Saturday, January 25, 2025

****ప్రశాంతత.....*

 *ప్రశాంతత.....*

ప్రశాంతత అనేది మానవుని యొక్క సహజస్థితి. ఆ సహజస్థితికి ఆటంకం కలిగించేది మనస్సే. "నాకు ప్రశాంతత అనుభవంలోకి రావటం లేదు" అంటే దాని అర్థం నీ విచారణ అంతా మనస్సులోనే సాగుతోందని అని.

మనస్సంటే ఏమిటో పరిశోధన చేయి. అది అప్పుడు అది మాయమైపోతుంది.  ఆలోచనే మనస్సంటే.. వేరే మనస్సంటూ ఏమీ లేదు.  ఆలోచన వస్తూండటం వల్ల అది ఎక్కడో పుట్టుతోందని అనుకొని దానికి మనస్సు అని పేరు పెడ్తారు. అదేమిటో పరిశోధన చేస్తే మనస్సంటూ ఏమీ లేదని తెలుస్తుంది.  శాశ్వతమైన శాంతిని గ్రహిస్తారు.

నీ సహజస్థితిలో నీవు ఉండు, ఆ ప్రశాంతత లోనె నీవు ఎవరివో నీకు తెలుస్తుంది...

No comments:

Post a Comment