*భోగి మంటలు*
లౌకికమైనటువంటి కోరికలకి మేము దూరంగా వుండి ఆంతరంగికం నందు మేము భగవంతునికి దగ్గరగా ఈశ్వరకామం పెంచుకుంటాము అని చెప్పటానికి సూచనగా భోగిమంట అని వేస్తారు.
ప్రతి వీధి యందు భోగి మంట వేసి అందులో కట్టెలు, ఆవుపేడతో చేసినటువంటి పిడకలు వేస్తుంటారు. అంటే దాని అర్ధం మేము లౌకిక కామాన్ని కాల్చేసుకొని ఈశ్వరకామాన్ని పెంపొందించుకొనే ప్రయత్నం చేస్తాము అని. బాహ్యంలో పరమేశ్వరుడు ఇచ్చినటువంటి సంపత్తిని పరమేశ్వర ప్రసాదంగా అనుభవిస్తాము.
లౌకికమైనటుంటి కామమంతా కాలిపోయి ఈశ్వరకామమొక్కటే మిగిలిపోతే, ఆ ఈశ్వరకామమే నిరతిశయ భక్తిగా మారితే, ఆ భక్తి వలన చేసిన కర్మానుచరణమునకు చిత్తశుద్ధిచేత పాత్రత కలిగితే, పాత్రత వలన జ్ఞానం కలిగితే, జ్ఞానం వలన భోగి. భోగి అంటే ఈశ్వరునితో భోగించుట. అనగా మోక్షసిద్ధి కలుగుతుంది.
No comments:
Post a Comment