*శ్రీగురుభ్యోనమః*🙏
ఆత్మ అనే దానిని నిర్వచించలేము. అది ఉన్నదే సత్యము తప్ప, అది ఇలా ఉన్నదని చెప్పలేము. దానికి స్పందనము ఉంటుంది. వెలుగు ఉంటుంది. అంతకు మించి ఏమీ ఉండదక్కడ. స్పందనములో కలిసిపోతూ ఉంటుంది, మళ్లీ విడిపడి వస్తూ ఉంటుంది. కవులు, ఋషులు, మహర్షులు దానిని వర్ణించ లేక నానా బాధలు పడ్డారు.
దీనిని ఎట్లాగైనా జీవులకు ఎక్కించాలనే వారి తపన వలన ఇన్ని గ్రంధాలు వచ్చాయి. ఎక్కించుకుందామనే తపన జీవుడిలో లేకపోతే ఈ ప్రపంచములో ఎన్ని గ్రంధాలు ఉన్నా ఉపయోగము లేదు. నన్ను నేను తెలుసుకోవాలి అనే తపన పుట్టిన వాడికి అన్నిటిలోను *అదే* కనిపిస్తూ ఉంటుంది.
*భాగవతము Master K.P.K.*🙏
నవ గోపికా సంఘము
No comments:
Post a Comment