🔔 *సంస్కృతి* 🔔
*ప్రముఖ వాగ్గేయ కారులు*
(అతి సంక్షిప్త పరిచయం)
*జయదేవుడు*
(1101-1153)
🌹🌹🌹🌹🌹
'గీతగోవిందము' అను సంగీత గ్రంథమును సంస్కృత భాషలో రచించిన ప్రథమ వాగ్గేయకారుడు.'జయదేవ'ముద్రతో ఇతను రచించిన సంగీత కృతులు 'అష్టపదులు'గా ప్రసిద్ధి చెందినవి.
*పురందరదాసు*
(1484-1564)
🌹🌹🌹🌹🌹
తన ఇష్టదైవమగు పండరీపుర విఠలునిపై
వేలాది,సంగీత కృతులను కన్నడ భాషలో రచించారు.*'దేవరనామాలు'* అను పేరుతోప్రఖ్యాతిగాంచిన ఈతని కృతులు 'పురందరవిఠల' ముద్రతో ఉన్నాయి.
*అన్నమాచార్యులు*
(1408-1503)
🌹🌹🌹🌹🌹
తన ఇష్టదైవమైన తిరుపతి,శ్రీవేంకటేశ్వరునిపై 32 వేల కీర్తనలను రచించారు.ఈ కీర్తనలు *'వేంకటేశ'* ముద్రతో సాగుతుంది.'ఆంధ్ర పద కవితా పితామహుడు' గా ప్రఖ్యాతి చెందినారు.
*భక్త రామదాసు*
(1620-1680)
🌹🌹🌹🌹🌹
ఇతని అసలు పేరు కంచర్ల గోపన్న.తన ఆరాధ్య దైవమగు శ్రీరామునిపై *'రామదాసు'* ముద్రతో అనేక కీర్తనలను రచించారు.
*క్షేత్రయ్య*
(1610-1685)
🌹🌹🌹🌹🌹
ఇతని అసలు పేరు వరదయ్య. అనేక క్షేత్రములను సందర్శించడం వలన క్షేత్రయ్యగా పిలువబడినారు.
తన ఇష్టదైవమగు గోపాలస్వామి పేర *'మువ్వగోపాల'* ముద్రతో పెక్కు సంగీత కృతులు రచించారు.
*శ్యామశాస్త్రి*
(1762-1827)
🌹🌹🌹🌹🌹
అసలు పేరు వేంకట సుబ్రహ్మణ్యం.
ఆంధ్రులైన సంగీతత్రయంలో మూడవవారు.
త్యాగరాజు,ముత్తుస్వామి దీక్షితులకు సమకాలికులు.*'శ్యామకృష్ణ'* ముద్రతో సంగీత కృతులు రచించారు.
*త్యాగరాజు*
(1767-1847)
🌹🌹🌹🌹🌹
కాకర్ల త్యాగరాజు *'సంగీతరత్నత్రయము'* గా, ప్రసిద్ధి గాంచిన వారిలో అగ్రగణ్యుడు. తన ఇష్టదైవమైనశ్రీరామునిపై,అపారమైన భక్తితో 24 వేల కీర్తనలను రాసారు.
*ముత్తుస్వామి దీక్షితులు*
(1776-1835)
🌹🌹🌹🌹🌹
'సంగీతరత్నత్రయం'లో రెండవ వారు.*'గురుగుహ'* ముద్రతో సంస్కృత భాషలోవీరు కృతులు రచించారు.
*స్వాతితిరునాళ్*
(1813-1846)
🌹🌹🌹🌹🌹
తిరువాన్కూరు(కేరళ) సంస్థానమునకు ప్రభువు.
బహుభాషాపాండిత్యమునకుతోడు,సంగీతంములోనూవిశేష ప్రజ్ఞా వంతులు.మళయాళము,తమిళము, సంస్కృతము,హిందీ, మరాఠీ,ఒరియా,కన్నడము ,
తెలుగు వంటి ఎనిమిది భాషలలో *'పద్మనాభ'* ముద్రతో సంగీత కృతులను రచించారు.
*నారాయణ తీర్థులు*
(17వ శతాబ్దము)
🌹🌹🌹🌹🌹
ఇతని అసలు పేరు తల్లావఝల శివశంకరశాస్త్రి.
తన ఆరాధ్య దైవమగుశ్రీకృష్ణుని లీలావినోదములను 'కృష్ణ లీలా తరంగిణి' అను సంగీత గ్రంథమున
విపులంగా వర్ణిస్తూ కీర్తనలను రాసారు.
ఇవి *'తరంగములు'* అను పేర ప్రసిద్ధి చెందినవి.
https://youtube.com/@tirumalavaibhavam7?si=g_cCl4_tMjT-aA1G
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
No comments:
Post a Comment