*_జీవితం లో సంతృప్తిలేని వాడికి ఏది దొరికినా,ఎంత దొరికినా సంతోషం కలగదు._*
*_జీవితం ఆసాంతం అశాంతితోనే గడుస్తుంది.ఉన్నదాంట్లో తృప్తి పడినప్పుడే ప్రశాంతంగా జీవితం ప్రశాంతంగా ఉంటుంది.._*
*_ప్రశాంతంగా ఉండే మనిషిని అనారోగ్యం త్వరగా దరిచేరదు.ఆయుష్షూ పెరుగుతుంది._*
*_ప్రకృతిలో పక్షులనూ,జంతువులకు ఎప్పుడో తప్ప వ్యాధులు సోకి మరణించడం చూడం._*
*_మనిషి కూడాఋ అంతే.అత్యాశలకు పోకుండా,ఈర్ష్యాసూయలకు లోనుకాకుండా మనగలిగితే తృప్తిగా జీవించి, తృప్తిగా దేవుడిని చేరుకోవచ్చు._*
*_అయితే, విజ్ఞాన సముపార్జన విషయంలో తృప్తి ఉండకూడదు.నిరంతరం నేర్చుకోవాలనే తపన, నేర్చిన జ్ఞానాన్ని పదుగురికీ పంచాలన్న సదుద్దేశం ఉత్తమ లక్షణాలు._*
*_కొత్త విషయాలు తెలుసుకోవడం,మంచివారితో స్నేహం మనల్ని ఉన్న స్థితి నుంచీ అత్యున్నత స్థితికి తీసుకెళ్తాయి._*
*_మిత్రమా...ఒక్క మాట..జీవితంలో ప్రశాంతత లేని వ్యక్తి బ్రతికి ఉన్న..శవాముతో సమానం.☝🏾_*
No comments:
Post a Comment