*స్త్రీ లో అందం..* ❤
*స్త్రీ తో అవసరం..*
*స్త్రీ లేకపోతే ఉహించలేని జీవితం..*
*స్త్రీ ని గౌరవించాలి..*
*ప్రేమించాలి అనేది ఒట్టి మాటలు..*
*ముందు స్త్రీ ని మనిషి గా చూడాలి..*
*మగ దురహంకారానికి బలైన స్త్రీలు ఎందరో ఉన్నారు..*
*స్త్రీల అహంకారానికి బలైన పురుషులు ఉన్నారు..*
*కాకపోతే మగాడి దౌర్జన్యానికి బలైన స్త్రీలు నూటికి 90% ఉంటే..*
*స్త్రీ మోసాలకు బలైన పురుషులు ఓ పది శాతం ఉంటారు..*
*స్త్రీ మగాణ్ణి నవమాసాలు మోసి కంటే..*
*మరి మగాడు*
*తాను కన్న, తన కన్న ఆడ బిడ్డను*
*తన చేతుల మీద తాను ఒకరికి అమ్మ అయ్యే దాకా పెంచుతాడు..*
*బంధం ముడి పడ్డాక బాధ్యతలు పెరుగుతాయి..*
*బంధాన్ని తెంచుకుంటే* *బాధ్యతలనుండి తప్పించుకుంటే*
*దొరికేది స్వేచ్ఛ అనుకుంటే అదొక పిచ్చితనం అవుతుంది..!*
*స్త్రీ సుఖం కోసమే ఐతే*
*ప్రపంచవ్యాప్తంగా నేడు పెళ్లిల్లే ఉండేవి కాదు..*
*విచ్చలవిడిగా సుఖపడే వారు..*
*వివాహ వ్యవస్థ*
*కుటుంబ వ్యవస్థ*
*మనిషికి కొన్ని విలువలను నేర్పింది..*
*మానవజాతి మనుగడకు దోహదపడింది..!*
*అత్యాచారం చేయమని*
*ఏ తండ్రి ఏ తల్లి చెప్పరు..*
*స్త్రీని వాడుకొని వదిలేయమని*
*ఏ సమాజం అనదు..*
*స్త్రీల గొప్పతనం గురించి పాఠాలు పాటలు కావ్యాలు సినిమాలు వచ్చినా,*
*చరిత్రలో స్త్రీ లు ఎంత ఉన్నత స్థానం లో ఉన్నా,*
*మన ఇంట్లో స్త్రీల ను మనం ఎలా చూసుకుంటున్నాం అనేది ముఖ్యం..!*
*పరాయి స్త్రీ ని దేవత అని*
*ఇంటి ఆడదాన్ని దయ్యంలా చూసే మగాడు*
*ప్రతి మగాడి లో ఉంటాడు..*
*కానీ కొందరిలో వాడు బయట పడడు..*
*కొందరు బయట పడుతుంటారు..!*
*అయినా ఇప్పటికీ స్త్రీలే పద్ధతిగా సాంప్రదాయ బద్ధంగా బతకాలి*
*మగాడికి ఎలాంటి అడ్డు అదుపు లేదు..!*
*ప్రపంచవ్యాప్తంగా ఈ నేల మీద*
*ఏ మూలన కూడా ఒక్క రేప్ కూడా జరగనప్పుడే*
*నిజం గా మనం స్త్రీ ని*
*గౌరవిస్తున్నట్టు..!*
*ప్రతి ఆడదానిలో అమ్మను చెల్లిని అక్కను కాదు*
*స్త్రీ నే చూడండి..*
*స్త్రీ తో ఆరోగ్యకరమైన, ఎలాంటి దురుద్దేశం లేని బంధాన్ని అనుబంధాన్ని పెంచుకోండి..!*
*శారీరక సంబంధం కన్నా ఎక్కువ ఆనందాన్ని*
*స్త్రీ స్నేహం అందిస్తుంది..!*
*స్త్రీల అవయవాలను తొంగి చూడటం కాదు..*
*స్త్రీ హృదయాన్ని చూడండి..*
*స్త్రీ కంట్లో నే ఆవిరైపోతున్న* *కన్నీళ్ళలో కనపడని వేదను*
*వ్యధ ను*
*మీ హృదయంతో వినే ప్రయత్నం చేయండి..!*
*రేప్ చేయడం..*
*స్త్రీ ని బలవంతంగా లోబరుచుకోవడం మగతనం కాదు..*
*స్త్రీ హృదయాన్ని గెలుచుకోవడం మగతనం..*
*ఒక స్త్రీ తనను తాను నీకు అర్పిస్తాను అనడం*
*నీ మగతనం...*
No comments:
Post a Comment