Thursday, June 19, 2025

 అమ్మ మనకు జన్మనిస్తుంది.

 భార్య మనల్ని ఆజన్మాంతం ప్రేమిస్తుంది. 

అమ్మ లేకుంటే 
మనకు జన్మ లేదు. 

భార్య లేకుంటే 
ఆ జన్మకు అర్ధం లేదు. 

అమ్మ భారం కాకూడదు.
 భార్య బానిస కాకూడదు.

 ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, 

ఒకరి కోసం ఒకరు బ్రతుకుతూ, 

నీ ఆనందమే 
నా ఆనందం అనుకుంటూ,

 జీవితాంతం ప్రేమను పంచుకునే బంధమే 
భార్య భర్తల బంధం.

 అపురూపమైనది, 
కల్మషం లేనిది, కమనీయమైనది, 
పవిత్రమైన బంధమే మాంగళ్య బంధం...

భార్య అంటే 
బానిస కాదురా ఒక భాధ్యత...

పెళ్ళి అంటే బానిసత్వం కాదు బరువు అంతకన్నా కాదు
 మన మీద ఉన్న నమ్మకం...

 మనల్ని నమ్మి 
తన కన్నవారిని విడిచి, 

నా అనుకునే వాళ్ళకు దూరంగా 
మన కోసం తన ప్రపంచాన్నే మార్చుకుని, 

మనలో తన జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన జీవిత భాగస్వామికి మనం ఏమిచ్చి తన ఋణం తీర్చుకోగలం. 

వాళ్ళ కనులకు కన్నీరు అంటే ఏమిటో తెలియకుండా చూసుకోవడం తప్ప. 

ప్రతీ అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం.

 కానీ,...
 *తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం.*🙏💐

No comments:

Post a Comment