కర్మము... విధిరాత.....
భాగవతం దశమ స్కందంలో శ్రీకృష్ణుడు బోధించిన పద్యం...
కర్మమున బుట్టు జంతువు,
కర్మమున వృద్ధిచెందు, గర్మమునజడున్ |
కర్మమే జనులకు దేవత,
కర్మమే సుఖదుఃఖములకు గారణ మధిప ||
దీనికి సరిపోయే ఓక చిన్న కథ...
ఒకసారి 'విక్రమార్కుడు' పాదరక్షల మహిమ వల్ల బ్రహ్మలోకానికి వెళితే బ్రహ్మదేవుడు సంతోషించి వరం కోరుకోమన్నాడట. అప్పుడు విక్రమార్కుడు బ్రహ్మదేవునితో "అయ్యా, మీరు సృష్టించేటప్పుడు వారి వారి కర్మానుసారం ఫలితాలన్నీ నుదుట రాస్తారని, ఆ రాత తప్పదని శాస్త్రాలన్నీ చెబుతున్నాయే. మరి ఇప్పుడు నాకు వరాలిస్తానంటున్నారు. నుదిటిరాత చెరిపి మళ్లీ రాస్తారా..? లేక పైపైన దిద్దుతారా..? ఏమిటి కధ" అన్నాడట విక్రమార్కుడు..
బ్రహ్మగారు అతని వివేకానికి సంతోషించి చిరునవ్వుతో "ఏమీ లేదోయ్.. వాళ్ళ వాళ్ళ కర్మానుసారం ఏది ప్రాప్తమో అదే వారి కోరిక రూపంలో బయటకు వస్తుంది. అలాగే ఇచ్చామంటాము. అంతే.. కొత్తగా ఇచ్చేదేమీ లేదు. ఇది గ్రహించలేక వరములకై తపస్సు చేస్తారు. నీవు వివేకివి కనుక మర్మం కనుక్కున్నావు. చాలా సంతోషం కలిగింది" అని చెప్పి బ్రహ్మాస్త్రం బహుమతిగా ఇచ్చి పంపారట...
No comments:
Post a Comment