🕉 శ్రీ గురుభ్యోనమః 🕉
సంసారం అంటే రిపిటీషన్. ఈ రోజు చేసిందే మరల రేపు చేయడం, చేసిందే చేయడం. సంసార వాసన ఉన్నవానికి ఆత్మానుభవం పొందాలనే తలంపేరాదు.
వంతెనలు, భవనాలు, ఆనకట్టలు నిర్మించవచ్చు కానీ, కర్తృత్వం, స్వార్థం ఉన్న వానిని సహృదయం గల వ్యక్తిగా చెయ్యడం కష్టం.
అలవాట్ల యొక్క వేగం వల్ల, వ్యక్తిని ఉన్నతునిగా చెయ్యాలన్నా చెయ్యలేము.
మనం పని చేసేటప్పుడు సింపుల్ గా ఏకాగ్రతతో చెయ్యాలి. అలాగే చదివేటప్పుడు ఏకాగ్రతతో చదివితే, ఎంత గ్రంథమైనా కొద్దిసేపు చదివితే చాలు అంతా అర్థం అవుతుంది.
"మంచితనమే జ్ఞానం"
అంటాడు సోక్రటీస్. లోకం కోసం మంచిగా ఉండటం కాదు, ఎదుటివారు చెప్పుకోవడం కోసం మంచితనంగా ఉండటం కాదు, చరిత్ర వ్రాయించుకోవడం కోసం మంచిగా ఉండటం కాదు, మంచికోసమే మంచిగా ఉండండి. అప్పుడు, "ఈశ్వరుడు మాయను దారి ఇమ్మని, మాయను తప్పిస్తాడు".
" అమృతవాహిని"
🌷🙏🏻🌷🙏🏻🌷
No comments:
Post a Comment