శ్రీ మూక పంచశతి:
శ్రీ మూకశంకర విరచిత
మూక పంచశతి
శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన
స్తుతి శతకం
🙏🌸🙏🙏🙏🌸🙏
శ్లోకము:-
*యేన ఖ్యాతో భవతి సగృహీ పూరుషో మేరుధన్వా*
*యద్దృక్కోణే మదననిగమ ప్రాభవం బోభవీతి|*
*యత్ప్రీత్యైవ త్రిజగదధిపో జృంభతే కింపచానః*
*కంపాతీరే స జయతి మహాన్ కశ్చిదోజో విశేషౌ||75||*
భావము:
మేరువు ధనుస్సుగా గల ఆ మహాపురుషుడు ప్రసిద్దుడయిన గృహస్థుడగునో! ఎవరి( ఎవతె) చూపుకొనయందు కామశాస్త్రముయొక్క ప్రభుత్వము ఎక్కువగుచున్నదో ఎవరి(ఎవతె) యొక్క ప్రీతితోనే దరిద్రుడు ముల్లోకములకు అధిపతిగా విజృంభించునో అటువంటి ఒకానొక గొప్ప విశిష్టమైన తేజస్సు కంపానదీతీరమున విలసిల్లుచున్నది;
శ్లోకము:-
*ధన్యా ధన్యా గతిరిహ గిరాం దేవి కామాక్షి కామే*
*నింద్యాం భింద్యాత్ సపది జడతాం కల్మషాదున్మిషంతీం|*
*సాధ్వీ మాధ్వీరసమధురతా భంజినీ మంజురీతిః*
*వాణీవేణీ ఝటితి వృణుతాత్ స్వర్ధునీ స్పర్ధినీ మామ్||76||*
భావము:
ఓ కామాక్షీదేవీ ప్రస్థుతము ఒకానొక నాయొక్క మిక్కిలి ధన్యమైన వాక్కులగతి కలుషము నుండి బయటపడినదై నిందనీయమయిన జాడ్యమును వెంటనే భేదించును గాక! మధురరసము యొక్క మాధుర్యమును భగ్నముచేయునట్టియు సాఫీయైనదియు ఆకాశగంగతో పోటీపడినట్టియు సరస్వతీకేశపాశమునదగిన మనోహరమగు శైలి నన్ను వెంటనే వరించుగాక!
🔱 ఆ తల్లి
పాదపద్మములకు నమస్కరిస్తూ 🔱
🙏🌸🌸🌸🌸🌸🙏.
No comments:
Post a Comment