Wednesday, January 1, 2025

 ~ కవి ~

ఖైదు లోనూ 
కమ్మని కలలే కంటాడు

సంకెళ్ళలోనూ 
స్వేచ్ఛ కోసమే కలవరిస్తాడు

నిర్భందాల్లోనూ
హద్దుల్లేని లోకన్నే పలవరిస్తాడు  

వద్యశిల పైనా
ఉషోదయాన్నే తలపోస్తాడు 

మరణమే లేని
సరికొత్త గేయాలను కూర్చి ఆలపిస్తాడు

ప్రజల నాల్కలపై
స్వేచ్ఛా గీతికై పునర్జన్మిస్తాడు

ఆవరించిన పెను చీకట్లలో
కాంతి రేఖై తోవ చూపుతాడు

బెదిరి చెదిరిన హృదయాల్లో
ధైర్యమూ స్థైర్యమూ నింపేస్తాడు

నియంతల ప్రాకారాలను
మరఫిరంగి దళమై కూలుస్తాడు

నిరంకుశుల సింహాసనాలను
పెను ప్రకంపమై కృంగదీస్తాడు

స్వేచ్ఛా సమానత్వం 
సౌభ్రాతృత్వపు కేతనమై రెపరెపలాడతాడు

స్వాప్నికుడు మాత్రమే కాదు
సాహసీకుడూనూ సుమా కవి

- రత్నాజేయ్ (పెద్దాపురం) 

No comments:

Post a Comment