Monday, January 20, 2025

 Vedantha panchadasi:
అజ్ఞానావృతి విక్షేప ద్వివిధజ్ఞాన తృప్తయః ౹
శోకాపగమ ఇత్యేతే యోజనీయాశ్చదాత్మని  ౹౹28౹౹

28.చిదాత్మను గూర్చి సప్తదశలను చూడవచ్చును.
అజ్ఞానము,ఆవరణము,
విక్షేపము,
పరోక్షము,అపరోక్షము, తృప్తి,దుఃఖనాశము అనేవి ఏడు దశలు.

సంసారసక్త చిత్తః సంశ్చిదాభాసః కదాచన ౹
స్వయంప్రకాశ కూటస్థం స్వతత్త్వం నైవ వేత్త్యయమ్ ౹౹29౹౹
29. సంసారమునందే లగ్నమైన మనస్సు గల చిదాభాసుడు తన నిజస్వరూపము స్వప్రకాశము అయిన కూటస్థమును తెలియనే తెలియడు.ఇది అజ్ఞాన దశ.

వ్యాఖ్య:-దశముడి కథ యందలి దృష్టాంతాన్ని బట్టి ఆ దశమ వ్యక్తిలో మనకు ఏడు అవస్థలు కనిపిస్తున్నాయి.
1)అజ్ఞానము,
2)ఆవృత్తి లేక ఆవరణము,
3)విక్షేపము,
4)పరోక్షజ్ఞానము,
5)అపరోక్షజ్ఞానము అనే రెండు విధములైన జ్ఞానములు,
6)తృప్తి,
7)శోకనివృత్తి(దుఃఖనాశము).
అనేవి ఆ ఏడు దశలు.
ఇప్పుడు మనం ఈ ఏడు అవస్థలను చిదాత్మకు అన్వయించుకోవాలి.

చిదాభాసమైన ఈ జీవాత్మ సంసారమునందు ఆసక్తి కలిగి వుంటుంది.అందుచేత శ్రుతియందు చెప్పబడిన సత్యాన్ని - తత్త్వాన్ని గుర్తించటానికి పూర్వం నేను
"స్వయంప్రకాశ స్వరూపుడను"
అని తన పారమార్థికమైన స్వయంప్రకాశత్వాన్ని తెలుసుకోలేడు.
ఈ విధంగా తెలుసుకోలేక పోవటమే అజ్ఞానావస్థ.

అజ్ఞానమే మిథ్యాజ్ఞానమని పిలవబడుతుంది.
మిథ్యాజ్ఞానము గల వానికి సత్యము అసత్యముగను,
అసత్యము సత్యముగను గోచరించును.

మిథ్యాజ్ఞానము నశించవలెనన్నచో 
సమ్యక్ జ్ఞానము కలుగవలెను. అదియే ఏకవస్తు దర్శనము. కేవల సద్రూప జ్ఞానము.

విచక్షణాపూరిత వివేకము గలవానికే సమ్యక్ జ్ఞానము కలుగును.
సదా ఆత్మనాత్మ వివేకము చేయగల మనస్సునకే సత్యానుభూతి కలుగుతుంది.

అనంతమైన ఆత్మ పరిచ్ఛిన్నమై కన్పించుటయే మిథ్యాజ్ఞానము.
అదియే అజ్ఞానము.
మబ్బు వీడితేకాని సూర్యుడు బయటపడనట్లు అజ్ఞానం తొలగితే గాని ఆత్మదర్శనం కానేరదు.

అజ్ఞానం తొలగగనే ఆత్మ స్వయం ప్రకాశము గనుక తనకు తానుగా ప్రకాశిస్తుంది.
మనస్సనెడి పెరుగు కుండలో విచారణ యనెడి కవ్వమునువేసి చిలికినచో జ్ఞానమనే వెన్న పుడుతుంది.

జ్ఞానముచే అజ్ఞానము దగ్ధముకాగా,సత్యదర్శనము కలుగుతుంది.

న భాతి నాస్తి కూటస్థ ఇతి వక్తి ప్రసఙ్గతః ౹
కర్తా భోక్తాహమస్మీతీ విక్షేపం ప్రతిపద్యతే ౹౹30౹౹

30.ప్రసంగవశమున 'కూటస్థము కన్పింపదు,
అది లేదు' అనును.ఇది అజ్ఞానము వలన కలుగు ఆవరణ దశ.మీది మిక్కిలి
"నేనే కర్తను భోక్తను"అని కూడా భావించును.ఇదే విక్షేప దశ.

వ్యాఖ్య:-
"అజ్ఞానము జీవాశ్రయమై బ్రహ్మము నాచ్ఛాదించును" (విషయం). అనగా 
"జీవాశ్రయ బ్రహ్మవిషయం" అని అర్థము.
"నేను బ్రహ్మమునెరుగను"అన్న వాక్యములో "నేను" అనేది జీవుని చెప్పును.వాడే అజ్ఞానమున కాశ్రయమని తెలుస్తున్నది.

"బ్రహ్మము నెరుగను" అంటున్నాడు కనుక అజ్ఞానం కప్పినది తెలియనీయనిది బ్రహ్మమునే అని తాత్పర్యము.

ఈ జీవ - అజ్ఞానములు నానా సంఖ్యములు.ఎవరి అజ్ఞానము వారికి కలిగి వారి జ్ఞానముతో పోతుంది.అందుకే శ్రవణాది సాధనాలు ఎవనికి వాడే చేసుకోవలి.

అనంతాజ్ఞానులకు ఈశ్వరులు,బ్రహ్మాండములు అనంతములు.ఇలా ఎవనికి వానికి వాని అజ్ఞానము, తత్కల్పిత ఈశ్వరుడు, బ్రహ్మాండము ఏర్పడును.
వాని వాని జ్ఞానముతో అవి నివృత్తమగును.

ఈ అజ్ఞానము ఆవరణ,విక్షేపాలగా ఒకటి వస్తువు లేదని పించేది ఇంకొకటి వస్తువును కనపడనీయనిది.

నేను బ్రహ్మమును గాను పుణ్యపాపాదుల కర్తను భోక్తను ప్రమాతను జీవుడను అల్పజ్ఞుడను అనేదే భ్రాంతి.

చిదాత్మ,"కూటస్థుడు నాకు ప్రతీతమవటం లేదు" అని అనటమే అజ్ఞానంవల్ల కలిగిన ఆవరణం.
ఆ విధమైన ఆప్రతీతితో పాటు
"నేను కర్తను,భోక్తను"అనే కర్తృత్వభోక్తృత్వాదులను ఆరోపించుకోవటం విక్షేపం.

దీనికి కారణం స్థూల సూక్ష్మ శరీరాలు రెండూ కలిగినట్టి చిదాభాసమే.!(జీవాత్మే!)
ఇదే విక్షేపం.

అజుడు సచ్చిదానందస్వరూపుడైన కూటస్థుడను నేను - సంసారాదులు మిధ్య - అను జ్ఞానముతో
 భ్రాంతి నాశము
(శోక నాశము),విక్షేపనాశము.

No comments:

Post a Comment