*`డబ్బెక్కడ దాస్తున్నారు?`*
*`"పైసలదేముందిరా.. కుక్కను కొడితే రాలతాయి'`*
*అనే మాట చాలాసార్లు వినుంటాం. నిజమే, ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం పెద్ద సమస్య కాదు. కానీ, సంపాదించిన డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నాం! ఎక్కడ పెట్టుబడిగా పెడుతున్నాం. అనేదే అసలు సమస్యంతా!*
*వయసులో ఉన్నప్పుడు మనం వెనకేసిన సొమ్మే భవిష్యత్తులో పెరిగే ఖర్చులకు వృద్ధాప్యంలోనూ ఉపయోగపడుతుందని* *నిపుణులు చెబుతుంటారు. సరైన ప్రణాళిక లేకపోయినా, ఉన్నదంతా ఒకేచోట జమచేసినా ఆశించిన ఫలితం ఉండదని హెచ్చరిస్తుంటారు.*
*దీనికి వారు ఒక ఉదాహరణ చెబుతుంటారు.*
*అదేంటంటే- విజయ్, అజయ్, ప్రజయ్ ముగ్గురూ సోదరులు వారికి వారసత్వంగా తలో రూ.20 లక్షలు వచ్చాయి. ఆ మొత్తంతో విజయ్ ఓ ఇంటి స్తలాన్ని కొన్నాడు. అజయ్ రూ.10 లక్షలతో బంగారం కొని, మరో రూ.10 లక్షలను మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాడు. ప్రజయ్ మాత్రం సగం పిక్స్ డ్ డిపాజిట్ చేయగా..*
*మిగతా మొత్తాన్ని అపార్ట్మెంట్కి ఆడ్వాన్స్డ్ చెల్లించాడు. కొన్నేళ్లు గడిచాయి. విజయ్ ఇరవై లక్షలు పెట్టి కొన్న స్థలం విలువ నలభై లక్షలైంది. కొడుకును పై చదువులకు అమెరికా పంపేందుకు డబ్బు అత్యవసరం కావడంతో దాన్ని అమ్మాలను కున్నాడు. కానీ, మార్కెట్ బాగా లేకపోవడంతో అంత ధర పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. తక్కువ ధరకు అమ్మలేక, మరో మార్గం కనిపించక లోలోపలే దిగులు పడసాగాడు. సోదరుడి పరిస్థితిని తెలుసుకున్న అజయ్ తాను కొన్న బంగారంపై లోన్ తీసుకొని కొంత సర్దుబాటు చేశాడు. ప్రజయ్ తన బ్యాంక్ డిపాజిట్ను తీసి మిగిలిన మొత్తం సర్దాడు.*
*విజయ్ దగ్గర నలభై లక్షల విలువైన స్థలం ఉన్నా అవసరానికి డబ్బు చేతికి అందే పరిస్థితి లేదు. భూముల క్రయవి క్రయాలు కాస్త సమయం తీసుకొనే వ్యవహారమని గుర్తుంచుకుంటే ఆ సమస్య వచ్చేది కాదు. మిగతా ఇద్దరు వెంటనే సొమ్ము చేసుకోగలిగే పెట్టుబడి మార్గాలను అనుసరించడం వల్లనే విజయ్ సమయానికి ఆదుకోగలిగారు.*
*అలాగని, సంపాదించిన ప్రతి రూపాయిని మదుపు చేయా లని చూడటమూ సరైన పద్దతి కాదు. జీతం రాకపోయినా ఆర్నెల్లపాటు కుటుంబ ఖర్చులకు సరిపడా మొత్తాన్ని అందుబాటులో ఉంచుకున్నాకే పొదుపైనా మదుపైనా! సంపాదనలో మనం కట్టే నెలవారీ వాయిదాలు 40 శాతానికి మించకూడద నేది మరో నియమం. రేయింబగళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్ము అవసరానికి అక్కరకు రాకపోతే ఆ బాధ వర్ణనాతీతం. అందుకే, ఉన్నస్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్లాలంటే 'మైండ్ ఫుల్ ఇన్వెస్ట్మెంట్ను అలవాటుగా మార్చుకోవాలి. ఖర్చులకు పోగా మిగిలించే పొదుపు చేద్దామని కాకుండా, పొదుపు చేశాక మిగిలిందే ఖర్చు పెట్టాలన్న నియమాన్ని ఒంటపట్టించుకుంటే నిశ్చింతగా నిద్రపోవచ్చు.*
No comments:
Post a Comment