Tuesday, June 24, 2025

 


🙏 *రమణోదయం* 🙏

*మనస్సే తాననే మోహంతో తిరిగి జీవుడు స్వప్నం వంటి బాహ్య ప్రపంచ దృశ్యాన్ని చూడటానికి బదులు, తన ఆత్మస్థానమైన హృదయంలో మునిగి ఉండటమే ప్రాణాయామం యొక్క నిజమైన తత్త్వమని తెలుసుకో.*

 విద్యుత్ స్పర్శ లేకుండా
జడమైన యంత్రంలో కదలిక ఉండదు.
దేవుని స్పర్శ లేకుండా 
జడ రూపమైన జీవునిలో
"నేను" అన్న అహం స్పురణ కలుగదు.

 ఇప్పుడు మొదట సున్నా  పెట్టు,
అప్పుడు దాని తర్వాత ఒకటి (01) పెట్టు. ప్రతీ సున్నాకి మొదట ఒకటి పెడితే విలువ ఉంది..
కానీ, ఒకటి పెట్టకపోతే సున్నాకి విలువ లేదు..
ప్రపంచంలోని అన్ని వస్తువులు సున్నాలు లాంటివి..
సత్యమనే ఒక దానిని తెలుసుకోకుండా ఉంటే
వాటికి ఏ మాత్రం విలువలేదు...మనం పరిపూర్ణ
సత్యాన్ని జ్ఞప్తిలో ఉంచుకున్నప్పుడు జీవితం
జీవించ తగినదిగా అవుతుంది,
లేకపోతే అది భారమవుతుంది!

 జీవించాలంటే మరణించాలి.
మరణించడం అంటే 
దేహం పోవడం కాదు.
అహం పోవడమే!

🌹🙏🏻ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🏻🌹

 *భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.702)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 
🪷🪷🪷🪷🪷🪷
 *స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |
 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 
            
🌹🌹🙏🙏 🌹🌹

No comments:

Post a Comment