Sunday, January 12, 2025

 *_జీవితంలో సరైన విధానం తెలిసేవరకు నిదానంగా వెళ్లిన తప్పులేదు ఎందుకంటే, బలంగా నలిగిన హృదయాలు ఎప్పటికి బలహీనపడవు._*

*_ఓడిపోతే ఓదార్పు అవసరమో లేదో తెలీదు కానీ, గెలవాలంటే మాత్రం మార్పు కావాలి._*

*_మారి తీరాలి... నువ్వు చేరుకున్న గమ్యాన్ని చూసి గాయం కూడా గర్వపడాలి... నిద్రలేని రాత్రులే కాదు ఎప్పుడు తెల్లారుతుందా... అని ఆశతో ఎదురుచూసే గొప్ప గెలుపు కూడా ఒకటి వస్తుంది..._*

*_ఈ రోజు దరిద్రం అని తిట్టుకున్నదే ఎదో ఒక రోజు అనుభవం అని అర్ధం అవుతుంది. ఓడిపోతామన్న భయంతో గెలవగలవన్న విషయం మర్చిపోకు..._*

*_కొన్ని తలుపులు మూసుకుపోతేనే... కొత్త మలుపులు చేరుకుంటావు... అప్పుడే కదా నువ్వు ఏం చేయాలో నీకు అర్థమయ్యేది..._*

*_జీవితంలో జ్ఞాపకం అనేది ఒక మంచి అనుభూతి... కొన్ని మంచివి కొన్ని చెడ్డవి..._*

*_మంచివైతే కొన్నేళ్ల తరువాత ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. నీకు ఆ రోజు అంత చిన్న సమస్యలకేనా అంతలా బాధపడింది అనిపిస్తుంది._*

*_కాలం దేనికి ఎవ్వరికీ సమాధానం చెప్పదు ఒక్క నువ్వు పడుతున్న కష్టం తప్ప..._*

*_గొప్ప కథల్లో నీ పాత్ర లేకపోయినా నీ కథ ఎప్పుడూ గొప్పగా ఉండేలా చూసుకో..._*

*_ఎందుకంటే అవసరం చెప్పిరాదు అవకాశం పోతే తిరిగి రాదు. అమ్ముకో... గలిగాలే కానీ... ఆలోచనలే అంతులేని ఆస్తి..._*

*_చేసే పని దైవంలా భావిస్తే ఎదో ఒక రోజు నీ జీవితానికి దీపంలా వెలుగునిస్తుంది.☝️_*

     *_-సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌺🌺🌺 🪷🙇🪷 🌺🌺🌺

No comments:

Post a Comment