Thursday, January 2, 2025

 *శివుడు లేని చోటెక్కడ..?*


🌷అవ్వయ్యార్ శివ భక్తురాలి కథ:🌷

🌿అవ్వాయ్యార్ అనే వృద్ధురాలి భక్తికి మెచ్చి గణపతి ఆమెను సశరీరంగా  కైలాసానికి తీసుకు వెళ్తాడు.

🌸అవ్వ కడు వృద్ధురాలు కావడం తో కాళ్ళు మడిచి కూర్చోలేక శంకరుని ముందు కాళ్ళు చాపి కూర్చుంటుంది.

🌿పరమేశ్వరుడి పక్కనే ఉన్న పార్వతికేమో మనస్సు చివుక్కమంది.' అలా కూర్చోవడం అపరాధం కదా!అన్న భావం తో ఆమెకు ఒక్కసారి చెప్పి చూడమని పతి దేవుణ్ణి కోరింది.

🌸అమ్మో ! ఆమె పరమ భక్తురాలు.ఆమెనేమీ అనకూడదు!అన్నాడు శివుడు. అయినా పరమేశ్వరి ఆ అమర్యాదను సహించక చెలికత్తె కు చెప్పిచూసింది.

🌿ఆ సఖి అవ్వను సమీపించి ' అవ్వా!అవ్వా! కాళ్ళు ఈశ్వరుని వైపుకు పెట్టకు అంది'.అప్పుడు ఆ వృద్దురాలు ' అలాగా అమ్మా! ఈశ్వరుడు లేని చోటు ఎక్కడో చెప్పు , 

🌸కాళ్ళు అటు వైపు పెట్టుకుంటాను ' అంటూ పక్కకు తిప్పుకుందట ! పరమేశ్వుడు కూడా ఆవైపుకు తిరిగాడు.అటు తిప్పితే అటు తిరిగాడు.ఎటు తిప్పితే అటు శంకరుడు తిరగాల్సి వచ్చింది .

🌿 అలా తిరుగుతూ పరమేశ్వరుడు పార్వతీ వైపు చూసి ' నేను చెబితే విన్నావు కాదు!ఆమె నన్ను ఎలా తిప్పుతుంది చూడు.అందుకే నేను నోరు మెదపకు అన్నాను.

🌸నేను భక్తుల వశమే అని నీకు తెలుసు కదా! అంటాడు.
అప్పుడు పార్వతీదేవి అవ్వా క్షేమించు అని ఆమెను ప్రార్థించి నదట! అయినా శివుడు లేని చోటెక్కడైనా ఉందా?...             

No comments:

Post a Comment