేందుకు పిలిచి, ‘‘అతి వేగంగా పయనించేది మనసుగదా, సరే! ఆ తర్వాత రెండవ స్థానంలో వుండేది ఏది?’’ అని అడిగాడు. ‘‘గాలి!’’ అన్నాడు దుర్జయుడు. ‘‘కాదు, అగ్ని!’’ అన్నాడు విక్రముడు.

🥀 ‘‘నా ఉద్దేశంలో, మీ ప్రశ్నకు సమాధానం, వార్త! అది కేవలం కొన్ని నిమిషాలలోనే గాలి కన్నా, అగ్నికన్నా వేగంగా పయనిస్తుంది. ఎక్కడో మారుమూలనున్న మా గ్రామానికి, ఈ పోటీ గురించి మీరు ప్రకటించిన వార్త వెంటనే చేరిపోయిందంటే, వార్త యొక్క వేగం ఊహించవచ్చు!’’ అన్నాడు ఇంద్రదత్తుడు. ‘‘మరొక ప్రశ్న. మనిషిని కాల్చేది ఏది?’’ అని ప్రశ్నించాడు మహేంద్రభట్టు. ‘‘నిప్పు!’’ అన్నాడు వెంటనే దుర్జయుడు.


🥀‘‘అవును, నిప్పు మనిషినే కాదు, దేనినైనా కాలుస్తుంది!’’ అన్నాడు విక్రముడు. ‘‘ఆర్యా! నిప్పును మించి కాల్చి బాధించేది అపనింద! నిప్పువల్ల మనిషిలో మార్పురావచ్చు కానీ, అపనింద మనిషిని అంతర్గతంగా దగ్థం చేస్తుంది,’’ అన్నాడు ఇంద్రదత్తుడు.

🥀‘‘తదుపరి ప్రశ్న మృత్యువును మన దగ్గరికి చేర్చేది?’’ ‘‘అనారోగ్యం!’’ అన్నాడు దుర్జయుడు. ‘‘చింత!’’ అన్నాడు విక్రముడు.

🥀‘‘ఆర్యా! అనారోగ్యం, చింత, మృత్యువును దగ్గరికి చేర్చేవే కానీ, ఆ రెంటికీ కూడా ముఖ్య కారణం క్రోధం! అది మనలోని వివేకాన్ని దూరం చేస్తుంది. అకారణ ద్వేషాన్ని పెంచుతుంది. అనేక ప్రకంపనలకు లోనైన శరీరాన్ని మృత్యువు తేలికగా కబళించగలదు,’’ అన్నాడు ఇంద్రదత్తుడు. ఈ సమాధానానికి మహేంద్రభట్టు చిరునవ్వు నవ్వి, ‘‘ఇంద్రదత్తా! నువ్వు సమాధానం చెప్పిన తీరు బావుంది.

🥀అయితే, నీకీ విద్యాధికారి పదవి లభిస్తే, ఎలా నిర్వహిస్తావు?’’ అని అడిగాడు. ‘‘పెద్దల అభిప్రాయాలను మన్నిస్తాను. దేశంలో ఎందరో …యువతీ…యువకులు, తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలన్న తపనతో వున్నారు.
అలాంటి వారికి అవకాశాలు కల్పిస్తే ఒక్కొక్కరూ ఒక్కొక్క విద్యాసంస్థగా మారి, విద్యాభ్యాస అవకాశాలు లేక నిర్లిప్తతకులోనై వున్నవారికి ఉత్సాహం కలిగించి, విద్యాబోధ చేయగలరు. నాకున్న విజ్ఞానాన్ని, తమబోటి విజ్ఞుల అనుభవంతో మిళితం చేసి, కాంచన పురి రాజ్యంలోని ప్రతి యువతినీ, యువకుణ్ణీ అపర సరస్వతీ మూర్తిగా రూపొందించేందుకు శాయశక్తులా కృషి చేస్తాను.

🥀ఆ విశ్వాసం నాకున్నది!’’ అన్నాడు ఇంద్రదత్తుడు ఉత్సాహంగా. ఆ తర్వాత, వారం గడవకుండానే, విద్యాధికారి పదవికి ఇంద్రదత్తుడు తగినవాడని నిర్ణయించాడు మహేంద్రభట్టు. ఆయన నమ్మకం వమ్ము కాలేదు. విద్యాధికారిగా ఇంద్రదత్తుడు అత్యంత ప్రతిభాశాలి అనిపించుకున్నాడు. ఆ విధంగా, రాజు చంద్రసేనుడి పాలనలో కాంచనపురం విద్యార్థుల పాలిట కల్పవృక్షంగా చిరకాలం నిలిచింది.


☘️☘️🌻🌻🌻🌸🌻🌻🌻☘️☘️

అభిజిత్ లగ్నం అంటే…

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

          *అభిజిత్ లగ్నం అంటే…*
                 ➖➖➖✍️

అభిజిత్ అనేది కాంతిలేని నక్షత్రం. పురాణాల్లో దీని వెనుక ఓ ఆసక్తికర కథ కూడా ఉంది.

అందరూ టక్కున చెప్పే సమాధానం ఇరవై ఏడు అని. కానీ అభిజిత్ అనే ఓ నక్షత్రం ఉందనీ, దానికి కొంత ప్రత్యేకత ఉందని ఎంతమందికి తెలుసు? 
ఆ విశేషాలేమిటో మనం తెలుసుకుందాం….

అభిజిత్ అంటే కనిపించని చుక్క అని మనం అనుకోవచ్చు. అంటే కాంతిలేనిదన్నమాట. నిజానికి నక్షత్రం అనేది కూడా ఒక్కటి కాదు…. అనేక నక్షత్రాల సమూహం. 

వీటిని 27 మండలాలుగా విభజించి వాటికి అశ్వని, భరణి అంటూ పేర్లు నిర్ణయించారు. ఇక అభిజిత్ విషయానికి వస్తే ఉత్తరాషాఢ నక్షత్రం చివరి పాదం, శ్రవణా నక్షత్రంలోని మొదటి పాదంలో 15వ వంతు భాగాన్ని అభిజిత్ నక్షత్రం అంటారు. ఈ నక్షత్రం వెనుక ఓ పురాణ కథ ఉంది అదేంటో మనం తెలుసుకుందాం….

మనకున్న 27 నక్షత్రాలనూ దక్షప్రజాపతి కుమార్తెలుగా చెబుతారు. దక్షుడు వీరిని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. 

అందరికన్నా రోహిణి మీదే చంద్రుడికి ప్రేమ ఎక్కువ. ఆమెతోనే ఎక్కువ కాలం గడిపేవాడు. మిగతా నక్షత్రాలు ఊరుకున్నా శ్రవణం మాత్రం ఊరుకోలేదు. తనలాగే ఉండే తన ఛాయను తీసి తన స్థానంలో ఉంచి చంద్రుడి వ్యవహారం తేల్చడానికి తండ్రి దగ్గరకు వెళ్లింది. 

శ్రవణా నక్షత్రం వదిలిన ఛాయ పేరే అభిజిత్తు. అది 28వ నక్షత్రంగా ఏర్పడింది. 

ఆ తర్వాత కాలంలో దీనికి ఒక పవిత్రమైన స్థానం కూడా ఏర్పడింది. సర్వ దోషాలనూ పోగొట్టే శక్తి ఈ నక్షత్రానికి వచ్చింది. 

ప్రతి రోజూ ఈ నక్షత్రానికి సంధించిన సమయం ఉంటుంది. దాన్నే అభిజిత్ ముహూర్తం అంటారు. ఆ వివరాలు చూద్దాం….

ఈ పదం ఒకప్పుడు పల్లెటూళ్లకు కొత్త కాదు. కాలంమారింది కాబట్టి ఇప్పుడది అంతగా వినపడటం లేదు. అభిజిత్ లగ్నాన్ని పల్లెటూళ్లలో అలా పిలిచేవారు. గడ్డపలుగును భూమిలో పాతిపెట్టి దాని నీడ మాయమయ్యే సమయాన్ని గడ్డ పలుగు ముహూర్తం అనేవారు. అంటే మిట్టమధ్యాహ్నం అన్నమాట. 

ఈ ముహూర్తంలో సూర్యుడు దశమ స్థానంలో ఉంటాడని, ఈ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. నిజానికి ఇది చాలా బలమైన ముహూర్తం. 

ప్రస్తుతం రామాలయ నిర్మాణం కోసం అయోధ్యలో జరుగుతున్న భూమిపూజను ఈ అభిజిత్ లగ్నంలోనే చేశారంటే దీనికున్న ప్రాధాన్యం                          ఏ పాటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. 

ఈ ముహూర్తం మధ్యాహ్నం 11-45 నుండి 12-30 వరకు ఉంటుంది. 
ఈ ముహూర్తం లోనే శివుడు త్రిపురాసుర వధ చేశాడు. 
ఇదే ముహూర్తం లో దేవతలు సముద్ర మధనం ప్రారంభించారు. 
ఈ శుభ ముహూర్తం లోనే ఇంద్రుడు దేవ సింహాసనాన్ని అధిరోహించాడు. శ్రీరాముడి జననం, సీతారాముల కల్యాణం, భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టిన సమయం… ఇవన్నీ ఈ ముహూర్తంలోనే జరిగాయి. 

ఈ ముహూర్తంలో పెళ్ళి జరిగింది కాబట్టి ఇలా కష్టాలు వచ్చాయని అనుకోవడం కూడా తప్పే. అసలు ఆ లగ్నంలో ఏ శుభకార్యం చేపట్టినా, ఇక మిగతా విషయాలు ఏవీ ఆలోచించాల్సిన అవసరమే లేదు.
ఇంకా ఈ ముహూర్తానికి సంబంధించి మరికొన్ని విశేషాలు ఉన్నాయి. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది. 
దక్షిణం యమస్థానం కాబట్టి బుధవారం మాత్రం ఆ దిక్కుకు వెళ్లరాదని నారద సంహిత పేర్కొంది. 
అలాగే ఉపనయనానికి కూడా ఈ లగ్నం పనికిరాదని పేర్కొంది. దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. 
ఆ నక్షత్రాధిపతుల సమయంలో ఈ అభిజిత్ ముహూర్తం వస్తే మాత్రం దక్షిణ దిక్కుకు నిరభ్యంతరంగా ప్రయాణం చేయవచ్చు. సూర్యుడు చీకటిని ఎలా పారదోలతాడో అలా సర్వదోషాలనూ ఈ ముహూర్తం హరించి వేస్తుందని వశిష్ఠ సంహిత పేర్కొంది. ముహూర్త వల్లరి అనే గ్రంథం మాత్రం అభిజిత్ ముహూర్తం కేవలం ప్రయాణాలకే తప్ప ఇతర కార్యాలకు పనికిరాదని అంటోంది. ఈ లగ్నంలో వివాహం చేస్తే నష్టమని బ్రహ్మ శపించినట్లు నారద సంహిత పేర్కొంది. ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా అభిజిత్ లగ్నం సర్వశ్రేయోదాయకమని అనేక గ్రంథాలు పేర్కొన్నాయి.

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Friday, September 1, 2023

ప్రయత్నం - ఫలితం

 🌴🌷ప్రయత్నం-ఫలితం 🌷🌸
🌴🌷అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో అతి కష్టంమీద పడవ నడుపుతున్నాడు నావికుడు. ఒడ్డుకు దగ్గర పడుతున్నాడు. అప్పటివరకు ఎంతో జాగ్రత్తగా, నేర్పుగా నావ నడిపిన ఆ వ్యక్తి ఒక్క క్షణం ఏమరుపాటుగా ఉన్నాడు. అంతే! ఆ నావ తలకిందులైంది. అతడు సముద్రంలో కొట్టుకుపోయాడు. మానవ జీవనయాత్ర కూడా సముద్ర ప్రయాణం వంటిదే. ప్రతి అడుగులోనూ జాగ్రత్త వహించాలి. జీవితమంతా నియమ నిష్ఠలతో గడిపి, ఎప్పుడో ఒకసారి ఏమాత్రం అలసత్వం వహించినా, క్షణకాలం మాయకు లోనైనా... వ్యక్తి అంతవరకు పడిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది.

🌻గొడ్డలి భుజాన పెట్టుకొని ఒక వ్యక్తి చెట్లు కొట్టడానికి వస్తున్నాడు. ఒక చెట్టు అతణ్ని చూసి గజగజ వణికిపోయింది. పక్కన ఉన్న చెట్టుతో ‘మిత్రమా, చూశావా వాణ్ని... గొడ్డలితో మనల్ని నరికి చంపడానికి యముడిలా ఎలా వస్తున్నాడో!’ అన్నది భయంతో. అప్పుడు రెండో చెట్టు ‘ఆ పదునైన ఇనుప గొడ్డలికి ఆధారం ఒక కొయ్యముక్క. దాన్ని గొడ్డలికి తగిలించి, వాడు మనల్ని చంపుతున్నాడు. ఆ కొయ్య ముక్క మనలో పుట్టిందే. అంటే, బయటి శత్రువు కంటే అంతర్గత శత్రువు అతి ప్రమాదకరం... అదే ఈ యముడికి పట్టుగొమ్మ’ అంది.

🌻బయట పొంచి ఉన్న శత్రువులకు మనవాళ్ళే దారి చూపడం చరిత్రలో కొత్త విషయమేమీ కాదు. దీన్ని గ్రహించి, అంతర్గత శత్రువుల విషయంలో జాగరూకత వహించక తప్పదు. ఏదైనా సాధించాలంటే ప్రయత్నం అవసరం. అప్రయత్నంగా సిద్ధించేదాన్ని అదృష్టమంటాం. ఇది అందరికీ అన్ని వేళలా రాదు. ముఖ్యంగా మనం ఆదర్శంగా భావించేవారందరూ బృహత్‌ ప్రయత్నాలతోనే అనుకున్నవి సాధించారు. ప్రలోభాలకు లోనుకాకుండా, ఆటంకాలకు జడవకుండా, భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటి వచ్చిన స్వామి వివేకానంద మనందరికీ సదా స్మరణీయుడు.

🌻ఎన్నిసార్లు ఎన్ని విఘ్నాలు ఎదురైనా, ధీరులు తాము తలపెట్టిన పనిని వదిలిపెట్టరు. భగీరథుడు తన పూర్వులకు ఉత్తమ గతులు కలిగించాలనుకున్నాడు. గంగ స్పర్శ వారి అస్థికలకు తగిలితేనే అది సాధ్యపడుతుంది. అందుకే అతడు గంగను ప్రార్థించాడు. ఆమె ప్రత్యక్షమయ్యాక, తన వెంట భూమిపైకి రమ్మని ప్రార్థించాడు. తాను ఆకాశం నుంచి సరాసరి కిందకు పడితే భూమి భరించలేదు కాబట్టి, శివుణ్ని ప్రార్థించమని చెప్పింది గంగ. శివుడి గురించి భగీరథుడు తపస్సు చేశాడు. ఆ ప్రార్థన ఆలకించి వచ్చిన ఆయన, గంగను తన శిరస్సుపై మోయడానికి అంగీకరించాడు. ఆమె అక్కడి నుంచి భూమిమీదకు ప్రవహించింది.

🌻గంగను భగీరథుడు తన పూర్వులు భస్మమై పడి ఉన్న చోటుకు వెంటబెట్టుకొని పయనమయ్యాడు. ప్రవాహవేగం వల్ల, దారిలో ఉన్న జహ్నుముని యాగస్థలం కొట్టుకుపోయింది. అతడు కోపించి, గంగను పుక్కిట పట్టాడు. మునిని ప్రార్థించిన భగీరథుడు, చివరికి గంగను విడిపించాడు. పట్టు వదలకుండా గంగను వెంటపెట్టుకుని వెళ్ళి తన పూర్వులకు సద్గతులు కలిగించాడు. సత్ప్రయత్నాలు చేసేవారికి ఆయన ఒక గొప్ప ఆదర్శం.

🌻కన్యాకుమారిలో నేడు వివేకానంద శిలా స్మారక మందిరం అందరికీ నేత్రానందం కలిగిస్తోంది. దీని నిర్మాణానికి ఏకనాథ్‌జీ చేసిన కృషి భగీరథ ప్రయత్నమే! ప్రతి వ్యక్తీ ఒక దైవరూపమే అనే విశ్వాసం ఆయనకు అతీత మానవ బలాన్ని కలిగించింది. నాటి ప్రధాని నెహ్రూ కన్యాకుమారి శిలపై వివేకానందుడి విగ్రహ స్థాపనకు అంగీకారం ప్రకటించారు.

🌻ఒకప్పుడు ఆ శిలపై కూర్చొనే స్వామి వివేకానంద- భారతదేశం గురించి ధ్యానం చేసేవారు. 1970లో అక్కడే ఆయన శిలాస్మారకం ఆవిష్కృతమైంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మూడు స్ఫూర్తిదాయక ప్రదర్శనలు నిత్యమూ వేలాది వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. ఏ పలుకుబడీ పదవీ లేని ఒక సామాన్య వ్యక్తి సత్‌ ప్రయత్నం ఫలితంగా వెలసిన కన్యాకుమారిలోని వివేకానంద శిలాస్మారక నిర్మాణం- అఖిల మానవాళికీ ఒక దివ్య సందేశం!

-

సంభోగం నుండి సమాధి వైపు (ఓషో)* 🌺 🌹 *Chapter -- 2:-- ప్రేమ -- అహంకారం

🌺 *సంభోగం నుండి సమాధి వైపు (ఓషో)* 🌺
🌹 *Chapter -- 2:--  ప్రేమ -- అహంకారం* 🌹
🌷 *Part -- 1* 🌷

🌳 గొప్ప అన్నది కేవలం అహంకారానికి మాత్రమే పరిమితం - *'ప్రేమకు'* మాత్రం పెద్దా చిన్నా తేడాలుండవు ! తనను ఆశ్రయించిన వాళ్ళనందరినీ ప్రేమ సము దృష్టితోనే ఆప్యాయంగా స్వీకరిస్తుంది ! 

🌿 ప్రేమ ఎప్పుడూ వినయంగా క్రిందికి వంగేందుకు సిద్ధంగానే ఉంటుంది *"అహంకారం"* క్రిందికి ఏ మాత్రం వంగేందుకు ఒప్పుకోదు. 

☘️ తనను తాను అర్పించు కోవడానికి *"ప్రేమ"* సంతోషంతో సిద్ధపడుతూనే ఉంటుంది. అన్నింటినీ లాక్కుంటున్నప్పుడు మాత్రమే *"అహంకారానికి"* సంతోషం లభిస్తూ ఉంటుంది.

🍀 ప్రేమ అనే పుష్పాల కిరీటం ధరించిన వాడు ఎప్పుడూ రాజులాగే ఉంటాడు. కానీ, *"అహంకారం"* అనే ముళ్ళ కిరీటాన్ని తలకు చుట్టుకున్నవాడు ఎప్పుడూ దరిద్రంతో దీనంగానే ఉండక తప్పదు.

🌼 తన వల్ల ఎవరికైనా సుఖం లభిస్తే *"ప్రేమ"* ఎంతో సంతోషిస్తుంది ! తన వల్ల ఎవరికైనా ఇబ్బంది, దుఃఖము కలుగు తూంటే అహంకారానికి ఆనందం కలుగుతుంటుంది ! 

🍁 *"ప్రేమ"* నిరంతరం ఎదురు చూస్తునే ఉంటుంది. తనను ఎవరితోనూ పంచుకోలేకపోతే, తను ఇవ్వలేకపోతే *"ప్రేమ"* దిగులు చెందుతుంది. తనను తాను పంచుకోగలిగితే *"ప్రేమ"* సంతోషంతో కృతజ్ఞతా భావాన్ని పొందుతుంది. తన సర్వస్వాన్ని సమర్పించుకోగలిగినప్పుడు *"ప్రేమ"* బ్రహ్మనందాన్ని అనుభవిస్తుంది ! *"అహంకారానికి"* ఎప్పుడూ దేన్నో ఒక దాన్ని సాధించాలనే తీవ్ర ఆకాంక్ష ఉంటుంది. ఏదో ఒకటి నేరవేరే అవకాశం కన్పిస్తేనే అహంకారం  ముందుకు నడుస్తుంది. కానీ, *"ప్రేమ"* కు ఇంకో దాన్ని పోందాలన్న తలంపు కూడా ఉండదు. ప్రేమకు తనకు తానే ఓ బహుమానం.



🌷 *Part -- 2* 🌷

🌷 ఉన్న దాన్ని దాచి ఉంచుకోవడం *"ప్రేమ"* స్వభానం కాదు .ఏ ఆంక్షలూ లేకుండా సర్వస్వాన్ని అర్పిస్తుంది. అహంకారం అన్నింటినీ ప్రోగు చేసుకుంటూ ఉంటుంది.

🌳 తను ముక్కలై పోయినా ప్రేమకు ఆనందంగానే ఉంటుంది. *"అహంకారం"* ధనాన్ని కోరుతుంది - ఎందుకంటే డబ్బుతో దానికి శక్తి లభిస్తుంది. కనుక. అనుకున్న దాన్ని పొందినా *"అహంకారానికి"* సంతోషం కలుగదు. అహాంకారానికి అత్యాశ అధికం.

🌿 ఇష్టమైన వారి కోసం తన అంగాల్ని తెగగొట్టుకోవడానికి కూడా అది సిద్దమే. *"ప్రేమ"* అంటే ఇవ్వడం: ఇచ్చేందుకు "ప్రేమ ఎప్పుడూ సంసిద్ధంగానే ఉంటుంది. అహంకారానికి ప్రేమ ఓ *'పిచ్చి'* లాగా మాత్రమే కనిపిస్తుంది. 

☘️ ప్రేమ నిరంతరంగా సాగే విరాళం. ప్రేమ ఎప్పుడూ ఓ రాజుగా, రారాజుగానే ఉంటుంది! ప్రేమ కంటే గొప్ప చక్రవర్తి ఎవరున్నారు? *"అహంకారం"* ఎప్పుడూ ఏదయినా ఎక్కడయినా లభ్యమౌతుందని తెలిస్తే దానికోసం పరుగులు పెడుతూనే ఉంటుంది. ఏమీ లభించని చోట్లకు *"అహంకారం"* పోనేపోదు *"అహంకారం"* నిరుతరం బిచ్చమెత్తుకుంటూనే ఉంటుంది. ప్రతిదీ దానికి కావాలి . 

🍀 *"అహంకారానికి" 'స్వీకరించే భాష'* మాత్రం వచ్చు. ' *'సమర్పించే భాష'* ప్రేమది.

🌼 ప్రేమకు మూల గ్రంథాలు లేవు. ప్రేమను వివరించగలిగే సూత్రాల పట్టికలు లేవు. ప్రేమకు నిఘంటువులు లేవు. ప్రేమకు ఆనుసరించాల్సిన విధుల క్రమాలు లేవు.     ప్రేమను గురించి నేను మీకు ఎలా చెప్పాలి - ఎంత చెప్పగలనోననే విస్మయ, విచిత్ర ఆలోచన నాలోనూ కలిగింది. ప్రేమను మాటలతో వర్ణించడం ఎంతో కష్టతరమైన విషయం.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🍁 *సంభోగం నుండి సమాధి వైపు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాలి అనుకునేవాళ్ళు *9032596493* no కి whatsapp కి msg చేయగలరు.

నాడు....నేడు....

 నాడు. ...నేడు
గతంలో సంసారం చీకట్లో జరిగేది,
జీవితాలు వెలుగులో ఉండేవి,
నేడు సంసారం వెలుగులోకి వచ్చింది,
జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయి,

కప్పుకోవాల్సిన వాటిని చూపిస్తూ,
చూపించాల్సిన అందమైన ముఖాన్ని కప్పేస్తున్నారు,

నాడు కొందరే మందుకు, విందుకు,అలవాటు పడేవారు,
నేడు కొందరే వీటికి దూరంగా ఉంటున్నారు,

నాడు కష్టమొస్తే, కుటుంబం సభ్యులు ధైర్యం చెప్పేవారు,
నేడు కుటుంబం కుటుంబాలే కష్టాల కడలికి బలియౌతున్నాయి,

నాడు తినడానికి శ్రమించి సంపాదించే వాళ్ళం,
నేడు తిన్నది అరగడానికి తిన్నగా శ్రమిస్తున్నాం,

నాడు జబ్బు చేస్తే శక్తి కోసం పండ్లు, పాలు తాగేవాళ్ళం,
నేడు అదే డబ్బుతో బిళ్ళలు కొని,జబ్బులు కొనితెచ్చుకుంటున్నాం,

గతంలో అందరూ హార్డవేర్ ఇంజనీర్లే!!
అయినా మనసు సాప్ట్ గా ఉండేది,
ఇప్పుడు అంతా సాప్ట్ వేర్ ఇంజనీర్లే!
మనసు మాత్రం పెళ్ళాం తో పంచుకోలేనంత హార్ట్ గా మారిపోయింది,

అప్పుడు వైద్యుడు ఇల్లిల్లూ తిరిగి వైద్యం చేసేవాడు,
బిల్లు వల్ల జేబుకు చిల్లు పడేదికాదు,
నేడు ఇంటిల్లిపాదీ వైద్యుని ముందు క్యూ కట్టారు,
సంపాదన సగం, వైద్యునికి సమర్పణం, 

నాడు భవతీ బిక్షాందేహీ అంటే, పనికల్పించి అన్నం పెట్టేవారు,
నేడు భిక్షగాడు సైతం మందుతాగి,
ఇంటిముందు తూలుతున్నాడు,

నాడు దొంగలు నట్టింట్లోపడి దోచుకెళ్ళేవారు,
నేడు దొంగలు దొరల్లాగా నెట్ ఇంట్లో దోచేస్తున్నారు,

ఒకప్పుడు దొంగల్ని పట్టడానికి  పోలీసులు తిరిగేవారు,
ఇప్పుడు హైటెక్ పోలీసుల చుట్టూ దొంగలే తిరుగుతున్నారు,

పదికిలోమీటర్లు నడిచి, పదిరూపాయలు పెట్టి సినిమా చూసేవాళ్ళం,
ఇప్పుడు ఇంటిముందు సినిమాని వెయ్యి రూపాయలు పెట్టి చూస్తున్నాం,

అప్పుడు అప్పు చేయాలంటే తప్పు చేసినట్లు బాధపడేవాళ్ళం,
ఇప్పుడు తప్పు చేయడానికే అన్నట్లు  అప్పు చేసేస్తున్నాం,

ఒకప్పుడు కప్పు పాలు,పెరుగు అమ్మి, సొమ్ము చేయలేక తాగేవాళ్ళం,
ఇప్పుడు ప్లాస్టిక్  కప్పుల్లో పాలు, పెరుగు తినేస్తున్నాం,

చైనా నుండి పెన్నులు,గన్నులు మాత్రమే  వచ్చేవి,
నేడు చైనా ప్లాస్టిక్ బియ్యం కూడా వస్తున్నాయి...

ఇది మనం సాధించిన పురోగతా.....!
లేక మనకు మనం తెచ్చుకున్న అధోగతా....?🙏

సంభోగం నుండి సమాధి వైపు (ఓషో) Chapter --1:-- ప్రేమ

 *Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *సంభోగం నుండి సమాధి వైపు (ఓషో)* 🌺
🌹 *Chapter --1:--  ప్రేమ* 🌹
🌷 *Part -- 1* 🌷

☘️ ప్రేమ అనుభూతికి సులభంగా అందేదే, అయినా ప్రేమను నిర్వచించడం మాత్రం కష్టతరమే.

🌿 జీవితంలోని అత్యంత సుందరమైన, నిత్య శోభతో భాసిల్లే పదార్థ స్వభావ ధర్మాల్ని అనుభవించి తెలుసుకోగలగడం సులభమే కానీ ఆ అనుభూతులను స్పష్టంగా నిర్వచించి వ్యక్తీకరించడం మాత్రం దుస్సాధమై తీరుతుంది.

🌷 ఈ ప్రపంచంలో ఏదీ *'విషం'* కాదు. దివ్యమైన ఈ సృష్టిలో *'చెడు వస్తువు'* ఏదీ లేదు. సర్వం అమృతమయమే. 

🍁 ప్రేమంకురాలు మానవుల్లో పుష్పించకపోవడానికి నిశ్చయంగా మతాలే కారణం  అని నేను పునరుదాటిస్తున్నాను.

🌼 వికృతమైన సభ్యతా, మానవత్వాన్ని అణిచి వేస్తున్న ప్రమాదకర కట్టుబాట్లు అనే అవరోధాల్ని తొలగించగలిగితే ప్రతి ఒక్కరలోనూ ప్రేమ సహజంగానే ఉద్బవిస్తుంది. 

🌸 ప్రేమకు పునాది కామమే! ఇదే మౌలిక సత్యం!! ప్రేమ ప్రవాహానికి ఆరంభం కామం. గంగా నదికి జన్మ స్థలం గంగోత్రి ఎలాగో, ప్రేమ గంగకు జన్మ స్థలం సెక్స్, కామమే! కానీ అందరూ సెక్స్ ను ఓ శత్రువులా చూస్తుంటారు.

🏵️ కామం నుంచి ఉద్భవించిన శక్తి ఒక్కటే పయనించి చివరికి అంతరాంతరాల్లోని ప్రేమ సాగరాన్ని చేరుకోగలుగుతుందనే సత్యాన్ని మనం ఎవ్వరం గుర్తిస్తున్నట్లు అనిపించడం లేదు. కామ శక్తి యొక్క రూపాంతరమే ప్రేమ శక్తి. *`కామం'* అనే విత్తనంలోంచే *'ప్రేమ కుసుమం'* విచ్చుకోగలుగుతుంది. 

☘️ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమంటే కామం నుంచి మానవుడిని విడదీయడం సాధ్యమయ్యే పని కాదని! మానవుడి జీవితానికి కామమే తొలి అడుగు. కామం లొంచే మానవుడు జన్మించాడు. కామ శక్తే మూల బిందువుగా ఈ సృష్టి నిర్మాణాన్ని భగవంతుడు చేశాడు. సృష్టికర్త దేన్ని "పాపం అని అనుకోలేదో ఆ కామాన్నే మహానుభావులందరూ పాపం అంటున్నారు ! సెక్సు ఓ పాపమేనని దేవుడు అనుకుంటే ఆ భగమతునికన్నా మించిన పాపి ఈ భూమి మీద గానీ, యావద్విశ్వంలో గానీ మరొక్కడు ఉండడు! 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌳 *సంభోగం నుండి సమాధి వైపు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాలి అనుకునేవాళ్ళు *9032596493* no కి whatsapp కి msg చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣

*Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🏵️ *సంభోగం నుండి సమాధి వైపు ---ఓషో*🏵️
🌸 *Chapter --1:-- ప్రేమ*🌸
🌷 *Part --2*🌷

☘️ ప్రపంచంలోని ఏ జంతువుకూ మనిషికున్నంత కామ వికారం లేదు! ప్రతి చోటా మనిషి కామ ప్రవృత్తిలోనే ఉంటున్నాడు - నిద్రపోతున్నా, మేల్కొని ఉన్నా అదే ధ్యాసే! అతడి ప్రవర్తనా, నడవడీ పాడయిపోతూ ఉన్నాయి. ప్రతి క్షణం అతడిని కామం వేధిస్తూనే ఉంది! 

🌿 నిర్ణయాలన్నీ మానవుడీ మనస్సు పై పై పోరల్లోనే తీసుకోబడతాయి, దేనికోసం ఆ నిర్ణయం తీసుకోబడిందో
దాని కీలక మర్మం అచేతన మానసపు అడ్డ దిడ్డమైన లోతైన గుహల్లో దాక్కుని ఉంటుంది. మానసాన్ని పది భాగాలుగా విభజిస్తే పైన ఉన్న మొదటి భాగంలోనే తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ప్రతిజ్ఞలు చోటు చేసుకుని ఉంటాయి. మనసులో మిగతా తొమ్మిది భాగాలూ పదో భాగానికి వ్యతిరేకంగా పని చేస్తూ ఉంటాయి. 

🌷 బలవంతం మీద జరిగే పని ఏదీ సవ్యంగానూ సంపూర్ణంగాను జరగదనే విషయాన్ని దయచేసి ఎప్పుడూ గుర్తుంచుకోండి. 

🍁 ఏ పరమానందంలో తన్మయుడై ఎల్లవేళలా ఉంటాడో, ఏ పరిపూర్ణ ప్రేమను నిరంతరమూ అనుభవిస్తూనే ఉంటాడో, ఏ రమణీయ ప్రశాంతి నిలయంలో ఎల్లప్పుడూ నివసిస్తుంటాడో ఆ యోగి పొందుతున్న ఆనందపు అనుభూతే సంభోగపు పరాకాష్ఠలో క్షణమో, మరికాస్త మాత్రమో దంపతుల అనుభూతిలోకి వస్తుంది. మౌలికంగా ఈ దంపతులూ, ఆ యోగీ అనుభవిస్తున్న ఆనందం ఒక్కటే.

🌼 ఎంత ఎక్కువగా మీరు కామాన్ని ఇష్టంగా స్వీకరించగలుగుతారో అంత సులభంగానూ దాన్నుంచి స్వేచ్ఛను పొందగలుగుతారు. కామాన్ని ఎంత బలంగా మీరు అణచి పెట్టేందుకు ప్రయత్నిస్తారో అంత ఎక్కువగా దానితో చిక్కుబడిపోతారు. 

🌸 కామ ప్రవాహం సహజంగానే ప్రేమ వైపుకు తీసే పరుగులకు ప్రతి బంధకంగా ఓ బలమైన అడ్డుగోడలా ఉన్న 
అవరోధమే నేను. ఈ *"నేను"* అన్నది మంచి వాళ్ళలోనూ, చెడ్డ వాళ్ళలోనూ కూడా మహా బలంతో కూడి ఉంటుంది. 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌳 *సంభోగం నుండి సమాధి* వైపు మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాలి అనుకునేవాళ్ళు *9032596493* no కి whatsapp కి msg చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣

*Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🏵️ *సంభోగం నుండి సమాధి వైపు ---ఓషో*🏵️
🌸 *Chapter --1:-- ప్రేమ*🌸
🌷 *Part --3*🌷

🏵️ ఎంత ఎక్కువ అహంకారం ఓ మనిషికి ఉంటే ఆ మనిషి  ఇతరులతో కలవడం అంత కష్టం. ఈ నేను తనను తాను గట్టిగా గుర్తించి ఘోషిస్తుంది - ఇదొక అడ్డుగోడ. నువ్వు నువ్వే - నేను నేనే అంటుంది. ఓ మనిషిలో *"నేను"* అన్న భావం ఉన్నంత వరకూ ప్రక్క నున్న వారు *'పరాయి వారు'*  అన్న భావన పోనేపాదు.

🌳 ఏకత్వ అనుభవమే ప్రేమానుభవం. అడ్డు గోడలన్నీ కూలిపోయి రెండు శక్తులూ పరస్పరం సమ్మిళితమై పోవడమే ప్రేమంటే. ఇద్దరు మనుష్యుల  మధ్య ఉన్న గోడలు నేలమట్టమై, రెండు జీవితాల కలయిక ఏకత్వమై
ఇద్దరూ అనుభవించే పారవశ్యమే *'ప్రేమ'*.

🍀 ఇద్దరి మధ్య ఇటువంటి అన్యోన్యత సంభవిస్తే దాన్నే నేను" ప్రేమ అంటాను. ఇటువంటి అన్యోన్యత ఓ వ్యక్తికీ,  మానవాళి సమస్తానికీ మధ్య జరిగితే దాన్నే నేను భగవత్సందానం" అంటాను. నువ్వు నాలో పూర్తిగా లీనమై పోయి, అటువంటి అన్యోన్యతనే, ఏకత్వాన్నే, అనుభవించగలిగితే అన్ని హద్దులు మాయమై మన శక్తుల ప్రవాహం మిళితమై రసానుభూతి ప్రాప్తిస్తే, అప్పుడే అది ప్రేమ. అటువంటి ఏకత్వమే మిగతా అందరిలోనూ నాకు కలిగితే అప్పుడు నా ఉనికి మాయమై అందరిలోనూ నేను ఉంటాను. ఈ విధంగా నేను అందరిలోనూ ఉన్నానని తెలుసుకోగల సంపూర్ణ అవగాహనే, ఎరుకే - మహోన్నత్వం. అదే సర్వజ్ఞత్వం: అతి బలోపేతమైన విశ్వాత్మతో విలీనం; అదే దైవప్రాప్తి అంటే. అందువల్లే నేను ప్రేమను మొదటి మెట్టుగా దైవత్యాన్ని చివరి మెట్టుగా వర్ణిస్తూ ఉంటాను. అదే అత్యంత రమణీయమైన చివరి మెట్టు.

☘️ నేను 'అనే మీ అహంకారం ఎక్కడుంది? " *"నేను"* అంటే ఏమిటి? "నేను అంటే అందరికీ తెలిసినట్లే అనిపిస్తూ ఉంటుంది. కానీ *"నేను"* అంటే ఎవరో, అది ఎక్కడుందో మాత్రం తెలియడం లేదు. శరీరంలోనూ, ఏ చోటులోనూ అది లేదు! ఓ ఏకాంత ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చుని తీరిగ్గా ఆలోచించి చూడండి. *"నేను"* గురించి అన్వేషణ చెయ్యండి. ఎంత త తీవ్రంగా శోధించినా ఎక్కడా ఈ *"నేను"* కనిపించకపోవడం మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎంతో లోతుగా మీ ఆలోచన సాగిన తరువాత మీకు *"నేను"* అనేది అసలు లేనేలేదని *"నేను"* లేదు కాబట్టి *"అహంకారం"* అనేది కూడా లేదనే సత్యం స్పష్టంగా అర్థమయి జ్ఞానోదయం కలుగుతుంది. అదే ఆత్మ జ్ఞానం అంటే ! అదే బ్రహ్మ జ్ఞానం
అంటే ! అది నీకు లభిస్తే అదే నీవు అవుతావు. *"నేను"* గా  ఉండవు.

🌿 ప్రేమ కేవలం శూన్యం నుంచి మాత్రమే ఆవిర్భవించగలదు. ఓ శూన్యత్వం మాత్రమే  మరో శూన్యంతో ఐక్యం కాగలదు. ఒక సున్నా మాత్రమే మరో సున్నాతో పూర్తిగా కలిసిపోగలదు. ఇద్దరు వ్యక్తులు' కలవలేరు రెండు శూన్యతలు మాత్రం కలిసిపోగలవు. అక్కడ ఏ హద్దులూ అడ్డురావడం లేదు గనుక. ప్రతి వస్తువుకూ అడ్డు గోడలుంటాయి. శూన్యానికి ఏ అడ్డు గోడలూ ఉండవు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌳 *సంభోగం నుండి సమాధి* వైపు మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాలి అనుకునేవాళ్ళు *9032596493* no కి whatsapp కి msg చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣