విచారపు చిరునవ్వు!!!
—————————
ఎప్పుడైనా…
ఎక్కడైనా…
దేని విలువ దానికుంటుంది!
విలువలు అనేవి
తనకుతాను
వివరించుకుంటేనో,
ఆత్మస్తుతి చేస్కుంటేనో,
ఎవరో నిన్ను మెచ్చుకోవాలనీ
ఇతరులను తక్కువ చూపిస్తేనో,
నీ విలువ పెరుగదు!
సరికదా! తరుగుతుంది!
మన గురించి
మనం లేనప్పుడు
మరోకరు చప్పే
మాటల పరంపరనే
నిజమైన మనం!
మన నడవడికలు
మన గమనికలు
మన ఉత్సాహాకతలు
మనల్ని మనకే
గుర్తింపజేస్తాయి!
ఎప్పుడో ఒకప్పుడు
ఆ గుణపాఠం తప్పక బోధంపజేస్తుంది!
ఆ బాధ్యతల బాధలు
కాలానికి వదిలేద్దాం!!
కాలం తన పని తాను
చేస్తూనే ఉంటుంది!
అది ఎవరు చెప్పినా ఆగదు!
మనిషి చెప్పితే
అస్సలు ఆగదు!!!
కాలానికి మనల్ని చూస్తే ఎందుకో
విచారపు చిరునవ్వు!!!
ఎవరికీ అంతుదెల్వదు…!!??
✍🏻… నా న
No comments:
Post a Comment