Sunday, December 11, 2022

ఈ మంచి చెడుల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి మంచి గెలుస్తుంది. మరో సారి చెడు గెలుస్తుంది. దాని వలన సుఖము మరియు దుఃఖము ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. ఇదే సంసారము అనే సాగరము. ఈ సాగరము నుండి బయటపడాలంటే ఒక గట్టి పడవ కావాలి.

 ఆచార్య సద్బోధన:
                🌺🌺🌺✍️

మన శరీరం కూడా ఒక కురుక్షేత్రం! అందులో మంచి ఆలోచనలు పాండవుల సైన్యం అయితే, దుర్మార్గముతో కూడిన ఆలోచనలు కౌరవ సేనలు. వాటి మధ్య జరిగే ఘర్షణ... కురుక్షేత్ర సంగ్రామము.

అసలు మనిషి పుట్టగానే అతడి లేక ఆమె మనసు నిర్మలంగా, ప్రశాంతంగా, అమాయకంగా ఉంటుంది. పెరిగి పెద్ద అయ్యేకొద్దీ ఇది నాది, అది నీది అనే స్వార్ధము.నీవు వేరు నేను వేరు అనే భేదబుద్ధి, ఇది అంతా నాకే  కావాలి, నీకు ఇవ్వను అనే లోభత్వము, నువ్వంటే నాకు పడదు అనే ద్వేషము, నీకు అంత ఉంది, నాకు ఇంతే ఉంది  అనే అసూయ        క్రమక్రమంగా మన మనసులను, బుద్ధిని కురుక్షేత్రంగా మారుస్తాయి. 

ఈ మంచి చెడుల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి మంచి గెలుస్తుంది. మరో సారి చెడు గెలుస్తుంది. దాని వలన సుఖము మరియు దుఃఖము  ఒకదాని వెంట ఒకటి వస్తుంటాయి. 

ఇదే సంసారము అనే సాగరము. ఈ సాగరము నుండి బయటపడాలంటే ఒక గట్టి పడవ కావాలి. 

అదే భగవద్గీత! 

దానికి చుక్కాని పట్టేది గురువు. భగవద్గీత అనే పడవ ఎక్కి, శ్రీకృష్ణుడు అనే గురువు సాయంతో ఈ సంసారము అనే సముద్రమును సునాయాసంగా దాటవచ్చు.✍️
              వందే గీతామాతరం.
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవంతు.🙏

No comments:

Post a Comment