Saturday, December 3, 2022

:::::ఇంద్రియాల అతిక్రమణ:::::

 *ఇంద్రియాల అతిక్రమణ*
     ఎవరు ఏ పని చెయ్యగలరో  ఆ పని చేసుకుంటారు. ఒకరి పని లో మరొకరు జోక్యం చేయరాదు. అది అతిక్రమణ.
  
     అలాగే ఏ ఇంద్రియం పని ఆ ఇంద్రియం చేత చేయించాలి..
  కన్ను అందాన్ని చూసి మనకు చెపుతుంది. చెప్పాలి.
  చెవి శబ్దాన్ని విని మనకు చెప్పాలి . అంతే.
 నాలుక రుచి చూడాలి.
ముక్కు వాసన పీల్చాలి.
   ఏమి జరుగుతుందంటే అందరి పనులు చెవి చెస్తుంది 
     ఉదా. గులాబి అందంగా వుంటుంది అని చెవి విని మనకు చెబుతుంది. మనం నమ్ముతున్నాము. ఇది కన్ను పని కదా . కన్ను గులాబీ ని చూసి అందంగా వుందో లేదో  చెప్పాలి కదా.
  అలాగే పంచదార తియ్యన అని  ఏ  పని లేని చెవి అక్కడ ఇక్కడ విని చెపుతుంది.
నాలుకని పరిశీలించ నివ్వాలి కదా. పరీక్షించాలి కదా.
*ధ్యానం ఇంద్రియాలను నిగ్రహిస్తుంది*
*షణ్ముఖానంద9866699774*

No comments:

Post a Comment