*::::మనం ఎలా నేర్చు కుంటాం::::*
పశి వాడిగా ఉన్నప్పుడు మనం కేవలం అనుకరించడం ద్వారానే అనేక విషయాలు నేర్చు కొనే వాళ్ళం.
కొద్దిగ పెద్ద అయిన తర్వాత రక రకాల ఇంద్రియ అనుభూతులు పరిచయం చేసుకుంటూ వుంటాము.
బడి లో పాఠాలు బైహార్ట్ చేస్తాం. వినికిడి ద్వారా,విషయం జ్ఞానం అభివృద్ధి చేస్తాం.
అయితే సొంత పరిశీలన, విశ్లేషణ, సత్యాసత్య నిరూపణ, హేతుబద్ధ పరిశీలన, శాస్త్రీయ అవగాహన, విచక్షణ, వీటిని యుక్త వయస్సులో నేర్చుకుంటాం.
కొందరు పెద్దలు పశి వారు నేర్చు కొనే విధానం లోనే వుండి పోతారు.ఆగుతారు (కొందరు యువకులు తాతగారి బామ్మగారి భావాలకు బద్దులై)
అందుకే మనకు గురువు,నాయకుడు, బాస్ లను అనుకరిస్తూ, అనుకరణ చేస్తూ, చెప్పింది చెప్పినట్లు గంగిరెద్దుల లాగా తల ఊపుతూ , చిలుక పలుకులు పలికే మేదావులు వున్నారు.
ధ్యానం _స్వీయజ్ఞానాన్ని_ స్వయంగా కలిగించు కుంటది.
*షణ్ముఖానంద. 98666 99774*
No comments:
Post a Comment