దిగజార్చుకోలేను
*వ్యక్తిత్వాన్ని*
విపత్తులెన్ని వచ్చినా....
ఆత్మాభిమానాన్ని
*వదులుకోలేను*
కాసులెన్ని కానుకిచ్చినా..
సహించలేను
*నిష్కారణ నిందను*
కారకులు ఎంతటివారైనా..
నమ్మక ద్రోహాన్ని భరించలేను
బంధువైనా
వారు దగ్గరి దోస్తులైనా....
*వదులుకోలేను*
విలువనిచ్చే చెలిమిని
ఎంత కాలము జీవించినా...
వీడలేను మదికి తోడుండే
*అక్షర మైత్రిని*
మస్తిష్కము శుష్కించినా...
జ్ఞప్తి వీడను
నా రాతలను ప్రేమించు వారిని
*నేనే స్థితినందున్నా...*
స్మరించుట మానను
నా బంధు హితులను
*అనుదినం ఎందున్నా...*
మరవలేను
బతుకునిచ్చిన కన్నవారిని
*కాయము కాటికెళ్ళినా..*
నిందించలేను
జన్మనిచ్చిన దేవదేవుని
*ఎన్ని జన్మాలెత్తినా..!!*
Sekarana
No comments:
Post a Comment