Wednesday, January 1, 2025

 మునిమాణిక్యం 
ఈ పేరు వినగానే...
కాంతం కథలే మెదులుతాయి స్మృతిపథంలో 
సన్నని హాసరేఖ ప్రత్యక్షమౌతుంది మన పెదాలపై

కానీ ... 
ఆయన 'మన హాస్యం' అనే 
అరుదైన గ్రంథాన్ని కూడా రచించారు
ఇది తెలియదు అందరికీ

*******

"శృంగార హాస్య కరుణా....." అంటూ

మానవ మనుగడకు 
ఆధారభూతమైన 'శృంగారం' 
తరువాతి స్థానాన్ని 

మనిషి జీవితాన్ని 
సరళతరం చేసే 'హాస్యం' కే 
ఇచ్చారు 
మన లాక్షణికులు 

అటువంటి హాస్య రస తాత్వికతను 
విశ్లేషించి విశదీకరించే సిద్ధాంత గ్రంథం 
అనదగ్గ రచన ఈ  'మన హాస్యం

********

ఇతరులను హీనంగా చూసే ...
తనని తాను గొప్ప వాడిగా భావించుకునే
ఓ డాబుసరి దర్పాలమారి పెద్దమనిషి 
అరిటితొక్క పై కాలేసి జర్రను జారి మొత్తానికి నిలదొక్కుకున్నాడనుకోండి 
పగలబడి నవ్వుతారు చుట్టూనున్నవారు 
ఇది హాస్యం 

అదే.... 
ఓ నిండు మూలాలు
జారి తడబడిందనుకోండి....
అయ్యో... అని చేయందించడానికి ముందుకురుకుతారు 
చుట్టూ ఉన్నవారు 
ఇదీ మానవత్వం 

ఇటువంటి సందర్భంలో 
ఎవరన్నా నవ్వారనుకోండి
అది అపహాస్యం బ్లేక్ కామిడీ 
చీదరించుకుంటారు వాణ్ణి అందరూ 

********

ఇలా....
హాస్యం అంటే ఏమిటి
ఆరోగ్యవంతమైన హాస్యం ఎలా పుడుతుంది
అది ఎన్ని రకాలుగా ఉంటుంది

ఇత్యాది విషయాలన్నీ
కూలంకుషంగానూ.... సోదాహరణంగానూ 
అదే సమయంలో హాస్యస్ఫోరకంగాను చెబుతారు
మన ముని'మాణిక్యం' ఇందులో 

- రత్నాజేయ్ (పెద్దాపురం)

No comments:

Post a Comment