*_బ్రాహ్మణా బ్రహ్మపుత్రా..!_*
సంస్కృతాన్ని అభ్యసించి..
సంస్కృతిని పరిరక్షిస్తూ..
నిలువెల్లా సంస్కారాన్ని
నింపుకుని..
సంచరించే ఉత్తమ జీవుడు
*_బ్రాహ్మణుడు.._*
వేదం తన వాదమై..
తన నడవడే ఒక వేదమై..
మేధస్సు బహువిధమై..
చెడు పట్ల సింహనాదమై..
సత్కార్యాచరణే తన విధమై..
సమాజానికి ఆదర్శంగా నిలిచే
సత్సంగుడు *_బ్రాహ్మణుడు.._*
నుదుటిన సూర్యుడంత బొట్టు
మోమున శివుడంటి తేజస్సు..
ఒంటిపై పవిత్ర యజ్ఞోపవీతం..
నడకలో..నడతలో నిండుదనం
కదిలివచ్చే హుందాతనం..
సుప్రభాత సమయాన
అపర సరస్వతిలా దర్శనమిచ్చే విభుడు..
*_బ్రాహ్మణుడు.._*
ఆయన ఉనికితోనే ఉపనయనం..
ఆయన మంత్రంతోనే కళ్యాణం..
ఆయన తొలి అక్షరం దిద్దిస్తేనే
అక్షరాభ్యాసం..
ఆయన చేస్తేనే వేదపఠనం..
ఆయన చెప్పేది పాఠం...
ఆయన కొలువుండేదే మఠం..
ఆయన అంతరంగమే
వాగ్దేవి కొలువుకూటం..
అంతటి సరస్వతికే ప్రతిరూపం..
*_బ్రాహ్మణుడు.._*
పొద్దున్నే సంధ్యావందనం..
సూర్యనమస్కారం..
ఆ వెంటనే పూజా పునస్కారం
భగవంతునికి తోయంపత్రం..
నిరంతర గాయత్రీ మంత్రం..
మడి వస్త్రం..
మాటే స్తోత్రం..చక్కని గాత్రం..
మహాదేవుని మరోరూపం
*_బ్రాహ్మణుడు.._*
మన నడవడికి స్ఫూర్తి..
పాండితీ ఆర్తి..
సమవర్తి..
సాహితీ చక్రవర్తి..
చెరిగిపోని కీర్తి..
*_బ్రాహ్మణుడు.._*
_(సురేష్..9948546286)_
No comments:
Post a Comment